ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నం | Bank robbery attempt in ysr kadapa district | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో చోరీకి యత్నం

Jul 31 2014 9:49 AM | Updated on Aug 30 2018 5:24 PM

వైఎస్ఆర్ కడప జిల్లాలోని దేవుని కడపలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్లో గురువారం తెల్లవారుజామున దుండగులు చోరీకి యత్నించారు.

కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలోని దేవుని కడపలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో గురువారం తెల్లవారుజామున దుండగులు చోరీకి యత్నించారు. అక్కడే ఉన్న బ్యాంక్ భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దాంతో దుండగులు పరారయ్యారు. దుండగులను పట్టుకునేందుకు భద్రత సిబ్బంది యత్నించారు. కానీ దుండగులు భద్రత సిబ్బందికి చిక్కలేదు. బ్యాంకులో చోరీ యత్నంపై భద్రత సిబ్బంది అటు పోలీసులకు ఇటు బ్యాంకు అధికారులను సమాచారం అందించారు. పోలీసులు, బ్యాంకు అధికారులు బ్యాంకు వద్దకు చేరుకుని దోపిడికి యత్నానికి సంబంధించిన వివరాలను భద్రత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement