NTR district News
-
నోడల్ అధికారులూ.. అప్రమత్తం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ముగిసే వరకు నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మండల, జిల్లాస్థాయి నోడల్ అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ అధికారులు ప్రణాళికలు అమలుచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దీనికి సమన్వయంతో పని చేయాలని సూచించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వేసవి నేపథ్యంలో ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు, తాగునీరు, మజ్జిగ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి బస్సులోనూ మెడికల్ కిట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటివి అందుబాటులో ఉంటాయన్నారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సిద్ధం చేస్తారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే బస్సులు వేదిక వద్దకు సరైన సమయానికి చేరుకొని, తిరిగి విజయవంతంగా గమ్యస్థానాలకు చేరుకునే విషయంలో రూట్ అధికారులు, జిల్లాస్థాయి నోడల్ అధికారులు అయిన జిల్లా వ్యవసాయ అధికారి, డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, యూసీడీ పీవో నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ లక్ష్మీశ వారధి, ప్రకాశం బ్యారేజీ, వెస్ట్ బైపాస్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. -
ప్రధాని సభకు జనసమీకరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాన నరేంద్రమోదీ చేతుల మీదుగా శుక్రవారం నిర్వహించే రాజధాని పునఃనిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి భారీ జనసమీకరణ చేస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి లక్ష్యం నిర్దేశించి బస్సులను కేటాయిస్తోంది. విజయవాడ నగరంలోని మూడు సర్కిళ్లకు ఒక్కో సర్కిల్‌కు 50 చొప్పున 150 బస్సులు కేటాయించారు. రూరల్‌లోని 16 మండలాలకు ఒక్కో మండలానికి 45 నుంచి 50 బస్సులు ఏర్పాటు చేశారు. జనసమీకరణ బాధ్యతలు స్థానిక నాయకత్వం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్టు, టెక్నికల్ అసిస్టెంట్లు, వెలుగు బుక్ కీపర్లు, సచివాలయాల ఎంఎస్‌కేలకు అప్పగించారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే వారి వివరాలను సేకరించి సిద్ధం చేశారు. ఒక్కో బస్సుకు ఇన్చార్జిగా సచివాలయాల పరిధిలో లైజనింగ్ ఆఫీసర్లను నియమించారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే వారికి అల్పాహారం, మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేశారు. చిల్లకల్లు టోల్ ప్లాజా, కొణకంచి అడ్డరోడ్డు వద్ద పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో భోజనం వాటర్ ప్యాకెట్లను సిద్దం చేశారు. ఇబ్రహీంపట్నం అడ్డరోడ్డు వద్ద భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రామాలకు చేరిన బస్సులు ఇప్పటికే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు, ప్రైవేటు వాహనాలు ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. డ్వామా, మెప్మా, డీఆర్డీఏ సిబ్బంది జన సమీకరణలో తలమునకలయ్యారు. ఉపాఽధి కూలీలు, డ్వాక్రా మహిళలు, రైతులు ఇలా వేర్వేరుగా బస్సులు కేటాయించారు. బస్సులను నింపే బాధ్యత వారికి అప్పగించారు. ప్రధాని పర్యటన కావడంతో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాల నుంచి సభకు హాజరయ్యే వారు వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్డు ద్వారా సభ ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే జనసమీకరణ చేయలేక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ దఫా అంగన్వాడీ వర్కర్లను కార్యక్రమానికి దూరంగా ఉంచడం విశేషం భారీగా బస్సులు ఉపాఽధి కూలీలను, డ్వాక్రా మహిళలను తరలించడానికి సన్నాహాలు -
రేపటి నుంచి రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీ
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–9 ఓపెన్, బాలికల రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి, కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ తెలిపారు. విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్‌పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 3, 4 తేదీల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోటీల పోస్టర్‌ను స్కూల్ ఆవరణలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫణి కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఏడు రౌండ్ల పోటీలు జరుగుతాయన్నారు. పోటీల అనంతరం జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఎంపిక చేస్తామని చెప్పారు. స్కూల్ ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టోర్నీ తమ స్కూల్లో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ టోర్నీకి స్కూల్ తరఫున పూర్త సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టోర్నీ డైరెక్టర్ రేణుక, స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు శివ పాల్గొన్నారు. -
దివిసీమ సిగలో కలికితురాయి
ఎన్నో ఆటంకాలను అధిగమించి అవనిగడ్డ/నాగాయలంక: గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం దివిసీమ సిగలో కలికితురాయిగా మారనుంది. క్షిపణి పరీక్ష కేంద్రంతో దివిసీమ ఖ్యాతి విశ్వవ్యాప్తం కానుంది. గత 13 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఈ ప్రాజెక్టుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేయనున్నారు. తొలిదశలో రూ.1,600 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. దీంతో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు దివిసీమ పారిశ్రామికంగా, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధించనుంది. 13 ఏళ్ల నిరీక్షణ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)కు దేశవ్యాప్తంగా 51 పరిశోధనాలయాలు ఉన్నాయి. జాతీయ భద్రతకు సంబంధించి వైమానిక అవసరాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి, జీవశాస్త్రం, మిస్సైల్స్, యుద్ధ శకటాలు, యుద్ధనౌకలు, క్షిపణిల తయారీపై ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. ఒడిశాలోని బాలాసోర్ కంటే మెరుగైన క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలని 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. అనంతరం 2012లో కృష్ణాజిల్లా నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోద అనువైన ప్రాంతంగా పాలకులు గుర్తించారు. అనువుగా ఉంటుందని.. ఇక్కడ సముద్రం మలుపు ఉండటం, దట్టమైన మడ అడవులు పెరగడంతో ఈ ప్రాంతాన్ని అనువైనదిగా ఎంచుకున్నారు. మచిలీపట్నం, చైన్నె ఓడరేవుల నుంచి సముద్రమార్గం ఉంది. దీంతో క్షిపణి ప్రయోగ కేంద్రాలకు అవసరమైన పరికరాలు రోడ్డు రవాణా నుంచి కాకుండా సముద్ర మార్గం నుంచి తీసుకొచ్చే వసతులు ఉన్నాయి. దీనికి తోడు 8 కి.మి. మేర ఇక్కడ జనావాసాలు లేకపోవడం, చెంతనే సముద్రం ఉండటంతో క్షిపణి పరీక్షలకు అనువుగా ఉంటుందని డీఆర్డీఓ అధికారులు నిర్ధారించడం ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా కలిసొచ్చే అంశాలు. అన్ని రంగాల్లో అభివృద్ధి ఈ ప్రాజెక్టుకు సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, మరో ఆరు వందల మంది సిబ్బంది నివాసం ఉండాల్సి రావడంతో ఈ ప్రాంతం ఆర్థికంగా అభి వృద్ధి చెందనుంది. భారీ కంటైనర్లు రాకపోకలతో రహదారుల విస్తరణ జరగనుంది. అనుబంధ పరిశ్రమలతో పలు భవనాల నిర్మాణాలు, స్థానికంగా వేలాది మందికి ఉపాధి, పచ్చదనం కోసం చెట్లు పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పర్యావరణ సమతౌల్యం పెరుగుతుంది. 2011లో బాలాసోర్ కంటే మెరుగైన పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయిం చింది. 2012లో గుల్లలమోద అనుకూలమైన ప్రాంతంగా గుర్తించారు. తొలుత ఈ ప్రాజెక్టు కోసం 380 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. గుల్లలమోద పరిసర ప్రాంతాల్లో క్షిపణి పరీక్ష కేంద్రానికి అనువైన భూములన్నీ అటవీ పరిధిలోకి వస్తాయి. ఈ ఆటంకాన్ని అధిగమించడానికి ఐదేళ్లు పట్టింది. 2017లో రెవెన్యూ నుంచి అటవీశాఖకు భూములు బదలాయించడానికి రూ.35 కోట్లు చెల్లించారు. అభయారణ్యం కావడంతో అరుదైన ఆలివ్రెడ్లీ తాబేళ్లు, బావురు పిల్లులు వంటి అంతరించి పోతున్న జీవరాసులు అక్కడ ఉండటంతో అనుమతులకు కొంత సమయం పట్టింది. డీఆర్డీఓ చైర్మన్‌గా పనిచేసిన సతీష్‌రెడ్డి తెలుగువారు కావడంతో గతంలో ఈ ప్రాజెక్టు కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డీఆర్డీఓ ఆధ్వర్యాన గుల్లలమోదలో క్షిపణి పరీక్ష కేంద్రం నేడు వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం తొలివిడతగా రూ.1,600 కోట్లతో పనులు మొత్తం రూ.20 వేల కోట్లతో అభివృద్ధి పనులు నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ క్షిపణి ప్రయోగ కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేయనున్నారు. లైవ్ ప్రసారాలను తిలకించడానికి ఈ ప్రాంతంలో భద్రతా చర్యలు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, డీఆర్డీఓ చైర్మన్ సమీర్ వి.కామత్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కట్టుదిట్టమైన భద్రత
విమానాశ్రయం(గన్నవరం): అమరావతి రాజధాని నిర్మాణ పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ప్రధాని భద్రత వ్యవహారాలు చూసే ఎన్ఎస్జీ దళాలు ఇక్కడికి చేరుకుని విమానాశ్రయాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీస్ శాఖతో కలిసి ఎన్ఎస్జీ దళాలు ప్రధాని భద్రత అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించి ఎన్ఎస్జీ పర్యవేక్షణలో ట్రయల్‌రన్ కూడా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరువనంతపురం నుంచి విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 2.50 గంటలకు ఇక్కడకు చేరుకోనున్నారు. అనంతరం 2.55 గంటలకు వాయుసేన హెలికాఫ్టర్‌లో ఇక్కడి నుంచి అమరావతి ప్రాంతానికి బయలుదేరివెళ్తారు. అక్కడ నుంచి సాయంత్రం 5.15 గంటలకు ఇక్కడకు చేరుకుని అదే విమానంలో న్యూఢిల్లీ బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు. ప్రధాని రాక సందర్భంగా విమానాశ్రయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు రేజ్ డీఐజీ అశోక్‌కుమార్, కృష్ణా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు.రైల్వేస్టేషన్లో విస్తృత తనిఖీలురైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్వే ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ రత్నరాజు ఆధ్వర్యాన జీఆర్పీ సీఐ జె.వి. రమణ ఆర్పీఎఫ్ అధికారుల సమన్వయంతో విజయవాడ రైల్వేస్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. పహల్గాం ఉగ్రవాదుల దాడి, అమరా వతిలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఈ తనిఖీలు చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్లో అనుమానితులు, సంఘవిద్రోహ శక్తులను గుర్తించడానికి ప్రత్యేంగా రైల్వే పోలీసులు, జాగిలాలు, డీఎఫ్ఎండీ, హెచ్హెచ్ఎండీలతో స్టేషన్లో క్షుణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రైల్వే డీఎస్పీ రత్నరాజు మాట్లాడుతూ ఆర్పీఎఫ్ పోలీసుల సమన్వయంతో అసాంఘిక శక్తులు రైల్వే స్టేషన్లోకి చొరబడకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్టేషన్లోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో నిరంతరం గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అనుమానిత వ్యక్తులు గానీ, బ్యాగులు గానీ ఉంటే రైల్వే పోలీసులకు లేదా 139కు ఫోన్‌చేసి సమాచారం అందించాల్సిందిగా కోరారు.దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన జి.నాగకుమారి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి రూ. లక్ష విరాళాన్ని అన్నదానానికి అందజేశారు. చైన్నెకి చెందిన డి.ఫణీంద్రరావు కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.ఎన్టీఆర్ జిల్లాలో 9.12 మి.మీ. సగటు వర్షపాతంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో 9.12 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గంపలగూడెం మండలంలో 25.2 మిల్లీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 22.4, విజయవాడ సెంట్రల్లో 16.4, వెస్ట్‌లో 16.4, వీరులపాడు, జి. కొండూరు, విజయవాడ నార్త్‌లో 15.2 మిల్లీమీటర్ల చొప్పున, విజయవాడ రూరల్‌లో 14.8, ఈస్ట్‌లో 14.6, మైలవరం 9.4, తిరువూరులో 6.6, వత్సవాయి 6.0, కంచికచర్లలో 3.6, ఎ.కొండూరలో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
అందుబాటులో.. ఒకటి, రెండు రోజులే..
శుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి పాలనలో రాష్ట్రంలో ఆలయాల భద్రత ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. సింహాచలం ఘటనతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో భద్రత ఎంత అని పలువురు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సాధారణ రోజుల్లో నిత్యం 30 వేల మందికిపైగా, శుక్ర, శని, ఆదివారాల్లో 60 వేల మందికిపైగా భక్తులు దర్శించుకుంటారు. ఆలయంలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పని చేయని సీసీ కెమెరాలు కొండపైకి గత నెల11వ తేదీన ఉత్తరాదికి చెందిన ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి వేళ కాలినడకన చేరుకోవడంతో పెద్ద దుమారమే రేగింది. గత నెలలో ఘాట్ రోడ్డులోని ఓం మలుపు వద్ద నిలిపిన కారులో 272 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం గమనార్హం. కొరవడిన చిత్తశుద్ధి కొండపైన, కింద 220 సీసీ కెమెరాలు ఉన్నా అవి సరిగా పని చేయడం లేదు. వాటిని పర్యవేక్షించే పరిస్థితిలేదు. దీన్ని బట్టే అధికారులకు అమ్మవారి భద్రతపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతోంది. కొంత మంది దేవాలయ అధికారులే దర్శనాల దందా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మొత్తం మీద రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. ఈఓ నియామకంలో ప్రభుత్వ అలసత్వం రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యమున్న దుర్గగుడికి ఈఓను నియమించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. దుర్గగుడి ఈఓగా గత ఏడాది డిసెంబర్ 31న రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత దేవదాయ శాఖ కమిషనర్‌గా, అదనపు కమిషనర్–2గా రామచంద్రమోహన్‌ను ప్రభుత్వం నియమించడంతో ఆ బాధ్యతలు కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. ఆయన ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఇక్కడ కొనసాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తూతూమంత్రంగా.. ఈఓగా రామచంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆలయంలో జరిగే ఉత్సవాల్లోనూ వైభవం తగ్గిందని సిబ్బందే బహిరంగంగా పేర్కొంటున్నారు. ఇటీవల మహా శివరాత్రి కల్యా ణోత్సవాలు, చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాల్లో ఈ లోటు స్పష్టంగా కనిపించింది. ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఈఓ పాల్గొనకపోవడంతో అంతా తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారని ఉభయదాతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. న్యూస్రీల్వైఎస్సార్ సీపీ హయాంలో అభివృద్ధికి పెద్ద పీట వైఎస్సార్ సీపీ సర్కార్ హయాంలో దుర్గగుడి అభివృద్ధికి పెద్ద పీట వేశారు. రూ.72 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా దుర్గగుడిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే ఇంజినీరింగ్ పనులను ఈఓ పర్యవేక్షించిన దాఖలాలు లేవు. పనులపై ఇంజినీరింగ్ సిబ్బంది పర్యవేక్షణ సైతం కొరవడింది. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. సింహచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ఘటన తర్వాత అయినా ప్రభుత్వంలో మార్పు వస్తుందని భక్తులు భావిస్తున్నారు. రెగ్యులర్ ఈఓను నియమించి, దుర్గగుడి అభివృద్ధి పనులపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సింహాచలం ఘటనతో దుర్గగుడి భద్రతపై సందేహాలు సీసీ కెమెరాలు లేక పెరుగుతున్న చోరీలు వారంలో ఒకటి, రెండు రోజులే ఉంటున్న ఈఓ జగన్ సర్కార్ ఇచ్చిన రూ.72 కోట్ల నిధులతో అనేక భారీ నిర్మాణాలు ఇన్చార్జి ఈఓగా రామచంద్రమోహన్ వారంలో ఒకటి, రెండు రోజులే దుర్గగుడిలో అధికారులకు అందుబాటులో ఉంటున్నారు. దేవస్థానానికి సంబంధించి ప్రతి ఫైల్ ఈ–ఫైల్లో నమోదు చేయాలని చెబుతున్నా.. పూజలు, ఇతర ఆలయ వ్యవహారాలు ఎప్పుడు అనుమతులు లభిస్తాయో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. ఆలయ సిబ్బందికి ప్రతి నెలా వేతనాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఆలస్యమవుతున్నాయి. ఆరు నెలలకు ఒకసారి ఆలయ అధికారులు, ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేయాలని ఆదేశాలున్నాయి. దుర్గగుడిలో అంతర్గత బదిలీల ఊసే లేదు. అమ్మవారి ఆదాయానికి భారీగా గండి పడేలా రామచంద్రమోహన్ వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సిఫార్సుల దర్శనాలను కట్టడి చేయడంలో రామచంద్రమోహన్ పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. సిఫార్సులపై వచ్చే వారిని నియంత్రించలేక, టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సైతం అంతరాలయంలోకి అనుమతించకపోవడంతో ఆలయ అధికారులతో భక్తులు వివాదాలకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. -
బావిలో పడిన ట్రాక్టర్ : యువకుడి దుర్మరణం
ఏడాది క్రితమే ఆ కుటుంబ పెద్ద అనారోగ్యంతో మరణించాడు. తల్లిని, చెల్లిని పోషించడానికి ఇరవై ఏళ్ల కుమారుడు కుటుంబ బాధ్యత నెత్తి మీద వేసుకున్నాడు. ఆ కుటుంబానికి ఉన్న ట్రాక్టర్‌ను జీవనాధారం చేసుకుని ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధి ఆ కుటుంబంపై పగబట్టింది. నేలబావి రూపంలో ఆ యువకుడిని బలి తీసుకుంది. తిరువూరు: పొలం దుక్కి దున్నడానికి ట్రాక్టరు నడుపుతున్న యువకుడు పొదలమాటున ఉన్న బావిని గమనించకపోవడంతో అందులో పడి దుర్మరణం చెందిన ఘటన ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన చల్లా హరీష్(20) తండ్రి వెంకటేశ్వరరావు ఏడాది క్రితం మరణించగా కుటుంబ పోషణ కోసం ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామ శివారులోని ఒక పొలం దుక్కి దున్నడానికి ట్రాక్టరు తీసుకెళ్లిన హరీష్ పొలంలో పొదల్లో పాడుబడిన బావిని గమనించకుండా ముందుకు నడపడంతో ట్రాక్టరు బావిలో బోల్తా పడింది. చుట్టుపక్కల రైతులు గమనించి అతనిని బావి నుంచి బయటికి తీసి ఆసుపత్రికి తరలించేందుకు యత్నించగా అప్పటికే మృతిచెందాడు. ఏడాది వ్యవధిలోనే భర్త, కుమారుడు ఇద్దరూ మృతిచెందడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. తమను ఆదుకునేదెవరంటూ రోదిస్తున్న ఆమెను ఆపతరం ఎవరికీ కావడం లేదు. ఎ.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెదపులిపాకలో రెండు పడవలు దగ్ధం
పెనమలూరు: పెదపులిపాక గ్రామంలోని రేవు వద్ద ఉంచిన రెండు పడవలు అనుమానాస్పద పరిస్థితుల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు ఎస్ఐ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం పెదపులిపాక గ్రామానికి చెందిన నడకుదురు ఏడుకొండలు, తాడి భాస్కరరావు వారి పడవల్లో కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లి చేపలు పట్టి జీవిస్తుంటారు. వేట అనంతరం పడవలు ఘాట్ వద్ద నది ఒడ్డున ఉంచుతారు. అయితే తమ ఇద్దరి పడవలు కాలిపోతున్నాయని స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఏడుకొండలు, భాస్కరరావు ఘటనా స్థలం వద్దకు వెళ్లి మంటలను ఆర్పే యత్నం చేయగా అప్పటికే పడవలు, మోటర్లు, చేపల వలలు దగ్ధమయ్యాయి. రాత్రి సమయంలో పడవలు ఉన్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగి, సిగరెట్ వేయటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రెండు పడవలు దగ్ధం కావటంతో రూ.6 లక్షల మేరకు నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేశారు. -
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పెనమలూరు: పెనమలూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ తగాదాలతో గడ్డి మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు చెరువు కట్టకు చెందిన ఉప్పలపు రమేష్ (53) స్వగ్రామం మొవ్వ మండలం కాజ గ్రామం. అతను 30 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులతో వచ్చి పెనమలూరు గ్రామంలో స్థిరపడ్డాడు. కానూరులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రమేష్‌కు భార్య ఇద్దకు కుమార్తెలు. కుమార్తెలకు వివాహం చేశాడు. కొంతకాలంగా రమేష్‌కు భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతను బుధవారం పెనమలూరు–వణుకూరు రోడ్డులో గడ్డి మందు తాగి ఇంటికి వచ్చి చెప్పగా అతనిని వెంటనే కానూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న రమేష్ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌కు కై వల్య, చైత్రదీపికవిజయవాడస్పోర్ట్స్: దక్షిణ కొరియాలో జరిగే ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌కు ప్రాతినిధ్యం వహించే భారత జట్టులో విజయవాడకు చెందిన కొప్పవరపు కై వల్య, పి.చైత్రదీపిక చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన భారత జట్టు ఎంపిక పోటీల్లో వీరిరువురూ అత్యుత్తమ ప్రదర్శనతో ఆసియా చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. యూత్ బాలుర సోలో ఫ్రీ స్టయిల్ వ్యక్తిగత విభాగానికి కై వల్య ఎంపిక కాగా, యూత్ పెయిర్ స్కేటింగ్ విభాగానికి కై వల్య, చైత్రదీపిక ఎంపికయ్యారు. వీరిద్దరూ ఇటీవల తైవాన్‌లో జరిగిన తైవాన్ స్కేటింగ్ ప్రపంచ కప్ పలు విభాగాల పోటీల్లో సత్తా చాటి దేశానికి పతకాలు అందించారు. వీరు ప్రస్తుతం పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో చదువుతున్నారు. ప్రతిష్టాత్మకమైన పోటీలకు ఎంపికై న వీరిద్దరినీ స్కూల్ ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి అభినందించారు. -
ధాన్యం విక్రయాలకు పోటెత్తిన రైతులు
అనుమంచిపల్లి(జగ్గయ్యపేట): గ్రామంలోని శ్రీ పద్మావతి శ్రీనివాసా పార్ బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని తిరువూరు, విస్సన్నపేట, నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, మైలవరం మండలాల్లోని ఆయా గ్రామాల నుంచి రైతులు ధాన్యం అమ్మేందుకు ట్రాక్టర్లు, లారీలతో వచ్చారు. అయితే అప్పటికే రెండు రోజులుగా రైస్‌మిల్లులో ధాన్యం లోడుతో ఉన్న వాహనాలుండటంతో వాహనాలు లోపలికి వచ్చేందుకు యాజమాన్యం అనుమతించకపోవటంతో రైతులు, యాజమాన్యం మధ్య రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధాన్యం బస్తాలతో వందల కి.మీ.ల దూరం నుంచి వచ్చామని, రెండు రోజుల క్రితం రావటంతో ధాన్యంతో ఇక్కడే ఉంటున్నామని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా వారికి అనుకూలమైన వారి వాహనాలను మాత్రం అనుమతిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ డీటీ వెంకటేశ్వర్లు పోలీసుల సహకారంతో రైతుల, యాజమాన్యంతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన రైతులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ సైట్లో ఇబ్బందులు ఉండటంతోనే ఆలస్యమవుతోందని, అంతే కాకుండా మిల్లులో ఎస్ఏ గోడౌన్లకు సరఫరా చేయాల్సిన బియ్యం గోడౌన్ అధికారులు కొనుగోలు చేయకపోవటంతో రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నాయని, దీంతో రైతుల ధాన్యానికి చోటు లేదని యాజమాన్యం వివరణ ఇచ్చింది. వందకు పైగా లారీలు, ట్రాక్టర్లకు ధాన్యంకు పాసులు జారీ చేయటంతో వివాదం సద్దుమణిగింది.అనుమంచిపల్లిలో రైస్‌మిల్లు వద్ద ఉద్రిక్తత రెండు రోజులుగా ధాన్యం లారీలతో మిల్లు వద్దే మకాం మిల్లులో స్థలం లేదని యాజమాన్యం సమాధానం రంగప్రవేశం చేసిన పౌర సరఫరాల శాఖ అధికారులు రైతులకు పాసుల జారీతో సద్దుమణిగిన వివాదం -
కూటమి పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, కార్మికులు, కర్షకులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. కార్మికుల కోసం సంక్షేమ పథకాలు లేవని, వారిని పట్టించుకోవడం వదిలేశారని ఆరోపించారు. మేడే సందర్భంగా విజయవాడలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్టీయూసీ, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న దేవినేని అవినాష్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆటో కార్మికులకు ప్రతి ఏటా వాహనమిత్ర పేరుతో రూ.10 వేలు ఇచ్చారని, కేసులు, జరిమానాలు లేకుండా ఐదేళ్ల పాటు ఆటోకార్మికులు ఆనందంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో కార్మికులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం చిరు వ్యాపారులకు ఏటా రూ.10 వేలు ఇచ్చి గుర్తింపు కార్డులు ఇచ్చిందని, కానీ నేడు టీడీపీ నేతలు చిరు వ్యాపారులను నిత్యం మామూళ్లతో దోచుకుంటున్నారన్నారు. అప్కాస్ ఏర్పాటు చేసి చిరు ఉద్యోగులు, కార్మికులకు క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చారని, కానీ నేడు కూటమి ప్రభుత్వం దానిని ఎత్తేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు పాలన ఉందా? సింహాచలం వంటి వరుస ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో అసలు పాలన ఉందా అనే అనుమానం కలుగుతోందని అవినాష్ అన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో తొక్కిసలాట, ఇప్పుడు సింహాచలంలో గోడ కూలి 8 మంది మృతి చెందడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలన్నారు. రెడ్‌బుక్ అమలుపైనే దృష్టి రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపైనే పాలకులు దృష్టి పెడుతున్నారని, పాలనను గాలికొదిలేశారని దేవినేని అవినాష్ విమర్శించారు. విజయవాడలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టిన రక్షణ గోడ వరదల నుంచి లక్షలాది మందిని కాపాడిందని, కూటమి ప్రభుత్వంలో సింహాచలంలో కట్టిన గోడ 8 మంది ప్రాణాలు తీసిందన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ప్రతి కార్మికుడికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ రవి, అనుబంధ విభాగాల అధ్యక్షులు గొట్టిపాటి హరీష్, ఏలూరి శివాజీ, శెటికం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్కరూ ఆనందంగా లేరు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు ఆటో రోడ్డెక్కితే జరిమానాల బాదుడు మేడే వేడుకల్లో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
పాత టైరు షెడ్లో అగ్నిప్రమాదం
ఆటోనగర్(విజయవాడతూర్పు): జవహర్ ఆటోనగర్ రెండవ క్రాస్ 4వ రోడ్డు లోని పాత టైరు షెడ్లో బుధవారం రాత్రి సుమారు 10.30 గంటల తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.15 లక్షలకు పైగా విలువైన పాత టైర్లు అగ్నికి ఆహుతయ్యాయి. షెడ్డు యజమాని హుస్సేన్ బాబా తెలిపిన వివరాల మేరకు... గత రాత్రి 10.30 గంటల తర్వాత హుస్సేన్ బాబా షెడ్డు వెనుక నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. షెడ్డు వెనుక భాగంలో ఎవరైనా చెత్తకు నిప్పు పెట్టడం వల్ల జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. మంటలను ఆర్పడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టిందని ఆగ్నిమాపక అధికారి నరేష్ తెలిపారు. మంటలు విస్తరించివుంటే... రెండవ క్రాస్ 4వ రోడ్డులో సుమారు 300కు పైగా పాత టైర్ల షాపులు ఉంటాయి. రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు వ్యాపించి ఈ షాపులకు నిప్పు అంటుకుని ఉంటే రూ.కోట్లల్లో ఆస్తినష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. సుమారు రూ.15 లక్షలకు పైగా ఆస్తినష్టం తప్పిన పెను ప్రమాదం -
సంగీత ప్రియులకు షడ్రసోపేత విందు
విజయవాడ కల్చరల్: శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 258 వ జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామ కృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న 32 వ జాతీయ సంగీతోత్సవాలు శ్రావ్యంగా సాగుతున్నాయి. గురువారం నాటి కార్యక్రమంలో కె.శర్వాణి, సహాన, జనని, కె.శ్రావ్య శివానీ, ఓరుగంటి లక్ష్మి, సురవరపు విద్య, అనీష్ మీనన్, ఎన్.భవ్యశ్రీ గీతిక, సాత్వికా మోహన్, బి.రఘునాథరావు త్యాగరాజ స్వామి రచించి, స్వరపరచిన కీర్తనలను ఆలపించారు. కరణా జలధే, రారా మాయింటి దాకా, గిరిరాజ సుతా తనయ, సామజవరగమన, పట్టి విడువరాదు తదితర కీర్తనలు శ్రోతలను రంజింపజేశాయి. త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవంలో 6 సంవత్సరాల చిన్నారి నుంచి 80 ఏళ్ల విద్వాంసుల వరకు పాల్గొనడం విశేషం. కార్యక్రమంలో శ్రీ సద్గురు సంగీత సభ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్, ఉపాధ్యక్షుడు బి.హరిప్రసాద్, కార్యదర్శి పోపూరి గౌరీనాఽథ్, సభ్యులు గాయత్రి గౌరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రావ్యంగా సాగుతున్న జాతీయ సంగీతోత్సవాలు ఆరేళ్ల చిన్నారి, 81 ఏళ్ల వయోవృద్ధ సంగీత విద్వాంసుల గానామృతం త్యాగరాజ కృతులను మధురంగా ఆలపిస్తున్న వైనం -
దేవాలయాల్లో భక్తులకు భద్రత కరువు
గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేవాలయాల్లో భక్తులకు భద్రత కరువైందని, కేవలం ఆదాయంపైనే యావ తప్ప భక్తుల రక్షణ చర్యల గురించి పట్టించుకోవటం లేదని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సాయిరామ్ విమర్శించారు. గుణదలలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాల ఆదాయంపై ఉన్న దృష్టి భక్తులకు భద్రత కల్పించే విషయంలో లేకుండా పాలకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు. బుధవారం సింహాచలం దేవస్థానంలో తొక్కిసలాట ఘటన, గతంలో తిరుమలలో చోటుచేసుకున్న తోపులాట ఘటనలు ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం దేవదాయ శాఖ అధికారులు, కూటమి నాయకుల నిర్లక్ష్యం కారణంగానే భక్తులు మృత్యువాత పడుతున్నారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే దేవాలయాల కూల్చివేత, విగ్రహాల ధ్వంసం వంటి దుర్ఘటనలను చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. దేవుని విషయంలో అపరాధం చేస్తున్న వారికి దేవుడే తగిన బుద్ధి చెబుతాడని అన్నారు. ఇకనైనా దేవదాయ శాఖ భక్తులకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకులు పాల్గొన్నారు. -
కనకమహాలక్ష్మి బ్యాంకులో ఘరానా మోసం
మచిలీపట్నంటౌన్: కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. నగరంలోని ఆజాద్ రోడ్డులో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి కో–ఆపరేటివ్ బ్యాంకు ప్రైవేటు లిమిటెడ్‌లో రాజుపేటకు చెందిన గుడిసేవ సునీత అనే మహిళ గత సంవత్సరం మే నెలలో నాలుగు బంగారపు గాజులు తాకట్టు పెట్టి రూ.2.40 లక్షలు అప్పుగా తీసు కుంది. తాకట్టు సమయంలో ఒకటికి రెండుసార్లు గీటురాయితో, యాసిడ్‌తో తనిఖీ చేసుకున్న బ్యాంకు అప్రైజర్ ఈ బంగారం మంచిదేనని నిర్ధారించటంతో యాజమాన్యం ఆమెకు గోల్డ్‌లోన్ మంజూరుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకు అధికారులు సునీత ఇంటికి వెళ్లి గత ఏడాది మీరు బ్యాంకులో పెట్టిన నాలుగు గాజులు నకిలీవని తేలిందని, వెంటనే వాటిని విడిపించుకుని తీసుకువెళ్లాలని సూచించారు. అయితే తాను పెట్టింది స్వచ్ఛమైన బంగారమని నిర్ధారించే రుణం ఇచ్చారని, ఇప్పుడు అవి నకిలీవని ఎలా చెబుతారని సునీత వారిని ప్రశ్నించింది. ఆడిటింగ్‌లో సుమారు 25 ఖాతాలకు చెందిన బంగారం నకిలీవని తేలిందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆమె విస్తుపోయింది. అప్రైజర్, బ్యాంకు అధికారులు కుమ్మక్కై తన బంగారం కాజేశారని దీనిపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా బ్యాంకు వారు చెప్పినట్లు చేసి వ్యవహారం సరిచేసుకోవాలని సూచించారని తెలిపింది. బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్‌పై పలు బ్యాంకులను మోసం చేసిన కేసులు ఉన్నాయని, ఈ మధ్యే అతనిపై దొంగ నోట్ల కేసు కూడా నమోదైందని ఆమె తెలిపారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నాగేశ్వరరావును వివరణ కోరగా అప్రైజర్, సునీత కుమ్మకై ్క రుణం తీసుకున్నారని చెప్పారు. పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తే, వారు పిల్లలు కలవారని కేసు వరకు వెళ్లలేదని బదులివ్వడం గమనార్హం. బ్యాంకులో 25 ఖాతాలకు సంబంధించి దాదాపు రూ.40 లక్షల మేరకు గోల్మాల్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే బ్యాంకు పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందనే ఉద్దేశంతో పోలీసు కేసు పెట్టలేదని, ఈ మొత్తం అప్రైజర్ నుంచి రికవరీ చేసేలా మేనేజర్ కాగితాలు రాయించుకున్నారని తెలుస్తోంది. కుదువపెట్టిన బంగారం మాయం చేసి నకిలీ బంగారం చూపుతున్నారని ఆరోపిస్తున్న బాధితురాలు గోల్డ్ అప్రైజర్ నకిలీ బంగారం తయారు చేయించి బ్యాంకులో జమ చేశారనే అనుమానాలు గోల్డ్ అప్రైజర్‌పై గతంలో దొంగనోట్ల కేసు ఉందని ఆరోపణలు 25 ఖాతాలకు సంబంధించి సుమారు రూ.40 లక్షల కుంభకోణం -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025సెలవుల్లో సరదాగా.. –8లోuభక్తిశ్రద్ధలతో మహాలక్ష్మి యాగం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అక్షయ తృతీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో బుధవారం మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో ఆలయ అర్చకులు యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకల జన సంక్షేమార్థం, లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ వేద పండితులు, అర్చకులు యాగాన్ని జరిపించారు. అమ్మవారి మూలవిరాట్‌కు ఎర్ర కలువలతో విశేష అర్చన జరిగింది. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు జరిపించారు. అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకొని తరించారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు సత్కారం విజయవాడస్పోర్ట్స్: సుదీర్ఘ కాలం క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కె.జి.వి.సరిత వీడ్కోలు పలికారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ పోలీసులు పి.వి.రమణ(సీపీవో), అబ్దుల్ కలామ్(ఎస్ఐ), కె.రామకృష్ణంరాజు(ఎస్ఐ), ఏ.శ్రీనివాసరావు(ఎస్ఐ), కె.సత్యనారాయణ(ఎస్ఐ), కె.వి.డి.మల్లేశ్వరి(ఎస్ఐ), ఏ.రామరావు(ఏఎస్ఐ), సి.హెచ్.కృష్ణారెడ్డి(ఏఎస్ఐ), ఎల్.విజయరాజు(హెడ్‌కానిస్టేబుల్), డి.శ్రీనివాసరావు(హోంగార్డు), ముల్లంగి సుబ్బులు(హోంగార్డు)లను ఆమె ఘనంగా సత్కరించారు. ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తినాయుడు, కార్యాలయ ఏవో సునీత తదితరులు పాల్గొన్నారు. స్కేటింగ్ ఆసియా చాంపియన్‌షిప్‌నకు జెస్సీరాజ్ విజయవాడస్పోర్ట్స్: ఆర్టిస్టిక్ స్కేటింగ్ అండర్–14 ఆసియా చాంపియన్‌షిప్‌నకు జెస్సీరాజ్ మాత్రపు అర్హత సాధించింది. జూలై 20 నుంచి 30వ తేదీ వరకు దక్షణకొరియాలో జరిగే ఈ చాంపియన్‌షిప్‌నకు జెస్సీ మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఇటీవల జరిగిన జాతీయ జట్టు ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించి ఈ పోటీలకు ఎంపికై ంది. మే 15 నుంచి 30వ తేదీ వరకు, జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు మెహాలీలో రెండు విడతలుగా జరిగే భారత్ క్యాంప్‌నకు ఆమె హాజరుకానుంది. పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో జెస్సీ పదో తరగతి చదువుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్కూల్ ప్రిన్సిపాల్ రాయప్పరెడ్డి ఆమెను ప్రత్యేకంగా అభినందించి, సత్తా చాటాలని ఆకాంక్షించారు.జి.కొండూరు: ‘వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి.. దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది.. ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకొక జీవికి ఆయువు మూడిందే’ అంటూ ఓ సినీ కవి రాసిన పాట అక్షరసత్యం. ప్రతి జీవి తన జీవన మనుగడ కోసం చేసే పోరాటంలో ఇది భాగం. కానీ అన్ని తెలిసీ.. అన్నీ అందుబాటులో ఉండీ, బతకడానికి ఎన్నో మార్గాలున్న మనిషి సైతం ప్రకృతి సమతుల్యతలో భాగమైన వన్య ప్రాణులను వేటాడుతూ, దానినే జీవనాధారంగా మార్చుకోవడం సహించలేని విషయం. వేటగాళ్ల ప్రభావంతో ఎంతో అరుదైన అటవీ జంతు సంపద కనుమరుగవుతోంది. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలకు వన్యప్రాణులను చిత్రాలలో చూపించడం తప్ప ప్రత్యక్ష ప్రదర్శన కష్ట తరంగా మారే అవకాశం ఉందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాహార్తి కోసం పొలాల వైపు.. ఎన్టీఆర్ జిల్లాలో 39వేల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వేసవి ఎండలు మండుతున్న క్రమంలో నీటి కోసం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే వన్య ప్రాణులు శివారు వ్యవసాయ భూముల, వాగులు, వంకల వైపు వస్తూ ఉంటాయి. యథేచ్ఛగా వేట.. వేటగాళ్లు ఇదే అదునుగా భావించి వన్య ప్రాణుల పాద ముద్రల ఆధారంగా ఏ జంతువులు సంచరిస్తున్నాయో పసిగట్టి ఉచ్చులు పెడుతున్నారు. వ్యవసాయ భూములు వైపు వస్తున్నాయని పసిగడితే విద్యుత్ తీగల ఆధారంగా వన్య ప్రాణులకు షాకు తగిలేలా ఉచ్చులు పెట్టి జంతువులను పట్టుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, జగ్గయ్యపేట, చందర్లపాడు, వీర్లపాడు, ఏ.కొండూరు, గంపలగూడెం మండలాల పరిధిలోని అటవీ, కొండ ప్రాంతాలలో వేట ఎక్కువగా కొనసాగుతున్నట్లు సమాచారం. వ్యాపారంగా మార్చుకొని.. అటవీ, కొండ ప్రాంతాలలో జంతువులను వేటాడి మాంసాన్ని విక్రయించడం వేటగాళ్లు వ్యాపారంగా మార్చుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో ఎక్కువగా లభించే అడవి పంది, కణుజు, దుప్పి, కొండ గొర్రె, కుందేళ్లు, అరుదైన పక్షులను వేటాడి జంతువును బట్టి కేజీ మాంసం రూ.400 నుంచి 800వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వేసవి కాలం మినహా మిగతా కాలాల్లో అడవి జంతువులు చిక్కని సమయాల్లో కొండముచ్చులను వేటాడి ఆ మాంసాన్నే దుప్పి మాంసంగా విక్రయిస్తున్నట్లు సమాచారం. వేటగాళ్లు పగటి సమయంలో ప్రత్యేకమైన పద్ధతుల్లో ఉచ్చులను పెట్టి రాత్రి సమయాలలో వేట కుక్కలను వెంట తీసుకెళ్లి వేటను కొనసాగిస్తున్నట్లు సమాచారం. అటవీశాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే వేటగాళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయని జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు. ఆటాడుకుందాం రండి.. విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో మే 1 తేదీ నుంచి 31వరకు వేసవి ఉచిత క్రీడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్స్, స్కేటింగ్ రింక్లలో శిక్షణ తరగతులు జరుగుతాయి. ● స్విమ్మింగ్.. గాంధీనగర్‌లోని జింఖానా గ్రౌండ్స్ దగ్గర ఉన్న సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్, గురునానక్ నగర్‌లోని కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్, చిట్టినగర్‌లోని డాక్టర్ కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్స్‌లో శిక్షణ ఇస్తారు. ● బ్యాడ్మింటన్.. బందరురోడ్డులోని దండమూడి రాజగోపాలచారి ఇండోర్ స్టేడియంలో, పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో శిక్షణ తరగతులు జరుగుతాయి. ● స్కేటింగ్.. సత్యనారాయణపురంలోని జీవీఎస్ శాస్త్రి పార్కులో, భవానీపురంలోని రోజ్ గార్డెన్ పార్కులో, దండమూడి రాజగోపాలచారి ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్‌లో శిక్షణ ఇస్తారు. ● యోగ.. పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో యోగాలో ఉచిత శిక్షణ తరగతులు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించిన పాలిసెట్–2025 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 88.27 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 7,661 మంది విద్యార్థులను కేటాయించగా వారిలో 6,762 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగింది. విద్యార్థులు గంట ముందుగా పది గంటలకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించలేదు. జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. విజయసారథి పరీక్షను పర్యవేక్షించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ.. నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని నలంద విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి నున్నకు చెందిన విద్యార్థి సందీప్, కండ్రిక నుంచి వచ్చిన వర్షిత్‌కుమార్ వారి ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో చేరుకున్నారు. అయితే అప్పటికే 11 గంటలు దాటడంతో అధికారులు వారిని అనుమతించలేదు. వారితో పాటుగా మరో ఇద్దరు విద్యార్థులు సైతం ఆలస్యంగా రావడంతో వారూ వెనుదిరిగి వెళ్లిపోయారు. కృష్ణాలో 4,083 మంది హాజరు.. మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని మొత్తం 10 కేంద్రాల్లో 4,562 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 4,083 మంది హాజరయ్యారని జిల్లా పరిశీలకుడు ఎ.శివప్రసాద్ తెలిపారు. వీరిలో 2,689 మంది బాలురకు గాను 2,424 మంది, 1,873 బాలికలకు గాను 1,659 మంది హాజరయ్యారని చెప్పారు. 7న్యూస్‌రీల్ రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న వేట జంతు మాంసం విక్రయాలను వ్యాపారంగా మార్చుకున్న వేటగాళ్లు కనుమరుగవుతున్న అరుదైన అటవీ జంతు సంపద వేసవి తాపంతో నీటి కోసం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న వన్య ప్రాణులు ఎన్టీఆర్ జిల్లాలో 39 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతంఇటీవల కొన్ని ఘటనలు.. గతంలో ఉమ్మడి కృష్ణాజిల్లా, ప్రస్తుత ఏలూరు జిల్లా పరిధి ముసునూరు మండలంలోని వేలుపుచర్ల శివారు అటవీ ప్రాంతంలో ఏప్రిల్ 12వ తేదీన వేటగాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు అడవి పందులను అటవీశాఖ అధికారులు ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి మునగపాడు గ్రామ శివారులోని గ్రంథివాని చెరువు వద్ద అడవిలో వదిలేశారు. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి గంగినేనిశివారులోని కొండ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం పెట్టిన ఉచ్చు తగిలి ఇదే గ్రామానికి చెందిన మేకల కాపరి కాలికి తీవ్ర గాయమైన ఘటన ఇటీవల జరిగింది. ఉచ్చు పెట్టిన వేటగాడు ఎవరో తెలియకపోవడంతో ఎటువంటి ఫిర్యాదు చేయకుండా వైద్యం చేయించుకొని వదిలేశారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.. కొండపల్లి ఫారెస్ట్ సెక్షన్లో వేట జరగకుండా సిబ్బందితో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. జంతువుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులను ఇప్పటి వరకు ముప్పై వరకు తొలగించి నిర్యీర్యం చేశాం. ఈ ఉచ్చులన్నీ ఎక్కువగా మొక్కజొన్న చేలు, జంతువులు నీటి కోసం వచ్చే ప్రదేశాలలో పెడుతున్నారు. వేటాడుతూ ఎవరైనా చిక్కితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎం.రామిరెడ్డి, కొండపల్లి ఫారెస్ట్ సెక్షన్ డీఆర్ఓ -
యువరాగం కదిలింది.. నవరాగం పలికింది!
