విద్యుత్ షాక్‌తో పసికందు మృతి | Babe killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో పసికందు మృతి

Mar 23 2016 2:15 AM | Updated on Sep 5 2018 3:52 PM

విద్యుత్ షాక్‌తో పసికందు మృతి - Sakshi

విద్యుత్ షాక్‌తో పసికందు మృతి

విద్యుత్ షార్ట్ సర్క్వూట్ సంభవించి ఏడు నెలల పసికందు మృతి చెందిన సంఘటన మండలంలోని ....

మరో నలుగురికి తీవ్రగాయాలు
ఒకరి పరిస్థితి విషమం

 
బీకేపాలెం(కాకుమాను): విద్యుత్ షార్ట్ సర్క్వూట్ సంభవించి ఏడు నెలల పసికందు మృతి చెందిన సంఘటన మండలంలోని బీకేపాలెంలో మంగళవారం వేకువజామున సుమారు మూడుగంటల సమయంలో జరిగింది. బీకేపాలెం వీఆర్వో సుధారాణి తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన జంగా చంద్రపాల్ కూతురు హెమీమా అన్నప్రాసన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతని అక్క అరుణ తన ఇద్దరు పిల్లలతో సహా హాజరైంది.

ఎప్పటిలానే ఇంటి పనులు ముగించుకుని సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం సుమారు 3 గంటలకు ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో చిన్నారి హెమీమా, అరుణ, ఆమె కుమారుడు, సుబ్బారావు, కుమార్తె ప్రియాంక, చంద్రపాల్ తల్లి కుమారిలకు తీవ్ర గాయాలవడంతో క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ పసికందు హెమీమా మృతి చెందింది. అరుణ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యసేవల కోసం ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement