నిర్మాతగా బన్నీతో సినిమా : సుకుమార్

నిర్మాతగా బన్నీతో సినిమా : సుకుమార్


పిఠాపురం మున్సిపాలిటీ :నిర్మాతగా మారి అల్లు అర్జున్(బన్నీ)తో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నానని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ తెలిపారు. సోమవారం ఆయన పిఠాపురంలో  సందడి చేశారు. స్థానిక నవచైతన్య జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. గతంలో  కాకినాడ ఆదిత్య కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. నవచైతన్య కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెడ్డెం దుర్గాప్రసాద్ (బాబి)తో చర్చించారు. అంతకుముందు తన  అసిస్టెంట్ డెరైక్టర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన సానా బుచ్చిరాయుడు మామగారైన ప్రస్తుత 23వ వార్డు కౌన్సిలర్ రెడ్డెం భాస్కరరావు స్థానిక రంగారావుగారి ఆస్పత్రిలో ఉండడంతో ఆయనను పరామర్శించారు.

 

 పముఖ దత్త ప్రచారకులు నారాయణదత్త సుకుమార్‌కు దత్తుని ప్రసాదాలను, కేలండర్‌ను అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ తానే స్వయంగా నిర్మాతగా మారి అల్లు అర్జున్‌తో సినీమా తీసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల విడుదలైన వన్ చిత్రం ఆశించిన విజయం సాధించలేదని, రానున్న రోజుల్లో ప్రేక్షకుల మన్ననలు పొందేలా చిత్రాలను నిర్మిస్తానని పేర్కొన్నారు. తీరిక సమయాల్లో తాను పుస్తకాలు చదవడంతో పాటు భార్య తబిత, కుమార్తె సుక్రతవేణి, కుమారుడు సుక్రాంత్‌తో హాయిగా జీవితాన్ని సాగిస్తున్నట్టు వెల్లడించారు. సుకుమార్ వెంట డాక్టర్ పంతం రాజేష్, వైఎస్సార్ సీపీ నేతలు ముమ్మిడి శ్రీను, కొండేపూడి శంకరరావు, రెడ్డెం జనార్ధన్ తదితరులు ఉన్నారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top