విజయవాడ కల్చరల్: సంగీత మూర్తిత్రయంలో ఒకరైన సద్గురు త్యాగరాజ స్వామి 258 వ జయంతి ఉత్సవాలు శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం నాటి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన యువ కళాకారులు నవ రాగం పలికించారు. చింతలపాటి శ్రీదేవి సంకీర్తన, జీవీఆర్ సంగీత కళాశాల విద్యార్థినులు, మల్లాది అనన్య, మల్లాది అభిజ్ఞ, పుష్పాల షణ్ముఖ్, రాగంపూడి అమూల్య, పసుమర్తి సంధ్య, ముడుంబై లక్ష్మి,, డాక్టర్ యనమండ్ర శ్రీనివాస శర్మ త్యాగరాజ కృతులను ఆలపించారు. యువ వేణువు కళాకారులు వనమాలి, మాధవ్ వేణువుపై హృద్యంగా త్యాగరాజ కృతులను ఆలపించారు. శ్రీ సద్గురు సంగీత సభ కార్యవర్గం బీవీఎస్ ప్రకాష్, గౌరీనాథ్, గాయత్రి గౌరీనాథ్, ప్రసాద్ శర్మ, వీఆర్ సుబ్రహ్మణ్యం, శారదా దీప్తి పాల్గొన్నారు. యువ సంగీత కళాకారులను నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు. -
పీఎం పర్యటన నేపథ్యంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడస్పోర్ట్స్: రాజధాని పునఃనిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 2వ తేదీన గుంటూరు జిల్లా వెలగపూడికి విచ్చేస్తున్న నేపధ్యంలో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఈ ఆంక్షల సమయంలో వీఐపీ, వీవీఐపీలు నోవాటల్ హోటల్ నుంచి మహానాడు జంక్షన్, రమేష్ హాస్పిటల్ జంక్షన్, బెంజ్ సర్కిల్‌కు చేరుకుని అక్కడ నుంచి కుడివైపునకు తిరిగి ఎంజీ రోడ్డు మీదుగా పీసీఆర్ జంక్షన్, వినాయక టెంపుల్, సీతమ్మవారిపాదాలు, ప్రకాశంబ్యారేజ్ నుంచి సభా ప్రాంగణానికి చేరుకోవాలని పేర్కొన్నారు. లారీలు, భారీ వాహనాలు మళ్లింపు ● గుంటూరు–విశాఖపట్నంకు రాకపోకలు సాగించే వాహనాలు బుడంపాడు క్రాస్, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు, పెనుమూడి బ్రిడ్జి, మోపిదేవి, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మార్గాన్ని అనుసరించాలి. ● విశాఖపట్నం–చైన్నెకు రాకపోకలు సాగించే వాహనాలు హనుమాన్‌జంక్షన్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, మోపిదేవి, పెనుమూడి బ్రిడ్జి, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మార్గాన్ని అనుసరించాలి. ● చైన్నె–హైదరాబాద్‌కు అద్దంకి, పిడుగురాళ్ళ, నడికుడి, దామరచర్ల మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి మీదుగా రాకపోకలు సాగించాలి. సభా ప్రాంగణానికి వెళ్లే బస్సులు, కార్లు మళ్లింపు ● ఏలూరు వైపు నుంచి వాహనాలు చినఅవుటపల్లి వద్ద పశ్చిమ బైపాస్ మీదుగా ముస్తాబాద, నున్న, ఇన్నర్ రింగ్ రోడ్, కండ్రిక జంక్షన్, పైపుల రోడ్, వై.వి రావు ఎస్టేట్, పాములకాలువ, వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్డు, నల్లకుంట అండర్ బైపాస్ బ్రిడ్జి, కృష్ణానది ఐకానిక్ నుంచి వెలగపూడి సభా ప్రాంగణానికి చేరుకోవాలి. ● ఏలూరు జిల్లా కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి నుంచి వచ్చే బస్సులు, కృష్ణాజిల్లా నుంచి వచ్చే బస్సులు బెంజ్‌సర్కిల్, స్క్యూ బ్రిడ్జి, వారథి, తాడేపల్లి, మంగళగిరి, ఎన్ఆర్ఐ, ఎర్రుబాలెం మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి. ● ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల నుంచి వచ్చే బస్సులు ఇబ్రహీంపట్నం రింగ్, నల్లకుంట, పశ్చిమ బైపాస్ సర్వీస్ రోడ్, కృష్ణానది ఐకానిక్ మీదుగా వెలగపూడి సభా ప్రాంగణానికి చేరుకోవాలి. ● విజయవాడ నగరం నుంచి వెళ్లే బస్సులు, కార్లు బెంజ్‌సర్కిల్, స్క్యూ బ్రిడ్జి, వారథి, తాడేపల్లి, మంగళగిరి ఒక మార్గంగా, పైపుల రోడ్, వైవీ రావు ఎస్టేట్, పాములకాలువ, వెస్ట్ బైపాస్, కృష్ణానది ఐకానిక్ మీదుగా వెలగపూడి సభా ప్రాంగణానికి చేరుకోవాలి. సభ ముగిసే వరకు విశాఖపట్నం నుంచి వచ్చే భారీ వాహనాలను పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద, హైదరాబాద్ నుంచి వచ్చే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ వద్ద నిలిపి వేస్తామని ఇన్చార్జ్ సీపీ ప్రకటించారు. -
3న కేఎల్‌యూ క్యాంపస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు అత్యుత్తమ వార్షిక ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్ సాధించారని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథివర్మ తెలిపారు. విజయవాడ మ్యూజియం రోడ్డులో ఉన్న యూనివర్సిటీ అడ్మిని స్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది రూ.75 లక్షల వార్షిక ప్యాకేజీతో తమ విద్యార్థి ప్లేస్మెంట్ సాధించటం గర్వకారణమన్నారు. రూ.58 లక్షల ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్‌తో పాటు తమ విద్యార్థులు అనేక రికార్డ్స్ సాధించారని చెప్పారు. ఈ ఏడాది 500కు పైగా కంపెనీలు యూనివర్సిటీని సందర్శించి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించాయని, ఆరు వేల మందికి పైగా విద్యార్థులు కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ అందుకున్నారని, 4700 మంది విద్యార్థులు వివిధ ప్యాకేజీలలో ప్లేస్‌మెంట్స్ పొందారని వివరించారు. రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు వార్షిక ప్యాకేజీలను 35 మందికి పైగా విద్యార్థులు దక్కించుకున్నారన్నారు. సూపర్ డ్రీమ్ కంపెనీలలో 150 మంది విద్యార్థులు ప్లేస్ అయ్యారని చెప్పారు. టీసీఎస్‌లో ఒకేరోజు 617 మంది, కాప్ జెమినీలో 493 మంది, టెక్ మహేంద్రలో 381 మంది ఆఫర్స్ పొందారన్నారు. ఈ ఏడాది జర్మనీ, జపాన్, సింగపూర్, దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో అంతర్జాతీయ ప్లేసెమెంట్స్ దక్కించుకున్నారన్నారు. తమ యూనివర్సిటీ విద్యార్థులు సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులందరిలో ఉత్సాహన్ని నింపేందుకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ విజయోత్సవాన్ని మే మూడో తేదీన వడ్డేశ్వరంలోని యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్లేస్‌మెంట్స్ విభాగం డీన్ ఎన్.బి.వి.ప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంస్థలైన మైక్రోసాఫ్ట్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, సిస్కో వంటి కంపెనీలతో పాటు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో యూనివర్సిటీ నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, ఎంహెచ్ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అతిథులుగా మైక్రోసాఫ్ట్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కంపెనీ ప్రతినిధులు రూ.75 లక్షల ప్యాకేజీ దక్కించుకున్న కేఎల్‌యూ విద్యార్థి -
రెండేళ్ల తర్వాత తల్లి చెంతకు చేరిన బాలుడు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రెండేళ్ల క్రితం తప్పిపోయిన బాబును నవజీవన్ బాలభవన్ సురక్షితంగా తల్లి చెంతకు చేర్చింది. వివరాలు... కృష్ణాజిల్లా పెదకళ్లేపల్లికి చెందిన బుజ్జిబాబు(12) అనే బాలుడు రెండేళ్ల క్రితం 2023 జూలై 3న తప్పిపోయాడు. అదే గ్రామానికి చెందిన మహిళా సంరక్షక అధికారి భానుప్రియ కంటబడడంతో ఆమె రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టారు. కమిటీ తాత్కాలిక వసతి కోసం బాబును నవజీవన్ బాలభవన్ ఓపెన్ షెల్టర్‌కు అప్పగించింది. షెల్టర్‌లో నిత్యావసరాలు అందించి కౌన్సెలింగ్ నిర్వహించగా తనది పెద్ద కళ్లేపల్లి గ్రామమని, ఇతర వివరాలు తెలియవని చెప్పాడు. తల్లిదండ్రుల వివరాలు చెప్పలేదు. నవజీవన్ ఫీల్డ్ స్టాఫ్ బాబును పెదకళ్లేపల్లి గ్రామానికి తీసుకెళ్లి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేయగా ఫలించలేదు. అక్కడి పెద్దలను కలవగా బాబు తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత బుజ్జిబాబును తిరిగి సీడబ్ల్యూసీ ముందు ప్రవేశపెట్టగా చిగురు చిల్డ్రన్స్ హోంకు, ఆ తర్వాత దీపానివాస్కు పంపారు. రెగ్యులర్ స్కూల్ జాయినింగ్, ఆధార్ కార్డు కోసం సిబ్బంది బాబును మరోసారి పెద్దకళ్లేపల్లి గ్రామానికి తీసుకెళ్లగా అక్కడ పాఠశాల ఉపాధ్యాయుడు అతని వివరాలు తెలియజేశారు. స్కూల్లో జాయిన్ చేసినా వెళ్లకపోవడంతో మళ్లీ నవజీవన్ బాలభవన్‌కు పంపారు. అక్కడ కౌన్సెలింగ్ ఇస్తూ మరోసారి తల్లిదండ్రుల కోసం ప్రయత్నించగా తల్లి వివరాలు తెలిశాయి. దీంతో నవజీవన్ బాలభవన్ సిబ్బంది బాలుడిని అతని తల్లి చంద్రకళకు సురక్షితంగా అప్పగించారు. కార్యక్రమంలో నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ నీలం రత్న కుమార్, సంక్షేమ కమిటీ చైర్పర్సన్ కె.సువార్త, ప్రసన్నకుమారి, మమత తదితరులు పాల్గొన్నారు. -
ఐసెట్ నిర్వహిస్తే అడ్డుకుంటాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీ చదవాలనుకునే పేద విద్యార్థులకు గుదిబండలా మారిన జీవో 77ను రద్దు చేసి, ఆతర్వాతే ఈ ఏడాది ఐసెట్ ను నిర్వహించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో జీఓ 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఒక విద్యా సంవత్సరం ముగిసిపోయిందని, లోకేష్ హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది నిర్వహించే ఐసెట్‌కు ముందే జీఓను రద్దు చేయాలని, లేని పక్షంలో ఐసెట్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సమితి సభ్యుడు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి -
ర్యాంకుల ఫ్యాక్టరీల్లో మార్కుల యంత్రాల్లా విపరీతమైన ఒత్తిడిలో కాలం గడిపే విద్యార్థులకు వేసవి సెలవులు గొప్ప విరామం. ఈ సమయాన్ని విద్యార్థులు ఎక్కువగా వినోదానికి కేటాయిస్తారు. అయితే చిన్నారులు, యువత తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు గొప్ప అవకాశాలు కల్పిస్
‘యోగా’నందం.. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలోని ఈ–బ్లాక్ ఉన్న అమరావతి యోగ అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. వీటిలో యోగాసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాల్లో శిక్షణ ఇస్తారు. వివరాలకు 90147 46719, 98487 32626లో సంప్రదించవచ్చు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్.. విజయవాడ బందరురోడ్డులోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అమరావతి బాలోత్సవం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, మ్యాథ్స్, హ్యాపీ హ్యాపీ సమ్మర్ పేరుతో డ్యాన్స్‌లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ, డీపీపీ, కోలెడ్రా, సీ–లాంగ్వేజ్‌లో యువతీ యువకులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాలకు 90145 41958లో సంప్రదించవచ్చు. శ్లోకం.. భావం.. చిన్మయ మిషన్ విజయవాడ ఆధ్వర్యంలో చిన్మయ బాలల వేసవి శిబిరం–2025 పేరుతో 7 నుంచి 13ఏళ్ల లోపు బాల, బాలికలకు సంస్కృతి–సంప్రదాయాలు పేరుతో వివిధ అంశాల్లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. యోగా, భగవద్గీతలోని కథలు, శ్లోకాలు, భజనలు, గేమ్స్, క్విజ్, ఆర్ట్స్, పజిల్స్ అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్న వారు సూర్యారావు పేటలోని చిన్మయ మిషన్ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ‘ఆర్ట్’ఫుల్ స్కిల్.. మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్లో ఉన్న జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా చాక్లెట్ మేకింగ్, శారీ వర్క్, ఫ్లవర్ మేకింగ్, మిర్రర్ వర్క్, స్క్రీన్ ప్రింటింగ్, పెయింటింగ్ ఆర్టికల్స్ కోర్సుల్లో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 0866–2470420లో సంప్రదించవచ్చు. -
రైతుల గోడు పట్టించుకోని కూటమి సర్కార్
తిరువూరు: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, పంటలు అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి చందంగా ఉన్నాయని, రైతుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. తిరువూరు మండలం జి.కొత్తూరులో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు శీలం కృష్ణారెడ్డి ఇటీవల మృతిచెందారు. ఈ నేపథ్యంలో బుధవారం కృష్ణారెడ్డి కుటుంబసభ్యుల్ని అవినాష్ పరామర్శించారు. అనంతరం పంట పొలాలను పరిశీలించి ధాన్యం రైతులతో మాట్లాడారు. వరి, మిర్చి రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ధాన్యం రైతులకు గన్నీ బ్యాగులు కూడా ఇవ్వకపోవడం తగదన్నారు. పలు సహకార సంఘాల్లో అధికార పార్టీ అనుచరులైన రైతులకు మాత్రమే అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తూ సన్న, చిన్నకారు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. మిర్చికి మద్దతు ధరలేక, ధాన్యం కొనుగోలు చేసేవారు లేక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని, ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు మొద్దునిద్ర పోతున్నారన్నారు. రైతుల సమస్యలపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఉదాసీన వైఖరి అవలంబించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే మేలని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారన్నారు. ఎక్కడ రైతుకు ఇబ్బంది కలిగినా ఆదుకోవడానికి తాము ముందుంటామని అవినాష్ చెప్పారు. తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ తిరువూరు మండల అధ్యక్షుడు తాళ్ళూరి నవీన్‌కుమార్, తిరువూరు జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు రేగళ్ళ మోహన్‌రెడ్డి, కంచర్ల ముత్యప్రసాద్, నరెడ్ల వీరారెడ్డి, మామిడి కుటుంబరావు, మోదుగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
పేదరికం నుంచి బయటపడే వరకు సహకారం
నందిగామటౌన్: పేదరికం నుంచి పూర్తిగా బయటపడే వరకు చేయిపట్టి నడిపించే మిషన్ పీ 4 కార్యక్రమం అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలోని బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల ద్వారా సహాయం అందించే కార్యక్రమానికి ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మంగళవారం ఆయన శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా క్రక్స్ బయోటెక్స్ ద్వారా పగడాల నాగరత్నం కుటుంబానికి, సెంథిని బయో ప్రొడక్ట్స్ ద్వారా కోండ్రు వెంకట్రావమ్మ కుటుంబాలకు ఆటోలను అందజేశారు. ఫ్లైవుడ్ కంపెనీ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు అందించగా, అంబా కోచ్ బిల్డర్స్ ప్రైవేట్ కంపెనీ ద్వారా లక్ష్మయ్య, రమాదేవి దంపతులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నలుగురు మార్గదర్శకులను చూసి నాలుగు లక్షల మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పీ4 కార్యక్రమం ఒక్క రోజుతో ఆగేది కాదని, సీఎస్ఆర్ మాదిరిగా కాకుండా వినూత్న కార్యక్రమని చెప్పారు. జిల్లాలోని 96 వేల కుటుంబాలు అభివృద్ధి చెందే వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆయా కుటుంబాలను మార్గదర్శకులతో అనుసంధానించి సమాజంలో ఉన్నతంగా ఎదిగే వరకు మార్గదర్శకుల ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మార్గదర్శకులు అందించే ప్రతి రూపాయి, ప్రతి సాయం అత్యంత పారదర్శకతతో బంగారు కుటుంబాలకు చేరుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ముప్పాళ్ల గ్రామంలో పీ 4 కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, ఆయా శాఖల అధికారులు, నాయకులు, బంగారు కుటుంబాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
వక్ఫ్ ఉద్యమం రాజ్యాంగ పరిరక్షణ పోరాటమే
లబ్బీపేట(విజయవాడతూర్పు): వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమం ముమ్మాటికీ రాజ్యాంగ పరిరక్షణ పోరాటమేనని ముస్లం పర్సనల్ లా బోర్డు జాతీయ సభ్యులు జాకీర్ రషాదీ, మహమ్మద్ ఇషాక్ స్పష్టం చేశారు. ఆ చట్ట సవరణ చేయడం మతస్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు జాతీయ కార్యాచరణలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మంగళవారం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులతో పాటు వేర్వేరు జిల్లాల్లోని ముస్లిం జేఏసీ సభ్యులు, జిల్లాల కన్వీనర్లు, జమాత్‌ల ప్రతినిధులు హాజరయ్యారు. జాకీర్ రషాదీ, మహమ్మద్ ఇషాక్ మాట్లాడుతూ.. దేశ పౌరులు అందరికీ మత స్వేచ్ఛ కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26, 27, 28లను ఉల్లంఘిస్తూ, ఇతర మతాలకు వర్తించని నిబంధనలు ముస్లింలకు ఎందుకని ప్రశ్నించారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జూలై వరకూ ఉద్యమ కార్యాచరణ రూపొందించామని, శాంతియుత ఉద్యమాలు చేస్తామన్నారు. నేడు లైట్లు ఆర్పి నిరసన ఈ నెల 30వ తేదీ బుధవారం రాత్రి 9 నుంచి 9.15 గంటల వరకూ ఇళ్లలో, ఫ్యాక్టరీలలో దుకాణాల్లో విద్యుత్ దీపాలు ఆర్పి వేసి నిరసన తెలపాలని నిర్ణయించినట్లు జాకీర్ రషాదీ, మహమ్మద్ ఇషాక్ తెలిపారు. ప్రజాస్వామ్య వాదులు, లౌకిక వాదులు ఈ నిరసనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వక్ఫ్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ.. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అందరూ భారతీయులేనన్న రాజ్యాంగ స్పృహకు భిన్నంగా మత విభజన రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. అందుకు వక్ఫ్ సవరణను అడ్డుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న శాంతియుత ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జమ్యియ్యత్ అహ్లెహదీస్ ప్రతినిధి నసీర్ అహ్మద్ ఉమ్రి, మజ్లిస్ ఉల్ ఉలేమా ప్రతినిధులు ముఫ్తి యూసుఫ్, ముఫ్తి హబీబ్, మిల్లీ కౌన్సిల్ ప్రతినిధి ముఫ్తి ఆసిఫ్, పయమే ఇన్సానియత్, మౌలానా మక్బూల్ నద్వి, ముక్తార్ అలీ, న్యాయవాది అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు జాతీయ సభ్యులు జాకీర్ రషాదీ, మహమ్మద్ ఇషాక్ విజయవాడలో వక్ఫ్ చట్ట సవరణపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు -
ప్రధాని మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
విజయవాడస్పోర్ట్స్: రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే రెండో తేదీన వస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) కేజీవీ సరిత తెలిపారు. ప్రధాని పర్యటన నిమిత్తం ఏర్పాటు చేయవలసిన బందోబస్తుపై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ నగరం మీదుగా ప్రయాణిస్తారని చెప్పారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమానికి విచ్చేసే ప్రముఖులు, ప్రజలు ప్రయాణించు అన్ని రూట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. బందోబస్తు ఏర్పాట్లలో ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా, భద్రతా పరంగా ఎటువంటి లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీసీపీలు ఏబీటీఎస్ ఉదయారాణి, కృష్ణమూర్తినాయుడు, ఎస్వీడీ ప్రసాద్, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఏం.రాజారావు, కె.కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రభుత్వమే పరిరక్షించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఫైబర్ నెట్ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే మూతపడుతుందని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ఆందోళన వ్యక్తం చేశారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఏపీ ఫైబర్ నెట్‌ను కాపాడాలని కోరుతూ మంగళవారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ గడిచిన పది నెలల కాలంలో ఏపీ ఫైబర్ నెట్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనెక్షన్లు తగ్గిపోయాయన్నారు. గత ప్రభుత్వం నియమించిందన్న నెపంతో కూటమి ప్రభుత్వం సిబ్బందిని తొలగించడంతో జవాబుదారీతనం లోపించిందని చెప్పారు. దీనికి తోడు చైర్మన్ రాజీనామా, తరచూ ఎండీలను మార్చడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తాజా పరిణామాలతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆపరేటర్లు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే మంత్రిత్వ శాఖ కింద కొనసాగించడంతో పాటు అవసరమైన నిధులు కేటాయించి ఆదుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు స్పందించి ఫైబర్ నెట్ సంస్థను నిలబెట్టాలన్నారు. దీక్షలో జేఏసీ చైర్మన్ మిరియాల శ్రీరామ్, ప్రధాన కార్యదర్శి మధుబాబు, గౌరవాధ్యక్షుడు సీతారామయ్య, నాగిరెడ్డి వేణుగోపాలరెడ్డి, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. 2,412 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్ పెనమలూరు: మండల పరిధిలో 2,412 కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకొని, నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎస్ఐ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు గ్రామంలో పార్థసారథి కల్యాణమండపం వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశామన్నారు. తాడేపల్లి మండలానికి చెందిన బేతాళ కౌషిక్, బొజ్జగాని భానుప్రకాష్‌ను అదుపులోకి తీసుకొని, వారి నుంచి 2,400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో కేసులో పెనమలూరు సీఐ వెంకటరమణ మాట్లాడుతూ.. కానూరు సూపర్‌విజ్ రోడ్డులో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్ఐ ఉషారాణి దాడి చేశారన్నారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు యనమలకుదురుకు చెందిన ముర్ల దేవరాజు, ముర్ల తేజగా గుర్తించామని, నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశామని చెప్పారు. -
ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు పటిష్ట ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మే 2వ తేదీ అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాని హాజరుకానున్న నేపథ్యంలో చేపట్టవలసిన ఏర్పాట్లపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ జి. లక్ష్మీశ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, కొలికపూడి శ్రీనివాసరావు, పర్యటన విధులు నిర్వర్తించే రూట్ ఆఫీసర్లు, లైజనింగ్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్లతో మంత్రి సత్యకుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. విజయవంతం చేద్దాం.. మంత్రి మాట్లాడుతూ గ్రీన్‌ఫీల్డ్ రాజధాని లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతం చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో సభా వేదికకు జిల్లా నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని ముఖ్యంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, విద్య వైద్య వివిధ రంగాలకు చెందిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకురావాలన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు సమష్టి భాగస్వామ్యంతో ప్రధాన మంత్రి పర్యటనను విజయవంతం చేద్దామని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. కలెక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ ప్రధాన మంత్రి పర్యటనకు జిల్లా నుంచి చేసిన ఏర్పాట్లను మంత్రికి వివరించారు. సమావేశంలో వీఎంసీ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, డీఆర్వో ఎం. లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్డీవో కె. చైతన్య ఉన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
నటరాజుకు నృత్య నీరాజనం
సమ్మోహనం.. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ప్రదర్శన చేస్తున్న కళాకారులునృత్యద్భుతం.. కూచిపూడి ప్రదర్శన చేస్తున్న కళా కారిణివిజయవాడ కల్చరల్: అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా సంగీత కళాశాలలోని గోకరాజు గంగరాజు కళావేదికపై కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఫోక్ నృత్యాలు జాతీయ సమైక్యతను చాటాయి. నాట్యాచార్యులు సీహెచ్ అజయ్‌కుమార్, భాగవతుల సౌమ్య, శైలశ్రీ, పద్మశ్రీ హేమంత్, సప్తా శివకుమార్, భాగవతుల వెంకట్రామశర్మ, యల్లా జోస్యుల అనూరాధ, సంతోష్, ఉమామహేశ్వర పాత్రుడు, అనూషా నాయుడు, త్రినాథాచారి, ఉషామాధవి, అలివేలు మంగతాయారు, రాయన శ్రీనివాసరావు, శారదా రామకృష్ణ. చంద్రశేఖర్, చదలవాడ ఆనంద్ బృంద సభ్యులు అందరూ కలిపి దాదాపు 300 మంది పాల్గొన్నారు. పలువురికి సత్కారం.. ఈ సందర్భంగా సంగీత రంగానికి చెందిన శాంతిశ్రీ, ప్రముఖ నాట్యాచార్యుడు జోస్యుల శ్రీ రామచంద్రమూర్తి, మేకప్ ఆర్టిస్, నాట్యగురువులు మొత్తం 21 మందిని నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనరసమ్మ జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. భాషా సాంస్కృతిక శాఖ మేనేజర్ శ్రీనివాస్, వ్యాఖ్యాత అన్నపూర్ణ నిర్వహించారు. -
బోరుమంటున్న కృష్ణా తీరం
బెజవాడలో పాతాళంలోకి గంగ గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో లేవు. గతేడాది మార్చితో పోలిస్తే చాలా ప్రాంతాల్లో భూగర్భ జల మట్టం పడిపోయింది. ముఖ్యంగా విజయవాడ ‘బోరు’న విలపిస్తోంది. వాస్తవానికి నగరానికి ఓ వైపు కృష్ణా నది ప్రవహిస్తోంది. అంతేకాక మూడు ప్రధాన కాలువలు, నగరం మధ్య నుంచి బుడమేరు ప్రవహిస్తున్నాయి. అయినప్పటికీ విజయవాడతో పాటు చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లో వేసిన బోర్లు నిలువునా ఎండిపోతున్నాయి. మెట్ట ప్రాంతాల్లోనూ భూ గర్భ జల మట్టం పడిపోయింది. నగరంలో లక్షలాది రూపాయలు వెచ్చించి బోర్లు వేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. రోజు రోజుకు విస్తరిస్తున్న నగర పరిసరాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మిగిలిన ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి.. ● జిల్లాలోని వివిధ ప్రాంతా ల్లో భూగర్భ జలవనరుల శాఖ 70 ఫిజో మీటర్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా భూ గర్భ జలమట్టం లెక్కలు తీస్తోంది. ● ఏటా రుతు పవనాలకు ముందు, తర్వాత జలమట్టం కొలుస్తారు. ● తాజా లెక్కల ప్రకారం ఏ కొండూరు మండలం కొత్త రేపూడి గ్రామంలో భూ గర్భ జలమట్టం గణనీయంగా తగ్గింది. గతేడాది మార్చినెలతో పోలిస్తే 6.33 మీటర్లు ఉన్న జలమట్టం 14 మీటర్లకు పడిపోయింది. ● కంభంపాడులోనూ నీటి మట్టం తగ్గింది. జిల్లాలోని చందర్లపాడు మండలంలోని చింతలపాడు, కాసరబాద గ్రామాల్లోనే నీటి మట్టం తగ్గింది. ఈ రెండు గ్రామాలు కృష్ణానది చెంతనే ఉన్నాయి. ● జి. కొండూరు మండలం కోడూరు, కుంటముక్కల, వెలగలేరు గ్రామాల్లో నీటి మట్టం తగ్గింది. ● గంపలగూడెం మండలం గంపలగూడెం, వినగడప గ్రామాల్లోనూ, ఇబ్రహీం పట్నం మండలం జూపూడి, కొండపల్లి, కంచికచర్ల మండలం కంచికచర్ల, పరిటాల, పెండ్యాల, మైలవరం మండలం చంద్రాల, వత్సవాయి మండలం పోలంపల్లి, తాళ్లూరు, వత్సవాయి, విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామాల్లో నీటి మట్టం పడిపోయింది. ● బుడమేరు వరదల్లో విజయవాడలో సగభాగం సుమారు 10 రోజులపాటు వరద నీటిలో ఉంది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో నీటి మట్టం పెరగలేదు. డ్రాట్ ఇండెక్స్‌లో మూడు మండలాలు.. తాజా అంచనాల ప్రకారం ప్రకారం జిల్లాలోని మూడు మండలాలు కరువు ఇండెక్స్‌లో వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఏ. కొండూరు, విజయవాడ రూరల్ మండలాలు మైల్డ్ డ్రాట్, కంచికచర్ల మండలం మోడరేట్ డ్రాట్ కండిషన్లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా నిరాశాజనకంగా భూగర్భ జలం గతేడాదితో పోలిస్తే చాలా చోట్ల పడిపోయిన జలమట్టం విజయవాడ పశ్చిమం, రూరల్ ప్రాంతాల్లో ఎండిపోతున్న బోర్లు 500 అడుగుల వరకు వెళితే గానీ నీరు పడని పరిస్థితి మే నెలలో మరింత సంక్లిష్టంగా మారే అవకాశం 500 అడుగుల వరకు వెళ్లాల్సిందే.. గొల్లపూడితోపాటు విజయవాడ పశ్చిమ ప్రాంతం, అజిత్‌సింగ్‌నగర్ పరిసర ప్రాంతా ల్లో అపార్ట్మెంట్ల నిర్మాణాలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేసేవారు 500 అడుగుల వరకు బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో 15 ఏళ్ల కిందట వేసిన బోర్లు ఎండిపోయి నీటి సమస్య ఎదురవుతోంది. వేసవిలో స్వల్ప వ్యత్యాసాలు.. జిల్లాలో 70 ఫిజోమీటర్లు ఏర్పాటు చేశాం. ఎప్పటికప్పుడు భూ గర్భ జల మట్టం కొలతలు తీస్తున్నాం. నగరంలో బోర్లకు నీరు అందడం లేదని మా దృష్టికి వచ్చింది. కొన్ని చోట్ల 300 అడుగులు వేసినా పడని పరిస్థితి. ఇకపై భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు 500 అడుగుల వరకు బోర్లు వేస్తే నీటికి ఇబ్బంది ఉండదు. – నాగరాజు, డీడీ, భూగర్భ జలవనరుల శాఖ -
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● విజయవాడ నగరం మధ్యలో ఉన్న పెజ్జోనిపేటను ఆనుకొని ఏలూరు కాలువ ప్రవహిస్తోంది. రెండు మూడు నెలలు తప్ప ఏడాది పొడవునా కాలువ ప్రవహిస్తుంది. ఇటీవల ఏలూరు కాల్వకు ఆనుకొని బోర్ వేశారు. 300 అడుగులు వేసినా నీళ్లు పడలేదు. ● ఏలూరు లాకుల సెంటర్లో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఇక్కడ బోరు వేసేందుకు 300 అడుగుల వరకు తవ్వారు. కానీ నీళ్లు పడలేదు. ● గొల్లపూడి వద్ద కృష్ణా నది పక్కనే ఉన్న ఎస్ఎస్ కాలనీలో ఓ వ్యక్తి ఇంటిని నిర్మించేందుకు బోరు తవ్వారు. కానీ ఇక్కడ కూడా నీరు పడలేదు. ● గొల్లపూడిలోనే హోల్‌సేల్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో రెండు బోర్లు ఎండిపోయాయి. వాటి స్థానంలోనే రెండు బోర్లు వేశారు. ఒక్కొక్కటీ 300 అడుగుల వరకు వేశారు. కానీ ఆశించిన స్థాయిలో నీరు పడలేదు. ఇదీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి. నీటి కోసం బోర్లు వేసి, రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నా.. ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది. గొల్లపూడిలో ఎండిపోయిన బోరు న్యూస్‌రీల్ -
పహల్గాం ఉగ్రదాడి అమానుషం
విజయవాడస్పోర్ట్స్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో అమాయకులైన 26 మంది పర్యాటకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీయడం అమానుషమని ఆర్టీఓ వెంకటేశ్వరరావు, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు అన్నారు. ఎంజీ రోడ్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఉద్యోగులు జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మ శాంతించాలని కోరుతూ నివాళులర్పించారు. ఉగ్రవాదం నశించాలని కోరుతూ ప్ల కార్డులను పట్టుకొని ప్రదర్శన చేశారు. అనంతరం ఆర్టీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబీకుల కళ్ల ముందే ఉగ్రవాదులు కాల్పులు జరిపి ప్రాణాలు తీశారన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేమన్నారు. ఇంతటి దారుణానికి పాల్పడిన ముష్కరులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. అమరులకు నివాళి.. ఏపీ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు రాజుబాబు మాట్లాడుతూ.. భారత ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు మతం ఆధారంగా బాధితులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారన్నారు. ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రెకేత్తించిందన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడిన ఆయా దేశాలపై కఠినంగా వ్యవహరించే విధంగా, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ భారత ప్రభుత్వం తీసుకొని నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలన్నారు. భారతీయ హిందూ, ముస్లిం సోదరులు ఎప్పటికీ అన్నదమ్ముల్లవలే కలిసే ఉంటారన్నారు. దేశంలో మత ఘర్షణలు పెట్టే విధంగా ముష్కరులు మతం పేరును అడిగి మరి కాల్చి చంపారన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ రవాణాశాఖ కానిస్టేబుల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భద్రాచలం(రాజా), ఏవోలు సత్యనారాయణ, చంద్రకళ, జోనల్ సంఘం పూర్వపు సహాధ్యక్షురాలు జి.ఉషాసోదరి, కోశాధికారి రామచంద్రరాజు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పెసలు రైతులకు సొమ్ము జమ
● సేకరణ ప్రక్రియ మరింత ముమ్మరం ● ఇప్పటికే 938 టన్నులు సేకరణ కంకిపాడు: ఎట్టకేలకు పెసల రైతులకు సొమ్ము జమ అవు తోంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు సొమ్ము బదిలీ చేసేలా మార్క్‌ఫెడ్ అధికారులు అన్ని చర్యలూ తీసుకున్నారు. ‘పెసర రైతుకు కొనుగోడు కేంద్రాలు’ శీర్షికన ఈనెల 20న ‘సాక్షి’లో కథనం ప్రచురిత మైంది. పెసలు కొనుగోలు జరుగుతున్నా.. సొమ్ము లు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న వైనాన్ని వివరించింది. దీంతో స్పందించిన మార్క్‌ఫెడ్ అధికారులు జిల్లా స్థాయిలో నివేదికను సేకరించి ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు రూ. 4.81 కోట్ల సొమ్ము రైతు ఖాతాలకు జమ చేశారు. ముమ్మరంగా సేకరణ.. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో మూడు వేల హెక్టార్లలో పెసర పంట సాగు జరిగింది. మార్కెట్లో ధర ఆశాజనకంగా లేకపోవటంతో మార్క్‌ఫెడ్ పంట సేకరణకు చర్యలు చేపట్టింది. జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను తెరచి సేకరణ ప్రక్రియ చేపట్టింది. క్వింటాకు రూ.8,682 చొప్పున మద్దతు ధర అందించేలా కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. ఆయా కేంద్రాల ద్వారా 438 మంది రైతుల నుంచి 938 టన్నులు పెసలు సేకరించారు. రూ. 7,34,14,992 విలువైన పెసలు సేకరించి గోదాములకు తరలించారు. ఇందులో రూ. 4.81 కోట్లు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. విడతల వారీగా జమ.. పెసలు సేకరణ లక్ష్యానికి అనుగుణంగా సాగుతోంది. రైతులు మద్దతు ధర కోసం స్థానికంగా అందుబాటులో ఉంచిన కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించుకోవచ్చు. రూ. 4.81 కోట్లు రైతులకు సొమ్ము జమ అయ్యింది. మిగిలిన సొమ్ము విడతల వారీగా రైతులకు అందుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – మురళీకిషోర్, డీఎం, మార్క్‌ఫెడ్ -
మెటల్ డిటెక్టర్లకు మరమ్మతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని క్యూలైన్లలో ఏర్పాటు చేసిన మెటల్ డిటెక్టర్లకు ఇంజినీరింగ్(ఎలక్ట్రికల్) సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. దుర్గగుడి భద్రత ప్రశ్నార్థకం శీర్షికన మంగళవారం సాక్షి ప్రచురించిన కథనానికి ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ స్పందించారు. ఈవో ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. వెంటనే క్యూలైన్లలోని మెటల్ డిటెక్టర్లకు మరమ్మతులు చేపట్టి పని చేసేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలయ ఇంజినీరింగ్ సిబ్బంది అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు మహా మండపం క్యూలైన్లలోని మెటల్ డిటెక్టర్లకు మరమ్మతులు చేపట్టారు. అదే విధంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తుల లగేజీ, బ్యాగులను క్లోక్‌రూమ్‌లో భద్రపరుచుకునేలా సెక్యూరిటీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. హ్యాండ్ బ్యాగులు, పర్సులు మినహా ఇతర ఏ బ్యాగులను ఆలయంలోకి అనుమతించలేదు. బ్యాగులు, సంచులతో ఆలయంలోకి నో ఎంట్రీ -
హైవేపై సినీఫక్కీలో చైన్‌స్నాచింగ్
హనుమాన్‌జంక్షన్‌రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై ఓ కిలాడీ జంట బైక్‌పై వెళుతూనే సినీఫక్కీలో మరో స్కూటర్‌పై వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసులను చాకచాక్యంగా తెంచుకుని రెప్పపాటులో మాయమయ్యారు. బాపులపాడు మండలంలోని అంపాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఏలూరుకు చెందిన కర్రె పోతురాజు, కనకరత్నం దంపతులు స్కూటర్‌పై గన్నవరం మండలం పురుషోత్తపట్నంలో శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా అంపాపురం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వెనుకనుంచి వేగంగా బైక్‌పై వచ్చిన ఓ కిలాడీ జంట క్షణాల్లో మహిళ మెడలోని రెండు బంగారు గొలుసులను లాక్కుని పరారయ్యారు. భర్త పోతురాజు స్కూటర్ నడుపుతుండగా వెనుక సీటులో కూర్చున్న కనకరత్నం మెడలోని 32 గ్రాముల విలువైన రెండు బంగారు గొలుసులను దుండగులు బైక్ నడుపుతూనే దొంగిలించటం గమనార్హం. ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా వెనుక సీట్లో కూర్చున మహిళ చాకచక్యంగా కనకరత్నం మెడలోని బంగారు గొలుసులను లాక్కుంది. ఊహించని ఈ ఘటనతో అవాకై ్కన కనకరత్నం వెంటనే తేరుకుని కేకల వేయటంతో భర్త స్కూటర్ ఆపాడు. ఆ తర్వాత చోరీ జరిగిన విషయాన్ని భార్య చెప్పటంతో దుండగుల బైక్‌ను వెంబడించినప్పటికీ వారు మెరుపువేగంతో పరారయ్యారు. ఈ చోరీపై వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు కనకరత్నం ఫిర్యాదు ఇవ్వగా ఎస్ఐ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు. ఆత్కూర్ టోల్గేట్ సహా హైవేపై పలుచోట్ల సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించి, దుండగుల చిత్రాలను సేకరిస్తున్నారు. -
ఫైబర్‌నెట్‌ను ఆర్థికంగా ఆదుకుని నిలబెట్టాలి
● ఆపరేటర్లకు భద్రత కల్పించాలి ● ఫైబర్‌నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఫైబర్ నెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి నిలబెట్టాలని ఫైబర్‌నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవానికి అతి తక్కువ ధరలో ఇంటర్నెట్ సర్వీసులను అందించే సత్తా ఒక్క ఏపీ ఫైబర్ నెట్‌కు మాత్రమే ఉందన్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ విప్లవంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచగలిగే కమ్యూనికేషన్ నెట్వర్క్ ఫైబర్ నెట్‌కు ఉందన్నారు. అటువంటి ఫైబర్‌నెట్ ఒడు దొడుకులను ఎదుర్కొంటూ 10లక్షల కనెక్షన్ల నుంచి 5లక్షలకు దిగజారిందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థను నమ్ముకుని వేలాది మంది ఆపరేటర్లు స్వయం ఉపాధి పొందుతున్నారన్నారు. తాము లక్షలాది రూపాయలను పెట్టుబడులుగా పెట్టడమే కాకుండా వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి ప్రతి ఇంటికీ ఏపీ ఫైబర్ నెట్ సేవలను తీసుకువెళ్లడంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నామన్నారు. ఫైబర్ నెట్‌ను ఒకే మంత్రిత్వ శాఖ కింద నిర్వహించాలని, ఫైబర్ నెట్ ఆపరేటర్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆర్థిక భరోసా, వ్యాపార భద్రత, జీవిత బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. సంస్థకు రెగ్యులర్ ఎండీని నియమించాలని కోరారు. ఆర్థికంగా సహాయ, సహకారాలు అందించి సంస్థను కాపాడాలని, ఆపరేటర్లకు భరోసా కల్పించాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను కలిసి వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మైపాల రాంబాబు, ప్రధాన కార్యదర్శి బోయపాటి శివ ప్రసాద్, ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆలీ, కోశాధికారి శ్రీనివాస్, వివిధ ప్రాంతాలకు చెందిన ఆపరేటర్లు పాల్గొన్నారు. -
పోలీస్ ప్రజావాణిలో 78 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: శనగరంలోని పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 78 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెఫ్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి తెలిపారు. ఆస్తి, నగదు వివాదాలపై 49, కుటుంబ కలహాలపై మూడు, మహిలళా సంబంధిత నేరాలపై నాలుగు, చోరీలపై ఐదు, కొట్లాటలపై ఎనిమిది, ఇతర సంఘటనలపై తొమ్మిది మంది ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన అనంతరం సదరు ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆమె ఆదేశించారు. కెనాయింగ్ జాతీయ పోటీల్లో వర్షిత సత్తా విజయవాడస్పోర్ట్స్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన 35వ కెనాయింగ్ కయాకింగ్ స్ప్రింట్ చాంపియన్‌షిప్‌లో విజయవాడ క్రీడాకారిణి గోగులూరి వర్షిత సత్తా చాటింది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జరిగిన ఈ పోటీల్లో సబ్ జూనియర్ 500 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు వర్షిత ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకాన్ని సాధించింది. వర్షిత పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది. ప్రతిష్టాత్మకమైన జాతీయ పోటీల్లో పతకం సాధించిన క్రీడాకారిణి వర్షితను ఎన్ఎస్ఎం స్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాయప్పరెడ్డి, ఏపీ కెనాయింగ్ కయాకింగ్ సంఘం కార్యదర్శి శివారెడ్డి అభినందించారు. ఐటీఐల్లో ప్రవేశానికి అడ్మిషన్లు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించామని ఐటీఐ కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 24వ తేదీలోగా ఐటీఐ. ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారితో పాటు 8వ తరగతి పాస్ అయిన వారికి కూడా కొన్ని ట్రేడ్‌ల్లో అడ్మిషన్లు ఇస్తున్నామని ఆయన వివరించారు. విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వివరాలకు 94906 39639 నంబర్లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. -
క్షిపణి ప్రయోగ కేంద్రంకు పచ్చజెండా
మే 2న ప్రధాని నరేంద్రమోదీతో వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం అవనిగడ్డ: కృష్ణాజిల్లాకు మణిహారం కానున్న నాగాయలంక మండలంలోని గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రంకు ఎట్టకేలకు మోక్షం లబించింది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ కేంద్రానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 2వ తేదీన వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవం చేయనున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో రక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని 2011లో నిర్ణయించగా, 2012లో నాగాయలంక మండలం గుల్లలమోద అనుకూలమైనదిగా గుర్తించారు. ఈ ప్రాజెక్టు కోసం 386 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. 2017లో కొంత రెవెన్యూ భూమిని అటవీశాఖకు కేటాయించి ఆ మేరకు అటవీభూమిని ఈ ప్రాజెక్టుకు బదిలీచేశారు. ఇందుకోసం రూ.35కోట్లు చెల్లించారు. అదే సంవత్సరం తొలిదశ అనుమతులు లభించాయి. 2018లో ఈ ప్రాంతాన్ని సీఆర్‌జెడ్ పరిధి నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలివిడతగా రూ.1800 కోట్లు నిధులు కేటాయించగా ఈ ప్రాజెక్టు చుట్టూ ప్రహరీ, కొన్ని భవనాలు నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనున్నారు. 14 ఏళ్లకు మోక్షం మచిలీపట్నం ఆర్డీవో స్వాతి ఆదివారం గుల్లలమోద క్షిపణి ప్రయోగ కేంద్రంను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్య క్రమానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. గత 14 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న గుల్లలమోద క్షిపణి ప్రయోగ కేంద్రంకు అడ్డంకులు తొలగి ప్రారంభోత్సవం కానుండటంతో దివిసీమ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
● జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ● 173 మందికి రూ.18.70 లక్షల విలువైన ఉపకరణాల పంపిణీ
అవరోధాలను అధిగమించాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు అవరోధాలను అధిగమించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. పాఠశాల విద్యాశాఖ–సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు సోమవారం ఉపకరణాల పంపిణీ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, అధికారులు, పాల్గొని ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన 173 మంది లబ్ధిదారులకు రూ.18.70 లక్షల విలువైన 273 పరికరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, బ్రెయిలీ కిట్లు, క్రచ్ ఎల్బోలు, టీఎల్ఎం కిట్లు, వీల్ చెయిర్లు, వాకింగ్ స్టిక్‌లు, రోలటార్లు వంటి ఉపకరణాలు అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకుని కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటుందన్నారు. సదరం సర్టిఫికెట్లతో కొత్త పెన్షన్లు కూడా అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఈవో యూవీ సుబ్బారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి.మహేశ్వరరావు, సమగ్ర శిక్ష అధికారి ఎల్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని నిర్మాణం గర్వకారణం
● మే 2న ప్రధాని మోదీతో పునఃనిర్మాణ పనులు ప్రారంభం ● అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రులు, శాసనసభ్యులు చిలకలపూడి(మచిలీపట్నం): రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణంగా మిగలనుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో సోమవారం మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, వంగలపూడి అనిత, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ మే2న ప్రధాని మోదీ రాక సందర్భంగా సభా ప్రాంగణం సమీపంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కృష్ణాజిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు తరలివెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సభకు వచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యంతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ జి.గంగాధరరావు, శాసనసభ్యులు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, వర్ల కుమార్‌రాజా, కాగిత కృష్ణప్రసాద్, మారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ మంత్రి పీతల సుజాత, అధికారులు పాల్గొన్నారు. -
నాడు కళకళ...నేడు వెలవెల
● ఒకప్పుడు 72 షాపులతో వంద కోట్ల మేరకు వ్యాపారం ● నేడు సగం షాపుల్లోనే వ్యాపార లావాదేవీలు ● స్థానికంగా ఎక్కడికక్కడ ప్రైవేటు దుకాణాలు వెలవడమే కారణం విజయవాడరూరల్: ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన నున్న మ్యాంగో మార్కెట్ నేడు వ్యాపారాలు లేక వెలవెలబోతోంది. 1999 వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, భారీ పరిశ్రమల శాఖా మంత్రి కోటగిరి విద్యాధరరావు చేతుల మీదుగా ప్రారంభమైన నున్న మ్యాంగో మార్కెట్ దాదాపు 15 ఏళ్ల పాటు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. గత పది సంవత్సరాల నుంచి క్రమేపీ వ్యాపార లావాదేవీలు తగ్గుముఖం పట్టి తిరోగమనం దిశగా ఉంది. ఆసియాలోనే అతి పెద్ద మ్యాంగో మార్కెట్ గా పేరొందిన ఈ మ్యాంగో మార్కెట్ నుంచి సుమారు వంద కోట్ల రూపాయల వ్యాపారం ప్రతి మామిడి సీజన్లో జరిగేది. ఇక్కడ నుంచి మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు విస్తృతంగా జరిగేవి. కాలక్రమంలో మండల స్థాయిలో ప్రైవేటుగా వ్యాపార దుకాణాలు ఈదర, నూజివీడు, ఎ. కొండూరు, విస్సన్నపేట, చనుబండ, జి.కొండూ రు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల నున్న మ్యాంగో మార్కెట్ దాని ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే మామిడి రైతులకు రవాణా ఖర్చులు, హమాలీ చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని, గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో 72 షాపులకు గాను ఈ ఏడాది మామిడి సీజన్లో మార్కెట్లో 40 షాపుల్లో మాత్రమే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. గత నాలుగు సంవత్సరాల నుంచి మామిడి పూత దశలో కోడిపేను అనే వ్యాధి సోకడంతో ఆశించిన మేర దిగుబడులు లేక జిల్లాలోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది ఈ నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా భూమిలో తేమశాతం అధికంగా ఉండి మంగు వ్యాధి ఎక్కువగా వచ్చింది. ఆ వ్యాధి ప్రభావంతో మామిడిలో నాణ్యత లోపించడం వలన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదు. ఈ ఏడాది 10 మంది బయ్యర్లు మాత్రమే రంగ ప్రవేశం చేశారు. దీంతో మామిడి కొనుగోళ్లు మందగించాయి. దీని ప్రభావంతో రోజుకు 20 లారీలు కూడా ఎగుమతులు జరగడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మామిడి రైతుల బాగోగుల గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మామిడి పంట, మామిడి రైతులపై సానుకూల దృక్పథంతో ఆలోచించి ఇతర దేశాలకు కూడా మన మామిడి ఎగుమతులు జరిగేందుకు సహాయ సహకారాలు అందించాలని రైతులు కోరుతున్నారు. గత ప్రాభవం కోల్పోయిన నున్న మ్యాంగో మార్కెట్ మామిడి దిగుబడులు తగ్గాయి నున్న గ్రామంలో నాకు నాలుగు ఎకరాల మామిడి తోటలున్నాయి. గత సంవత్సరం 30 టన్నుల మామిడి కాయల దిగుబడులు వచ్చి లక్ష రూపాయల ఆదాయం లభించింది. ఈ ఏడాది దిగుబడులు బాగా తగ్గిపోయాయి. వ్యాధులను నివారించడానికి మందులు వాడటంతో ఖర్చు పెరిగింది. ఖర్చులు పోను రూ.20వేల ఆదాయం కూడా వస్తుందనే ఆశ లేదు. –భీమవరపు శివశేషిరెడ్డి, మామిడి రైతు, నున్న అవగాహన సదస్సులు నిర్వహించాం మామిడి తోటలను ఆశించిన కోడిపేను, మంగు వ్యాధులను నివారించేందుకు రైతులకు అవగాహన సదస్సులను నిర్వహించాం. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మామిడి దిగుబడులు తగ్గాయి. –బాలాజీ జిల్లా ఉద్యానశాఖ అధికారి -
ముందే ఖరారు!
పేరుకే టెండరు..ఎన్టీఆర్ జిల్లాలో అధికారికంగా ఎనిమిది రీచ్‌లకు అనుమతులున్నాయి. అయితే పార్లమెంట్ ప్రజా ప్రతినిధి చక్రం తిప్పి కేవలం చందర్లపాడు మండలం కసారబాద, కంచర్ల మండలం వేములపల్లి రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఈ ఇసుక రీచ్‌లను తన కనుసన్నల్లో ఉంచుకొని, ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి.. లారీకి రూ.10వేల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. అది కాక తెలంగాణ రాష్ట్రానికి ఇసుక అక్రమంగా తరలించి, దోపిడీ చేస్తున్నారు. అధికారులకు ఇదంతా తెలిసినా.. ఆయనకు చినబాబు అండదండలు ఉండటంతో ఏమి చేయలేక చేతులెత్తేస్తున్నారు. పేరుకు ప్రభుత్వం ఉచి త ఇసుక అని ఊదరగొడుతున్నా, సామాన్యు నికి ఇసుక అందుబాటులో లేదని, ట్రాక్టర్‌కు ఇసుక లోడ్ చేయాలన్నా, డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక టెండర్ల కేటాయింపులో మాయాజాలంసాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇసుక టెండర్లలో మాయాజాలం చేశారు. పేరుకు మాత్రం టెండర్లు అంటూ హడావుడి చేసిన యంత్రాంగం.. టెండర్లలో పాల్గొనే సంస్థలకు ఉండాల్సిన అర్హతలు, మార్గదర్శకాల జాబితా విడుదల చేసి, పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. బిడ్లు తెరిచి, టెండర్లు ఖరారు అయ్యే సమయానికి అసలు రంగు బయట పడింది. నిబంధనల పేరుతో తొలుత టెండర్లు రద్దు చేసి, చివరకు ముందే ఖరారు చేసుకున్న నాలుగు సంస్థలకు టెండర్లు కట్టబెట్టడంలో సక్సెస్ అయ్యింది. ‘బడా’ వ్యూహం.. కృష్ణా జిల్లాలో టెండర్ల ప్రక్రియను అధికారులు శనివారం సాయంత్రానికి పూర్తి చేశారు. టెండర్లు అన్నీ.. స్థానిక ప్రజా ప్రతినిధులకు దక్కేలా ఓ మంత్రి చక్రం తిప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి, స్థానిక సంస్థలను కాదని, తమ బినామీ సంస్థలకు దక్కేలా పావులు కదిపారు. కృష్ణా జిల్లాలో చోడవరం, రొయ్యూరు, నార్తువల్లూరు, లంకపల్లి నాలుగు రీచ్‌లకు ఏప్రిల్ మొదటి వారంలో టెండర్లు పిలిచారు. వీటిలో ఒక్కో క్వారీకి డజనుకుపైగా కాంట్రాక్ట్ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఈ టెండర్లలో పాల్గొనే సంస్థలకు స్థానికంగా జీఎస్టీ కలిగి ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఓ మంత్రి, స్థానిక ప్రజా ప్రతినిధులు, తమ బినామీలైన రాష్ట్రేతర సంస్థలతో టెండర్లు దాఖలు చేయించారు. ఈ సంస్థల జీఎస్టీలన్నీ స్థానికంగా కలిగి ఉన్నట్లు లోకల్ బ్రాంచ్‌లో నమోదు చేయించారు. టెండర్ల ప్రక్రియలో స్థానిక సంస్థలు అర్హత సాధించడంతో పోటీ నుంచి ఆ సంస్థలను తప్పించేందుకు పక్కా వ్యూహం అమలు చేశారు. టెండర్ల నోటిఫికేషన్, దరఖాస్తుల్లో కొన్ని తప్పులు ఉన్నట్లు సాకుగా చూపి టెండర్లను రద్దు చేశారు. మంత్రి ఆదేశాలను శిరసా వహించిన యంత్రాంగం వారి బినామీ సంస్థలకే కట్టబెట్టేలా సహకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ దందా.. నిబంధనల పేరుతో స్థానిక సంస్థలకు చెక్ కృష్ణా జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులకే టెండర్లు చక్రం తిప్పిన ఓ మంత్రి..వత్తాసు పలికిన అధికారులు ఎన్టీఆర్ జిల్లాలో పార్లమెంట్ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లోనే అంతా.. ఇప్పటికే అనధికారికంగా వందల లారీల ఇసుక అక్రమ రవాణా కృష్ణా జిల్లాలో టెండర్లు వీరికే.. పెనమలూరులోని చోడవరం ఇసుక రీచ్‌ను స్థానిక నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి చెందిన బినామీ సంస్థ దక్కించుకొంది. ఇప్పటికే ఈ రీచ్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారికంగా రోజుకు వందల లారీల ఇసుకను తరలిస్తున్నారు. రొయ్యూరు ఇసుక రీచ్ నుంచి గుడివాడకు చెందిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, మచిలీపట్నం పార్లమెంటు ప్రజా ప్రతినిధి, రోజుకు వందల లారీలను ప్రముఖ కాంట్రాక్టు సంస్థ చేసే పనులకు తరలిస్తున్నారు. ఈ రీచ్‌ను వీరికి చెందిన బినామీ సంస్థే దక్కించుకొంది. పామర్రు నియోజకవర్గ ప్రజా ప్రతినిధికి చెందిన బినామీ సంస్థకు నార్తు వల్లూరు ఇసుక రీచ్ వచ్చింది. ఈ రీచ్‌ను ఇప్పటికే ప్రతి రోజు ఎలాంటి అనుమతులు లేకుండా రోజుకు 400కు పైగా లారీల ఇసుకను అక్రమంగా తరలించి, కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. లంకపల్లి ఇసుక రీచ్‌ను ఓ మంత్రికి చెందిన బినామీ సంస్థ దక్కించుకొంది. ఇవి కాక చాగంటివారిపాలెం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రోజుకు 200 లారీలకు పైగా ఇసుకను పచ్చనేతలు తరలిస్తున్నారు. మద్దూరు ఇసుక రీచ్‌లో అదే పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధుల అడుగులకు మడుగులు ఒత్తుతూ, కళ్లముందే భారీ దోపిడీ జరుగుతున్న తమకేమి పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. -
దోపిడీ!
‘బడి’ తెగించి కంకిపాడు: కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ అండదండలతో పరిధి దాటి వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి వ్యాపారం సాగిస్తున్నాయి. పాఠశాలలనే వ్యాపార సముదాయంగా మార్చేస్తున్నాయి. నోటు పుస్తకాలు, మెటీరియల్స్ విక్రయించి తమ గల్లా పెట్టెలు నింపుకుంటున్నాయి. ప్రజల జేబులు లూటీ అవుతున్నా.. విద్యాశాఖ కనీసం ఆ వైపు కన్నెత్తి చూడకపోవటం విస్మయం కలిగిస్తోంది. జిల్లాలో పరిస్థితి.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 316 ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో 169 వరకూ హైస్కూల్స్ ఉన్నాయి. ఏటా లక్షకు పైగా విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు మంజూరయ్యాయి. అయినా ఆయా సంస్థలు అడ్మిషన్ల వేటలో పోటీ పడుతూ పది ఫలితాల సాధన వివరాల పేరుతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. అడ్డగోలు వ్యాపారం.. అడ్మిషన్ల ప్రారంభంతోనే విద్య వ్యాపారానికి కొన్ని విద్యాసంస్థలు తలుపులు బార్లా తెరిచాయి. మెటీరియల్స్, నోటు పుస్తకాలు తమ పాఠశాలలోనే కొనుగోలు చేయాలని నిబంధన విధిస్తున్నాయి. అంతే కాకుండా తరగతుల వారీగా రేట్లు నిర్ణయించి అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నాయి. నిబంధనల మేరకు ఏ విద్యాసంస్థలోనూ నోటు పుస్తకాలు, మెటీరియల్స్ విక్రయం జరగకూడదు. కానీ పలు యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలు వ్యాపారానికి తెరతీస్తున్నాయి. గత విద్యాసంవత్సరంలో మెటీరియల్స్, నోటుపుస్తకాలు పదో తరగతి విద్యార్థులకు రూ. 7,800 ధర నిర్ణయిస్తే ఈ ఏడాది 4, 5 తరగతుల చిన్నారులకే రూ. 8 వేలు వరకూ ధర నిర్ణయించారంటే విద్యాసంస్థల దోపిడీ ఏ తీరుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అదే సెమీ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అయితే ఈ దోపిడీ పరాకాష్టకు చేరింది. వాళ్లు చెప్పిందే వేదంగా మారింది. ఆయా విద్యాసంస్థల్లో అడ్డగోలు రేట్లు నిర్ణయించి మెటీరియల్స్, నోటు పుస్తకాలు అమ్మేస్తున్నారు. ఫీజుల్లోనూ అదే స్పీడు.. గత జూన్ నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల విషయంలో దూకుడు పెంచాయి. సెమీ స్కూల్స్‌లో వార్షిక ఫీజు రూ. 10వేలు నుంచి రూ. 20వేలు వరకూ పెంచేశాయి. కార్పొరేట్ తరహా సంస్థలు రూ. 50వేలు ఫీజు అదనంగా వసూళ్లు చేశాయి. ఈ ఏడాది కూడా ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేసేందుకు కొన్ని సంస్థలు రెడీ అయిపోయాయి. తమ సంస్థకు వచ్చిన పది ఫలితాలను ఆశచూపుతూ అడ్మిషన్లను పెంచుకుంటున్నాయి. మార్కుల వలలో పడి తల్లిదండ్రులు కష్టమైనా, భారమైనా ప్రైవేటు పాఠశాలల వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో విద్యాసంస్థల ఆర్థిక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయాలు అడ్డగోలుగా ప్రజల సొమ్ము లూటీ కూటమి వత్తాసుతో పెట్రేగిపోయి దందా ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలను చూసీ చూడనట్లుగా విద్యాశాఖ మా దృష్టిలో లేదు.. ప్రైవేటు విద్యాసంస్థల్లో పుస్తకాల విక్రయాలకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎంఈవోలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. కానీ ఎలాంటి నివేదిక అందించలేదు. పుస్తకాల విక్రయాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వటంతో పాటుగా అవసరమైతే విద్యాసంస్థ గుర్తింపును కూడా రద్దు చేస్తాం. – పీవీజే రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి, కృష్ణాజిల్లా ఇష్టారాజ్యంగా ప్రైవేటు విద్యాసంస్థల ఫీ‘జులుం’ కన్నెత్తి చూడని విద్యాశాఖ..ప్రైవేటు విద్యాసంస్థల్లో అడ్డగోలుగా పుస్తకాలు విక్రయాలు జరిగిపోతున్నాయి. అయినా విద్యాశాఖ అధికారులు ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదు. ఫలితంగా విద్య మాటున అడ్డగోలు వ్యాపారం సాగిస్తూ లక్షలు పోగేసుకుంటున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
ఇంద్రగిరిపై భక్తజన కోలాహలం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. మరో వైపున ఉదయం, సాయంత్రం వేళ భక్తుల రద్దీ మరింత పెరుగుతుండగా, వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు క్యూలైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో రూ. 500 టికెట్ల విక్రయాలను ఉదయం 8 గంటల నుంచే నిలిపివేశారు. దీంతో వీఐపీలకు, రూ. 300 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులకు ముఖ మండప దర్శనం కల్పించారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు అమ్మవారి దర్శనం త్వరత్వరగా జరిగేలా క్యూలైన్లను ముందుకు నడిపించారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ భక్తులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో, చలివేంద్రాలలో మజ్జిగ, మంచినీటిని అందించారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులకు ఉచిత ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలను అందజేశారు. మహా మండపం రెండో అంతస్తులో సిట్టింగ్ పద్ధతిలో, మొదటి అంతస్తులో బఫే పద్ధతిలో అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పెరుగుతున్న రద్దీ ఆర్జిత సేవలకు డిమాండ్.. చైత్ర అమావాస్య, ఆదివారం నేపథ్యంలో పలు ఆర్జిత సేవలకు డిమాండ్ పెరిగింది. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహించే ఖడ్గమాలార్చనకు 20 టికెట్లు, చండీహోమానికి రికార్డు స్థాయిలో రెండు వందలు టికెట్లను విక్రయించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, యాగశాలలో నవగ్రహ హోమం, గణపతి హోమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అర్చకులు శాంతి కల్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సూర్యోపాసన సేవ.. లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. -
వేసవి వినోదం...విజ్ఞానం
కంకిపాడు: వేసవిలో విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేలా గ్రంథాలయ సంస్థ చర్యలు చేపట్టింది. వినోదం, విజ్ఞానాన్ని పెంపొందించేలా వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 28న ప్రారంభం కానున్న శిక్షణ శిబిరాలు జూన్ 6వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 109 వరకూ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో జిల్లా గ్రంథాలయం 1, ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు 7, ద్వితీయ శ్రేణి గ్రంథాలయాలు 18, తృతీయ శ్రేణి లైబ్రరీలు 83 ఉన్నాయి. ఆయా గ్రంథాలయాల్లో వివిధ రకాలైన పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్స్, సంస్కృతి, సంప్రదాయాలు, చర్రితలకు సంబంధించిన అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. విజ్ఞానాన్ని అందిస్తూ.. గ్రంథాలయాలను చేరువ చేస్తూ... వేసవిలో స్నేహితులతో చక్కర్లు కొట్టడం, ఊర్లు తిరుగుతూ సందడిగా గడపటం చేస్తుంటారు. దీంతో పాఠశాలల పునఃప్రారంభం నాటికి చదువుపై పూర్తిగా అశ్రద్ధ, నిర్లక్ష్యం పెరుగుతున్నాయి. దీన్ని అధిగమిస్తూ, గ్రంథాలయ సంస్థ సేవలను విద్యార్థులకు చేరువ చేసే లక్ష్యంతో గ్రంథాలయ పరిషత్ వేసవి విజ్ఞాన శిబిరాలకు శ్రీకారం చుట్టింది. ఆట పాటలు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనను వెలికితీసేలా చిత్రలేఖనం, కథలు చెప్పటం, వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. లక్ష్యం ఘనం.. ఆచరణ భారం లక్ష్యం ఘనంగా ఉన్నా ఆచరణలో శిబిరాల నిర్వహణ గ్రంథాలయ సిబ్బందికి పెనుభారంగా మారుతోంది. గ్రేడ్–1కి రూ.25 వేలు, గ్రేడ్–2కి రూ.15 వేలు, గ్రేడ్–3కి రూ.8 వేలుచొప్పున వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు సొమ్ము కేటాయించారు. సోమవారం నుంచి శిబిరాలు ప్రారంభించాల్సి ఉన్నా ఆ సొమ్ము సంబంధిత గ్రంథాలయాలకు చేరలేదు. దీంతో సిబ్బంది స్థానిక దాతలను సమన్వయం చేసుకుని శిబిరం నిర్వహణ చేయడంతో పాటు ఆఖరి రోజు ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించాల్సిన ఉంటుంది. షెడ్యూల్ ఇదీ.. ● ఉదయం 8.00 నుంచి 8.30 గంటల వరకూ కథలు వినడం 8.30 నుంచి 10 గంటల వరకూ పుస్తక పఠనం ● 10.00 నుంచి 10.10 వరకూ విరామం ● 10.10 నుంచి 10.30 వరకూ పుస్తక సమీక్ష ● 10.30 నుంచి 11.00 వరకూ కథలు చెప్పటం, ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకూ స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్ చెస్, క్యారమ్స్, క్విజ్, జీకే తదితర అంశాలపై పోటీలు జరుగుతాయి. గ్రంథాలయాల్లో నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలు జూన్ 6 వరకూ నిర్వహణ పఠనాశక్తి, విజ్ఞాన సముపార్జనే లక్ష్యం అన్ని ఏర్పాట్లు పూర్తి వేసవి శిబిరాలు ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 109 కేంద్రాలకు 103 కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉన్నారు. విద్యార్థుల్లో చదివే ఆసక్తి పెంచడం, నైపుణ్యాలను వృద్ధి చేయడం లక్ష్యంగా శిబిరాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. శిబిరాల నిర్వహణకు గ్రాంటు కూడా త్వరలోనే అందిస్తాం. – రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, మచిలీపట్నం -
జంక్షన్లో నెల్లూరు ప్రేమజంట
హనుమాన్‌జంక్షన్ రూరల్: నెల్లూరుకు చెందిన ప్రేమజంట హనుమాన్‌జంక్షన్‌లో ఆదివారం హల్చల్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. నెల్లూరుకు చెందిన సయ్యద్ ఆఫ్రిన్ కుబ్రా, షేక్ రసూల్ ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పరారై హనుమాన్‌జంక్షన్ చేరుకున్నారు. ఇద్దరు మేజర్లు కావటంతో ఇక్కడి బంధువులు, స్నేహితుల సహకారంతో మత పెద్దల సమక్షంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆదివారం ఆఫ్రిన్, రసూల్ పెళ్లి చేసుకున్నారు. ఆఫ్రిన్ అదృశ్యమైనట్లుగా ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమజంట హనుమాన్‌జంక్షన్‌లో ఉన్నట్లుగా సమాచారం అందుకున్న నెల్లూరు పోలీసులు నవ దంపతుల ఉంటున్న బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఆఫ్రిన్‌ను తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందంటూ నెల్లూరు పోలీసులతో వెళ్లేందుకు వధూవరులు అంగీకరించలేదు. దీంతో జంక్షన్ పీఎస్‌కు ప్రేమజంట చేరుకోవడంతో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. తమ ఆధార్‌కార్డులు చూపించి, మేజర్లు కావడంతో ఇష్ట్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలంటూ నవదంపతులు వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమజంటకు.. ఇద్దరి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇంటికి పంపుతామని చెప్పడంతో ఎట్టకేలకు నెల్లూరు పోలీసుల వెంట వెళ్లిపోయారు. -
ఐక్యంగా ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం
విజయవాడస్పోర్ట్స్: ఐక్యంగా ఉగ్రవాదాన్ని అంతమొందిద్దామని విజయవాడ స్కేటర్లు పిలుపు నిచ్చారు. కశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన పర్యాటకులకు సంఘీభావంగా నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో స్కేటర్లు ఆదివారం ర్యాలీ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో 200 మంది జాతీయ, అంతర్జాతీయ స్కేటర్లు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్టీఎస్ రోడ్డులోని ఘంటసాల సంగీత కళాశాల నుంచి భానునగర్ జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా రోలర్ స్కేటింగ్ సంఘం అధ్యక్షుడు జె.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ భారత్ అభివృద్ధిని తట్టుకోలేక పాకిస్తాన్ మన దేశంలో అల్లర్లు సృష్టిస్తోందన్నారు. పాక్ దుష్ట ప్రయత్నాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందన్నారు. ఏపీ రోలర్ స్కేటింగ్ సంఘం ఉపాధ్యక్షుడు బచ్చు మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు ఆర్థికంగా, సాంకేతిక పరంగా అభివృద్ధి సాధిస్తుంటే, పాకిస్తాన్ ఆ దేశ యువకులను ఉగ్రవాదులుగా తయారు చేసి భారత్ పైకి ఉసిగొల్పుతోందన్నారు. పాక్ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కోశాధికారి ఎస్.తాతయ్య, కోచ్‌లు వరుణ్, దిలీప్, నాగసేన్, గ్రీష్మిత, మహేష్, నాని, కీర్తి, పాల్గొన్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో స్కేటర్ల ర్యాలీ -
ఆశావర్కర్స్‌ను ఉద్యోగులుగా గుర్తించండి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆశ వర్కర్లను ఎన్హెచ్ఎం ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఎన్హెచ్ఎం ఏర్పడి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘ఆశ వర్కర్లు సాధించిన విజయాలు–ముందున్న సవాళ్లు, ప్రజారోగ్యం–ప్రభుత్వాల బాధ్యత’ అనే అంశాలపై ఆదివారం రాష్ట్ర సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 20ఏళ్లుగా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారే తప్ప, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఆశావర్కర్లకు మెటర్నిటీ లీవ్ కూడా కల్పించకుండా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయన్నారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె. సాయిప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహించే విధానం మానుకొని, ప్రభుత్వ వైద్య రంగానికి ప్రోత్సాహం అందించాలని డిమాండ్ చేశారు. పోరాట ఫలితమే జాబ్ చార్ట్.. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్స్ పోరాట ఫలితంగా జాబ్ చార్ట్ సాధించుకున్నామన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆశ వర్కర్స్‌పై వేధింపులు కొనసాగుతున్నాయని, రాజకీయ జోక్యంతో అక్రమ తొలగింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెమినార్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. పోచమ్మ, కోశాధికారి ఏ.కమల, ఉపాధ్యక్షురాలు ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ -
భద్రతకు భరోసా ఏదీ!
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో భద్రతకు భరోసాపై సంశయం కలుగుతోంది. స్టేషన్లో రైల్వే పోలీసులు, ఇతర భద్రత సిబ్బంది చర్యలు మచ్చుకై నా కనిపించడం లేదు. విజయవాడ స్టేషన్‌కు సుమారు 250 రైళ్లు రోజూ వస్తుంటాయి. ఇక్కడ 10 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. 1.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. పూర్తిస్థాయిలో నిఘా ఏదీ.. నగరంలోని రైల్వేస్టేషన్లో నిఘా వ్యవస్థ పూర్తిస్థాయిలో కానరావడం లేదు. ప్రయాణికుల లగేజీల్లో అనుమానాస్పద వస్తువులు ఉంటున్నాయా లేదో కూడా గుర్తించే నిఘా వ్యవస్థ ఉండటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులతో పాటుగా సంఘ విద్రోహులు, దొంగలు, అక్రమ రవాణాదారులు యథేచ్ఛగా స్టేషన్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది మాత్రం అప్పుడప్పుడు స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలను తనిఖీలు చేసి సంతృప్తి చెందుతున్నారు. తాజాగా పహల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో ఎక్కువ మంది ప్రజలు వెళ్లే రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో ఎక్కడ, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా.. ప్రధాన ప్రవేశ మార్గాలతో పాటుగా రైల్వే స్టేషన్లోకి వచ్చి వెళ్లడానికి అనధికారిక మార్గాలను కొంతమంది వినియోగించుకుంటున్నారు. రైల్వేపార్సిల్ కార్యాలయం, నైజాంగేటు, కంసాలీపేట, తారాపేట, కాళేశ్వరరావు మార్కెట్, ఖుద్దూస్‌నగర్, రైల్వేకోర్టు తదితర ప్రాంతాల నుంచి కూడాస్టేషన్లోకి రాకపోకలు జరుగుతున్నాయి. రైలులో గంజాయి, మద్యం అక్రమ రవాణదారులు ఈ మార్గాల నుంచి సులువుగా తప్పించుకుని వెళుతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి కరోనా సమయంలో టిక్కెట్ ఉన్న ప్రయాణికులను తప్ప ఇతరులను స్టేషన్లోకి ప్రవేశించకుండా రైల్వే అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. అదే తరహాలో అనధికారిక మార్గాలతో పాటు స్టేషన్లోకి ప్రవేశ ద్వారాల వద్ద ఆర్పీఎఫ్ భద్రత సిబ్బంది నిఘా పెంచాలి. అనుమానితులను ముందుగానే గుర్తించి ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్లో కనిపించని ‘నిఘా’ ప్రవేశద్వారాల వద్ద కానరాని ఆర్పీఎఫ్ సెక్యూరిటీ పెరుగుతున్న నేరాలు రైల్వే స్టేషన్లో నిఘా లోపించడంతో ప్రయాణికులతో పాటు దొంగలు, పాత నేరస్తులు, గంజాయి బ్యాచ్ యథేచ్ఛగా స్టేషన్లో తిరుగుతున్నారు. ప్లాట్‌ఫాంలు, వెయిటింగ్ హాల్స్‌లలో నిద్రిస్తున్న ప్రయాణికుల లగేజీలు, సెల్ఫోన్లను చోరీ చేస్తున్న సంఘటలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రవేశ ద్వారాల వద్ద కొరవడిన భద్రత నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ విజయవాడతో పాటు డివిజన్లోని అన్ని స్టేషన్లలో ఆర్పీఎఫ్ భద్రత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడ స్టేషన్లో ఏర్పాటు చేసిన కంట్రోలు రూమ్ నుంచి తమ సిబ్బంది స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫాంలతో పాటు స్టేషన్ పరిసరాలు, ప్రవేశ ద్వారాల వద్ద రాకపోకలు సాగించే ప్రయాణికులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని తనిఖీ చేస్తుంటారు. ముఖ్యంగా అనధికార ప్రవేశ మార్గాలు, అవుటర్లలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఎక్స్ సర్వీస్‌మెన్‌లతో పర్యవేక్షణ ఏర్పాటు చేసి భద్రత చర్యలు చేపట్టాం. – వల్వేశ్వర బి.టి, సీనియర్ డీఎస్సీవిజయవాడ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించేందుకు ఐదు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు వైపున రెండు, దక్షిణ వైపు ఒకటి, పశ్చిమం వైపు తారాపేట, వెస్ట్ బుకింగ్ వద్ద రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు వీటి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో ఈ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లతో ఆర్పీఎఫ్, సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణికుల్ని, వారి లగేజీలను క్షుణంగా తనిఖీ చేసి పంపించే వ్యవస్థ ఉండేది. ఇటీవల అటువంటి భద్రత ప్రమాణాలు స్టేషన్లో ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి నెలకుంది. ప్రవేశ ద్వారాల వద్ద ఆర్పీఎఫ్ పోలీసులు కుర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. -
అనుబంధ విభాగాలే పార్టీకి బలం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అనుబంధ విభాగాల అధ్యక్షులు కీలకపాత్ర పోషించాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పార్టీకి అనుబంధ విభాగాలు బ్యాక్‌బోన్ లాంటివని ఆయన పేర్కొన్నారు. గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ, మండల స్థాయితో పాటు, గ్రామ డివిజన్ స్థాయి అనుబంధ విభాగాల కమిటీలను పూర్తి చేయాలని ఆయా విభాగాల అధ్యక్షులను అవినాష్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయ్యే విధంగా నియోజకవర్గ సమన్వయకర్తలు ఏర్పాటు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కష్ట పడేవారికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా ఎంపికై న వారికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. జనగణనతోపాటు ఓబీసీ కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యాన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు ఆదివారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం శంకరరావు మాట్లాడుతూ.. నేటి రాజకీయ నాయకులు విగ్రహమూర్తులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే అంబేడ్కర్, పూలే విగ్రహాలకు సమర్పించాల్సి వచ్చిందన్నారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇస్తూ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని దశాబ్దాలుగా కోరుతున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాల మాదిరిగానే బీసీల రక్షణకు చట్టం తీసుకురావాలని, క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలే పార్టీకి వెన్నెముకలని అరెస్ట్ చేస్తారా? శాంతియుతంగా ర్యాలీ చేసే తాము సంఘ విద్రోహులమైనట్లు పోలీసులు వేధించి అరెస్ట్ చేస్తారా అన్ని శంకరరావు ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు బీసీలు పార్టీకి వెన్నెముకలని చెప్పుకొస్తుంటే మరో వైపు పోలీసులు అరెస్ట్‌లు చేయటం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నేతలు కుమ్మరి క్రాంతికుమార్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, ఎం.ఎస్.ఎన్.మూర్తి, రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మేకా వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు -
ముగిసిన ఫుట్‌బాల్ పోటీలు
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి కేంద్రీయ విద్యాలయంలో రెండురోజులుగా జరుగుతున్న రీజనల్ స్థాయి ఫుట్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. సంఘటన్ వ్యాయామ క్రీడ ల్లో భాగంగా హైదరాబాద్ రీజియన్ పోటీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎనిమిది టీంలు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయం(హైదరాబాద్) జట్టు ప్రథమస్థానంలో నిలిచింది. బొల్లారం కేంద్రీయ విద్యాలయం జట్టు ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బి.రమేష్‌బాబు తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఐడీ సంచాలకులు భూమ య్య విజేతలకు కప్, సర్టిఫికెట్లు అందజేశారు. ఏడీఎంఈగా డాక్టర్ ఏవీరావుకు ఉద్యోగోన్నతి లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఫుల్ అడిషనల్ చార్జి(ఎఫ్ఏసీ)పై పనిచేస్తున్న డాక్టర్ ఏ వెంకటేశ్వరరావుకు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(ఏడీఎంఈ)గా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోనే ఎనస్థీషియా విభాగాధిపతిగా ఉన్న డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు గత ఏడాది నవంబరు 2న ఎఫ్ఏసీపై సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఏడీఎంఈగా ఉద్యోగోన్నతి కల్పించడంతో పూర్తిస్థాయిలో అధికారాలు అప్పగించినట్లయింది. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావుకు పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా చెస్ పోటీల్లో హర్షిత్, శుభశ్రీ సత్తా విజయవాడస్పోర్ట్స్: కృష్ణాజిల్లా స్థాయి అండర్–13 బాల, బాలికల చెస్ చాంపియన్‌షిప్ బాలుర విభాగంలో హర్షిత్‌సాయి, బాలికల విభాగంలో నాగశుభశ్రీ విజేతలుగా నిలిచారు. విజయవాడ శివారు పోరంకిలోని విజ్ఞానభారతి హై స్కూల్లో కృష్ణాజిల్లా చెస్ అసోసియేషన్ ఆదివారం ఈ పోటీలను నిర్వహించింది. బాలుర విభాగంలో అబ్దుల్ ఫెయిజ్, బాలికల విభాగంలో ప్రహస్థా రన్నర్లుగా నిలిచారు. వీరిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశామని కృష్ణాజిల్లా చెస్ సంఘం కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ తెలిపారు. అనంతరం ఓపెన్ కేటగిరీలో జరిగిన పోటీల్లో సందీప్, మోనీష్, రుషీల్సాయి విజేతలుగా నిలిచినట్లు చెప్పారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు విజ్ఞానభారతి హై స్కూల్ డైరక్టర్ కె.ఆర్.ఎస్.రావు, ఫిట్నెస్ డెవలపర్ ఎ.వేణు, కరూర్ వైశ్య బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ పాల్గొని విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. -
శాసీ్త్రయ సంగీతానికి పూర్వ వైభవం
విజయవాడ కల్చరల్: శాసీ్త్రయ సంగీతానికి పూర్వ వైభవం తేవడానికి శ్రీ సద్గురు సంగీత సభ కృషి చేస్తోందని సంగీత సభ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్ చెప్పారు. శ్రీసద్గురు సంగీత సభ ఆధ్వర్యాన త్యాగరాజస్వామి 258వ జయంతి సందర్భంగా ఎనిమిది రోజులపాటు నిర్వహించే జాతీయ సంగీతోత్సవాలు శివరామకృష్ణ క్షేత్రంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ శాసీ్త్రయ సంగీతం సజీవ స్రవంతి అని అభివర్ణించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి గౌరీనాథ్ మాట్లాడుతూ త్యాగరాజ కృతి వైభవం నేటి తరం యువ సంగీత విద్వాంసులు తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు బి.హరిప్రసాద్, జేఎస్ఎస్ ప్రసాద్ శర్మ, గాయత్రి గౌరీనాథ్, చారుమతి పల్లవి తదితరులు పాల్గొన్నారు. రుగ్వేదం పద్మశ్రీ, కృష్ణశ్రీ, వి.శ్యామకృష్ణ, హంసిని, సూరి కిరణ్మయి, మల్లాది కార్తీక, త్రివేణి, జొన్నలగడ్డ సాయిశ్రావణి త్యాగరాజ కృతులను మధురంగా గానం చేశారు. -
రోడ్డెక్కనున్న కొత్త బస్సులు
ఆటోనగర్(విజయవాడతూర్పు): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన బస్సులు రోడ్డెక్కనున్నాయి. వీటి రిజిస్ట్రేషన్లు దాదాపుగా పూర్తి అయినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎన్నికలకు ముందు కొనుగోలు చేసిన బస్సులు.. నాలుగు నెలల కిందట ఆటోనగర్ డిపోకు చేరాయి. వాటిని అధికారుల వినియోగించకపోవడంతో ఎండకు ఎండి, వానకు తడిసి పాడైపోతున్న విషయాన్ని ఇటీవల సాక్షి దినపత్రిక ‘రోడ్డెక్కని కొత్త బస్సులు’ అనే శీర్షికన ప్రచురించింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ బస్సులన్నింటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి, దాదాపుగా పూర్తి చేశారు. డిపోకు మొత్తం 11 బస్సులు మంజూరవగా.. ఇందులో 4 బస్సులు గత కొద్ది రోజుల నుంచి నడుపుతున్నట్టు డీఎం ప్రవీణ్‌కుమార్ చెప్పారు. మరో 7 బస్సులకు పర్మిట్ రావాల్సి ఉందని, త్వరలో వచ్చే అవకాశం ఉందని వివరించారు. -
ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న సదస్సులో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేశారు. విమానాశ్రయంలో కిషన్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర నాయకులు పాతూరి నాగభూషణం, సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, వల్లూరి జయప్రకాష్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు. గణితంపై ఆసక్తి పెంచుకోవాలి వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): అబాకస్, వేద గణితం చిన్నారుల్లో గణితంపై ఆసక్తిని, విశ్లేషణాత్మకతను పెంపొందిస్తోందని ఇస్రో రీసెర్చ్ సైంటిస్ట్ ఏడుకొండలు అన్నారు. డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్ రోబోటిక్స్‌లో వేద గణితం ప్రముఖ పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యాన పొట్టిశ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో జాతీయ స్థాయి అబాకస్, వేద గణితం పోటీలను ఆదివారం నిర్వహించారు. 14 రాష్ట్రాలకు చెందిన 1,235 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అబాకస్ –16 , వేదగణితం – 4 , రూబిక్స్ – 2, విభాగాల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి చిట్టా అమర్సుధీర్ మాట్లాడుతూ కృత్రిమ మేధాశక్తిలో వేదగణితం ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. ప్రిన్సిపాల్ శరవణ కుమార్, రాజా ఎడ్యుకేషనల్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ మార్టూరి పద్మలత మాట్లాడుతూ వేదగణితాన్ని మానసిక గణితం అని కూడా అంటారని చెప్పారు. -
కానుగ కాయలతో జాతీయ జెండా
పెనమలూరు: కానుగ కాయలకు రంగు వేసి జాతీయ జెండాను రూపొందించాడు చిన్నారి లిషాన్. చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవటానికి ప్రతిభ చాటాడు. తాడిగడప శివ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థి వినుకొండ లిషాన్కు నాలుగున్నర ఏళ్లు. పోరంకికి చెందిన శివప్రసాద్, శిరీష దంపతులు తమ కుమారుడి లిషాన్కు చిత్రకళపై మక్కువ ఉండటాన్ని గుర్తించి గిన్నీస్ బుక్ హోల్డర్, ప్రముఖ చిత్రకారుడు పామర్తి శివ వద్ద శిక్షణ ఇప్పిస్తున్నారు. లిషాన్ ప్రపంచ రికార్డు ప్రయత్నంలో భాగంగా ఈ నెల 25వ తేదీన 1,211 కానుగ కాయలకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు వేసి జాతీయ జెండాను రూపొందించాడు. కాయలకు నీలిరంగు వేసి అశోక చక్రాన్ని తీర్చిదిద్దాడు. కానుగ కాయలతో జాతీయ జెండా రూపకల్పనను ఐదు గంటల 11 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఈ జెండా 40 అంగుళాల ఎత్తు, 55 అంగుళాల వెడల్పుతో ఉంది. ఈ మేరకు వివరాలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు, అసిస్ట్ వరల్డ్ రికార్డు సంస్థలకు పంపామని చిత్రకారుడు పామర్తి శివ తెలిపారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లాకు చెందిన భక్తులు రూ.లక్ష విరాళం సమర్పించారు. కంకిపాడుకు చెందిన పి.శ్రీనివాసరావు, సత్యవతి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం అందజేసింది. ఆలయ అధికారులు దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. తిరుపతమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళం పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారి ఆలయానికి శనివారం కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, గండికుంట గ్రామానికి చెందిన కగ్గా సాంబయ్య దంపతులు రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ నగదును ఆలయ ఏఈఓ తిరుమలేశ్వరరావు చేతుల మీదుగా ఆందజేశారు. విరాళంలో రూ.50 వేలు నిత్యాన్నదాన పథకానికి, రూ.50 వేలు అంకమ్మ వారి ఉపాలయం గోపురం వెండి తాపడానికి వినియోగించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. పోలీస్ యంత్రాంగానికి ల్యాప్‌టాప్‌లు అందజేతవిజయవాడస్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి 50 ల్యాప్‌టాప్‌లను డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా పంపిణీ చేశారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అయిన ‘కంట్రోల్ ఎస్ డేటా’ కంపెనీ సమకూర్చిన ఈ ల్యాప్‌టాప్‌లను డీజీపీ కార్యాలయంలో శని వారం అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను త్వరితగతిన ఛేదించేందుకు ఈ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ డైరెక్టర్, రిటైర్డ్ డి.జి రాజీవ్కుమార్త్రివేది, కంపెనీ ప్రతినిధులు గోపాల్అగర్వాల్, మనీషా, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ చైర్మన్ సత్యనారాయణ, డీసీపీలు కె.జి.వి.సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎ.బి.టి.ఎస్. ఉదయరాణి, కృష్ణమూర్తినాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఎ.వి. ఎల్.ప్రసన్నకుమార్, ఎం.రాజారావు, కె.కోటేశ్వరరావు తదిరులు పాల్గొన్నారు. బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీలకు విశేష స్పందనఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు నిర్వహి స్తున్న బ్రాండ్ ఇమేజ్ టైటిల్ పోటీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో ఇప్పటి వరకు 200 మందికి పైగా తమ ఎంట్రీలను పంపారని తెలిపారు. ఔత్సాహికులకు మరో అవకాశం కల్పించాలనే ఉద్దే శంతో ఎంట్రీలు పంపేందుకు మే పదో తేదీ వరకు గడువు పొడిగించినట్లు కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. గడువు తేదీ ముగిసిన అనంతరం ఉత్తమ టైటిల్, ట్యాగ్లైన్లను ఎంపిక చేస్తామన్నారు. విజేతలకు ప్రశంసా పత్రం, బహుమతులతో పాటు సముచిత గుర్తింపు కల్పిస్తామని వివరించారు. ఈ పోటీల్లో పాల్గొని ఎంట్రీలు పంపిన ప్రతిఒక్కరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందజేస్తామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. -
పెత్తనం నీదా.. నాదా.. సై
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అందినకాడికి దోచుకో.. అందినంతా దాచుకో అన్న చందంగా తయారైంది పార్లమెంటు ప్రజాప్రతినిధి తీరు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఔపోసన పట్టిన ఆ ప్రజాప్రతినిధి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్రమ సంపాదన కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు జిల్లా టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుగా ఎస్సీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గాల్లో తన వ్యూహం ఫలించడంతో మిగిలిన నియోజకవర్గాల్లోనూ వేలు పెట్టడం ప్రారంభించారు. సహజ వనరుల దోపిడీ నుంచి నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు, కార్పొరేషన్ రుణాల మంజూరు ఇలా ప్రతి అంశంలో తన హవానే కొనసాగేలా ముందుకు సాగుతున్నారు. పార్టీ అధిష్టానం సైతం సదరు పార్లమెంటు ప్రజాప్రతినిధికే ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీ పెద్దలే అండగా నిలవడంతో ప్రతి నియోజకవర్గంలో తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ జిల్లా టీడీపీలో అంతర్గత పోరుకు తెరలేపారు. ఈ క్రమంలో సీనియర్ ప్రజాప్రతినిధులంతా పార్లమెంటు ప్రజాప్రతినిధి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో పెత్తనం పార్లమెంటు ప్రజాప్రతినిధి తన అక్రమ సంపాదన కోసం ముందుగా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలైన తిరువూరు, నందిగామపై దృష్టి సారించారు. తిరువూరు నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధిపై అధిష్టానానికి వ్యతిరేక భావన ఏర్పడేలా చేయడంలో విజయం సాధించారు. కనీసం స్థానికంగా జరిగే కార్యక్రమాలకు పార్టీ నాయకులు వెళ్లకుండా కట్టడి చేసి అక్కడి ప్రజాప్రతినిధిని ఏకాకిని చేశారు. ఈ నియోజకవర్గంలో మట్టి రవాణాతో పాటు మార్కెట్ యార్డు పదవులు, పార్టీ పదవులు, కార్పొరేషన్ రుణాలను సైతం తన వర్గానికి చెందిన వారికే వచ్చేలా చేయడంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి విజయం సాధించారు. ● ఎస్సీ నియోజకవర్గమైన నందిగామలో సైతం పార్లమెంటు ప్రజాప్రతినిధి తన పెత్తనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎనిమిది ఇసుక రీచ్‌లలో సగానికిపైగా నడవకుండా నిలిపివేసిన పార్లమెంటు ప్రజాప్రతినిధి తన వర్గానికి చెందిన వ్యక్తులతో ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధి, పార్లమెంటు ప్రజాప్రతినిధి మధ్య వైరం నడుస్తోంది. అంతే కాకుండా నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. సబ్సిడీ రుణాలు సైతం పార్లమెంట్ ప్రజాప్రతినిధి సూచించిన వారికే ఇస్తున్నారు. ● జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గం, స్థానిక ప్రజాప్రతినిధి వర్గం, టీడీపీ జిల్లా నాయకుడి వర్గంతో ఇక్కడి టీడీపీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారింది. ఇక్కడ మార్కెట్ యార్డు పదవి కోసం ఈ మూడు వర్గాలు పట్టుబడుతున్నాయి. అంతే కాకుండా ఇక్కడ ఇసుక అక్రమ రవాణా కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి వర్గం, స్థానిక ప్రజాప్రతినిధి వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ● మైలవరం నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి, స్థానిక ప్రజాప్రతినిధి ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. అయినప్పటికీ వారిద్దరి మధ్య అంతర్గతంగా తీవ్రస్థాయిలో వైరం నడుస్తోంది. స్థానికంగా ఇసుక, మట్టి, బూడిద వంటి సహజ వనరులు అధికంగా ఉన్నాయి. వీటి అక్రమ రవాణాలో తన వాటా కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి పట్టుబట్టాడు. దీంతో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వైరం నెలకొంది. ● విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో సైతం పార్లమెంటు ప్రజాప్రతినిధికి స్థానిక ప్రజాప్రతినిధులకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మొత్తంగా జిల్లా మీద పట్టు బిగించేందుకు ప్రయత్నం చేస్తున్న పార్లమెంటు ప్రజాప్రతినిధి ఈ మూడు నియోజకవర్గాల్లో సైతం గ్రూపు రాజకీయా లను ప్రోత్సహిస్తున్నారు. విజయ వాడ నగర పాలక సంస్థ వ్యవహా రాల్లో వేలు పెట్టి, ప్రతి పనిలో కమీ షన్ కోసం ఆయన చేస్తున్న ప్రయ త్నాలు పార్టీ సీనియర్ ప్రజాప్రతినిధులకు మింగుడు పడటంలేదు. జిల్లాపై పెత్తనం కోసం పార్లమెంటు ప్రజాప్రతినిధి దందా ఎస్సీ నియోజకవర్గాల్లో నాయకులు జీ హుజూర్ అనాల్సిందే.. నియోజకవర్గాల్లో అక్రమ సంపాదన కోసం గ్రూపు రాజకీయాలు ప్రతి నియోజకవర్గంలో పార్లమెంటు ప్రజాప్రతినిధికి ప్రత్యేక వర్గం ఈ వింత పోకడలపై మండిపడుతున్న సీనియర్ ప్రజాప్రతినిధులు -
డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో లోపాలు ఉన్నాయని, వాటిని తక్షణమే కూటమి ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను డీఎస్సీకి దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇంటర్, డిగ్రీ, పీజీలో మార్కుల శాతంతో సంబంధం లేకుండా డీఎస్సీకి అనుమతి ఇవ్వాలని కోరారు. బీఈడీ, డైట్ చేసి టెట్ అర్హత సాధించిన వారు ఇప్పుడు ఎందుకు అనర్హులు అయ్యారో చెప్పాలని ప్రశ్నించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వై.రాము, జి.రామన్న మాట్లాడుతూ.. సిలబస్ విస్తృతి రీత్యా అభ్యర్థులకు ప్రిపరేషన్‌కు 90 రోజుల సమయం ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా డీఎస్సీ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే ఏపీపీపీఎస్సీ పరీక్షలు, పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని డీఎస్సీ పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేనందున అభ్యర్థులకు వయోపరిమితి 47కు పెంచాలని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం, అధికారులు అనాలోచిత విధానాల వలన డీఎస్సీ అభ్యర్థులు రోడ్లపాలు అవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన వెబ్ సైట్స్‌లో డీఎస్సీకి దరఖాస్తు చేసుకోడానికి అనేక సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని కోరారు. అనేక మందికి ఎడిట్ ఆప్షన్, సబ్జెక్టు చూపించడం లేద న్నారు. తక్షణమే పై సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు -
కూచిపూడి గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
చిలకలపూడి(మచిలీపట్నం): కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర నివేదికను వారంలోగా తయారుచేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూచిపూడి నాట్య కళకు మూలకేంద్రమైన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ గ్రామాభివృద్ధిలో సినీ తారలు, వ్యాపార దిగ్గజాలను భాగస్వామ్యం చేసి వారి ద్వారా నిధులను సమకూర్చే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు. కూచిపూడి వెళ్లే రహదారి మార్గంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా గుంతలను పూడ్చివేయాలన్నారు. గ్రామాభివృద్ధి కోసం యునెస్కో వారికి ప్రతిపాదనలు పంపేందుకు డాక్యుమెంటేషన్ సిద్ధం చేయాలన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబరు నెలలో కూచిపూడి వార్షికోత్సవాలను యక్షగాన వసంతం పేరుతో వారం రోజుల పాటు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సొసైటీని ఏర్పాటు చేసి కూచిపూడి అభివృద్ధి పనులు, వార్షికోత్సవాల నిర్వహణ జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను పటిష్టంగా పనిచేసేందుకు కార్పస్ నిధులు సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకురాలు ప్రసన్నలక్ష్మి, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఉయ్యూరు ఆర్డీవో హేలషారోన్, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ హరిహరనాఽథ్, డీపీవో జె.అరుణ, జిల్లా పర్యాటక అధికారి రామ్‌లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
పాతాళంలో మినుము ధర
కంకిపాడు: ఈ ఏడాది రబీ సీజన్లో కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2,84,237 ఎకరాల్లో మినుము సాగు చేశారు. ఎల్బీజీ, పీయూ 31, టీబీజీ, ఘంటసాల, ఇతర సాధారణ రకాలను రైతులు సాగుకు ఎంచు కున్నారు. పంటలో బంగారు తీగ, పల్లాకు తెగులు ఆశించినా, పంట చేతికందిన తరుణంలో అకాల వర్షాలు కురిసినా దిగుబడుల్లో వ్యత్యాసం రాలేదు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ రైతులు పెట్టుబడులు పెట్టారు. ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది బస్తాలకు తగ్గకుండా దిగుబడులు దక్కాయి. మాగాణిలో అక్కడక్కడా ఐదు బస్తాల వరకూ దిగుబడులు వచ్చాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్లో ధరలు పడిపోవటంతో రైతులు నీరసించిపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7400 కాగా, బయటి మార్కెట్లోనూ అదే ధర ప్రారంభంలో దక్కింది. అయితే రోజురోజుకీ ధర పతనం అవుతూ ప్రస్తుతం క్వింటా రూ.6900కి పడిపోయింది. పెట్టుబడులు పోనూ, కనీసం కూలీ ఖర్చు కూడా చేతికి అందేలా లేదంటూ రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరిచినా...? ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే మినుముకు తక్కువ ధర లభిస్తుండటంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. దీంతో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో మినుము కొనుగోలు కేంద్రాలను మార్చి 19 నుంచి అందుబాటులోకి తెచ్చారు. మార్క్‌ఫెడ్ అధికారుల లెక్కల ప్రకారం మోదుగుమూడి, మల్లేశ్వరం, ఆరుగొలను, పెరికీడు, గుడ్లవల్లేరు, కంకిపాడు, మొవ్వ, పెడన, గంగూరు, బొడ్డపాడు, ఆత్కూరు, ఉయ్యూరులో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,84,237 ఎకరాల్లో మినుము సాగు జరిగింది. కేవలం 12 కేంద్రాల్లోనే కొనుగోలు కేంద్రాలను తెరిచారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు పంట తరలించటం, కూలీలతో జల్లెడ, కాటా వేయించే పనులకు రైతులే అదనంగా పెట్టుకోవాల్సి వస్తోంది. దూర ప్రాంతంలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు పంటను తరలించేందుకు రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు రూ.4 వేలు–రూ.6 వేల వరకూ అవుతుండటంతో కొనుగోలు కేంద్రాల వైపు రైతులు మొగ్గుచూపటం లేదు. దిగుబడి బాగున్నా... ధర లేదన్నా.. సిండికేట్ మాయ రైతులపై పడుతున్న అదనపు పెట్టుబడి భారాన్ని ఆసరాగా చేసుకున్న దళారీలు స్థాని కంగా రేటు పెరగకుండా నిరోధిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ధరను నిర్ణయించటంలో సిండికేట్ పాత్ర ఉందనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. అదే లేకపోతే గత సీజన్లో రూ.9200 నుంచి రూ.9800 పలికిన ధర నేడు అమాంతం రూ.6900కి ఎలా తగ్గుతుందని ప్రశ్నిస్తున్నారు. దళారుల చేతిలో రైతులు నిట్టనిలువునా దోపిడీ అవుతున్నారని స్పష్టమవుతోంది. ఇంత జరుగు తున్నా ప్రభుత్వం చలించటం లేదు. రైతు సేవా కేంద్రాల్లో రబీ ధాన్యం మాదిరిగా మినుము కొనుగోళ్లు చేపడితే రవాణా ఖర్చుల భారం తగ్గి, కనీసం మద్దతు ధర అయినా దక్కుతుందనే భావన వ్యక్తం చేస్తున్నారు.పూర్తిగా ధర పతనం నేను ఎకరం విస్తీర్ణంలో మినుము సాగు చేశాను. దిగుబడి అందరికీ బాగానే వచ్చింది. నాకు మాత్రం ఐదు క్వింటాళ్లే వచ్చింది. మార్కెట్లో ధర పూర్తిగా తగ్గిపోయింది. ఆ రేటుకు అమ్మితే ఖర్చులు కూడా రావు. చేసేది లేక పంటను ఇంటిలో నిల్వ చేశా. మంచి ధర వస్తే అమ్ము దామని చూస్తున్నా. –బీహెచ్ రాజగోపాల్‌రెడ్డి, రైతు, ప్రొద్దుటూరు సిండికేట్ దోపిడీ వ్యాపారులు సిండికేట్ అయిపోయారు. గత సీజన్లో రూ.9200 ఉన్న ధర ఈ ఏడాది పడిపోవటానికి వారే కారణం. అదేమంటే బర్మా నుంచి మినుము దిగుమతి అవుతోందంటున్నారు. ఆర్ఎస్కేల్లో మినుము కొనుగోలు చేయాలి. –కొండవీటి సుబ్బారావు, రైతు, మంతెన -
బ్రాహ్మణ సామాజికవర్గంపై ప్రభుత్వ దాష్టీకం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మ ణ సామాజికవర్గంపై దాష్టీకాలు అధికమయ్యాయని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై కక్ష పూరితంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాజకీయ కక్ష సాధింపులతో కుట్రపూరితంగా అక్రమ కేసులో సస్పెండ్ చేసి, సంధ్యా వందనం చేసుకోవటానికి కూడా సామాన్లు అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ బాగా పనిచేసిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆత్మగౌరవంపైనా.. అప్పటి ప్రభుత్వం దాడి చేసిందని గుర్తు చేశారు. ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావును ఏ విధంగా అవమానపర్చారో చూశామన్నారు. శారదా పీఠంపై ఎందుకంత కక్ష.... విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలసలో శారదా పీఠంకి గత వైఎస్సార్ సీపీ సర్కార్ కేటాయించిన 15 ఎకరాలను కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. వేద పాఠశాల ఏర్పాటుకు భూమి ఇవ్వాలని శారదాపీఠం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని కోరగా, అప్పటి ప్రభుత్వం స్పందించి కొత్తవలసలో భూమి కేటాయించిందని చెప్పారు. కానీ ప్రభుత్వం మారిన వెంటనే కేటాయింపులను రద్దు చేయటంతో పాటు వేరే కంపెనీకి ఎకరా కేవలం రూపాయికే కేటాయించటం గమనార్హమన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే శారదా పీఠం పైన, స్వరూపానంద స్వామి పైన ప్రభుత్వానికి ఎందుకంత కక్ష సాధింపు అని ప్రశ్నించారు. తిరుమలలో విశాఖ శారదా పీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకి అప్పగించాలని, టీటీడీ అధికారులు మఠానికి నోటీసులు జారీ చేయటంపై భక్తులు మండిపడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్చకులు, పురోహితులపై దాడులు అధికమయ్యాయని తెలిపారు. అర్చకులకు సరైన రక్షణ కల్పించి కఠినమైన చట్టాన్ని రూపొందించాలని కోరారు. వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు -
మాటలతో మత్తు జల్లుతాడు..
గుణదల(విజయవాడ తూర్పు): యువతులతో నమ్మకంగా నటిస్తూ నయవంచనకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన మాయమాటలతో నమ్మించి వారి వద్ద బంగారు ఆభరణాలను దొంగిలించే మాయలోడిని మాచవరం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ మేరకు సెంట్రల్ ఏసీపీ దామోదర్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సులువైన దారిలో డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ యువకుడు చోరీలకు అలవాటు పడ్డాడని తెలిపారు. హైదరాబాద్ నిజాంపేట, ప్రశాంతి నగర్‌కు చెందిన కిలారు నాగతేజ (23) అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. బాపట్లకు చెందిన ఈయన కుటుంబం బతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్ వలస వెళ్లారు. వ్యసనాలకు అలవాటు పడిన నాగతేజ సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని ఎన్నుకున్నాడు. దీనిలో భాగంగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా యువతులను టార్గెట్ చేశాడు. మాయమాటలతో ఆకట్టుకుని వారి వద్ద బంగారు నగలను దోచుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. హైదరాబాదులో జరిగిన ఇటువంటి ఘటనల్లో పలుమార్లు ఈ యువకుడు అరెస్టయ్యాడు. ఇటీవల విడుదలైన నాగతేజ విజయవాడకు చెందిన ఓ యువతిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. తాను ఓ పెద్ద వ్యాపారవేత్తనని నమ్మించి ఈ నెల 21వ తేదీన నగరంలోని ఓ హోటల్లో కలిసేందుకు పథకం రచించాడు. అక్కడకు వచ్చిన యువతికి మాయమాటలు చెప్పి బంగారాన్ని దోచుకునేందుకు సిద్ధమయ్యాడు. కత్తితో బెదిరించి యువతి వద్ద గల బంగారు చైను, ఉంగరాలను తీసుకుని ఆ యువతి చేతులు కట్టేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎలాగో బయట పడ్డ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించి శనివారం నిందితుడిని అరెస్టు చేశారు. రెండు లక్షల రూపాయల బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సీఐ సీహెచ్ ప్రకాష్, ఎస్.శంకరరావు పాల్గొన్నారు. యువతులను మోసగించి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న నిందితుడి అరెస్టు రూ.2 లక్షల విలువైన సొత్తు స్వాధీనం -
రైలులో మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):ౖరెలులో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేసి 67 మద్యం ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ జీఆర్పీ సీఐ జె.వి రమణ తెలిపిన వివరాల ప్రకారం... సిబ్బందితో కలసి విజయవాడ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 1వ నెంబర్ ప్లాట్‌ఫాం వెయిటింగ్ హాల్ వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో నరసరావుపేటకు చెందిన వరికంట వీరాస్వామి అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకొని తనిఖీ చేశామని చెప్పారు. ఆ వ్యక్తి వద్ద ఉన్న మూడు లగేజీ బ్యాగులను సోదా చేయగా అందులో హర్యానా రాష్ట్రానికి చెందిన 67 మద్యం ఫుల్ బాటిళ్లు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. వీటిని హర్యానా నుంచి నరసరావుపేటకు రైలులో తరలిస్తున్నట్లు తెలపడంతో నిందితుడిని అరెస్టు చేశామన్నారు. -
పోప్ ఫ్రాన్సిస్‌కు కథోలికుల నివాళి
పటమట(విజయవాడతూర్పు): విశ్వశాంతిదూత, పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ కథోలిక శ్రీసభలో అనేక నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారని విజయవాడ కేథలిక్ డయాసిస్ బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ తెలగతోటి జోసఫ్ రాజారావు అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ సేవలను కొనియాడుతూ శనివారం ఉదయం బెంజిసర్కిల్ సమీపంలోని సెయింట్ పాల్స్ కథెడ్రల్ చర్చిలో విజయవాడ కేథలిక్ డయాసిస్ ఆధ్వర్యాన నివాళులర్పిస్తూ, అంతిమ దివ్య పూజాబలి సమర్పణ కార్యక్రమం జరిగింది. తొలుత పవిత్ర పూజాపీఠంపై పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి బిషఫ్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ మెశపాం గాబ్రియేలు, లయోల కళాశాల రెక్టర్ ఫాదర్ పూదోటి రాయప్పజాన్ తదితర గురువులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు పోప్ ఫ్రాన్సిస్ సేవలను కొనియాడుతూ సందేశమిచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ తన 12 ఏళ్ళ పరిపాలనా కాలంలో కొత్త సంస్కరణలకు నాంది పలికారని గుర్తు చేశారు. పవిత్ర పూజాపీఠంపై పోప్ ఫ్రాన్సిస్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కేథలిక్ డయాసిస్‌కు చెందిన 150 మందికి పైగా గురువులతో కలసి అంతిమ సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేథలిక్ డయోసిస్ పొక్రెయిటర్ ఫాదర్ బి.ఆనంద్ బాబు, గుణదల పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు స్వామి, ఎడ్యుకేషన్ డస్క్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, ఎస్ఎస్సీ డైరెక్టర్ ఫాదర్ తోట సునీల్ రాజు, ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప, ఫాదర్ పసల తోమస్, ఫాదర్ కె. కుమార్‌రాజా, ఫాదర్ వినోద్ తదితర గురువులు, కన్యాసీ్త్రలు, గృహస్థ క్రై స్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
బైక్‌లు చోరీ చేస్తూ.. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: దొంగిలించిన బైక్‌లను విక్రయించగా వచ్చిన డబ్బులతో గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్న ముఠాను సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9.5 కేజీల గంజాయి, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్‌ఫోర్స్ కార్యాలయం వద్ద టాస్క్‌ఫోర్స్ ఏసీపీ లతాకుమారి వివరించారు. గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు అంశాలపై పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్న పాత నేరస్తులపై దృష్టి సారించామని చెప్పారు. ఈ క్రమంలో మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గులాబీతోటతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఎ.మనోజ్పార్ధు(గులాబీతోట), షేక్ అలీబాబా(పెనమలూరు)లను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులిద్దరూ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనం, గంజాయి విక్రయానికి పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో పార్క్ చేసిన బైక్‌లను దొంగిలించడం, ఆ వాహనాలపై ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి, అక్కడ వాహనాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో గంజాయిని కొనుగోలు చేసి విజయవాడకు తీసుకువస్తారని తెలిపారు. ఇదే గంజాయిని స్థానిక యువతకు విక్రయిస్తూ సొమ్ము చేసుకోవడాన్ని నిందితులిద్దరూ వృత్తిగా చేసుకుని జీవిస్తున్నట్లు చెప్పారు. ఈ ముఠా సభ్యులు ఐదుగురు ఉన్నారని, వీరంతా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారన్నారు. ఈ ముఠాలోని ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి రూ.60 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీధర్, రవికుమార్ పాల్గొన్నారు. -
నిరుద్యోగులపై కూటమి నయవంచన
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కూటమి ప్రభుత్వం నయవంచన చేసిందని జిల్లాలోని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీపై ఎన్నో మాటలు చెప్పి చివరకు అరకొర పోస్టులతో సరిపెట్టారంటూ యువత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 27,333 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ఆర్టీఐ ద్వారా వివరించింది. ఆ మేరకు జిల్లాల్లో అవసరమైన పోస్టులను భర్తీ చేయకుండా అందులో సగానికి మాత్రమే డీఎస్సీ ప్రకటన విడుదల చేయటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఇదేమి మోసమంటూ యువజన సంఘాల నేతలు మండి పడుతున్నారు. దానికి తోడు సంతకం చేసిన ఏడాది కాలం తరువాత నోటిఫికేషన్ ఇవ్వటంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు వేల పోస్టులు అవసరం.... ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు రెండు వేల పోస్టులు అవసరమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం 1:20 మేర ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పతి ఉండాలని నేతలు చెబుతున్నారు. ఆ మేరకు రాష్ట్రంలో 27,333 పోస్టులు ఖాళీ ఉన్నాయని సాక్షాత్తూ ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. అందులో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సుమారు రెండు వేల పోస్టులు అవసరమని తెలుస్తోంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వటంతో జిల్లాకు కేవలం 1208 పోస్టులే ఉన్నట్లు చూపించి ప్రకటనను విడుదల చేశారని యువత వాపోతుంది. దీనివలన వేలాది మందికి అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసహనం వ్యక్తం చేస్తున్న యువత.... ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సుమారు 40 వేల మంది ఈ డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్లో నిబంధనలు, పరిమితులు చూసి వారంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం కావాలనే ఈ విధమైన నిబంధనలతో యువతను మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ పోస్టులకు సాధ్యమైనంత వరకూ పోటీని తగ్గించేలా కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తుంది. దాంతో ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న యువతకు నిరాశ ఎదురైంది. ప్రధానంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యూయేషన్‌లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. వయస్సు విషయంలోనూ నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. గడిచిన ఏడాదిలో 200 మంది పదవీవిరమణ చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ అంటూ హడావుడి చేసి ఫైల్‌పై సంతకం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 180 నుంచి 200 మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పదవీ విరమణ చేశారని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఈ పోస్టుల లెక్క దేనిలోనూ రాకపోవటంతో విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరగనుందని నిపుణులు చెబు తున్నారు. యువతకు పోస్టులు రాక అన్యాయం జరిగితే విద్యార్థులకు సరైన స్థాయిలో ఉపాధ్యాయులు లేక నష్టపోయే పరిస్థితులు నెలకొంటాయి. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 2000 టీచర్ పోస్టులు అవసరం కానీ ప్రభుత్వం డీఎస్సీలో ప్రకటించినవి కేవలం 1208 పోస్టులు మాత్రమే ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు పరిమితులను సవరించాలి డీఎస్సీ నోటిఫికేషన్లో వయస్సు, మార్కులకు సంబంధించిన అనేక పరిమితులను ప్రభుత్వం విధించింది. దాని వలన చాలా మంది అవకాశం కోల్పోతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యువతకు ఇది చాలా నిరాశను కలిగించే అంశం. దీనిపై ప్రభుత్వం మార్పు చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయటానికి చర్యలు చేపట్టాలి. – సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
15 మంది పిల్లలకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు
లబ్బీపేట(విజయవాడ తూర్పు): పుట్టుకతోనే అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలు ఉన్న 15మంది చిన్నారులకు విజయవాడ ఆంధ్రా హాస్పటల్లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. హీలింగ్ లిటిల్‌హార్ట్స్, యూకే ఛారిటీ సౌజన్యంలో ఈ నెల 21 నుంచి 34వ ఉచిత హార్ట్ సర్జరీస్ క్యాంపు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ వెంకట రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్జరీల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ బెంగుళూరుకు చెందిన పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ జగన్నాథ్‌తో పాటు, ఉషశెట్టి, అశ్శిని కుమారస్వామిలతో పాటు, ఆంధ్రా హాస్పటల్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావుల బృందం ఈ సర్జరీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి నెలా 50 నుంచి 60 మంది పిల్లలకు గుండె సర్జరీలు చేస్తూ, ఇప్పటి వరకూ తమ ఆస్పత్రిలో 4,500 మందికి చిన్నారులకు గుండె సర్జరీలు చేసినట్లు తెలిపారు. ఆంధ్రా మదర్ అండ్చైల్డ్ ఫౌండేషన్, మహేష్‌బాబు ఫౌండేషన్ సహకారం కూడా ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో శస్త్ర చికిత్సలు చేసిన వైద్యులు, పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
పెనమలూరు: యనమలకుదురు గ్రామ పరిధి కృష్ణానది లంకల్లో ఈ నెల 4వ తేదీన హత్యకు గురైన పోతుల పోచమ్మ(67) కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ కె.గంగాధరరావు తెలిపారు. ఆయన శుక్రవారం పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలు వెల్లడించారు. యనమలకుదురు లంకల్లో హత్య జరిగిన తర్వాత పెనమలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారన్నారు. సాంకేతికతఆధారంగా మృతురాలు తెలంగాణ మెదక్ జిల్లా గణ్పూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందినవాసిగా గుర్తించారు. డబుల్ మర్డర్ కేసు పెనమలూరు ఎస్ఐ రమేష్, పోలీసులు గంగాపూర్ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేయగా డబుల్ మర్డర్ కేసు వెలుగు చూసిందన్నారు. మృతురాలు పోతుల పోచమ్మకు కుమారుడు పోతుల మహేష్ ఉన్నాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి స్థానికంగా ఉన్న బండి శోభ(42)తో వివాహేతర సంబంధం ఉంది. భర్తను వదిలేసిన ఆమె అదే గ్రామానికి చెందిన మామిడి గోపాల్‌తో(45) కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే ఆమె గతంలో మహేష్ వద్ద 9 గ్రాముల బంగారు గొలుసు తీసుకొని తాకట్టు పెట్టింది. విషయం తెలిసిన పోచమ్మ ఆమెను గొలుసు ఇవ్వాలని ఒత్తిడి చేయసాగింది. మహేష్ కూడా తన గొలుసు ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేశాడు. హత్యకు ప్లాన్ మామిడి గోపాల్, ఆ మహిళకు ఇబ్బందిగా మారిన మహేష్‌ను హత్య చేయడానికి ప్రణాళిక రచించారు. ప్రధానంగా గోపాల్.. ఆమెతో మహేష్‌కు ఉన్న వివాహేతర సంబంధంపై రగిలిపోతున్నాడు. దీంతో ఈ ఏడాది మార్చి 26న మహేష్‌ను నమ్మించి గోపాల్, ఆ మహిళ అతన్ని మెదక్ జిల్లా ఏడుపాయల వంతెన వద్దకు తీసుకెళ్లారు. ఊరు చివర వాగు వద్ద రాయిపై కూర్చొని కల్లు తాగారు. మహేష్ మత్తులో ఉండగా రాయిపై నుంచి కిందకు తోసివేశారు. గాయపడిన మహేష్‌ను తుండుతో మెడకు బిగించి హత్య చేశారు. ఆంధ్రలో పోచమ్మ హత్యకు స్కెచ్ పోచమ్మ తన కుమారుడు కనపడటం లేదని, ఏమి చేశారని తరచుగా గోపాల్, ఆ మహిళను ప్రశ్నిస్తుండటంతో ఆమెను హత్య చేయడానికి పథకం పన్నారు. మహేష్ యనమలకుదురులో పని చేస్తున్నాడని నమ్మించి పోచమ్మను ఆంధ్రలో హత్య చేయడానికి స్కెచ్ వేశారు. 3వ తేదీన కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి పోచమ్మను ఈ నెల 4వ తేదీన యనమలకుదురుకు తీసుకు వచ్చారు. గోపాల్ యనమలకుదురులో మద్యం కొన్నాడు. మహేష్ నదిలో ఇసుక పనులు చేస్తున్నాడని నమ్మించి పోచమ్మను నదిలోకి తీసుకెళ్లారు. వారితో తీసుకొచ్చిన కల్లులో లోబీపీ బిళ్లలు కలిపి పోచమ్మతో తాగించారు. గోపాల్, ఆ మహిళ కూడా మద్యం సేవించారు. పోచమ్మ స్పృ హ కోల్పోయిన తర్వాత చీరకొంగుతో మెడకు బిగించి హత్య చేసి చెవి దిద్దులు తీసుకొని గుట్టుచప్పుడవ్వకుండా రైలు ఎక్కి గోపాల్, ఆ మహిళ వెళ్లి పోయారు. గోపాల్‌కు యనమలకుదురులో లింకులు గోపాల్ బావ యనమలకుదురులో ఉండటంతో గోపాల్, ఆ మహిళ గతంలో పలుసార్లు యనమలకుదురుకు వచ్చి వెళ్లారు. హత్యకు ఈ ప్రాంతం అనువుగా ఉందని పోచెమ్మను కృష్ణా నదిలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకు వెళ్లి హత్య చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీలు, ఇతర టెక్నికల్ ఎవిడెన్స్‌ల ఆధారంగా డబుల్ మర్డర్ కేసును ఛేదించారని ఎస్పీ గంగాధరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్‌ను శాలువా కప్పి ఎస్పీ గంగాధరరావు సన్మానించారు. సిబ్బందిని ప్రశంసించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ జె.వెంకటరమణ, ఎస్.రమేష్, నాలుగు బృందాలుగా సిబ్బంది పాల్గొన్నారు. యనమలకుదురు లంకల్లో ఈ నెల 4న వృద్ధురాలి హత్య వివరాలు వెల్లడించిన ఎస్పీ గంగాధరరావు -
తక్కువ ధరకు ధాన్యం అమ్మొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు అమ్మొద్దని మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గాంధీనగర్‌లోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకుని నష్టపోతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మిల్లర్లు తక్కువ ధరకు కొంటున్నారని వస్తున్న వార్తలను ఖండించారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు లేని ధాన్యాన్ని తక్కువకు కొనుగోలు చేసి ఉండొచ్చని వివరించారు. మిల్లర్లు ఏవైనా అవకతవకలకు పాల్పడితే అసోసియేషన్ దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భాస్కరరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పులిపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి అన్నే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు -
సార్వత్రిక విద్య మిథ్య!
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యలవాడగా పేరుగాంచిన జిల్లాలో ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఫలితాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. అధికారుల తీరు, కోఆర్డినేటర్ల నిర్లక్ష్యంతో జిల్లా ప్రతిష్టను దిగజార్చటమే కాకుండా అభ్యర్థుల భవితతో ఆటలాడుతున్నారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మార్చి మాసంలో సాధారణ ఎస్ఎస్సీ పరీక్షలు, ఇంటర్మీడియెట్ పరీక్షలతో పాటుగా ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్లో అభ్యసించే పది, ఇంటర్ అభ్యర్థులకు సైతం పరీక్షలను ఏకకాలంలో నిర్వహించింది. సాధారణ పదో తరగతి పరీక్ష ఫలితాలతో పాటుగా ఓపెన్ స్కూల్ ఫలితాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఫలితాల్లో రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ 24, 25 స్థానాల్లో ఎన్టీఆర్ జిల్లా ఉండటం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అందని పాఠ్య పుస్తకాలు.. సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సులకు సంబంధించి ఏటా ఆ సంస్థ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. ఫీజు చెల్లించిన వారికి పుస్తకాలను సకాలంలో పంపిణీ చేస్తుంది. కానీ ఈ ఏడాది సకాలంలో పుస్తకాలు అందలేదని ఆయా కోర్సులకు ఫీజులు చెల్లించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిపై పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించి కోఆర్డినేటర్లు సైతం పలు కారణాలను చెబుతూ తమను తప్పుదోవ పట్టించారని పలువురు ఫీజు చెల్లించిన అభ్యర్థులు వాపోతున్నారు. సకాలంలో పుస్తకాలు అందకపోవటం వల్లే చాలా మంది అరకొర చదువులతో పరీక్షలకు హాజరయ్యారని, అందుకే ఈ తరహా ఫలితాలు వచ్చాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ఈ ఏడాది పూర్తిగా పర్యవేక్షణను వదిలేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దాంతో అడ్మిషన్ల సంఖ్య భారీగానే పడిపోయిందని, అలాగే ఫలితాలు సైతం దిగజారిపోయాయంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యాపీఠం షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన విధులను సైతం నిర్వహించలేదని దానిని రాష్ట్ర స్థాయి అధికారులు సైతం పర్యవేక్షించలేదని కోఆర్డినేటర్లు చెబుతున్నారు. వేలాది రూపాయలు దండుకున్నారు! తమ నుంచి వేలాది రూపాయలు దండుకున్నారని, తీరా పరీక్ష ఫలితాల్లో తమకు అన్యాయం చేశారంటూ పలువురు అభ్యర్థులు కోఆర్డినేటర్లను ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఓపెన్ స్కూల్ కోర్సులను నిర్వహించే సంస్థలు విద్యార్థులకు పలు మాయ మాటలు చెప్పి వారి నుంచి వేలాది రూపాయాలు దండుకున్నారని ప్రచారం జరిగింది. ‘మిమ్మల్ని పాస్ చేయిస్తాం, మీరు చూసి రాసుకోవచ్చు’ అంటూ పలు రకాలుగా వారిని మభ్యపెట్టి భారీ వసూళ్లకు పాల్పడిన విషయాలపై పెద్ద స్థాయిలో విమర్శలు సైతం వచ్చిన విషయం తెలిసిందే. తీరా పరీక్షలు సాధారణ షెడ్యూల్లో పెట్టడం, గట్టిగా నిఘా ఉంచటం, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చేయటంతో ఫలితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఫలితం.. సు‘దూరం’ ఇదీ ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి: కానరాని తరగతుల జాడ.. దూరవిద్యలో దారుణ ఫలితాలు ఓపెన్ స్కూల్ ఫలితాల్లో భారీగా పడిపోయిన ఉత్తీర్ణత ‘పది’లో 25వ స్థానం, ఇంటర్లో 24వ స్థానానికి పరిమితమైన జిల్లా సకాలంలో అందని పాఠ్య పుస్తకాలు, జరగని తరగతులు ఓపెన్ స్కూల్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు ఫీజు చెల్లించిన అభ్యర్థులకు ఆయా స్టడీ సెంటర్ల ద్వారా కోఆర్డినేటర్లు తరగతులను నిర్వహించాల్సి ఉన్నా.. అలా జరగలేదు. సార్వత్రిక విద్యాపీఠం జిల్లా అధికారులు ఎక్కడా సరైన పర్యవేక్షణ కానీ పరిశీలన కానీ చేసిన దాఖలాలు లేవని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారు. అందువల్లే కోఆర్డినేటర్లు తరగతులు నిర్వహించకుండానే తమ నుంచి వేలాది రూపాయలు దండుకొని రోడ్డుపైన వదిలేశారంటూ వాపోతున్నారు. ఓపెన్ స్కూల్ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పదో తరగతికి 4.34 శాతం, ఇంటర్మీడియెట్‌లో 20.61 శాతం ఫలితాలు వచ్చాయి. ‘పది’లో రాష్ట్రంలోనే 25వ స్థానంలో నిలువగా, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో 24వ స్థానంలో నిలిచింది. పదో తరగతి పరీక్షలకు 1,499 మంది హజరయ్యారు. అందులో వారిలో 785 మంది బాలురు, 714 బాలికలు ఉన్నారు. అందులో కేవలం 65 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో 26 మంది బాలురు, 39 మంది బాలికలు ఉన్నారు. ఇంటర్మీడియెట్ కోర్సుకు సంబంధించి 2,751 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. వారిలో 1715 మంది బాలురు, 1036 మంది బాలికలు ఉన్నారు. అందులో 567 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 301 మంది బాలురు, 266 మంది బాలికలు ఉన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మర్యాదపూర్వకంగా.. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపిని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ నిత్యాన్నదానానికి గుంటూరుకు చెందిన ఎం.శశితేజ కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది. ‘శక్తి’ యాప్‌పై అవగాహన విజయవాడస్పోర్ట్స్: మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ కె.లతాకుమారి పర్యవేక్షణలో శక్తి టీం ఆంధ్రా లయోల, ఎస్ఆర్ఆర్ కాలేజీల్లో విద్యా ర్థినులకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు.● గుణదలకు చెందిన వినయ్(పేరు మార్చాం) 9వ తరగతి చదువుతున్నాడు. ఊబకాయం కారణంగా యాక్టివ్‌గా ఉండకపోవడంతో పాటు ఇటీవల నీరసంతో పడిపోయాడు. వైద్యులు పరీక్షించగా మధుమేహం స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ● భవానీపురానికి చెందిన 10వ తరగతి విద్యార్థి రాకేష్(పేరుమార్చాం) చిన్నప్పుడు బాగానే ఉన్నా, నాలుగేళ్లుగా ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంతో ఒకేసారి బరువు పెరిగాడు. దీంతో క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం లేక పోవడంతో మానసికంగా కుంగుబాటుకు గురై చదువులో కూడా రాణించలేక పోతున్నాడు. ఇలా వీరిద్దరే కాదు అనేక మంది పిల్లలు ఒబెసిటీ కారణంగా శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నాడని అనేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. బొద్దు ముద్దు కాదంటున్నారు. అలాంటి వారిలో చలాకీతనం లేక పోవడంతో పాటు, చిన్న వయస్సులోనే అనేక మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వయసుకు తగిన బరువు ఉంటే చాలని, అధిక బరువు అనర్థాలకు దారి తీస్తోందంటున్నారు. ప్రస్తుతం ప్రతి వంద మంది పిల్లల్లో 18 మంది అధిక బరువుతో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సెలవులను సద్వినియోగం చేసుకోవాలి.. పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. పిల్లలు ఇంటి వద్దే ఉంటూ స్మార్ట్ఫోన్లు, టీవీల్లో తమకిష్టమైన చానల్స్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా నిశ్చల జీవనశైలికి అలవాటు పడటం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటితో ఒబెసిటీ పిల్లలు ఎక్కువయ్యారు. ఒబెసిటీని అధిగమించేందుకు ఈ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అవుట్డోర్, ఇన్డోర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, తాజా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఒబెసిటీని తగ్గించుకోవచ్చునంటున్నారు. 9న్యూస్రీల్పిల్లలూ ఇలా చేయండి..ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.. డయాబెటిస్ వచ్చే ప్రమాదం.. వేసవి సెలవులు 50 రోజులకు పైగానే ఇచ్చారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో క్రీడలు ఆడండి. అవసరమైతే సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో చేరండి. స్విమ్మింగ్ చేయడం ఎంతో మంచిది. సైకిల్‌ను ఇష్టంగా ప్రతిరోజూ తొక్కండి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. సెల్‌ఫోన్, టీవీ చూస్తూ భోజనం చేసే వారు తగిన మోతాదు కంటే ఎక్కువ తినేస్తారు. ఆ అలవాటు మానుకోవాలి. సెల్‌ఫోన్, టీవీ చూసే టైమ్ తగ్గించాలి. పిల్లల్లో ఒబెసిటీతో మానసిక, ఆరోగ్య సమస్యలు డిప్రెషన్‌తో చదువులోనూ రాణించలేకపోతున్న వైనం వేసవి సెలవుల్లో వ్యాయామంపై దృష్టి పెట్టాలంటున్న వైద్యులు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన ఒబెసిటీతో ఉన్న పిల్లలు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. వేసవిలో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ, జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండటం ద్వారా స్లిమ్‌గా మారవచ్చు. వేసవిలో దొరికే మామిడి లాంటి సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు, ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లోనే అవుట్డోర్ క్రీడలు ఆడాలి. ఎండలో ఆడితే డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. – గర్రే హరిత, న్యూట్రీషియన్ ఒబెసిటీ ఉన్న పిల్లల్లో టైప్–2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. కొందరిలో సుగర్ లెవల్స్ అదుపులో ఉండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారంలో రెండు, మూడు సార్లు జంక్‌ఫుడ్, బయట ఆహారం తీసుకోవడం, సెకండరీ లైఫ్‌తో ఊబకాయులుగా మారుతున్నారు. తల్లిదండ్రులు వారిని గుర్తించి.. వాకింగ్, వ్యాయామం వంటివి చేయిస్తే మంచిది. అందుకు వేసవి సెలవులను వినియోగించుకోవాలి. – డాక్టర్ ఎం. సునీత, మధుమేహ నిపుణురాలు -
కృష్ణా వర్సిటీకి ఉన్నత విద్యా అవార్డు
రుద్రవరం (మచిలీపట్నం రూరల్): కృష్ణా వర్సిటీ ప్రతిష్టాత్మక ఇండియా ఉన్నత విద్యా అవార్డ్ సాధించిందని విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనితీరు ఆధారంగా కృష్ణా వర్సిటీ మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఎడ్యుకేషన్ వరల్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని హోటల్ గ్రాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సభ్యుడు జతీన్ పరాంజపే చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు బసవేశ్వరరావు తెలిపారు. తొలుత శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధిస్తున్న విజయాలు, పొందుతున్న ఫలితాలపై బసవేశ్వరరావు ప్రసంగించారు. 30న జాబ్‌మేళా చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యాన ఈ నెల 30న ఉయ్యూరులో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఉయ్యూరులోని ఏజీ, ఎస్జీ సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా జరుగుతుందని పేర్కొన్నారు. పలు కంపెనీల్లో ఉద్యోగాలకు 10వ తరగతి నుంచి పీజీ చదివిన 18 నుంచి 30 సంవత్సరాల్లోపు యువత అర్హులని వివరించారు. ఎంపికై న వారికి ఆకర్షణీయ వేతనంతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగావకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 96187 13243, 88851 59008లో సంప్రదించాలని సూచించారు. -
దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ షేక్ అన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచన మేరకు జేఏసీ ఆధ్వర్యంలో అమాయకులైన మృతుల ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. లబ్బీపేట మసీదులో శుక్రవారం నమాజు ముగిసిన అనంతరం వందలాది మంది ముస్లింలు ఈ శాంతిర్యాలీలో పాల్గొన్నారు. తొలుత భారత ప్రభుత్వం బాధితులకు అండగా నిలవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని చేతికి నల్ల రిబ్బన్ కట్టుకుని నమాజ్‌లో పాల్గొన్నారు. మాతృ దేశం కోసం ప్రాణా లైనా అర్పిస్తాం.. పాకిస్తాన్ డౌన్ డౌన్.. అంటూ పెద్ద ఎత్తున ముస్లింలు నినాదాలు చేశారు. ఉపేక్షించొద్దు.. తిప్పికొట్టాలి.. ఈ సందర్భంగా మునీర్ అహ్మద్ మాట్లాడుతూ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు కవ్వింపు చర్యలకు పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించ కూడదని, దేశ ప్రజలు అందరూ ఐక్యంగా కుల మతాలకు అతీతంగా తిప్పికొట్టాలన్నారు. దేశ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, అలాగే ఇస్లాం శాంతిని బోధిస్తోందన్నారు. కానీ మీడియాలో వస్తున్న కథనాలు అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. ఉగ్రవాదానికి – మతానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర నిఘావర్గాలు వైఫల్యం చెందటం దురదృష్టకరమన్నారు. ముఖ్తార్ అలీ, అబీద్, సుభానీ, నాహీద్, అజ్గర్, ఎస్ఐఓ రాష్ట్ర అధ్యక్షుడు అమీర్ ఫహాద్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రమూకల దాడిని నిరసిస్తూ లబ్బీపేటలో ముస్లింల శాంతి ర్యాలీ -
ప్రధానమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు పునర్ శంకుస్థాపన చేసేందుకు మే రెండో తేదీన విచ్చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రధానితోపాటు వీవీఐపీలు, వీఐపీలు పాల్గొంటున్న దృష్ట్యా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తుకు కావల్సిన ఏర్పాట్లపై ఈ సమీక్షలో చర్చించారు. డీసీపీలు కె.జి.వి.సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎ.బి.టి.ఎస్.ఉదయారాణి, కృష్ణమూర్తినాయుడు, ఎస్.వి.డి.ప్రసాద్, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఎ.వి.ఎల్.ప్రసన్నకుమార్, ఏం.రాజారావు, కె.కోటేశ్వరరావు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం మచిలీపట్నంఅర్బన్: పరిసరాల పరిశుభ్రతే ప్రజారోగ్యానికి తొలిమెట్టని కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్. శర్మిష్ట అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మురుగునీటి నిల్వలున్న ప్రాంతాల్లో దోమల లార్వా వృద్ధి చెందుతుందన్నారు. గతంతో పోలిస్తే మలేరియా కేసులు ఏటేటా తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. దోమ తెరలు వాడాలని, ఇంటి పరిసరాల్లో దోమల నియంత్రణ మందులు పిచికారీ చేయించాలన్నారు. పరిసరాల్లో కొబ్బరి బోండాలు, రోళ్లు, పాతటైర్లు వంటివి లేకుండా చూసుకోవాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి బి. రామారావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు స్వచ్ఛత, వ్యక్తిగత రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. బంగారు తాపడం పనులకు రూ. 5 లక్షల విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు శుక్రవారం రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన టి. శ్రీనివాస్ సంపత్ శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశా రు. ఆలయ అధికారిని కలిసి రూ. 5 లక్షల విరాళాన్ని ఆలయ బంగారు తాపడం పనుల నిమిత్తం అందజేశారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం చేయడంతోపాటు ప్రజల సమయం ఆదా చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తేచ్చినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఏ రవీంద్రనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా స్లాట్ బుక్ చేసుకునే వీలు కల్పించామన్నారు. ఈ నెల 4నుంచే విజయవాడ రీజియన్‌లోని గాంధీనగర్, మచిలీపట్నం రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. శనివారం నుంచి కృష్ణా జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్, ఎన్టీఆర్ జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకొని సమయాన్ని ఆదా చేసుకోవాలని కోరారు. -
సీఎస్ఎస్ఆర్ పోటీల్లో ఏపీ ఎస్డీఆర్ఎఫ్కు తృతీయ స్థానం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎనిమిదో బెటాలియన్ నిర్వహించిన కొలా ప్స్డ్ స్ట్రక్టర్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్ఎస్ఆర్) పోటీల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీ ఎస్డీఆర్ఎఫ్) బృందం తృతీయ స్థానంలో నిలిచింది. ఈ పోటీల కోసం పదో బెటాలియన్, ఎన్డీఆర్ఎఫ్ కొండపావులూరు సహకా రంతో 19 మందితో కూడిన ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందం అతి తక్కువ సమయంలో శిక్షణ పొంది ఒరిజినల్ స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించి జాతీయ స్థాయి పోటీకి అర్హత సాధించింది. సీఎస్ఎస్ఆర్ ఆపరేషన్స్ చేసే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తోపాటు వివిధ రాష్ట్రాలకు దీటైన పోటీ ఇచ్చి జాతీయ స్థాయిలో తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. బృంద సభ్యులను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ విభాగాధిపతి బి.రాజకుమారి, విభాగ అధికారులు అభినందించారు. -
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.అప్పారావు, పిల్లి నరసింహారావు డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో ఏపీ బిల్డింగ్, అదర్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా అప్పారావు, నరసింహారావు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ప్రతి మీటింగ్‌లోనూ చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయినా హామీ అమలుకు నోచుకోలేదన్నారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవసరమైన నిధులు కోసం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ చట్టం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర సంక్షేమ బోర్డులో రూ.4,298 కోట్లు ఉన్నాయని ఇటీవల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శాసనమండలిలో ప్రకటించారని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలకు అమలు చేయడానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించాల్సిన అవసరం లేదన్నారు. బోర్డు నుంచి తీసుకున్న సొమ్మును బోర్డుకు తిరిగి జమ చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని కూటమి నేతల హామీని నిలబెట్టుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ధర్నాలో సీఐటీయూ సెంట్రల్ సిటీ నాయకులు ఎం.బాబురావు, వై.సుబ్బారావు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ సిటీ కార్యదర్శి బి. గోవిందు, తూర్పు సిటీ కార్యదర్శి రాజు, అలీ, బాబు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ -
వైజాగ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీపై చర్యలు తీసుకోవాలి
● మా కుమారుడి ఆత్మహత్యకు ఆ కళాశాల డీన్, వైస్ ప్రిన్సిపాలే కారణం ● మూడేళ్ల కాలంలో కాలేజీ విద్యార్థులు ముగ్గురు చనిపోయారు ● కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఉమాదేవి, రాజేశ్వరరావు వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విశాఖపట్నంలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ విద్యార్థి శిరం ప్రణీత్ ఆత్మహత్యకు ఆ కళాశాల యాజమాన్యమే కారణ మని విద్యార్థి తల్లిదండ్రులు శిరం ఉమాదేవి, రాజేశ్వరరావు ఆరోపించారు. ఆ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని తమ ఇంటి వద్ద వారు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ కుమారుడు శిరం దత్తప్రణీత్ విశాఖపట్నం తగరపువలసలోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడని పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఆ కళాశాల ఏఓ తమకు ఫోన్ చేసి ‘మీ అబ్బాయి భవనం నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు. ఆస్పత్రిలో ఉన్నాడు. వచ్చి చూసు కోండి’ అని చెప్పారని తెలిపారు. ఆ రోజు రాత్రికి తాము విశాఖపట్నం వెళ్లే సరికి తమ కుమారుడు మార్చురీలో ఉన్నాడని చెప్పారు. కళాశాల డీన్ పి.వి.సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగానే తమ కుమారుడు మరణించాడని వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ భవనం నుంచి దూకిన తరువాత తక్షణం స్పందించలేదన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తరువాత ఏ చికిత్స అందించారనే అంశాలను సైతం తమకు చెప్పలేదని ఆరోపించారు. తమ కుమారుడి మృతి విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఘటనా స్థలంలో ఆనవాళ్లు లేకుండా కాలేజీ యాజమాన్యం చెత్తాచెదారం వేసిందన్నారు. తమ కుమారుడిలాగే గడిచిన మూడు సంవత్సరాల్లో మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు తమకు చెప్పారని వివరించారు. కాలేజీ డీన్ పి.వి.సుధాకర్‌పై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వచ్చాయన్నారు. కాలేజీ యాజమాన్యానికి ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల అండదండలు ఉండడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రమికవేత్త ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు వారిపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేదన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. తమ కుమారుడి మరణంపై తగిన దర్యాప్తు చేసి కారకులైన వారిని శిక్షించాలని కోరారు. విలేకరుల సమావేశంలో విద్యార్థి కుటుంబ సభ్యులు రవి ప్రసాద్, గంగాభవాని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు -
దూది.. సూదికీ గతిలేదు
● మందులు, టెస్టులు అన్నీ బయటకే.. ● పేద రోగులకు తప్పని అవస్థలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● రాష్ట్రంలోని ఏకై క టీచింగ్ ఆయుర్వేద ఆస్పత్రి దుస్థితి ఇదీ.. లబ్బీపేట(విజయవాడతూర్పు): సంప్రదాయ ఆయుర్వేద వైద్యంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఫలితంగా రాష్ట్రంలోనే ఏకై క ప్రభుత్వ టీచింగ్ ఆయుర్వేద ఆస్పత్రిగా ఉన్న విజయవాడ లోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రి అరకొర సౌకర్యాల కునారిల్లుతోంది. దుష్ఫలితాలు లేని వైద్యమని ఆశతో వస్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. మందులు, రక్త పరీక్షలతో పాటు, ఫైల్స్, ఫిస్టులా వంటి వ్యాధులతో వచ్చే వారు దూది, సూది కూడా బయట కొనుగోలు చేసి తీసుకురావాల్సిన దయనీయ స్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసి మందుల్లో చాలా వరకు నిండుకున్నాయి. ఉన్న అర కొర మందులనే రోగులకు ఇచ్చి పంపుతున్నారు. లేనివి బయట కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. డబ్బులు లేక ప్రభుత్వాస్పత్రికి వస్తే, ఇక్కడ మందులు కూడా లేవంటున్నారని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కానింగ్లూ బయటకే.. చికిత్స కోసం వచ్చిన వారికి ఎవరికై నా ఆల్ట్రాసౌండ్, సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్‌లు అవసరమైతే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లి తీయించుకోవాలని ఆయుర్వేద ఆస్పత్రి వైద్యులు సూచించాలి. కానీ కొంత మంది వైద్యులె కమీషన్ల కోసం ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు రాస్తున్నారు. డాక్టర్లు రాసిచ్చిన చీటీ తీసుకుని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్తే రూ.వేలల్లో గుంజుతున్నారని పలువురు రోగులు ఆరోపించారు. అంతేకాదు ఒక మహిళ కీళ్ల నొప్పితో ఆస్పత్రికి వస్తే, పిల్లలు లేరని తెలుసుకుని, ప్రైవేటు ఐవీఎఫ్ సెంటర్‌కు వెళ్లాలని వైద్యుడు సిఫార్సు చేశాడండే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యుల అత్యాస వెరసి రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిలిచిన పంచకర్మ గతంలో ఆయుర్వేద ఆస్పత్రిలోని పంచకర్మ విభాగంలో అనేక రకాల చికిత్సలు అందించే వారు. ఊబకాయం, మైగ్రేన్, నడుం నొప్పి, మెడ నొప్పితో పాటు వివిధ రకాల చర్మ వ్యాధులకు చికిత్సలు చేసేవారు. ఇప్పుడు పంచకర్మ విభాగం దాదాపు మూలనపడింది. పంచకర్మ చికిత్సలు చేసేందుకు అవసరమైన తైలాలు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాకుండా నాల్గో తరగతి సిబ్బంది సైతం కొరత ఉండటంతో చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరుత్సాహంగా తిరిగి వెళ్తున్నారు. సగం మందులే ఇచ్చారు నేను లారీ క్లీనర్‌గా పనిచేసే వాడిని. నాకు గతంలో వెన్నుపూస సర్జరీ జరిగింది. మళ్లీ నొప్పిగా ఉండటంతో చికిత్స కోసం ఆయుర్వేద ఆస్పత్రికి వస్తున్నాను. గతంలో రెండు సార్లు వచ్చాను. ఏవో మందులు ఇచ్చారు నొప్పి తగ్గ లేదు. ఆ విషయం చెప్పినా మళ్లీ అవే మందులు రాశారు, వాటిలో సగమే ఇచ్చారు. మిగిలిన సగం మందులను బయటే కొనుక్కోవాలని సూచించారు. – భూపతి రత్తయ్య, అవనిగడ్డ సౌకర్యాలు కల్పించాలి ప్రజలకు విద్య, వైద్యం అవసరం. ప్రభుత్వాలు ఆ రెండు రంగాలను విస్మరించకూడదు. సంప్రదాయ ఆయుర్వేదంపై నిర్లక్ష్యం తగదు. ఇక్కడ మంచి వైద్యం అందుతుందని దూర ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు. అయితే మందులు సరిగా ఇవ్వకుండా బయట కొనుక్కోమనడం, దూది కూడా లేక పోవడం దురదుష్టకరం. ప్రభుత్వం స్పందించి, సౌకర్యాలు కల్పించాలి. – మునీర్ అహ్మద్ షేక్, లబ్బీపేట -
ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు విజయ డెయిరీ ఆర్థిక సాయం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ డెయిరీ తరఫున ఆర్థిక సాయం అందించనున్నామని సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) ప్రాంగణంలో గురువారం మానవ హారం నిర్మించారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. ఎంపీ కేశినేని చిన్ని, చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబు, డెయిరీ బోర్డు సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి మానవ హారంలో పాల్గొని పాకిస్తాన్ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంపీ, చైర్మన్ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే జరిగిందని, దీనిని భారతీయులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి, మధుసూదనరావు మరణించారని, వారి కుటుంబాలకు విజయ డెయిరీ తరఫున రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వైజ్ఞానిక విహారయాత్ర
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లా ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులు వైజ్ఞానిక విహార యాత్రకు వెళ్లారు. ఏపీ ప్రభుత్వం, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విహార యాత్రను చేపట్టారు. జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ వైజ్ఞానిక ప్రదర్శ నల్లో ప్రతిభ చూపిన 101 మంది విద్యార్థులు, 10 మంది గైడ్ టీచర్లతో కలిసి డీఈఓ కార్యాలయం నుంచి బుధవారం రాత్రి వారు తరలివెళ్లారు. గురువారం చైన్నెలోని పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్, బీఎం బిర్లా ప్లానిటోరియం, ఎవల్యూషన్ పార్క్‌లు, స్నేక్ పార్క్, మెరీనా బీచ్‌లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ డాక్టర్ మైనం హుస్సేన్ పాల్గొన్నారు. -
టూరిజం ప్యాకేజీలపై అవగాహన కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో రూపొందించిన ప్రత్యేక ప్యాకేజీలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్యాకేజీలకు సంబంధించి కరపత్రాలను ఆకర్షణీయంగా రూపొందించాలన్నారు. కలెక్టరేట్లో టూరిజం ప్యాకేజీపై పర్యాటక, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) అధికారులతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలతో కలెక్టర్ లక్ష్మీశ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు, మూడు, నాలుగు రోజుల పర్యాటక ప్యాకేజీల వివరాలతో రూపొందించిన కరపత్రాలను పరిశీలించారు. ప్యాకేజీల కింద సందర్శనకు వీలయ్యే ప్రాంతాలు, ప్యాకేజీల ధరలు, పర్యాటకులకు కల్పించే వివిధ సౌకర్యాలు తదితర వివరాలతో రూపొందించిన కరపత్రాల్లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హోటళ్లు, ట్రావెల్ తదితర విభాగాల అసోసియేషన్లతో పాటు వివిధ భాగస్వామ్య పక్షాలతో పలు దఫాల్లో సమావేశాలు నిర్వహించి రూపొందించిన పర్యాటక ప్యాకేజీలపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఇందుకు అవసరమైన ప్రచార సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల విశిష్టతను పర్యాటకులకు వివరించేందుకు వీలుగా గైడ్లను గుర్తించాలన్నారు. త్వరితగతిన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఏపీటీడీసీ–సీఆర్ఓ సుహాసిని పాల్గొన్నారు. -
ఈవీఎం గోడౌన్‌కు పటిష్ట భద్రత
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోని ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్‌ను ఆయన అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరు, అగ్నిమాపక దళ పరికరాలు తదితరాలను తనిఖీ చేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రమౌళి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.భారత నావికాదళంతో కృష్ణా వర్సిటీ ఒప్పందంరుద్రవరం(మచిలీపట్నంరూరల్): భారత నావికాదళంతో కృష్ణా విశ్వవిద్యాలయం సంయుక్త పరిశోధనలు చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు కేయూ రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు గురువారం న్యూ ఢిల్లీలోని నావికాదళ కేంద్రంలో నావెల్ ఆర్కిటెక్చర్ డైరెక్టరేట్ డైరెక్టర్ అభిలాష్ శ్రీ కుమారన్, తాను ఎంఓయూపై సంతకాలు చేశామని చెప్పారు. ఈ ఒప్పందం ప్రకారం భారత నావికాదళం, కృష్ణా విశ్వవిద్యాలయం సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తాయన్నారు. అలాగే నావికాదళ అధికారుల విద్యార్థులు కూడా కేయూలో విద్యనభ్యసించే అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం అభిలాష్ శ్రీ కుమారన్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో సీడీఆర్ తరుణ్ చందర్ కమల్ తదితరులు పాల్గొన్నారు.జెడ్పీ సీఈవో, డీపీవోలకు అవార్డులుచిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో కె. కన్నమనాయుడు, జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ అవార్డులు అందుకున్నారు. 15వ ఆర్థిక సంఘ నిధులు సమర్థంగా వినియోగించినందుకు సీఈఓ.. జిల్లాలో స్వచ్ఛాంధ్ర కల సాకారం చేసే విధంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించినందుకు డీపీవో అవార్డుకు ఎంపికయ్యారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా వీరు ఇరువురూ అవార్డులను గురువారం స్వీకరించారు.జీజీహెచ్‌కు క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాలు అందజేతలబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రికి రాజ్యసభ సభ్యుడు వి.విజయేంద్ర ప్రసాద్ రూ.50 లక్షలు విలువ చేసే రెండు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరికరాలను అందజేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి నిధులను వెచ్చించి కొనుగోలు చేసిన వాటిని గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావుకు ఎంపీ తరఫున ఆరా సంస్థ ప్రతినిధి అందజేశారు. డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలలో రొమ్ము క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో స్క్రీనింగ్ డివైజ్‌లు అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరికరాలు బరువు తక్కువగా ఉండటమే కాకుండా, పరీక్ష చేసేటప్పుడు ఎటువంటి నొప్పి లేకుండా ఉండే విధంగా తయారు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్‌కుమార్, సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌ను విజయవంతం చేద్దాం
చిలకలపూడ(మచిలీపట్నం): జిల్లాలో వచ్చే నెల 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతంగా నిర్వహించి, జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కక్షిదారులు సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి కోరారు. గురువారం సాయంత్రం నగరంలోని న్యాయస్థానాల సముదాయంలో గల న్యాయ సేవా సదన్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ అధికారులు, కక్షిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తాను విజయనగరం, విశాఖపట్నంలో పనిచేసినప్పుడు లోక్ అదాలత్‌ను ఎంతో అద్భుతంగా నిర్వహించామన్నారు. అదే తరహాలో కొత్త ఒరవడితో జిల్లాలో నిర్వహించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో జిల్లాను నిలబెట్టేందుకు పోలీసు అధికారులు, న్యాయవాదులు, బీమా కంపెనీలు, విద్యుత్తు బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ శాఖలు అందరూ సహకరించాలన్నారు. స్టేషన్ల వారీగా కమిటీలు.. ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్కిల్ కమిటీలు ఏర్పాటు చేసుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ అధ్యక్షతన కోర్టు కేసులను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పర్యవేక్షించాలని న్యాయమూర్తి సూచించారు. లోక్ అదాలత్ సమయంలో వీలైనన్ని ఎక్కువ కోర్టు కేసులు పరిష్కారం అయ్యేందుకు న్యాయమూర్తులతో పాటు పోలీసులు న్యాయవాదులు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు. అదనపు ఎస్పీ వీవీ నాయుడు మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి సూచించిన విధంగా జిల్లాలోని 2,450 కేసులను పర్యవేక్షించి స్టేషన్ల వారీగా సర్కిల్ కమిటీలను ఏర్పాటు చేసి పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామ కృష్ణయ్య, న్యాయమూర్తులు పాండురంగారెడ్డి, సుజాత, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. పోతురాజు, న్యాయవాదులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి -
‘పది’ టాపర్స్‌కు ఘన సత్కారం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ లక్ష్మీశ గురువారం తన కార్యాలయంలో సత్కరించారు. జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి చెందిన పసుపులేటి నందిని (593)(ఎంబీఎం జిల్లా పరిషత్ హైస్కూల్ మైలవరం), గాదంశెట్టి సాయిచరణ్ (593) (శ్రీ తేలప్రోలు బాపనయ్య హైస్కూల్, విజయవాడ), కొంపిల్లి ప్రణీత్‌కుమార్ (592) (ఏకేటీపీ మున్సిపల్ హైస్కూల్, విజయవాడ), ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన కొల్లి స్వాతి (598) (నవోదయ హైస్కూల్, విజయవాడ) తదితరులను కలెక్టర్ అభినందించి సత్కరించారు. వారితో పాటుగా జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
హద్దులు దాటిన భూ కబ్జా పర్వం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికార పార్టీ నాయకుల భూ దాహం హద్దులు దాటింది. అధికారంలో తాముంటే ఎక్కడైనా దౌర్జన్యం చేయొచ్చన్న చందంగా తయారైంది కూటమి ఎమ్మెల్యేల తీరు. లేని భూమిని ఉన్నట్లు చూపి నిజాయతీగా కొనుగోలు చేసిన రైతుల భూమిపై కన్నేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆమె భర్త వెంకన్న చౌదరిల భూ కబ్జా భాగోతం ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండల పరిధి రంగాపురం గ్రామంలో వెలుగు చూసింది. రంగాపురం భూ వివాదం ఇలా.. రంగాపురం గ్రామం జమీందారు అడుసుమిల్లి విశ్వేశ్వరరావుకు చెందిన సర్వే నంబర్ 192లో గల 100ఎకరాలను గౌతు యశోధరాదేవి 1956లో కొనుగోలు చేశారు. ఈ భూమిలో 1963 నుంచి 1971వరకు 92.10ఎకరాలను రంగాపురం గ్రామానికి చెందిన 21మంది రైతులకు విక్రయించారు. ఆ తర్వాత 15ఏళ్ల తర్వాత తమకు ఇంకా మిగులు భూమి ఉందని యశోధరాదేవి కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ అనుభవంలో ఉన్న రైతులను సంప్రదించకుండా 1986లో సబ్ డివిజన్ చేయించారు. అప్పుడు 100ఎకరాలకు గానూ 98.84ఎకరాలు ఉన్నట్లు తేలింది. దీనిలో అప్పటికే 92.10ఎకరాలను విక్రయించగా 6.74ఎకరాలు రహదారులు, వాగులుకు పోనూ అక్కడ ఏ విధమైన భూమి లేదు. అయినప్పటికీ తమ భూమి 7.40ఎకరాలు ఇంకా తమకు ఉందని గతంలో కొనుగోలు చేసి అనుభవంలో ఉన్న పది మంది రైతులు తమ భూమిని ఆక్రమించారని 1988లో గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత ఈ భూమిని కొనుగోలు చేసిన 21మంది రైతులలో ఒకరైన పడమటి కోటేశ్వరరావు కుమారులు నాగేశ్వరరావు, సత్యనారాయణ, రామకృష్ణారావుల నుంచి 1974లో రంగాపురం గ్రామానికే చెందిన గండ్ర భద్రారెడ్డి 3ఎకరాలు, మద్దిరెడ్డి నాగేశ్వరెడ్డి ఎకరం కొనుగోలు చేశారు. అదేవిధంగా 21మంది రైతులలో ఒకరైన కుప్పిరెడ్డి వెంకటరెడ్డి నుంచి కుప్పిరెడ్డి కాంతారెడ్డి ఒక ఎకరం కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ భూమి ఇంకా తమకి ఉందంటూ గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కూతురు ప్రస్తుత పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆమె భర్త వెంకన్న చౌదరి 2017లో రంగంలోకి దిగారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వ అధికారంలో ఉండగా పొజిషన్లో ఉన్న గండ్ర భద్రారెడ్డి, మద్దిరెడ్డి నాగేశ్వరెడ్డి, కుప్పిరెడ్డి కాంతారెడ్డి కుమారుడు వెంకటరెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులు ఏడుగురిపై తొమ్మిది అక్రమ కేసులు పెట్టి బెదిరించారు. కేసులు సరికాదని నిర్ధారిస్తూ మైలవరం కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు వారి ఆటలు సాగలేదు. కూటమికి అధికారం రావడంతో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వీరు మరలా ఈ రైతులను వేధించ సాగారు. ఈ క్రమంలోనే ఈ వివాదాస్పద స్థలంలో 1974 నుంచి పొజిషన్లో ఉన్న రైతు గండ్ర భద్రారెడ్డికి చెందిన 3ఎకరాలు, కుప్పిరెడ్డి కాంతారెడ్డి కుమారుడు వెంకటరెడ్డికి చెందిన ఒక ఎకరంలో గల వంద మామిడి చెట్లను నరికి ధ్వంసం చేసి కలపను తరలించారు. అదే విధంగా మద్దిరెడ్డి నాగేశ్వరెడ్డి కుమారులు నర్సింహారెడ్డి, అంజిరెడ్డికి చెందిన ఒక ఎకరంలో మామిడి చెట్లను నరికేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. దీనితో ఈ వివాదం తెరపైకి వచ్చింది. రంగాపురం రైతుల భూములపై పలాస ఎమ్మెల్యే శిరీష కన్ను లేని భూమిని ఉన్నట్లు చూపి కబ్జాకు యత్నం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ రైతులపై అక్రమ కేసులు స్థానిక ఎమ్మెల్యే సపోర్టుతో టీడీపీ నాయకులను ఉసిగొల్పుతున్న వైనం నాలుగు ఎకరాల మామిడితోట ధ్వంసంలేనిది ఉన్నట్లు చూపి.. గౌతు యశోధరాదేవి విక్రయించగా 6.74ఎకరాలు వాగులు, రోడ్ల కింద పోయినప్పటికీ తమ భూమి ఇంకా 7.40ఎకరాలు ఉందని 1988లో యశోధరాదేవి కుమారుడు శ్యామ్‌సుందర్ శివాజీ కోర్టులో కేసు వేశారు. లేని భూమి 7.40ఎకరాలకు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ నుంచి ఆయన అల్లుడు వెంకన్న చౌదరి వివాదం కోర్టులో ఉండగానే 2009లో ఆయన పలుకుబడి ఉపయోగించి జనరల్ పవర్ పొందారు. ఈ భూమిని 2010లో మరో వ్యక్తికి విక్రయించినట్లు తెలుస్తోంది. లేని భూమిని విక్రయించిన విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతూ రైతులను వేధిస్తున్నారు. ఈ విధంగా కోర్టులను సైతం తప్పుదోవ పట్టించారు. ఇదిలా ఉండగా ఈ భూమిని 2022లో ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్ అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలో ఉన్న భార్యా భర్తల పేర్లు గండ్ర భద్రారెడ్డి, రామతులశమ్మ. వీరిది రెడ్డిగూడెం మండల పరిధి రంగాపురం గ్రామం. వీరి కుమారుడు సోమిరెడ్డి మృతి చెందగా.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా వివాహాలు చేసుకొని వెళ్లిపోయారు. వీరు 1974లో కొనుగోలు చేసిన 3ఎకరాల భూమిపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆమె భర్త వెంకన్న చౌదరి కన్ను పడింది. వారు వృద్ధులు కావడంతో పొరాటం కూడా చేయలేరని భావించి వీరి భూమిని తమ భూమి అంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. భూమిని కొనుక్కొని నలభై ఏళ్లుగా సాగులో ఉన్న తమపై దౌర్జన్యం చేసి భూమిని లాక్కోవాలని చూడడం దుర్మార్గమని ఈ ఇద్దరు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పది ఫలితాల్లో 8వ స్థానం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి సత్తాచాటింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు 85.68 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో సానం కైవసం చేసుకున్నారు. గత ఏడాది జిల్లా 13వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది ఆరు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. గత ఏడాది 88.76 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా ఈ ఏడాది 85.68 శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారీ బాలికలదే పైచేయి ఈ ఏడాదీ బాలికలే పైచేయి సాధించారు. 13,938 మంది బాలురు, 13,529 మంది బాలికలు కలిపి 27,467 మంది పరీక్షలు రాశారు. బాలురు 11,662 (83.67 శాతం) మంది, బాలికలు 11,872 (87.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో మొత్తం 27,899 మంది పరీక్షలు రాయగా 24,763 మంది (88.76శాతం) ఉత్తీర్ణత సాధించారు. పటిష్ట ప్రణాళికతో.. పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో నిలవడానికి జిల్లా విద్యాశాఖ ప్రణాళికా బద్ధంగా కృషి చేసింది. జిల్లా విద్యాశాఖాధికారి, ఇతర అధికారులు పాఠశాలల పునఃప్రారంభం నుంచి పదో తరగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విద్యా సంవత్సరంలో జూలై నుంచే ఉదయం, సాయంత్రం పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. హెచ్ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చేలా పర్యవేక్షణ చేశారు. 100 రోజుల ప్రణాళికను అమలు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు చేపట్టారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల నుంచి ఆర్జేడీ స్థాయి వరకు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. నవంబర్ – డిసెంబర్లో సిలబస్ పూర్తి చేసి, ప్రతి రోజూ రివిజన్ చేపట్టారు. జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ (డీసీఈబీ) ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు టెస్టులు తయారు చేసి విద్యార్థులకు తర్ఫీదునిచ్చారు. జెడ్పీ యాజమాన్యం స్టడీ మెటీరియల్ సరఫరా చేసింది. ఈ చర్యలు మెరుగైన ఉత్తీర్ణతకు దోహదం చేశాయని పలువురు హెచ్ఎంలు పేర్కొన్నారు. 63 పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు జిల్లాలో 63 పాఠశాలలు పదోతరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో తొమ్మిది పాఠశాలలు, ప్రైవేట్ యజమాన్యంలోని 54 విద్యాసంస్థలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 11,524 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,747 మంది (75.90 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ యాజమాన్యాల నుంచి 15,943 మంది పరీక్షలకు హాజరవగా 14,787 మంది (92.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఏపీ మోడల్ స్కూల్స్ 91.30 శాతం, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ స్కూల్స్ 80 శాతం, ఏపీసోషల్ వెల్ఫేర్ 93.82 శాతం, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ 82.55 శాతం, బీసీ వెల్ఫేర్ 97.27 శాతం, కేజీబీవీ 96.43 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ 70.45 శాతం, జెడ్పీ స్కూల్స్ 71.36 శాతం, మునిసిపల్ విద్యాసంస్థలు 80.76 శాతం, ప్రైవేట్ ఎయిడెడ్ 83.03 శాతం, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 92.75 శాతం, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు 48.94 శాతం చొప్పున ఫలితాలు సాధించాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. 19,589 మంది ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత జిల్లా వ్యాపితంగా 23,534 మంది ఉత్తీర్ణత సాధించగా వారిలో 19,589 మంది ప్రథమ శ్రేణిలో నిలి చారు. 2,782 మంది ద్వితీయ, 1,163 తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని అధికారులు ప్రకటించారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో చందర్లపాడు మండలం 93.25 శాతం ఫలితాలతో మొదటి స్థానంలో నిలవగా గంపలగూడెం 92.63 శాతం, విజయవాడ (తూర్పు) 90.84 శాతంతో ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి. ఎన్టీఆర్ జిల్లాలో 85.68 శాతం ఉత్తీర్ణత గత ఏడాది 13వ స్థానంలో నిలిచిన జిల్లా సత్తాచాటిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఫలితాలు సంతృప్తికరం టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా 8వ స్థానంలో నిలిచింది. గతేడాది 13వ స్థానంలో ఉండగా అది ఆరు స్థానాలు పైకి చేరి ఎనిమిదో స్థానాన్ని సాధించాం. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయి. సంతోషంగా ఉంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రత్యేక తరగ తులు, నిత్యం పరీక్షల నిర్వహణతోనే ఈ ఫలితాలు సాధించాం. ఈ విజయంలో భాగస్వాములైన హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అభినందనలు. – యు.వి.సుబ్బారావు, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి -
అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్లు
కంచికచర్ల: పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు రాతి క్వారీల్లో పనిచేసుకుంటూ బతుకుబండి లాగుతున్నారు. కొండలను పిండి చేస్తూ అరకొర వేతనాలతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే క్వారీల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్రగాయాల పాలవుతున్నారు. క్వారీల్లో పేలుళ్లకు నిబంధనలకు విరుద్ధంగా జిలెటెన్ స్టిక్స్ (పేలుడు పదార్థాలు) ఉపయోగించడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాల సమాచారం అధికారులు, మీడియాకు తెలియడంతో బహిర్గతం అవుతున్నాయి. మరికొన్ని ప్రమాదాలు మూడో కంటికి తెలియడంలేదు. ప్రమాదాలు జరిగిన సమయంలో బాధిత కుటుంబాలకు క్వారీ యజమానులు ఎంతో కొంత పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ఏడాదిలో 10 మంది వరకు మృతి ఏడాది కాలంలో దొనబండ రాతి క్వారీల్లో పది మంది వరకు మృత్యువాతపడ్డారు. వారిలో ఒడిశా, బిహార్ రాష్ట్రాల వారు ఉన్నారు. వర్షంలో బ్లాస్టింగ్ చేసిన బండరాళ్లను తొలగించే క్రమంలో బండలన్నీ కార్మికులపై పడిపోవటంతో ఒకేసారి ముగ్గురు మృతిచెందారు. క్వారీ గుంత వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఓ క్రషర్లో రివర్సు చేస్తున్న డోజర్ తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. కంకరలోడుతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన పల్టీకొట్ట డంతో ఓ డ్రైవర్ మృతిచెందాడు. బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు వచ్చి క్వారీల్లో పనిచేసే కార్మికులకు తగలడంతో తీవ్రగాయాల పాలయిన వారు మరో 20 మంది వరకు ఉన్నారు. కనిపించని భద్రతా చర్యలు క్వారీల్లో కార్మికుల రక్షణ కోసం నిర్వాహకులు ఎటువంటి భద్రతా చర్యలూ చేపట్టడంలేదు. పేలుళ్ల సమయంలో కొండ పైకి బెంచీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కార్మికులు పనిచేసే సమయంలో కాళ్లకు బూట్లు, బెల్టు, టోపీ, చేతులకు బ్లౌజులు సరఫరా చేయాలి. కార్మికులు కొండపైన డ్రిల్లింగ్ చేసే సమయంలో నాణ్యమైన తాళ్లు ఇవ్వాల్సి ఉంది. నాసిరకం తాళ్లు ఇవ్వటంతో అవి తెగి కార్మికులు కొండపై నుంచి కొందకు పడిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. రక్షణ చర్యలు చేపట్టాలి క్వారీల్లో బ్లాస్టింగ్ చేస్తున్న సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రిగ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. దీంతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. క్వారీలో పనిచేసే కార్మికుల రక్షణకు నిర్వాహకులు చర్యలు చేపట్టాలి. నిబంధనలు పాటించని క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. – కోట కల్యాణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయవాడ అధిక మోతాదులో పేలుడు పదార్థాలు అనుభవం లేని వ్యక్తులతో బ్లాస్టింగ్ చేయటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాసింగ్ సమమంలో అధిక మోతాదులో పేలుడు పదార్థాలను వాడుతున్నారు. ఫలితంగా క్వారీల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు మృత్యువాతపడుతున్నారు. ఒడిశా, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల కార్మికులు, మైనర్లతో పనులు చేయిస్తున్నారు. – జి.హరికృష్ణారెడ్డి, భవన నిర్మాణ రంగ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోని కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల్లో సుమారు 160 వరకు రాతి క్వారీలు, 80 వరకు క్రషర్లు ఉన్నాయి. కొన్ని క్వారీలు మూత పడ్డాయి. కొన్ని క్వారీలు అధికారికంగా, మరికొన్ని అనధికారికంగా నడుస్తున్నాయి. బ్లాస్టింగ్ చేసే సమయంలో ఎనిమిది అడుగుల లోతులో మాత్రమే డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. అయితే ఒకేసారి 100 లారీలకు సరిపడా ముడి సరుకు వచ్చేలా నిబంధనలకు విరు ద్ధంగా వంద అడుగుల వరకు డ్రిల్లింగ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లు ఒకే సారి పగిలిపోతున్నాయి. ఈ పేలుళ్ల ధాటికి కొన్నిసార్లు కార్మికులు మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలవుతు న్నారు. కంచికచర్ల మండలంలోని దొన బండ రాతి క్వారీలో ఒడిశా, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల కార్మికులు, ఇబ్రహీపట్నం మండలం మూలపాడు, జూపూడి క్వారీల్లో ఒడిశా, తమిళనాడు కార్మికులు పనిచేస్తున్నారు. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో 160కి పైగా క్వారీలు క్వారీల్లో పనికోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులు కార్మికుల భద్రతకు చర్యలు చేపట్టని క్వారీల నిర్వాహకులు బ్లాస్టింగ్‌కు అధిక మోతాదులో పేలుడు పదార్థాల వినియోగం పేలుళ్ల ధాటికి క్వారీల్లోనే తనువు చాలిస్తున్న పేద బతుకులు రాతి క్వారీల్లో బండలను పేల్చే పనులను అనుభవం లేని కార్మికులతో చేయిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిగ్ బ్లాస్టింగ్ చేయకూడదు. 100 లారీలకు ముడి సరుకు ఒకేసారి దిగుమతి కావాలన్న ఆశతో ఘాతాలు తవ్వి, వాటిలో మోతాదకు మించి జిలెటిన్స్ స్టిక్స్ వాడి బ్లాస్టింగ్ చేస్తున్నారు. పేలుడు ధాటికి పెద్ద పెద్ద బండరాళ్లు ఎగిరిపడి కార్మికులు మృతి చెందుతున్నారు. కొన్నిసార్లు క్వారీలకు మూడు కిలోమీటర్ల సమీపంలోని ఇళ్లు పేలుడు ధాటికి పగుళ్లు ఇస్తున్నాయి. మరికొన్ని చోట్ల ప్రహరీలు పడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ జరుగుతున్నా మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవైనా ప్రమాదాలు జరిగి, అవి బయటకు తెలిస్తేనే అధికారులు మొక్కుబడిగా క్వారీల వద్దకు వస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ అధికారిగా ప్రభాకరరావు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా ఇంట ర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా బి.ప్రభాకరరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో కొనసాగిన సి.ఎస్.ఎస్.ఎన్.రెడ్డి కడపకు బదిలీపై వెళ్లారు. పాయకాపురం ప్రభుత్వ జూని యర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న రెడ్డికి జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆయన ప్రమోషన్‌పై కడప అధికారిగా నియమితులయ్యారు. ఏలూరు జిల్లా నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ప్రభాకరరావుకు ఎన్టీఆర్ జిల్లా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన సి. ఎస్.ఎస్.ఎన్.రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. -
పదవిలో బాధ్యతగా వ్యవహరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): పదవి ద్వారా వచ్చిన అధికారంతో బాధ్యతగా వ్యవహరించాలి తప్ప అజమాయిషీ చేయకూడదని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి జి.గోపీ సూచించారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణస్వీకారం, జిల్లాకు బదిలీపై వచ్చిన న్యాయమూర్తులకు స్వాగతం, బదిలీపై వెళ్లిన న్యాయమూర్తులకు వీడ్కోలు కార్యక్రమం బార్ అసోసియేషన్ హాలులో బుధవారం జరిగింది. తొలుత బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ.. మచిలీపట్నంతో తనకు అనుబంధం ఉందని, తన మామయ్య మచిలీపట్నంలో ఎనిమిదేళ్లు పాటు పనిచేశారని పేర్కొన్నారు. తాను మచిలీపట్నం బదిలీ అయినట్లు తెలి యగానే ఎంతో సంతోషించానన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.పోతురాజు మాట్లాడుతూ.. తనతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్న న్యాయవాదులకు ముందుగా కృతజ్ఞతలు తెలి పారు. బార్, బెంచ్ సమన్వయంతో పనిచేసేలా తనవంతు కృషి చేస్తానన్నారు. మచిలీపట్నంలో ట్రిబ్యూనల్ కోర్టులు రావడానికి సహాయసహకారాలు అందించాలని న్యాయమూర్తులను కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ, ఆరో అదనపు జడ్జి పి.పాండురంగమూర్తి, శాశ్వత లోక్‌అదాలత్ చైర్మన్ ఒ.వెంకటేశ్వరరావుకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. జిల్లా కోర్టు నుంచి బదిలీపై వెళుతున్న జడ్జిలు ఎన్.మేరీ, ఎం.వి.వాహిని, సాయిశ్రీవాణిని శాలువాలతో సత్కరించారు. తొలుత మంత్రి కొల్లు రవీంద్ర బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అభినందించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ -
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడకు చెందిన ఎల్.నారాయణ కుటుంబం ఆలయ అధికారులను కలిసి రూ.1,01,116 విరాళం అందజేసింది. ఒంగోలుకు చెందిన డి.శివకృష్ణ ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మహిళలకు ‘శక్తి’ యాప్‌తో రక్షణవిజయవాడస్పోర్ట్స్: ఆపద సమయంలో మహిళలకు ‘శక్తి’ యాప్ రక్షణగా నిలుస్తుందని మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ లతాకుమారి సూచించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శక్తి యాప్ ఆవశ్యకతపై విద్యార్థినులు, గృహిణులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జి.కొండూరు గ్రామం, విజయవాడ నగరంలోని డెంటల్ కాలేజీ, సెంట్రల్ ఎకై ్సజ్ కాలనీలో మహిళా హాస్టల్, పలు ప్రధాన కూడళ్ల వద్ద విద్యార్ధినులు, గృహిణులకు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది బుధవారం ఈ యాప్‌పై అవగాహన కల్పించారు. ఏసీపీ లతాకుమారి మాట్లాడుతూ.. మహిళలు, బాలికల రక్షణకు ఎన్నో చట్టా లున్నాయన్నారు. ఆపద సమయంలో మహిళలకు రక్షణగా నిలిచేందుకు శక్తి యాప్‌ను రూపొందించామన్నారు. ఈ యాప్‌ను ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఆపద సమయంలో సాయం పొందాలని సూచించారు. బాధితులు యాప్‌లో సమాచారం అందించిన పది నిమిషాల్లో పోలీస్ సాయం అందుతుందన్నారు. నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్‌పై వర్క్‌షాప్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘స్వర్ణాంధ్ర 2047’ సాధనలో భాగంగా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు రెండు రోజులు జరిగే వర్క్‌షాప్ బుధవారం ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సిబ్బందికి వర్క్‌షాప్ చేపట్టారు. ఏపీ సెక్రటేరియట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్లు రావి రాంబాబు, జె.విజయలక్ష్మి, సీనియర్ సల హాదారు డి.వి.వి.సీతాపతిరావు పాల్గొని సిబ్బందికి శిక్షణనిచ్చారు. విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు నియోజకవర్గాల పరిధిలోని అవకాశాలు, బలాలు, అనుకూల, ప్రతికూల అంశాలను గుర్తించడంపై అవగాహన కల్పించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, వారి టీం సభ్యుల నుంచి సలహాలు, అభిప్రాయాలు సేకరించారు. వర్క్‌షాప్‌లో రెండు జిల్లాల నుంచి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మండల పరిషత్ అధికారులు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్లు, ప్రణాళిక శాఖ సిబ్బంది, జీఎస్‌డబ్ల్యూఎస్ నుంచి ప్రణాళికా శాఖకు ఆన్‌డ్యూటీపై తీసుకున్న సిబ్బంది పాల్గొన్నారు. వర్క్‌షాప్ గురువారం కూడా కొనసాగుతుందని అర్థగణాంకాధికారి ఎం.లలితాదేవి తెలిపారు. -
మద్యం మాఫియాను ప్రోత్సహించడం తగదు : అవినాష్
గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం మాఫియా పెరిగిపోయిందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి దేవినేని అవినాష్ అన్నారు. గుణదల కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమం కనుమరుగైందన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు కూటమి నేతలు దందాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని దయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం మద్యం మాఫియాను ప్రోత్సహిస్తోందని, ఈ పద్ధతి తగదన్నారు. కూటమి నాయకులు వీధివీధికి బెల్టుషాపులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో అన్ని శాఖలు పారదర్శకంగా పనిచేశాయని గుర్తుచేశారు. మద్యాన్ని అదుపులో ఉంచడంలో గత ప్రభుత్వం నిబద్ధతతో పనిచేసిందని వివరించారు. కాశ్మీర్‌లోని పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడిని దేవినేని అవినాష్ ఖండించారు. ఉగ్రవాదుల చర్య అమానుషమన్నారు. ఈ దాడిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. -
మామిడి రైతుకూ నష్టాలే
పెనుగంచిప్రోలు: ఈ ఏడాది మామిడి రైతులకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. కోలుకోలేని నష్టం వాటిల్లింది. సాధారణంగా మే నెలలో చెడుగాలులు, వానలు వస్తాయి. ఈసారి ఏప్రిల్ మొదటి వారం నుంచే అకాల వర్షంతోపాటు గాలి దుమ్ములు రావడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన తరుణంలో అకాల వర్షం, గాలులకు మామిడి కాయలు నేల రాలాయి. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో గాలివాన రావడంతో 40 నుంచి 60 శాతానికి పైగా కాయలు రాలిపోయాయి. గాలిదుమ్ము రాక ముందు మామిడి టన్ను రూ.40వేల నుంచి రూ.లక్ష వరకు పలుకగా ప్రస్తుతం టన్ను ధర రూ.30వేల నుంచి రూ.40వేలకు పడిపోయింది. కాయ నాణ్యత ఆధారంగా ధర మారుతోంది. కౌలురైతులకు మరింత నష్టం... ఎకరాకి రూ.20వేలు నుంచి రూ.30వేలు కౌలు చెల్లించి మామిడి తోటలను సాగుచేస్తున్న వారికి ఈ ఏడాది మరింత నష్టం వాటిల్లింది. తెగుళ్లతోపాటు గాలులకు కాయలు రాలడంతో కోలుకోలేని దెబ్బతిన్నారు. ఎకరానికి రూ.20వేలు నుంచి రూ. 25వేల వరకు నష్టాలు తప్పేలా లేవని కౌలురైతులు వాపోతున్నారు. జిల్లాలో మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో గాలులు మామిడికాయలు భారీగా నేలరాలడంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు ఉద్యానవనశాఖ అధికారులు చెబుతుండగా, నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మామిడిచెట్లకు తొలుత తెగుళ్లు.. ఇటీవల గాలి దుమారం.. అకాల వర్షాలు కోత సమయాన నేలరాలిన కాయలు తీవ్రనష్టాల్లో మామిడిసాగు రైతులు -
పది పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య
బంటుమిల్లి: పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపానికి గురై బంటుమిల్లి మండల పరిధిలోని పెదతుమ్మిడి పంచాయితీ శివారు అర్జావానిగూడెం గ్రామానికి చెందిన గోవాడ మింటు(17) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండోసారి కూడా పరీక్షల్లో ఫెయిల్ కావడంతో కలత చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యాన్ డ్రైవరుగా పనిచేస్తున్న మింటు తండ్రి రామకృష్ణ డ్యూటీకి వెళ్లగా, పనుల నిమిత్తం తల్లి బయటకు వెళ్లింది. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మింటు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. స్థానికులు మింటు మృతదేహాన్ని సందర్శించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. చదువుల ఒత్తిడే చంపేసిందిపెనమలూరు: కానూరు ఇంజినీరింగ్ కాలేజీలో మృతి చెందిన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న యార్లగడ్డ ఖ్యాతిశ్రీ (22) చదువుల ఒత్తిడితోనే మృతి చెందిందని ఆమె తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పంచనామా చేశారు. కానూరు ఇంజినీరింగ్ కాలేజీలో ఖ్యాతిశ్రీ మంగళవారం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకోని మృతిచెందడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమెతండ్రి యార్లగడ్డ శ్రీనివాసరావు విజయవాడ జీజీహెచ్ వద్ద బుధవారం జరిగిన శవపంచనామాకు హాజరై తమ కుమార్తె ఖ్యాతిశ్రీ సెమిస్టర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిందని తెలపడంతో ఈ మేరకు పోలీసులు కేసు పంచనామా పూర్తిచేశారు. ఖ్యాతిశ్రీ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం చేశారు. -
ఉగ్రదాడికి నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయవాడ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిరసన ప్రదర్శన జరిగింది. సిద్ధార్థ కళాశాల దగ్గర నుంచి మొదలైన నిరసన ప్రదర్శన మదర్‌ధెరిస్సా జంక్షన్, సిద్దార్థ స్కూల్ రోడ్డు, ఆర్ఆర్ జంక్షన్, జమ్మిచెట్టు సెంటర్, శిఖామణి సెంటర్ మీదుగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి మాట్లాడుతూ ఇటువంటి సంఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమఅన్నారు. పహల్గాం ఘటనను ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కులమతాలకు అతీతంగా ఉగ్రవాదాన్ని అణిచివేతకు కేంద్రానికి అందరూ సహకరించాలని కోరారు. పరిషత్ రాష్ట్ర కార్య సమితి సభ్యులు దుర్గారావు, అఖిల్, ఖాసీం, శ్యామ్, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రూ.లక్షకు పైగా నష్టం తప్పేలా లేదు
ఈ ఏడాది ఐదెకరాలు మామిడి తోట కౌలుకు తీసుకున్నాను. గాలిదుమ్ములు రాక ముందు టన్ను రూ.లక్ష వరకు ఉంది. ఇప్పుడు టన్ను రూ.30వేలు నుంచి రూ.40వేలు మాత్రమే ఉంది. ఐదెకరాలపై రూ.లక్షకుపైగా నష్టం వచ్చేలా ఉంది. ధర పెరిగితేనే నష్టాల ఊబి నుంచి గట్టెక్కగలం. – దారా వెంకటేశ్వర్లు, కౌలురైతు, పెనుగంచిప్రోలు అనుకూలించని వాతావరణం ఈ ఏడాది మామిడికి వాతావరణం అనుకూలించలేదు. పూత ఆలస్యం కావడంతోపాటు పూత దశలో నల్లతామర, మంగుపురుగు, తెగుళ్లతో కాపు తగ్గింది. కోత సమయంలో గాలులు, వానలకు అధికశాతం కాయ నేలరాలింది. తెగుళ్ల నివారణ మందులు కొట్టేందుకు ఎకరానికి రూ.20వేలు దాకా ఖర్చులు అయ్యాయి. – తిరుపతిరావు, కౌలు రైతు, పెనుగంచిప్రోలు ● -
బండెనక బండి కట్టి..
కంచికచర్ల: చందర్లపాడు మండలం తుర్లపాడులో నిర్వహించే బడేహజరత్ ఉరుసు ఉత్సవాలకు ముస్లింసోదరులు బుధవారం భారీగా తరలివెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి ముస్లింలు ఎడ్లబండ్లతో ఉరుసు ఉత్సవాలకు హాజరయ్యేందుకు తరలివచ్చారు. ఉరుసు ఉత్సవాలకు తరలివెళ్లే ఎండ్లబండ్లను కంచికచర్ల మండలంలోని పెండ్యాల మున్నేటి తీరాన మాజీఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు బుధవారం ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన ముస్లింలు బండెనక బండి కట్టి ఉరుసు ఉత్సవాలకు తరలివెళ్లారు. ఈసందర్భంగా డాక్టర్ జగన్మోహనరావు మాట్లాడుతూ మతాలకతీతంగా అందరూ ఉరుసు ఉత్సవాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎడ్లబండ్లపై ఉత్సవాలకు వెళ్తున్న భక్తులకు మున్నేటి తీరాన ఎంపీపీ షేక్ మలక్‌బషీర్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఉరుసు ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండ్ల సవారీలను చూసేందుకు పెండ్యాల మునేటి తీరానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యు లు షేక్ బడేహజరత్, వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ షేక్ గౌస్‌పాషా, సయ్యద్ అహ్మద్, షేక్ పీర్సామియా, షేక్ చాన్బహుదూర్, ఫయీంపాష, అబ్దుల్కరీం, ఖాజాపాషా తదితరులు పాల్గొన్నారు. ఉరుసు ఉత్సవాలకు తరలిన ముస్లింలు -
55 వేల ఎకరాల్లో మామిడి..
ఎన్టీఆర్ జిల్లాలో 55 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మామిడి సాగు అధికంగా ఉంది. గత నెలరోజుల్లో నాలుగుసార్లు గాలిదుమ్ములతో కూడిన వర్షాలు పడటంతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాధారణంగా ఏప్రిల్ నెలలో మామిడి కోతలు ప్రారంభమై మే నెలాఖరుతో ముగుస్తాయి. అంతకుముందు మంచు కారణంగా పూత రాలింది. పూత నిలిచేందుకు రైతులు 5 నుంచి 10సార్లు మందులు స్ప్రే చేశారు. ఇందుకు అదనంగా రైతుకు ఎకరానికి రూ.15 నుంచి రూ.20 వేలు పెట్టుబడి అయింది. తరువాత మంగు తెగులు కారణంగా కొంతనష్టం వాటిల్లింది. గాలివానకు పెనుగంచిప్రోలులో నేలరాలిన మామిడి కాయలు(ఫైల్) -
ప్రమాద బాధితులకు పరిహారం అందజేత
విజయవాడస్పోర్ట్స్: రోడ్డు ప్రమాదం(హిట్ అండ్ రన్) కేసుల్లో బాధితులకు కేంద్రప్రభుత్వం ఆర్ధిక సాయం మంజూరు చేసిందని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. జిల్లాలోని 101మంది బాధితులకు కేంద్రం నుంచి రూ.89.5లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం ఆయన ప్రమాద బాధిత కుటుంబసభ్యులకు నగదు చెక్కులను అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ బాధితులకు నష్టపరిహారం అందించడంలో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా 253 ప్రమాదాలు చోటుచేసుకోగా, ఇప్పటివరకు 101 కుటుంబాలకు నష్టపరిహారం అందించామన్నారు. కేంద్రప్రభుత్వం రోడ్డుప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడిన వ్యక్తికి రూ.50వేలు మంజూరు చేస్తుందన్నారు. తాజాగా 26కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, 75కుటుంబాలకు రూ.50వేల చొప్పున మంజూరుకావడంతో బాధితులకు అందించినట్లు వివరించారు. మిగిలినవారికి కూడా త్వరలోనే పరిహారం అందేలా చూస్తామన్నారు. గుర్తుతెలియని వాహనాలు చేసిన రోడ్డు ప్రమాదం(హిట్ అండ్ రన్) కేసులను చేధింపు, కేంద్రం నుంచి నష్టపరిహారం మంజూరుకు కావాల్సిన పత్రాలను సేకరించేందుకు డెఫ్యూటీ పోలీస్ కమిషనర్(డీసీపీ) కృష్ణమూర్తినాయుడు నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సురక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3000 సీసీ కెమెరాలను చేసినట్లు చెప్పారు. హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రమాదానికి కారణమైన వాహనాన్ని కచ్చితంగా స్వాధీనం చేసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కేంద్రం నుంచి నష్టపరిహారం అందేలా కీలకంగా వ్యవహరించిన డీసీపీ కృష్ణమూర్తినాయుడు, డెప్యూటీ కలెక్టర్ జి.మహేశ్వరరావు, రాష్ట్ర జనరల్ ఇన్సూరెన్స్ అధికారి డి.రామ్సుధాకర్, ఏసీపీ రామచంద్రరావు, మహిళా ఎస్ఐ మల్లీశ్వరి, కలెక్టరేట్, పోలీస్‌శాఖ సిబ్బందిని కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో డీసీపీలు కె.జి.వి.సరిత, జి.గుణ్ణం రామకృష్ణ పాల్గొన్నారు. -
ఏడాదిలో రూ.5 లక్షల కోట్ల వ్యాపారం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన యూకోబ్యాంక్ గత ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల కోట్ల వ్యాపారం చేసిందని ఆ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎన్.శ్రీకాంత్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాతబస్తీ బ్రాహ్మణవీధిలో ఏర్పాటు చేసిన ఆబ్యాంక్ విజయవాడ వన్‌టౌన్ శాఖ నూతన ప్రాంగణాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ క్విట్ ఇండియా సమయంలో గాంధీజీ పిలుపు మేరకు దేశంలోని వ్యాపారవర్గాల కోసం జీడీ బిర్లా 1943లో యూకోబ్యాంకును స్థాపించారన్నారు. నాటినుంచి దేశంతోపాటు హంకాంగ్, సింగపూర్ తదితర దేశాల్లోనూ మూడువేలకు పైగా శాఖలతో సేవలందిస్తున్నట్లు వివరించారు. తమ బ్యాంకు ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి దేశాభ్యున్నతికి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. కస్టమర్లకు గృహ, వాహన రుణాలను గంటల్లోనే మంజూరు చేస్తున్నామన్నారు. మొబైల్ బ్యాంకింగ్ సేవల్లో తమ బ్యాంక్ యాప్‌నకు టాప్ ర్యాంకింగ్ ఉందన్నారు. జోనల్లో ప్రస్తుతం 91శాఖలు ఉన్నాయని, మరో ఐదు శాఖలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. వన్టౌన్శాఖ మేనేజర్ యు. శ్రీనివాస్ మాట్లాడుతూ వన్‌టౌన్‌లో తమబ్యాంక్ 48 ఏళ్లుగా సేవలందిస్తున్నట్లు వివరించారు.యూకోబ్యాంక్ డీజీఎం శ్రీకాంత్ -
జక్కంపూడి కాలనీలో కార్డన్ సెర్చ్
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో బుధవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాలనీలోని 20 బ్లాకుల్లోని 640 ప్లాట్లలో నివాసం ఉంటున్న ఆయా కుటుంబీకుల వివరాలు, ఆధార్ కార్డులను పోలీసులు తనిఖీ చేశారు. ఇన్చార్జి డీసీపీ గుణ్ణం రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావు పర్యవేక్షణలో కొత్తపేట సీఐ చిన్న కొండలరావు, వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్, సీఐలు చంద్ర శేఖర్, ఉమామహేశ్వరరావు, కృష్ణమోహన్, లక్ష్మీనారాయణలతోపాటు పలుస్టేషన్లకు చెందిన ఎస్ఐలు, ఏఎస్ఐలతో కలిపి మొత్తం 130మంది పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఇళ్లలో ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమోనని క్షుణ్నంగా పరిశీలించారు. ఆయా ప్లాట్లలో ఎంత కాలం నుంచి నివాసం ఉంటున్నారు..మీ చుట్టు పక్కల కొత్తగా ఎవరైనా అద్దెకు వచ్చారా..వారేమైనా అనుమానాస్పదంగా ఉన్నారా అని కాలనీవాసులను ఆరా తీశారు. కాలనీలో ఎవరైనా మద్యం, గంజాయి, ఇతర మత్తుమందులు విక్రయిస్తున్నారా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ ద్వారా కాలనీ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ ఐరీష్ వాహనం ద్వారా 128మందికి ఐరీష్ తీయగా వారిలో ఐదుగురు అనుమానితులు ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. 350 బైక్‌లు, ఆటోల రికార్డులు పరిశీలించారు. సరైన ధ్రువీకరణపత్రాలు లేని 50 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పల్లె పండుగ నిధులు మంజూరు ఎప్పుడో?
జగ్గయ్యపేట: ఉపాధి హామీ పథకంలో భాగంగా గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆర్భాటంగా పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాల పేరుతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా మంజూరుకాలేదు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సిమెంట్ రోడ్లు, గ్రావెల్ పనులు, రోడ్డు చదు ను, పశువులషెడ్లు పనులకు బిల్లులు ఎప్పుడు మంజూరవుతాయోనని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 624 పనులు కేటాయింపు... ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 16మండలాల్లో కలిపి రూ. 94.32కోట్ల విలువగల 624 పనులకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోగా ఈ పనులు పూర్తిచేయాలని నిర్దేశించారు. వీటిలో 535 పనులు పూర్తికాగా, 63 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. వత్సవాయి మండలంలో ఐదు పనులు, విజయవాడ–2, పెనుగంచిప్రోలు–4, వీరులపాడు–5, కంచికచర్ల–3, నందిగామ–2, ఏ.కొండురు మండలంలో ఐదు పనులు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. పూర్తయిన పనులకు సంబంధించి కూటమి ప్రభుత్వం కేవలం రూ.6.8కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన నిధులను మంజూరు చేయకపోవడంతో కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 720 గోకులం షెడ్లు మంజూరు... పల్లె పండుగలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 720 పశువుల షెడ్లు మంజూరు కాగా ఇందులో 615 పూర్తయ్యాయి. ఇందులో కనీసం పదిశాతం నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. 559 షెడ్లకు సంబంధించి రూ.9కోట్ల మేర బిల్లులు ఇవ్వలేదు. ఎన్నో వ్యయప్రయాసల కోర్చి షెడ్లు నిర్మాణం పూర్తిచేసుకుంటే ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదంటూ రైతులు వాపోతున్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం స్పందించి బిల్లులు మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు, గోకులం షెడ్ల లబ్ధిదారులు కోరుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల పనులు పదిశాతం నిధులు కూడా ఇవ్వని కూటమి ప్రభుత్వం బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురుచూపులు గోకులం షెడ్ల సబ్సిడీ నిధుల కోసం లబ్ధిదారుల వేడుకోలు బడ్జెట్ రాగానే బిల్లులు చెల్లిస్తాం... ఉపాధి హామీ పథకం, పంచాయితీరాజ్‌శాఖలో చేసిన పనులకు సంబంధించిన అన్ని బిల్లుల వివరాలను కూడా ప్రభుత్వానికి అందించాం. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాగానే చేసిన పనులకు బిల్లులు చెల్లిస్లాం. –ఏ.రాము, డ్వామా పీడీ, విజయవాడ -
క్లోక్రూంలో అనుమానిత బ్యాగును గుర్తించిన రైల్వే జాగిలం
రూ.9.70 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు లభ్యం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే స్టేషన్‌లోని క్లోక్ రూంలో అనుమానాస్పదంగా ఉంచిన బ్యాగును రైల్వే జాగిలం గుర్తించింది. పోలీసులు ఆ బ్యాగును తెరచి చూడగా డబ్బు, బంగారు, వెండి ఆభరణాలు కనిపించాయి. వాటి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.వి.రమణ, ఆర్పీఎఫ్ సీఐ ఆలీబేగ్ ఆధ్వర్యంలో సిబ్బంది విజయవాడ రైల్వే స్టేషన్లో మంగళవారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రైల్వే జాగిలంతో కలసి ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంలోని క్లోక్రూంలో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ఒక బ్యాగును జాగిలం గుర్తించింది. మధ్యవర్తుల సమక్షంలో పోలీసులు ఆ బ్యాగును తెరచి చూడగా అందులో రూ.9.70 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు కనిపించాయి. నకిలీ పేరు, అడ్రస్‌తో ఈ నెల పదో తేదీన ఓ వ్యక్తి ఈ బ్యాగును క్లోక్ రూమ్‌లో ఉంచాడని గుర్తించారు. నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కలెక్టర్ లక్ష్మీశకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈఈ కోటేశ్వరరావు, ఏఈవో చంద్రశేఖర్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. నగరంలోని షాజహర్ ముసాఫిర్ఖానా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని ప్రారంభించారు. ఏటా హజ్ యాత్రికులకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వ్యాక్సినేషన్ చేయడం పరిపాటి. అందులో భాగంగా జిల్లాకు చెందిన 63 మంది యాత్రికులకు వ్యాక్సినేషన్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ ఇన్చార్జి అధికారి డాక్టర్ పద్మావతి, డాక్టర్ ఉస్మాన్, డాక్టర్ రాజా, డాక్టర్ కార్తీక్ పాల్గొన్నారు. ఆ కళాశాలలపై చర్యలు తీసుకోండి: ఏబీవీపీ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వివిధ పోటీ పరీక్షలు, బెటర్మెంట్, సప్లిమెంటరీ పరీక్షల పేరుతో వేసవి సెలవుల్లో రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు ఇంటర్మీడియెట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో మంగళవారం ఆమెను కలిసి వినతిపత్రం ఇచ్చామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి తెలిపారు. ఏటా వేసవి సెలవులు ప్రకటించిన తర్వాత ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు పోటీ పరీక్షల ప్రిపరేషన్ పేరుతో రెగ్యులర్ తరగతులను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ముందుగానే అధికారులకు తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రయివేటు కళాశాలలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. వీటితో పాటుగా కార్పొరేట్ కళా శాలలు ఒకచోట గుర్తింపు పొంది అనేక చోట్ల కాలేజీలు నిర్వహిస్తున్నాయని వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిషత్ రాష్ట్ర కార్య సమితి సభ్యులు దుర్గారావు, శ్యామ్, మోజేస్, చరణ్ వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. కిశోర బాలికల సమగ్రాభివృద్ధికి చర్యలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు నగరంలోని ఓ హోటల్లో కిశోర బాలల ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్లు ఎం.శిరీష, బి.మనోరంజని పాల్గొన్నారు. మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు కిశోర బాలికలకు వేసవి సెలవుల్లో నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలపై కుమారి మేరీ జోన్స్, యునిసెఫ్ టీం సభ్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. బాల్య వివాహాలు, రుతుక్రమ పరిశుభ్రత, బాలల హక్కులు, పోషణ, ఆరోగ్యం, లింగ సమానత్వం, విద్య ఆవశ్యకత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై వివరించారు. కిశోర వికాసంపై గ్రామస్థాయిలో నిర్వహించాల్సిన ప్రణాళికపై జిల్లాల వారీగా కార్యాచరణ నివేదికను రూపొందించారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి ,శిశు సంక్షేమ శాఖ అడిషనల్ అధికారి ఎస్.నాగ శైలజ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారత అధికార్లు డి.శ్రీలక్ష్మి, ఎం.ఎస్ రాణి తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ బైక్ దొంగలు ముగ్గురు అరెస్టు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎలక్ట్రిక్ బైక్‌లను చోరీ చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద 22 ఎలక్ట్రిక్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ ఏసీపీ కె.దామోదర్ తెలిపారు. స్థానిక మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఆయన సోమవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఏసీపీ దామోదర్ కథనం మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎస్కే బాషా (35), ఉండికి చెందిన జక్కంశెట్టి దుర్గాప్రసాద్ (26), విజయవాడ వాంబేకాలనీకు చెందిన సయ్యద్ యూసఫ్ (28) స్నేహితులు. కారు డ్రైవర్‌గా పనిచేసే బాషా వచ్చే ఆదాయం సరిపోక ఎలక్ట్రిక్ బైక్ రిపేరింగ్ నేర్చుకుని మెకానిక్ షాపు పెట్టుకున్నాడు. అందులోనూ ఆదాయం అంతంత మాత్రంగా ఉండటంతో తాను నేర్చుకున్న విద్యను ఉపయోగించి ఎలక్ట్రిక్ బైక్‌లకు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకు న్నదే తడవుగా తన స్నేహితులైన దుర్గాప్రసాద్, యూసఫ్‌తో కలిసి చోరీలు ప్రారంభించారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, కై కలూరు, తాడేపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో 22 వాహనాలను చోరీ చేశారు. మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ బైక్‌ల చోరీపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. స్పందించిన పోలీసులు పోలీసు కమిషనర్ ఆదేశానుసారం ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో మాచవరం ఇన్స్పెక్టర్ సీహెచ్.ప్రకాష్ తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎలక్ట్రికల్ బైక్‌ల చోరీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నెల 21వ తేదీన మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు ఎలక్ట్రికల్ ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ విచారణలో వారు చేస్తున్న ఎలక్ట్రిక్ బైక్‌ల చోరీల విషయం బయటపడింది. వారు దొంగిలించిన 22 ద్విచక్రవాహనాలను పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం ఇన్స్పెక్టర్ సీహెచ్ ప్రకాష్, ఎస్ఐ ఎ.వి.శ్రీనివాస్, పోలీస్ కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు. రూ.10 లక్షల విలువైన 22 వాహనాలు స్వాధీనం -
మొక్కజొన్నకు ఆధరణ కరువు
కంకిపాడు: మొక్కజొన్న రైతులను ఆదుకోవటంలో కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు దక్కటం లేదు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా మార్కెట్లో ధర పతనం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలను తెరిపించి మద్దతు ధర దక్కేలా చర్యలు చేపట్టాల్సిన సర్కారు మీనమేషాలు లెక్కించటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రోజుకో విధంగా వాతావరణ పరిస్థితులు మార్పు చెందుతుండటంతో రైతుల్లో ఆందోళన అధికమవుతోంది. 11,875 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో 11,875 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు జరిగింది. 20 రోజులుగా మొక్కజొన్న కోతలు జరుగుతున్నాయి. కండెలు ఎండబెట్టి, యంత్రాలతో గింజ వేరు చేసి కల్లాల్లో ఎండబెడుతున్నారు. గింజ వేరు చేయటం, ఎండబెట్టే పనుల్లో రైతులు, కూలీలు నిమగ్నమయ్యారు. ఎకరాకు కౌలు రూ.12 వేలు, పెట్టుబడులు కింద రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకూ రైతులు పెట్టుబడులు పెట్టారు. ఎకరాకు మాగాణి పొలాల్లో 35, మెట్ట పొలాల్లో 45 నుంచి 50 బస్తాల వరకూ దిగుబడులు వస్తున్నాయి. దళారుల సిండికేట్ మాయ పంట చేతికి వచ్చి మార్కెట్‌కు తరలించేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. పంట రాక ముందు క్వింటా ధర రూ.2400 వరకు పలికింది. ప్రస్తుతం రూ.2 వేలకు మించి పలకటం లేదు. దళారులు అంతా సిండికేటై ధర నిర్ణయం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆశించిన ధర దక్కటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ.2,225గా నిర్ణయించింది. ఆ ధర కూడా చేతికి అందకపోవటంతో ఆర్థికంగా నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అకాల వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు కారణంగా ఎప్పుడెలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం రైతులను వణికిస్తోంది. మూడు ఎకరాల్లో మొక్కజొన్న కౌలు చేశాను. పంట చేతికొ చ్చింది. కంకిపాడు యార్డులో ఆరబెడుతున్నాం. మార్కెట్లో గిట్టుబాటు రేటు లేదు. కొనుగోలు కేంద్రం తెరిస్తే మొక్కజొన్న పంట విక్రయించాలని అనుకుంటున్నాం. కేంద్రం ఎప్పుడు తెరుస్తారో? ఏమో? అర్థం కావటం లేదు. – గడ్డం రాజా, కౌలురైతు, గొడవర్రు, కంకిపాడు మండలం నేను మూడు ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేశాను. మాగాణిలో 30 నుంచి 35 బస్తాలు, మెట్టలో 45 బస్తాల పైగా దిగుబడులు వస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు మార్కెట్లో ధరకు పొంతన లేదు. క్వింటా ధర రూ.2 వేలకు మించి పలకటం లేదు. బయటి వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. – కాటూరి శివప్రసాద్, కౌలురైతు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు మండలం వైఎస్సార్ సీపీ పాలనలో రైతులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి భరోసా అందించింది. రబీ సీజన్లో కురిసిన అకాల వర్షాలతో పంట దెబ్బతిని నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకూ క్వింటా రూ.1600 మాత్రమే ధర పలికి ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి. ఆ స్థితిలో యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను తెరిచి కొనుగోళ్ల విషయంలో నిబంధనలు సడలించి మొక్కజొన్న కొనుగోళ్లు సాగేలా నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవ టంతో రైతులకు ఊరట చేకూరిన విషయం విదితమే. కొనుగోలు కేంద్రాలపై స్పష్టత ఇవ్వని సర్కారు మొక్కజొన్న పంటకు దక్కని మద్దతు ధర వాతావరణ మార్పులతో రైతుల్లో ఆందోళన రైతుల శ్రమను నిలువునా దోచేస్తున్న వ్యాపారులు జాడలేని కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారో? ఏమో? రూ.2 వేలకు మించడం లేదు నాడు రైతులకు అండగా.. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు మద్దతు ధర కంటే తక్కువకే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రైతులు నష్టపో కుండా చూడాల్సిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. దళారుల చెర నుంచి రైతులను ఒడ్డున వేసేందుకు సాగు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కానీ నేటి వరకూ కొనుగోలు కేంద్రాల ఊసు లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలు తెరిచే విషయమై స్పష్టత ఇవ్వటం లేదు. రైతు సంక్షేమాన్ని యోచించి వెన్నుదన్నుగా నిలవాల్సిన పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
మలేరియా, డెంగీ రహిత జిల్లాగా తీర్చిదిద్దండి గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను మలేరియా, డెంగీ రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ స్థాయిలో ప్రతి కుటుంబానికి దోమల వ్యాప్తిపై రూపొందించిన కర్ర పత్రాన్ని వైద్య ఆరోగ్య, సచివాలయ అధికారులు తప్పనిసరిగా అందించి అవగాహన కల్పించాలన్నారు. 2030 నాటికి దేశ వ్యాప్త మలేరియా నిర్మూలన లక్ష్యానికి ముందే మలేరియా, డెంగీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.ఈ సమావేశంలో విజయవాడ మునిసిపల్ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ జూపూడి ఉషారాణి, జిల్లా మలేరియా అధికారి మోతిబాబు, డీపీఓ పి.లావణ్య కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ బి.హనుమయ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.వి.ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. -
● క్రికెట్ క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటున్న వెబ్సైట్లు, యాప్ నిర్వాహకులు ● స్మార్ట్ ఫోన్లో బెట్టింగ్ బోర్డులు ● మ్యాచ్ చూస్తూనే వెబ్సైట్, యాప్‌లలో పందేలు ● జిల్లాలో ఊరికో బుకీ ● ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా బెట్టింగ్‌ల జోరు ● పోలీసుల అదుపులో బుకీలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: క్రికెట్ క్రేజ్ అభిమానుల ఉసురు తీసే స్థాయికి తీసుకెళ్లింది. బెట్టింగ్ భూతం అభిమానులను వెంటాడుతోంది. చివరకు అప్పులు పాలై ఆత్మహత్యలు జరుగుతున్న ఘటనలూ ఉన్నాయి. స్మార్ట్ యుగంలో బెట్టింగ్‌ను వెబ్సైట్, యాప్ నిర్వాహకులు సులభతరం చేసేశారు. ప్రత్యేక ప్రోగామింగ్తో రూపొందించుకున్న యాప్, వెబ్సైట్లను క్రికెట్ అభిమానుల అరచేతిలోకి చేర్చారు. ప్రస్తుతం పలు యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. టాస్ ప్రారంభం నుంచీ, బంతి బంతికీ, మ్యాచ్ ముగిసే వరకు బెట్టింగ్ కొనసాగుతూనే ఉంటుంది. రూ.100కు రూ.500, మ్యాచ్ స్వభావాన్ని బట్టి రూ.500కు 50,000 చెల్లింపులు అంటూ పందెపు రాయుళ్లను ఆకర్షిస్తుంటారు. నగదు లావాదేవీలకు యూపీఐ యాప్‌లను వినియోగిస్తున్నారు. రాజస్తాన్, పంజాబ్ కేంద్రంగా ఈ దందా కొనసాగు తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాడవాడలా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ భూతం వాడవాడలా విస్తరించింది. విజయవాడ నగరంలోని సీతన్నపేట, శ్రీనగర్‌కాలనీ, లోటస్, ముత్యాలంపాడు, పటమట, బావాజీపేట, కృష్ణలంక, నున్న, గన్నవరం, ప్రసాదంపాడు, కంకిపాడు, పటమట, చిన అవుటపల్లి, పెద అవుటపల్లి, ఇలా తదితర ప్రాంతాల్లో మెయిన్ బుకీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రంగంలోకి దించేదిలా... యాప్/వెబ్సైట్ నిర్వాహకులకు వీరు నేరుగా అందుబాటులో ఉంటారు. వీరి నుంచి కొందరు స్థానిక యువత యాప్/వెబ్సైట్లను ప్రాంచైజీలుగా తీసుకుని క్షేత్ర స్థాయిలోకి బెట్టింగ్‌ను విస్తరించారు. స్థానికంగా ఉన్న బుకీ ముందుగా ఆ ప్రాంతాల్లోని యువత నంబర్లను సేకరించి వాట్సాప్ చాటింగ్ ద్వారా బెట్టింగ్‌లోకి దింపుతారు. వారి వాట్సాప్‌కు యాప్/వెబ్సైట్ లింక్, యూజర్‌నేమ్, పాస్వర్డ్ పంపుతారు. లింక్ క్లిక్ చేయగానే యాప్/వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అందులోని ఆఫర్లు, మ్యాచ్ జరిగే తీరు ఆధారంగా బెట్టింగ్ జరుగుతుంటుంది. పందెం వేయాలనుకుంటే వాట్సాప్‌లో స్థానిక బుకీకి మెసేజ్ చేయాలి. అతని నుంచి ఓకే అని మెసేజ్‌తో పాటు యూపీఐ క్యూఆర్ కోడ్ పంపిస్తారు. దాన్ని స్కాన్ చేసి నగదు చెల్లించి, ఆ స్క్రీన్ షాట్ మళ్లీ వాట్సాప్ గ్రూప్‌లో అప్లోడ్ చేయగానే స్థానిక బుకీ వెబ్సైట్/యాప్‌లోని బెట్టింగ్ రాయుడి వాలెట్లో నగదు జమ చేస్తాడు. అక్కడ నుంచి బెట్టింగ్ ప్రారంభమవుతుంది. పోలీసుల అదుపులో బుకీలు ఉమ్మడి కృష్ణా , గుంటూరు, ఏలూరు జిల్లాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, విదేశాల్లో ఉండి యాప్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే విజయవాడ సీసీఎస్ క్రైం పోలీసులు పలువురిని ఆదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. లక్షకు రూ.1000 కమిషన్‌ను గ్రామాల్లో ఏజెంట్లకు ఇస్తున్నారు. కాకినాడకు చెందిన పండు రాధే ఎక్స్చేంజ్ బెట్టింగ్ యాప్ తయారు చేయించి, పలువురిని అడ్మిన్‌గా నియమించుకొని బెట్టింగ్‌ను విస్తరించారు. ఇప్పటికే పోలీసులు ప్రసాదంపాడుకు చెందిన కట్టవరపు భాను ప్రసాద్, గన్నవరం మండలం అల్లవరానికి చెందిన కె.రత్నబోసు, కంకిపాడు మండలం మంటాడకు చెందిన కొండేటి గురువెంకటదాస్, ఉంగుటూరు మండలం పెద్ద అవుటుపల్లికు చెందిన ఎస్కే సుభాని, చిన్న అవుటపల్లికి చెందిన కాకి సతీష్‌బాబు, చిల్లి అశోక్‌కు 41ఏ నోటీసులు ఇవ్వడంతో పాటు, వీరిలో కొంత మందిని అదుపులోకి తీసుకొని...బెట్టింగ్ , బెండ్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు క్రికెట్ అభిమానులు, కోట్లాది రూపాయల డబ్బును పోగొట్టుకున్నట్లు సమాచారం. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025యోగ శిక్షణ ప్రారంభం భవానీపురం: అమరావతి యోగా, ఏరోబిక్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం వేసవి ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ప్రారంభించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.60 అడుగుల వద్ద ఉంది. ఇది 139.6134 టీఎంసీలకు సమానం. అభివృద్ధి పనుల పరిశీలన ఇంద్రకీలాద్రి: దుర్గగుడిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను టెక్నికల్ బృంద సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులకు పలుసూచనలు చేశారు. 7 -
దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
విజయవాడకల్చరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. తిరుమలలో నిత్యం వివాదాలు చోటు చేసుకుంటున్నా యని, ఇది రాష్ట్రానికే అరిష్టమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో మంగళ వారం లబ్బీపేట వేంకటేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో ‘హిందూ ధర్మం.. గోమాత విశిష్టత’ అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనాథ సరస్వతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన సాధువులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సాధు సంతులపై చేస్తున్న దాడులను ఆపాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. దేవాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, తిరుమలలో నిత్యం వివాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో హిందువులు పవిత్రంగా భావించే గోవులు మరణిస్తుంటే ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని దుయ్యబట్టారు. అనంతరం సాధు శ్రీశివానంద సరస్వతి మాట్లాడుతూ.. తిరుమలలో అవనీతి రాజ్యమేలుతోందని, ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా కైంకర్యాలు జరుగుతున్నా యని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి నెలా గోవులు మరణిస్తుంటే కాకతాళీయం అంటూ కప్పిపుచ్చుతు న్నారని విమర్శించారు. మన గుడి – మన గోవు, మన ధర్మం నినాదం ఇంటింటా మారుమోగాలని సూచించారు. అవధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఆలయంలో గోవులను పెంచాలని, వాటి నిర్వహణను గోసంరక్షకులే చూసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో దయానంద సరస్వతి, పూర్ణానంద స్వామి, శివస్వామి, లక్ష్మీశివనందస్వామి, స్వామి సత్యజ్ఞానానంద, ఆత్మానంద స్వామి, సత్యనారాయణ స్వామి, ఓంకార స్వామి పాల్గొన్నారు. తిరుమలలో నిత్యం వివాదాలు సాధు సంతులపై తక్షణం దాడులను అరికట్టాలి రాష్ట్రస్థాయి సదస్సులో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు -
● అన్నదాతల బలవన్మరణం ● గిట్టుబాటు కాని పంటలు ● అందని పరిహారం ● పట్టించుకోని పాలకులు
పాలకుల భరోసా కరువై.. అప్పుల సాగు చేస్తున్న అన్నదాత బలవన్మరణం చేసుకోవాల్సి వస్తోంది. పంటలు పంటక.. గిట్టుబాటు ధర రాక.. అప్పులు తీర్చలేక రైతు ఉసురు తీసుకుంటున్నాడు. కుటుంబ పెద్దను కోల్పోయిన అన్నదాతల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అధికారుల మధ్య సమన్వయ లోపం బాధిత కుటుంబాలకు శాపంగా మారుతోంది. వీరికి పరిహారాన్ని పాలకులు సరైన సమయంలో అందజేయకపోవడంతో రైతుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల కాలంలో అన్నదాతల బలవన్మరణాలు జరుగుతున్నాయి. పండిన పంటకు ధర రాక.. ప్రభుత్వం పట్టించుకోపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పలభారం భరించలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడిన రైతులకు ప్రభుత్వం రూ. 7లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాల్సి ఉంది. ఇది సకాలంలో ఇవ్వడం లేదు. దీనికి కారణం నిబంధనలు ప్రతిబంధకంగా మారడమే. ఆత్మహత్యకు పాల్పడిన రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అన్ని అర్హతలు ఉన్నా.. కొందరు అధికారులు కొర్రీలు వేస్తున్నారు. వీఆర్వో నుంచి కమిషనర్ వరకు వివిధ స్థాయిల్లో నెలల తరబడి ఎక్స్‌గ్రేషియా అంశం పెండింగ్‌లో ఉంటోంది. వివిధ స్థాయిల్లో పెండింగ్ ఎన్టీఆర్ జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 8 మంది రైతులు, కౌలు రైతులు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదుగురు రైతుల ఎక్స్‌గ్రేషియా ఫైల్స్ వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మరో ముగ్గురు రైతులకు సంబం ధించి వీఆర్వో, తహసీల్దార్ స్థాయిలోనే ఎటూ తేలకుండా నిలిచిపోయి ఉన్నాయి. పంచనామా, పోస్టుమార్టం వంటి ప్రక్రియలు పూర్తైనా ఎక్స్‌గ్రేషియా ఫైల్ ముందుకు కదలడం లేదు. వత్సవాయి మండలం భీమవరానికి చెందిన పిట్టంపల్లి కోటయ్య, కొత్త వేమవరానికి చెందిన కస్తూరి గోపి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఫైల్స్ ఏ దశలో ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. అన్నదాత సుఖీభవ ఏమైంది..? అధికారంలోకి రాగానే రైతులకు ఏటా రూ. 20వేలు పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్న రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యవసాయ సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లు ముగిశాయి. కానీ అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న పెట్టుబడి సాయం ఏమైందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఊసే లేదు. మరింత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడకముందే ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తోంది చిట్టిబొమ్మ చిన్ని కృష్ణ, ఊరు గంపలగూడెం మండలం అనుముల్లంక. ఇతనికి 1.80 ఎకరాలు సొంత భూమి ఉంది. దీనితోపాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని ఆ భూమిలో మిర్చి సాగు చేశాడు. పెట్టుబడులు, ఎరువులు పురుగు మందుల కోసం వేర్వేరు చోట్ల రూ.20లక్షలు అప్పు చేశాడు. సొంత భూమిని తనఖాపెట్టి మరికొంత అప్పు తెచ్చాడు. పంటల్లో పూర్తిగా నష్టం వచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. నిత్యం తన అప్పులు ఎలా తీరుతాయంటూ కుటుంబ సభ్యుల వద్ద బాధపడుతూ పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఆ కుటుంబం పరిహారం కోసం ఎదురు చూస్తోంది. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు పిట్టంపల్లి కోటయ్య. వత్సవాయి మండలం భీమవరంలో కౌలు రైతు. గ్రామంలో దేవదాయ శాఖకు చెందిన మూడున్నర ఎకరాలు, రైతుల నుంచి మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తిపంటలు సాగు చేశాడు. కౌలు, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. దిగుబడులు తగ్గిపోయాయి. అప్పులు కుప్పయ్యాయి. కుటుంబ పోషణ భారంగా మారింది. మానసికంగా కుంగి పోయాడు. లెక్కలు చూసుకోగా రూ.10 లక్షల అప్పు తేలింది. వాటిని తీర్చే మార్గం లేక తాను కౌలుకు చేస్తున్న పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని కుటుంబం రోడ్డున పడింది. ఆ కుటుంబం ప్రభుత్వం అందించే పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. భార్య త్రివేణి, కుమారుడు బాలకృష్ణ, కుమార్తె సాత్విక కోటయ్యను తలచుకొని విలపిస్తున్నారు. భర్త మరణంతో దిక్కుతోచని స్థితిలో త్రివేణి కూలి పనులకు వెళుతూ పిల్లను ప్రభుత్వ బడిలో చేర్చింది. అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. తనను ఆదుకోవాలంటూ గత నెలలో పీజీఆర్ఎస్లో కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంది. ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి రైతు ఆత్మ హత్యకు పాల్పడితే పంచనామా రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. జాప్యం చేయకుండా నెల వ్యవధిలోనే అందజేయాలి. అప్పుడే బాధితులపై అప్పుల వాళ్ల వత్తిడి తగ్గుతుంది. శాఖల మధ్య సమన్వయం ఉండాలి. – పి.జమలయ్య, కౌలు రైతు సంఘందిక్కు తోచని స్థితిలో ఎక్స్‌గ్రేషియా పెండింగ్.... ఆత్మహత్య చేసుకున్న రైతులు ఏ దశలో పెండింగ్ గుడిపాటి నాగభూషణం చందర్లపాడు మండలం, కొడవటికల్లు కమిషనర్ స్థాయిలో పసుపులేటి పూర్ణచంద్రరావు వెలది కొత్తపాలెం కమిషనర్ స్థాయిలో చిట్టిబొమ్మ చిన్ని కృష్ణ, అనుముల్లంక, గంపలగూడెం తహసీల్దార్ స్థాయిలో మార్తి తిరుపతిరావు షేర్ మహ్మద్ పేట, జగ్గయ్యపేట తహసీల్దార్ స్థాయిలో నల్లమట్టి రాంబాబు జయంతిపురం, జగ్గయ్యపేట ఆర్డీఓ స్థాయిలో -
ముగ్గురు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులు ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డును అందుకున్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్‌తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందే డ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన దెందులూరు ఆపరేటింగ్ విభాగంలోని స్టేషన్ సూపరింటెండెంట్ టి.వి.ఎం.యూ మహేశ్వర్, రాజమండ్రి ఆపరేటింగ్ విభాగంలోని పాయింట్ మెన్ కె.నథానియేల్, రాజమండ్రిలోని ట్రైన్ మేనేజర్ లోకేష్‌కుమార్‌లకు జీఎం అరుణ్‌కుమార్ జైన్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. -
అంతా.. గప్‌చుప్
