నేడు కాంగ్రెస్ కోర్‌కమిటీకి ఆంటోనీ కమిటీ నివేదిక | Antony committee to submit report to congress core committee | Sakshi
Sakshi News home page

నేడు కాంగ్రెస్ కోర్‌కమిటీకి ఆంటోనీ కమిటీ నివేదిక

Sep 13 2013 8:28 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ కోర్ కమిటీతో నేడు ఆంటోనీ కమిటీ నివేదిక సమర్పించనుంది.

న్యూఢిల్లీ : కాంగ్రెస్ కోర్ కమిటీకి నేడు ఆంటోనీ కమిటీ నివేదిక సమర్పించనుంది. రాష్ట్ర విభజన ప్రకటనతో తలెత్తిన సమస్యలు... వాటి సంప్రదింపుల వివరాలపై కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ సందర్భంగా చర్చించనుంది. మరోవైపు తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైందని కేంద్ర ఉన్నతాధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన సోనియాగాంధీ తిరిగి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్ల్యూసీ, యూపీఏ ఏకగ్రీవ తీర్మానం చేయటంతో సీమాంధ్రలో తలెత్తిన ఉద్యమంపై కోర్ కమిటీ దృష్టి సారించినట్లు సమాచారం. ఆంటోనీ కమిటీ తుది నివేదికపైనే తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement