పోలీస్ స్టేషన్‌లో పేలుడు | blast in police station at nellore distirict | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్‌లో పేలుడు

May 1 2015 11:28 AM | Updated on Apr 3 2019 3:52 PM

పోలీస్ స్టేషన్‌లో పేలుడు - Sakshi

పోలీస్ స్టేషన్‌లో పేలుడు

పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు జరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం జరిగింది.

నెల్లూరు: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు జరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు... చేజర్ల పోలీసులు మూడు నెలల క్రితం ఓ బాణా సంచా తయారీ కేంద్రంపై దాడి చేసి అక్కడ ఉన్న బాణా సంచాను తీసుకు వచ్చి పోలీస్ స్టేషన్ అవరణలో పూడ్చిపెట్టారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో బాణా సంచా పూడ్చిన ప్రదేశంలో గురువారం నుంచే స్వల్పంగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.

చుట్టు పక్కల ఇళ్లపై పేలుడు పదార్ధాలు పడి ఇంటి రేకులు గాలిలో ఎగిరిపోయాయి. పనివేళల్లో ఈ సంఘటన జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్తానికులు తెలిపారు. ఈ సంఘటనతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. రెండురోజులు నుంచి పేలుడు సంభవిస్తున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
(చేజెర్ల)

Advertisement
 
Advertisement
Advertisement