ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగాల్లేవన్నా.. | Sakshi
Sakshi News home page

ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగాల్లేవన్నా..

Published Fri, Nov 24 2017 6:05 AM

Bed Student Sharing To Her Sorrows to ys jagan - Sakshi

ప్రజాసంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం : ‘అన్నా.. నేను బీపీఈడీ చదివా. అయినా ఉద్యోగం రాలేదు. బతుకుదెరువు కోసం కులవృత్తి అయిన దుస్తులు ఉతకడం తప్పడంలేదు. నాతో పాటు మా ఇంట్లో నలుగురు గ్రాడ్యుయేట్లు ఉన్నారు. నా భర్త మధు పీజీ, మరుదులు కృష్ణ.. బీఏ, రాము.. బీఏ, బీఈడీ చదివినా అందరిదీ ఇదే పరిస్థితి..’ అని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన నాగజ్యోతి గురువారం  ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement