పిట్టగోడను ఢీకొట్టి 60 అడుగుల కిందకి.. | Bus falls into ravine killing 16 and injuring several others | Sakshi
Sakshi News home page

పిట్టగోడను ఢీకొట్టి 60 అడుగుల కిందకి..

Jan 7 2015 10:58 AM | Updated on Aug 30 2018 3:58 PM

పిట్టగోడను ఢీకొట్టి 60 అడుగుల కిందకి.. - Sakshi

పిట్టగోడను ఢీకొట్టి 60 అడుగుల కిందకి..

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు పిట్టగోడను ఢీకొట్టి సుమారు 60 అడుగుల కిందికి పడిపోయినట్లు తెలుస్తోంది.

అనంతపురం : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు పిట్టగోడను ఢీకొట్టి సుమారు 60 అడుగుల కిందికి పడిపోయినట్లు తెలుస్తోంది. మడకశిర-పెనుకొండ మార్గంలో ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోనే ప్రమాదం చోటుచేసుకుంది.

ఘాట్ను తొలగించేందుకు 60 అడుగుల లోతున కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. కొత్త రోడ్డు కోసం పాత రోడ్డు పక్కనే 60 అడుగుల లోతున అధికారులు తవ్వించారు. అయితే  బస్సు డ్రైవర్ దీనిపై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 16మందికి చేరింది. మరోవైపు గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement