క్షణికావేశానికి మూడు ప్రాణాలు బలి

3 Family Members Suicide In Kaikaluru Krishna - Sakshi

కుమారుడి సహా తల్లిదండ్రులు ఆత్మహత్య

కోడలితో విభేదాలే కారణమంటూ లేఖ 

మొదటి పెళ్లిరోజు జరుపునేందుకు వచ్చి..

జీవిత చరమాంకంలో హాయిగా బతకాల్సిన జీవితాలు వారివి. మూడు పదుల వయసుదాటిన ఆ యువకుడు, భార్య, పిల్లలతో సంతోషంగా కాలం గడపాలి. అటువంటిది ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. కోడలిపై కోపంతో తల్లిదండ్రులు కుమారుడితో సహా పురుగుమందు తాగి తనువు చాలించారు. ఈ విషాద ఘటన గురువారం కైకలూరు మండలం తామరకొల్లు శివారు అయోధ్యపట్నంలో చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు విడవడంతో గ్రామం బోరున విలపించింది. 

సాక్షి, కైకలూరు(విజయవాడ) : అయోధ్యపట్నం గ్రామానికి చెందిన వెలగల బలరామకృష్ణారెడ్డి(60), సుబ్బలక్ష్మి(50)లకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. అందరికీ వివాహాలు చేశారు. కుమారుడు గంగాధరరెడ్డి సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బలరామకృష్ణారెడ్డి ఆక్వా చెరువుల సాగు చేసి, ఇటీవల వాటిని లీజుకు మరొకరికి ఇచ్చాడు. గత ఏడాది ఆగస్టు 30న వివాహా వెబ్‌సైట్‌లో సంబంధం కుదర్చుకుని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఏలేటిపాడుకు చెందిన రాజేశ్వరి(నక్షిత్ర)తో కుమారుడు గంగాధరరెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. వివాహం తరువాత గంగాధరరెడ్డి ఉద్యోగం కోసం సింగపూర్‌ వెళ్లాడు. భార్య రాజేశ్వరికి తల్లిదండ్రులు లేకపోవడంతో తాత, మేనమామల వద్ద ఉంటోంది. తరువా కోడలు, అత్తామామల మధ్య విబేధాలు వచ్చాయి. మొదటి పెళ్లిరోజు చేసుకోవడానికి పది రోజుల కిందట ఇండియాకి వచ్చాడు. బుధవారం తల్లిదండ్రులతో కలిసి భార్య ఇంటికి వెళ్లి వచ్చారు. తరువాత రోజే మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మా ఆస్తి కూతురులకే దక్కాలి...
మా ఆస్తి మా కుతూరులకే దక్కాలని వీలునామా రాసి తల్లిదండ్రులు బలరామకృష్ణారెడ్డి, సుబ్బలక్ష్మి, కుమారుడు గంగాధరరెడ్డి పురుగుమందు తాగి ఇంటి వెనక మరణించారు. కోడలి వలన పడిన ఇబ్బందులను మూడు పేజీలు సుసైడ్‌ లేఖ రాశారు. గురువారం మధ్యాహ్నం ఇంటి వెనుక పురుగుమందు తాగడం, సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎవరూ గమనించలేదు. సెల్‌ఫోన్‌ ఎంత సమయానికి తీయకపోడంతో గ్రామస్తులు వచ్చి చూస్తే ఆత్మహత్యల ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులను రెండు వైపుల పట్టుకుని మరణించిన గంగాధరరెడ్డిని చూసి గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గుడివాడ డీఎస్పీ సత్యానందం, సీఐ కేఎన్‌వీ జయకుమార్, టౌన్‌ ఎస్‌ఐ కె.రాజారెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top