● విజయవాడ కేంద్రంగా యానిమేషన్ స్కాం.. బాధితుల్లో నరసరావుపేట వాసులే అధికం ● ఒక్కొక్కరి వద్ద రూ.కోట్లు వసూలు చేసిన స్కామర్ కిరణ్ ● కనీసం కార్యాలయ సీల్, అడ్రస్ కూడా లేకుండా అగ్రిమెంట్ కాగితాలు జారీ ● న్యాయపరంగా వెళ్లాలంటే చెల్లవేమోనన్న భయం ● పెట్టుబడి పెట్టింది బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదుకు అవకాశం లేదంటూ వాపోతున్న వైనం ● అధిక వడ్డీల ఆశతో గుల్లవుతున్న ప్రజలు సాక్షి, నరసరావుపేట / నరసరావుపేట టౌన్: సాధారణంగా రూ.వెయ్యి పోతే.. పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీసి ఫిర్యాదు చేస్తాం. దొంగతనం చేసింది ఎవరో తెలిస్తే వెంటనే అతన్ని పట్టుకొని నగదు రికవరీకి ప్రయత్నిస్తాం. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.400 కోట్లకు పైగా మోసం చేసిన వాడు ఎవడో తెలుసు.. అయినా ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు అందడం లేదు. బాధితుల సంఖ్య సుమారు వందల్లో ఉన్నా ఒక్కరూ ముందుకు రాకపోతే తామేమి చేయలేమని పోలీసులు చేతులెత్తుస్తున్నారు. ఇది యానిమేషన్ స్కాం ఉదంతంలో బాధితులు తీరు. విజయవాడ కేంద్రంగా యానిమేషన్ ప్రోగ్రామింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన కిరణ్ ఆర్థిక నేరానికి తెర తీశాడు. రాష్ట్రవ్యాప్తంగా రూ.వందల కోట్ల వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఇతని బాధితుల్లో నరసరావుపేట వాసులు అధికంగా ఉన్నారు. పెట్టిన పెట్టుబడికి అధిక శాతం వడ్డీ ఆశ చూపడంతో అనేకమంది స్తోమతకు మించి అప్పులు చేసి మరీ భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం కిరణ్ మోసం చేసి పరారవడంతో బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సీల్ కూడా లేని అగ్రిమెంట్ కాపీలు... రూ.లక్ష పెట్టుబడి పెట్టే సమయంలో సైతం ఇరువర్గాల మధ్య జరిగే అగ్రిమెంట్లు చాలా పక్కాగా ఉండేలా చూస్తారు. అలాంటిది పదుల కోట్ల రూపాయాలను యానిమేషన్ కంపెనీలో పెట్టుబడి పెట్టినా సరైనా పత్రం బాధితుల వద్ద ఒక్కటీ లేదంటే స్కాం ఎంత పక్కాగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీ పేరుతో పెట్టుబడిదారులకు జారీ చేసిన ఒప్పంద పత్రాలలో ఎక్కడా కంపెనీ పర్మినెంట్ అడ్రస్ లేదు. విజయవాడలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయాన్ని నెల రోజుల క్రితం ఖాళీ చేయడంతో బాధితులకు ఎక్కడికిపోవాలో కూడా పాలుపోవడం లేదు. మరోవైపు అగ్రిమెంట్ కాపీలో పెట్టుబడులు స్వీకరించే కంపెనీ సీలు ఉండటం రివాజు. అయితే యానిమేషన్ కంపెనీ జారీ చేసిన అగ్రిమెంట్లలో ‘ఓకే’ అన్న అక్షరాలతో మాత్రమే సీల్ వేసి స్కామర్ కిరణ్ సంతకం చేసిన పత్రాలను జారీ చేశారు. రూ.వందల కోట్ల విలువైన కంపెనీకి సీల్ కూడా లేకపోవడం ఏంటని ప్రశ్నించలేదంటే బాధితులు అధిక వడ్డీలకు ఆశపడి ఎలా మోసపోయారో అర్థమవుతోంది. స్పందించని ప్రభుత్వం రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోటు ఆర్థిక నేరాలు వెలుగుచూస్తున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాఽధితులకు న్యాయం చేయకపోగా నిందితులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఇటీవల సాయిసాధన చిట్‌ఫండ్ స్కాం బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ. 3.02 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 18 రోజులకుగాను రూ. 3,02,92,986 నగదు, 440 గ్రాముల బంగారం, 5.225 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. లెక్కింపును ఈవో పర్యవేక్షించారు. దేశంలో రాజ్యాంగానికి ముప్పు పెనమలూరు: దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పోరంకి విజ్ఞాన భారత్ పాఠశాలలో సోమవారం అబ్దుల్ కలాం స్టడీ సర్కిల్ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వాహకుడు అమరయ్యశాస్త్రి అధ్యక్షతన.. ‘భారత రాజ్యాంగం నేడు ఎదుర్కొంటున్న సవాళు’్ల అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొలీజియం కమిటీ దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అనేక మతాలకు, జాతులకు, కులాలకు దేశ సమైక్యత విధానాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు. అయితే దేశంలో నేటి రాజకీయ పరిస్థితుల కారణంగా రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ సైతం నాయకుల చేతిలో సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. విజ్ఞాన్ భారత్ పాఠశాల కరస్పాండెంట్ ప్రొఫెసర్ కొడాలి రామశేషాద్రిరావు తదితరులు పాల్గొన్నారు. ‘మా పాఠశాలను తరలించొద్దు సారూ!’వక్కపట్లవారిపాలెం(నాగాయలంక): మండలంలోని వక్కపట్లవారిపాలెం శివారు బ్రహ్మానందపురం పాఠశాలను గ్రామానికి దూరంగా తరలించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వేడుకున్నారు. మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తమ ఇబ్బందులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా పంచాయతీ పరిధిలో రెండు కిలోమీటర్ల దూరంలోని వక్కపట్లవారిపాలెం పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టారని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహేతుకం కాదని వాపోయారు. బ్రహ్మానందపురంలో నివసించే వారంతా షెడ్యూల్ కులానికి చెందినవారని, ఇక్కడి పాఠశాలలో 45 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్న చిన్న పిల్లలని, వీరంతా రెండు కిలోమీటర్ల దూరం ఎలా నడిచి వెళ్తారని ప్రశ్నించారు. మార్గ మధ్యలో అవనిగడ్డ–నాగాయలంక, భావదేవరపల్లి ప్రధాన రహదారులు ఉన్నాయని ఈ రహదారులు ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీతో ఉంటాయని, చిన్నపిల్లలు ఆ రోడ్ల వెంట ఎలా వెళ్లగలరని అన్నారు. పాఠశాలను తరలించే ప్రయత్నం విరమించకపోతే నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని 30 మందికి పైగా గ్రామస్తులు బందరు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రతి కార్డుదారుడికీ ఈ–కేవైసీ తప్పనిసరి చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందేందుకు రేషన్‌కార్డులోని ప్రతి ఒక్క సభ్యుడు ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ తెలిపారు. సోమవారం నాటికి జిల్లాలో 71,110 మంది సభ్యులు ఇంకా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ లబ్ధిదారుల వివరాలు రేషన్ షాపు డీలరు వద్ద, పౌరసరఫరాల డెప్యూటీ తహసీల్దార్ వద్ద, పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి, డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా చేసుకోవచ్చన్నారు. -
‘అప్పులు సాకుగా చూపి పథకాలు ఎగ్గొట్టేందుకు కుట్ర’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అప్పులు సాకుగా చూపి సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి పి.ప్రసాద్ అన్నారు. సంపద సృష్టించి సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టి 11 నెలలు కావొస్తున్నా ఏ ఒక్క పథకం అమలు చేయలేదన్నారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే నవరత్నాలకు మించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర వర్గాలకు 176 అడ్డగోలు హామీలిచ్చిందన్నారు. అప్పుల పేరుతో ఈ పథకాల ఎగవేతకు పథకం పన్నడం ప్రజాద్రోహమని విమర్శించారు. క్విడ్ ప్రోకోగా.. రైతులకు ఇచ్చిన హామీల్ని వదిలి భారీ భూములను క్విడ్ ప్రొకోగా కంపెనీలకు కట్టబెడుతున్నారని గుర్తు చేశారు. ప్రజలు ఏమీ చేయరని చంద్రబాబు భావిస్తే.. ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దూరంలోనే లేదని ప్రసాద్ హెచ్చరించారు. పార్టీ నగర కార్యదర్శి పి.పద్మ, ఇఫ్టూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముని శంకర్, దాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని, జవాబుదారీతనంతో సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఎండలను సైతం లెక్కచేయక సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సమస్యలపై అర్జీలను సమర్పిస్తున్నారన్నారు. జవాబుదారీతనంతో అర్జీలను పరిష్కరించాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్జీల వివరాలు ఇవి.. రెవెన్యూ శాఖకు సంబంధించి 63 అర్జీలు రాగా.. పోలీస్ శాఖకు 26, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 14, సర్వే 8, విద్య 7, ఉపాధి కల్పన 6, పంచాయతీరాజ్ 4, వైద్య 4, విద్యుత్ 3, జలవనరులు 3, ఆర్డబ్ల్యూఎస్ 3, బీసీ వెల్ఫేర్ 3, పౌరసరఫరాలు 3, దేవదాయ 2, మార్కెటింగ్ 2, రిజిస్ట్రేషన్ 2, హౌసింగ్, స్కిల్ డెవలప్మెంట్, విభిన్న ప్రతిభావంతులు, ఎకై ్సజ్, మెప్మా, వ్యవసాయం, కోఆపరేటివ్, కార్మిక శాఖలకు సంబంధించిన ఒక్కొక్క అర్జీతో కలిపి మొత్తం 162 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి పాల్గొన్నారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. ● ఇంటర్మీడియెట్ విద్య పెన్షనర్లకు 2018 నుంచి రావాల్సిన డీఆర్ ఏరియర్స్, 11వ పీఆర్సీ ఏరియర్స్ తక్షణమే విడుదల చేయాలని, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు మీద అన్ని ఆస్పత్రుల్లో అన్ని వ్యాధులకు వైద్య సేవలు అందించాలని, 12వ పీఆర్సీ కమిషనర్‌ను నియమించాలని కోరుతూ పలువురు పెన్షనర్లు అర్జీ సమర్పించారు. ● బీసెంట్‌రోడ్డులో చిరువ్యాపారాలు చేసుకునే వారిని ఇటీవల కొంత కాలం నుంచి అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారు. దీంతో హాకర్స్ అండ్ తోపుడు బండ్ల యూనియన్ ప్రతినిధులు, సీఐటీయూ నాయకుడు దోనేపూడి కాశీనాథ్ కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. తాము 50 ఏళ్లుగా బీసెంట్ రోడ్డులో చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని.. కొందరికి కార్పొరేషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిందని.. దీంతో తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. పీజీఆర్ఎస్లో కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి 162 అర్జీలు స్వీకరణ -
యానిమేషన్ స్కాంలో రూ. కోట్లు పోతున్నా ఫిర్యాదుకు వెనకడుగు
న్యాయపరంగా నిలుస్తాయా..? ఎటువంటి ఆధారాలులేని పత్రాలను పట్టుకొని ఏ కోర్టు మెట్లు ఎక్కినా ఉపయోగం లేదన్న భావన బాధితుల్లో నెలకొంది. దీంతో పాటు లెక్కల్లో చూపని బ్లాక్‌మనీ అధిక మొత్తంలో ఉండటంతో ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనకడుగు వేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినవారికి ఒత్తిళ్లు అధికమయ్యాయి. యానిమేషన్లో పెట్టిన డబ్బులు తిరిగిరావని భావించిన బాధితులు ఉన్న ఆస్తులను అమ్మి తెచ్చిన అప్పులను తీర్చే పనిలో ఉన్నారు. మరికొంత మంది ఉన్న ఆస్తుల కంటే అప్పులు అధికంగా ఉండటంతో ఐపీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. -
పెద్దాస్పత్రిపై పగ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య రంగంపై కూటమి ప్రభుత్వ వివక్ష కొనసాగుతోంది. వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రిలో అదనపు భవనాల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి చేసుకున్న భవనాలకు పదినెలలుగా అతీగతీ లేకుండా పోయింది. దీంతో అవి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. రోగులకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అదనపు భవన నిర్మాణాలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం మోకాలడ్డటంతో నిలిచిపోయాయి. నిలిచిన క్యాజువాలిటీ నిర్మాణం.. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అత్యాధునిక క్యాజువాలిటీ బ్లాక్ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక్కో బ్లాక్ 2వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించేందుకు రెండేళ్ల కిందట పనులు ప్రారంభించింది. అందులో అత్యవసర చికిత్స విభాగంతో పాటు, ట్రామాకేర్, ఏఎంసీ, అత్యవసర నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది అందుబాటులోకి వస్తే అత్యవసర వైద్యం అవసరమైన వారికి సత్వరమే సేవలు అందుతాయని అంతా భావించారు. ఇప్పటికే 50శాతం పైగా నిర్మాణం పూర్తికాగా.. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పది నెలలుగా పనులు నిలిచిపోయాయి. పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు చేపట్టిన నిర్మాణం నిలిపి వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య కళాశాల భవనాలపైనా.. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలకు 2023–24 విద్యా సంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు వంద వరకూ పెరిగాయి. పెరిగిన సీట్లకు అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు సైతం మంజూరయ్యాయి. ఆ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కింద మరిన్ని నిధులు కేటాయించి దాదాపు రూ.90 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టారు. అదనపు తరగతి గదులతో పాటు, లెక్చర్ హాల్స్, లేబొరేటరీ వంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. 2024 జూన్ నాటికే 50 శాతం పైగా పనులు పూర్తి కాగా ప్రస్తుతం నత్త నడకన నడుస్తున్నాయి. అవి పూర్తి అయితే కాని విద్యార్థులకు సదుపాయాలకు అందుబాటులోకి వస్తాయి.విజయవాడ ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో నిలిచిపోయిన నిర్మాణ పనులు ఆస్పత్రిలో ఆగిన అభివృద్ధి పది నెలలుగా ముందుకు సాగని నిర్మాణాలు నిలిచిన కొత్త క్యాజువాలిటీ భవనం పనులు నత్త నడకన సాగుతున్న వైద్య కళాశాలలో అదనపు గదుల నిర్మాణం వైద్య రంగంపై వివక్ష తగదు.. కూటమి ప్రభుత్వం వైద్య రంగంపై వివక్ష చూపడం తగదు. విజయవాడ ఆస్పత్రి, వైద్య కళాశాలలో నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి. రోగులు, వైద్య విద్యార్థుల అవసరాల కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేసి, భవనాలు అందుబాటులోకి తీసుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు వైద్యశిబిరాలు
పెనమలూరు: మహిళా పోలీసుల ఆరోగ్య రక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు అన్నారు. కానూరు టాప్‌స్టార్ ఆస్పత్రిలో సోమవారం క్యాన్సర్‌పై అవగాహన, మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. మహిళా పోలీసులు పని ఒత్తిడిలో ఉండి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుందన్నారు. మహిళా పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధుల నిర్వహణ సక్రమంగా జరుగుతుందని, వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకోని క్యాన్సర్‌పై అవగాహన, ఉచిత వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే సులభంగా జయించవచ్చన్నారు. ఎన్టీఆర్ జిల్లా సురక్ష ఫౌండేషన్ కన్వీనర్ కేవీ నరసమయ్య మాట్లాడుతూ.. మహిళా పోలీసులతో పాటు ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతకు మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తాను డొనేట్ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీపీ సరిత, టాప్‌స్టార్ ఎండీ తాతినేని శ్రీనివాస్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ఆంధ్రా హాస్పిటల్లో ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ క్యాంప్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) ఉచిత వ్యాక్సినేషన్ క్యాంప్ సినీహీరో మహేష్‌బాబు సహకారంతో ఆంధ్రా హాస్పిటల్లో ప్రారంభమైంది. ఈ క్యాంప్‌ను సోమవారం ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు, ఫీటల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ పాతూరి పద్మలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్‌బాబు ఫౌండేషన్ సహకారంతో తమ ఆస్పత్రిలో తొమ్మిదేళ్ల నుంచి 45 సంవత్సరాల లోపు మహిళలకు మూడు డోసులను ఉచితంగా ఇస్తామన్నారు. ఈ వ్యాక్సిన్ మూడు డోసులు రూ.6 వేలుగా పేర్కొన్నారు. మహేష్‌బాబు ఫౌండేషన్ రూ.40 లక్షల సహకారంతో ఈ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఈ హెచ్‌పీవీ వ్యాక్సిన్ దోహదపడుతుందని వైద్యులు రామారావు, పద్మ తెలిపారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లా కేసరపల్లికి చెందిన భక్తులు సోమవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. కేసరపల్లికి చెందిన బి.నీలిమ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,04,893ల విరాళాన్ని అందించారు. నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు.. విజయవాడకు చెందిన భక్తులు నిత్యాన్నదానానికి, బంగారు తాపడం పనులకు వేర్వేరుగా విరాళాలను అందజేశారు. విజయవాడ మాచవరానికి చెందిన అట్లూరి రామ్మోహన్రావు, సువర్ణ దంపతులు నిత్యాన్నదానానికి రూ.లక్ష, బంగారు తాపడం పనులకు రూ.లక్ష విరాళాన్ని అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
బండెనక బండి కట్టి..
కంచికచర్ల: బడే హజరత్ ఉరుసును ప్రతి ఏడాది ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. మండలంలోని పెండ్యాలతో పాటు ఇతర గ్రామాల నుంచి చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో కొలువై ఉన్న బడే హజరత్ దర్గా ఉరుసుకు తరలివెళ్తుంటారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ముస్లింలు బండెనెక బండికట్టి వరసగా ఉత్సవాలకు తరలివెళ్తారు. 400 ఏళ్లుగా ఉత్సవాల నిర్వహణ.. ఉరుసు ఉత్సవాలను మతాలకతీతంగా జరుపుకుంటారు. ముస్లింలు ఉరుసుకు వెళ్లేందుకు హిందువులు ఎద్దుల బండ్లను ఉచితంగా కట్టి వారితో పాటు ఉత్సవాల్లో పాల్గొంటారు. బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట, వినుకొండ, గుంటూరు, కృష్ణాజిల్లాలోని చల్లపల్లి, అవనిగడ్డ, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, వైరా, మధిర, సూర్యాపేట తదితర ప్రాంతాల నుంచి పెండ్యాల గ్రామానికి చెందిన ముస్లింలకు ఉచితంగా ఎడ్ల బండ్లను కడతారు. ఉరుసు ఉత్సవాల్లో వారు కూడా వచ్చి పాల్గొంటారు. 400 ఏళ్ల నుంచి ముస్లింలు ఈ ఉత్సవాల్లో పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పెండ్యాల గ్రామానికి చెందిన ముస్లిం సంతతికి చెందిన వారంతా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలు చందర్లపాడు మండలంలోని తోటరావులపాడు గ్రామంలో కొలువై ఉన్న బడేమియా తాతయ్య షాషమియాను ప్రార్థించి అక్కడ నుంచి సాయంత్రానికి తుర్లపాడు చెరువులో ఉన్న బడేమియా హజరత్ దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. గ్రామంలో ఇళ్లకు తాళాలు వేసి.. తుర్లపాడులో కొలువై ఉన్న బడే హజరత్ ఉరుసు ఉత్సవాలు ఈ నెల 23, 24 తేదీలలో జరుగనుంది. గ్రామంలో మొత్తం జనాభా 14 వేల మంది ఉన్నారు. వారిలో 12 వేలకు పైగా ముస్లింలు ఉన్నారు. ఊరంతా రెండు రోజుల పాటు తుర్లపాడు వెళ్లేందుకు ఇళ్లకు తాళాలు వేస్తారు. వృద్ధులు నడవలేనివారు ఇళ్లకు కాపలా ఉంటారు. ఉరుసు ఉత్సవాలకు తరలి వెళ్తున్న ఎద్దుల సవారీలను చూసేందుకు పెండ్యాల మునేటి తీరాన ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. రేపటి నుంచి తుర్లపాడు ఉరుసు బడే హజరత్ ఉరుసుకు తరలివెళ్లనున్న ముస్లింలు హిందువులు, ముస్లింలు ఐక్యంగా జరుపుకునే తుర్లపాడు పండుగ కులమతాలకతీతంగా ఉరుసు తుర్లపాడు ఉరుసు ఉత్సవాలకు కులమతాలకు అతీతంగా జరుపుకుంటాం. హిందువులు ఎడ్ల బండ్లను ఉచితంగా కడతారు. హిందువులు భక్తి పారవశ్యంతో పాల్గొంటారు. రెండు రోజుల పాటు జరుపుకునే ఉరుసు ఉత్సవాలను ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. – షేక్ మలక్‌బషీర్, ఎంపీపీ, పెండ్యాల -
విజయవాడ చిల్ట్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ సంఘం ఎన్నిక
మధురానగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం ఏకగ్రీవమైంది. ముత్యాలంపాడులోని అజయ్ స్కూల్లో ఎన్నిక జరిగింది. 2025–26 సంవత్సరానికి నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా ముదిగొండ శ్రీహరి, కార్యదర్శిగా భీమిశెట్టి గణేష్, కోశాధికారిగా పుప్పాల శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికై న కార్యవర్గ సభ్యులతో సంఘ గౌరవాధ్యక్షుడు దేవినేని కిశోర్‌కుమార్, ఏపుగంటి సాయి కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. -
జాతి వైరం మరిచి.. స్నేహం చిగురించి..
కుక్క, పిల్లి మధ్య సహజంగానే జాతి వైరం ఉంటుంది. పిల్లి కనిపించిందంటే కుక్క ఒక్క ఉదుటున దాడి చేస్తుంది. కుక్క కనిపిస్తే పిల్లి వెంటనే తన దారి మార్చుకుంటుంది. అయితే విజయవాడ ఏలూరు రోడ్డు సమీపంలో ఓ కుక్క, పిల్లి మధ్య స్నేహం చిగురించింది. రెండూ ఆడుకుంటూ, సరదాగా ఆట పట్టించుకుంటూ సందడి చేస్తున్నాయి. స్థానికులు వాటి సరదా చేష్టలు చూసి ముచ్చట పడుతున్నారు. ఆదివారం కుక్క, పిల్లి ఆడుకుంటూ ఇలా ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
కార్తికేయుని ఆలయంలో భక్తజన సందడి
మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తులతో క్యూలు సందడిగా మారాయి. అన్నప్రసాదం ప్రాంగణం వద్ద భక్తులు బారులు తీరి కనిపించారు. డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోశాల రోడ్డు అభివృద్ధి పనులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహా మండపం నుంచి కనకదుర్గనగర్ వరకు ఉన్న గోశాల రోడ్డు అభివృద్ధి పనులకు ఆదివారం దుర్గగుడి ఈవో కె.రామచంద్రమోహన్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహా మండపం ఎదుట ఏర్పాటు చేసిన అమ్మవారి చిత్రపటం వద్ద పూజలు చేసిన తర్వాత పనులను ప్రారంభించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మరిన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. సకాలంలో రోడ్డు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఈఈ వైకుంఠరావు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్‌లో షణ్ముఖ్ సత్తా విజయవాడస్పోర్ట్స్: కేంద్రీయ విద్యాలయం రీజనల్ అంతరాష్ట్ర టేబుల్ టెన్నిస్ పోటీల్లో విజయవాడ క్రీడాకారుడు ఆర్.షణ్ముఖ్ సత్తా చాటాడు. ప్రకాశం జిల్లా రాజంపల్లిలో ఇటీవల జరిగిన పోటీల్లో అండర్–17 బాలుర విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 39 కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు తలపడ్డారు. నగరంలోని మధురానగర్ కేంద్రీయ విద్యాలయం–1లో షణ్ముఖ్ పదో తరగతి చదువుతున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీల్లో బంగారు పతకం సాధించిన షణ్ముఖ్‌ను, అతనికి శిక్షణ ఇచ్చిన కోచ్ షేక్ గౌస్‌బాషా, షేక్ అబ్దుల్‌ను ఏపీ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.విశ్వనాథ్, సంయుక్త కార్యదర్శి బి.శ్రీనివాస్ అభినందించారు. సాఫ్ట్‌బాల్ విజేత ఏజీ అండ్ ఎస్జీ జట్టు పెనమలూరు: కృష్ణా యూనివర్సిటీ సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఏజీ అండ్ ఎస్జీ కాలేజీ విజేతగా నిలిచింది. తాడిగడప మున్సిపాలిటీ పోరంకి కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఆదివారం కృష్ణా యూనివర్సిటీ ఇంటర్‌కాలేజీ సాఫ్ట్‌బాల్ పోటీలు జరిగాయి. ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్జీ కాలేజీ ప్రథమ స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ, తృతీయ స్థానంలో ఆంధ్ర లయోల కాలేజీ, నాలుగో స్థానంలో ఎస్ఆర్ఆర్ ఆండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ నిలిచాయి. విజేత జట్టుకు రెక్టర్ ప్రొఫెసర్ మండల బసవేశ్వరరావు, టీడీపీ నేత అనుమోలు ప్రభాకరరావు బహుమతీ ప్రదానం చేశారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వినయ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ భూలక్ష్మి, సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ ఆర్.రఘురామ్, చంద్రబాబు పాల్గొన్నారు. -
చలసానిపై నిరాధార ఆరోపణలు తగదు
కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యులు హనుమాన్‌జంక్షన్ రూరల్: కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులుపై అజ్ఞాత మహిళ నిరాధారమైన లైంగిక ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని ఆ యూనియన్ పాలకవర్గ సభ్యులు ఉయ్యూరు అంజిరెడ్డి, బొడ్డు రామచంద్రరావు, పలగాని కొండలరావు, నెక్కలపు వాణిశ్రీ, శనగల వెంకట శివజ్యోతి చెప్పారు. హనుమాన్‌జంక్షన్‌లోని పాలశీతల కేంద్రంలో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ సభ్యులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. అజ్ఞాతంలో ఉంటూ ఆరోపణలు చేయటం సరికాదని, తగిన సాక్ష్యాధారాలతో కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గాన్ని ఆశ్రయించాలని లేదా పోలీసులు, మీడియా ముందుకు రావాలని ఆ మహిళను డిమాండ్ చేశారు. అన్యాయం జరిగినట్లు నిరూపితమైతే యూనియన్ తరఫున చర్యలు తీసుకోక తప్పదని, అంతేకాక చట్టరీత్యా కూడా చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చలసాని ఆంజనేయులు ప్రైవేట్ కంపెనీ కాదని, లక్షా యాభై వేల మంది పాడి రైతుల సంస్థ అని చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా గుర్తు తెలియని మహిళ పదేపదే ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు విడుదల చేయటం తగదన్నారు. -
ఎల్ఈడీ లైట్లతో ప్రమాదం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): నిబంధనలకు నీళ్ళొదిలేస్తున్నారు.. కనీస ఆలోచన లేకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పు అని తెలిసినా.. ఎల్ఈడీ లైట్ల వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. ద్విచక్ర వాహనాలు మొదలుకుని.. ఆటోలు, లారీలు, ప్రైవేట్ బస్సుల్లో లైట్ల వినియోగం జరుగుతోంది. అయినా పట్టించుకోవాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. కొన్నాళ్ళ క్రితం గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెం వద్ద ఒక బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం తెలిసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. నేరుగా ఇంజిన్ నుంచి ఎల్ఈడీ లైట్లుకు వైర్లు అనుసంధానం చేయటం ద్వారానే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఆ ప్రమాదంలో బస్సు దగ్ధమై, ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయట పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలకు సంబందించి ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చింది. భారీ ఫోకస్ వచ్చే లైట్లు వినియోగించటం ద్వారా, ఎదురుగా వచ్చే వాహనదారులకు కనపడకపోవటంతో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు 90శాతం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం కంపెనీల ఫోకస్ లైట్లు ఇచ్చిన వాటి వరకే వినియోగించాలనేది చట్టం. అదనపు ఫిట్టింగ్‌లు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటీకీ.. వాహనదారులు యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు. వాహనాల చట్టం 1988 (మోటార్ వెహికల్ యాక్ట్) ప్రకారం.. వాహనాల్లో అనుమతించని మార్పుల్లో ఎల్ఈడీ లైట్లు వినియోగం ఒకటి. ఈ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం వాహనాల నిర్మాణం, ఫీచర్లలో అనుమతి లేకుండా మార్పులు చేయటం చట్ట విరుద్ధం. ఎల్ఈడీ లైట్లు హాలోజెన్ లైట్ల కంటే అధికంగా ప్రకాశిస్తాయి. తద్వారా ఇతర డ్రైవర్లకు గందరగోళం ఏర్పడటంతోపాటు, అంధత్వాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీఏ, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికమైన వాట్స్, అన్ అప్రూవ్డ్ లైట్లు నిషేదించిన పరిస్థితులు ఉన్నాయి. కారుల్లో 75 వాట్స్, లారీలకు 100 వాట్స్, బైక్‌లకు 10 వాట్స్ లోపు మాత్రమే లైట్ల వినియోగం ఉండాలి. జైలు శిక్షకు కూడా అవకాశం ఆర్టీఏ రూల్ ప్రకారం ఎల్ఈడీ లైట్లు వినియోగం చేపడితే వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు జరిమానా విధించవచ్చు. జరిమానా రూ.1,000 నుంచి రూ.పదివేల వరకు పడే అవకాశం ఉంది. గత కొద్ది కాలం క్రితం బెంగుళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కేవలం వారం రోజుల వ్యవధిలో 8వేల కేసులు నమోదు చేశారంటే ఎల్ఈడీ లైట్లు వినియోగం పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. లైట్ల వినియోగం ద్వారా ఒకొ సారి జైలు శిక్షకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు. ఇష్టానుసారంగా వినియోగం ద్విచక్రవాహనాలు మొదలుకుని భారీ వాహనాల వరకు పట్టించుకోని ఆర్టీఏ శాఖ అధికారులు అడ్డగోలుగా అమ్మకాలు.. మోటార్ వెహికల్ షాపుల్లో ఎల్ఈడీ లైట్ల విక్రయాలు చేపట్టకూడదని నిబంధనలు చెబుతున్నాయి ఆయా వాహనాన్ని బట్టి దాని వినియోగానికి సరిపడా వాట్స్ కంటే అధిక ప్రమాణాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి. రోడ్డు మంత్రిత్వ శాఖ (మినిస్టరీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే లైట్లు వినియోగించాలి. అయితే దీనిపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులకు అధికారం ఉంది. అయినా కనీసం చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇటీవల కాలంలో కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. -
ఘనంగా చెన్నుని పుష్పయాగం
మాచర్ల: మాచర్లలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు, ఈఓ ఎం పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, గౌరవాధ్యక్షులు పోలిశెట్టి చంద్రశేఖరరావు, పందిరి సాంబశివరావు, షరాబు వెంకటరత్నం, గజవెల్లి కిషోర్, కంభంపాటి అనిల్‌కుమార్, సూరె యలమంద, తిరివీధి వెంకట నాగేశ్వరరావు, కంభంపాటి వెంకటరమణలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి పుష్పయాగం మండపంలో జరిపారు. ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ నామస్మరణ చేశారు. ఆరోగ్యం పౌరుడి ప్రాథమిక హక్కుగా మారాలి డాక్టర్ పీవీ రమేష్ కృష్ణలంక (విజయవాడ తూర్పు): ఆరోగ్యం పౌరుడి ప్రాథమిక హక్కుగా మారాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ అన్నారు. విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రజారోగ్య వేదిక, జన విజ్ఞాన వేదిక, ఎంబీ విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య రంగం – మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ – ఆరోగ్య బడ్జెట్ విశ్లేషణ’ అంశాలపై ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో వర్చువల్‌గా రమేష్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్నారు. ప్రముఖ బడ్జెట్ విశ్లేషకుడు డాక్టర్ డేవిడ్ సుధాకర్ మాట్లాడుతూ ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు జీడీపీలో కనీసం ఆరు శాతం ఉండాలని, అయితే 1.9 శాతానికి మించడం లేదన్నారు. ప్రఖ్యాత వైద్యుడు, ఐఎంఏ మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సమరం తదితరులు సదస్సులో పాల్గొన్నారు. అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి పెదవడ్లపూడి(మంగళగిరి) : ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో వైభవంగా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లితండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. -
కిడ్నీ వ్యాధి బారిన పడిన గ్రామాలు
గిరిజనుల గోడు పట్టించుకోండి రక్షిత మంచినీరు లేక, ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉన్న నీరు తాగి కిడ్నీ వ్యాధిబారిన పడిన పడిన ఎ.కొండూరు మండలంలోని గిరిజనుల బాధలను అధికారులు గుర్తించాలి. అవసరమైన వైద్యసేవలు అందించాలి. తండాలకు శుద్ధి చేసిన జలాలు అందించడానికి చర్యలు తీసుకోవాలి. – మేకల డేవిడ్, ఎ.కొండూరు రక్షిత మంచినీటి ప్రాజెక్టులు పూర్తిచేయండి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎ. కొండూరు, గంపలగూడెం మండలాల్లో రక్షిత నీటి సరఫరా పనులు చేపట్టారు. ఈ పనులను ఇంతవరకు కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదు. కిడ్నీ రోగుల విషయంలో ప్రభుత్వం కాలక్షేపం చేయడం తగదు. అధికారులు చర్యలు తీసుకోవాలి. – నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, తిరువూరు పురోగతిలో పనులు కిడ్నీ ప్రభావిత గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నాం. రూ.50 కోట్ల వ్యయంతో ఎ.కొండూరు మండలంలోని 38 గ్రామాలకు కృష్ణా నదీ జలాలను సరఫరా చేసే ప్రాజెక్టు పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా నిర్దేశించారు. పనులు పురోగతిలో ఉన్నాయి. – రాఘవేంద్ర, ఆర్డబ్ల్యూఎస్ డీఈ, తిరువూరు ● ‘తిరువూరు’లో రక్షిత నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ● కిడ్నీరోగుల గోడు పట్టదా! ● జూన్ ఆఖరుకు పనుల పూర్తికి కలెక్టర్ ఆదేశం ● ఎ.కొండూరులో అరకొరగా ట్యాంకర్లతో నీటి సరఫరా తిరువూరు: తండాల్లో ప్రజలకు శుద్ధ జలం అందక ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ రోగులకు రక్షిత నీటి సరఫరా చేయడానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే.. ప్రస్తుత కూటమి పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ రోగులు అత్యధికంగా ఉన్న ప్రాంతం తిరువూరు రెవెన్యూ డివిజన్. ఇక్కడ తండాల్లో కిడ్నీ రోగులకు రక్షిత నీటి సరఫరాకు కావాల్సిన పనులను కూటమి ప్రభుత్వం నత్తనడకన చేస్తోంది. ఎ.కొండూరు మండలంలో 15 తండాల్లో 244 కిడ్నీ కేసులున్నట్లు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఎ. కొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ రోగులు అత్యధికంగా ఉన్నారు. మూడు రోజుల క్రితం గంపలగూడెం మండలం గోసవీడులో 14 ఏళ్ల బాలిక మరణిండంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గంపలగూడెంలోని నారికింపాడు, అనుముల్లంక, కనుమూరు, కొత్తపల్లి, వినగడప తండాలలో కిడ్నీ వ్యాధి గ్రస్తుల స్వాంతనకు చర్యలు లేవు. పనులు పూర్తయ్యేదెప్పుడో! గత ఏడాదిగా వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూయస్ శాఖల జిల్లా అధికారులు సమీక్షలు, పరిశీలనలు చేస్తున్నా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తాగునీరందని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టింది. గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారులు పట్టించుకోకపోవడంతో గిరిజనులకు బోరు నీరే దిక్కైంది. గత ఫిబ్రవరిలో కలెక్టర్ లక్ష్మీశ ఎ.కొండూరు మండలంలో కృష్ణా జలాల సరఫరాకు చేపట్టిన ప్రాజెక్టు పనులను తనిఖీ చేశారు. అప్పుడు.. ఈ ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేసి అన్ని గ్రామాలకు నీరందించాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు. చాలీచాలని నీటితో అవస్థలు రెడ్డిగూడెం మండలం కుదప వద్ద నిర్మించిన రిజర్వాయర్ నుంచి ట్యాంకర్లతో ఎ.కొండూరు మండలంలోని గ్రామాలకు కృష్ణా జలాలను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా వారి అవసరాలకు చాలక ఇబ్బంది పడుతున్నారు. గతంలో కృష్ణా జలాల సరఫరా కోసం నిర్మించిన సంప్‌లు నిరుపయోగంగా మిగిలాయి. ఎ.కొండూరు మండలంలోని 38 గ్రామాల్లో పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు గ్రామీణ నీటిసరఫరా విభాగం గుర్తించింది. ప్రత్యేకంగా కృష్ణా జలాలను శుద్ధి చేసి ఎ.కొండూరుకు అందించే ప్రాజెక్ట్‌కు సుమారు రూ.49.94 కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం మైలవరంలోని సీపీడబ్ల్యూసీ స్కీం వరకు వస్తున్న కృష్ణా జలాలను కుదపలోని సంప్ వద్దకు తీసుకెళ్లి ట్యాంకర్ల ద్వారా తండాలకు పంపుతున్నారు. రక్షిత నీరు లేక పెరుగుతున్న రోగులు ఫ్లోరైడ్, సిలికాన్ శాతం అధికంగా ఉన్న ‘ఎ.కొండూరు’లోని పలు గ్రామాల్లో బోర్ నీటిని తాగుతున్న గిరిజనుల కిడ్నీలు పాడై ఆస్పత్రుల పాలవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎ.కొండూరు, తిరువూరులో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఎ.కొండూరు మండలంలోని మత్రియా తండా, కేశ్యాతండా, దీప్లా నగర్, మాన్సింగ్తండా, కొండూరు తండా, గొల్లమందల తండా, పెద తండా, వెంకట తండా, కుమ్మరికుంట్ల తండా, గోపాలపురం గ్రామాల్లో కిడ్నీరోగుల సంఖ్య అధికంగా ఉంది. ఈ మండలంలో 413 మంది కిడ్నీ రోగులను ప్రభుత్వం గుర్తించగా, 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. శాశ్వత ప్రాజెక్టు ఏర్పాటు నత్తనడక మండలంలోని గిరిజన తండాలకు కృష్ణా జలాల సరఫరాకు నిర్దేశించిన శాశ్వత ప్రాజెక్టులో భాగంగా కుదప సంప్ వద్ద కొండపైన ఓవర్ హెడ్ రిజర్వాయర్ నిర్మాణంలో ఉంది. పైపులైన్ల పనులు 200 కిలోమీటర్లు చేపట్టాల్సి ఉండగా పనులు త్వరితగతిన పూర్తిచేయాలని రోగులు కోరుతున్నారు. కిడ్నీ బాధితులకు రక్షిత మంచినీరందించడంతో పాటు డయాలసిస్ రోగులకు అవసరమైన వైద్యసేవలు చేయాలని, పెన్షను మంజూరు, పౌష్టికాహారం సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఎ.కొండూరు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. కోడూరు, మారేపల్లి, పోలిశెట్టిపాడు గ్రామాలకు ఇంతవరకు రక్షిత మంచినీరందించలేదు. ఆ గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నా ముందు జాగ్రత్తగా కృష్ణా జలాల సరఫరాకు చర్యలు తీసుకోవట్లేదు. శుద్ధిచేసిన జలాల సరఫరాకు పైపులైన్ల నిర్మాణం పూర్తి చేసినా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తవలేదు. -
బడుగుల చదువుకు భరోసా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అమలు చేసిన ఘనత నాటి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిది. ఆయన పాలన పేద విద్యార్థులకు సువర్ణాక్షరం. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ పేదలకు అవకాశం కల్పించడానికి ఆలోచన చేశారు. ఆయన ప్రవేశపెట్టిన విద్యాహక్కు చట్టం ద్వారా ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థ మొదటి తరగతిలో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా నిర్ణయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో 2022–23 నుంచి ఈ పథకాన్ని అమలు చేశారు. అదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలోనూ ఈ పథకాన్ని అమలు చేయడంతో వేలాది మంది పేద కుటుంబాలు లబ్ధి పొందాయి. అధిక శాతం విద్యార్థులకు అందుబాటులో.. విద్యాహక్కు చట్టం సెక్షన్ 12 (1) సీ ద్వారా గడిచిన మూడేళ్లలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 4,056 మంది విద్యార్థులను మొదటి తరగతికి విద్యాశాఖ ఎంపిక చేసింది. వారిని వారి సమీప ప్రాంతాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకునే వీలు కల్పించింది. తొలి ఏడాది 2022–2023 విద్యాసంవత్సరంలో 120 మందికి, 2023–2024లో 1,127 మందికి అవకాశం కల్పించింది. 2024–2025 విద్యాసంవత్సరంలో మొదటి ఫేజ్‌లో 990, రెండో ఫేజ్‌లో 397, నాలుగో ఫేజ్‌లో 1422 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో అధిక శాతం విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో కొనసాగుతున్నారు. 2025–26 సంవత్సరానికి నోటిఫికేషన్ ఈ విద్యాహక్కు చట్టం –2009 సెక్షన్ 12 (1)సీ అమలులో భాగంగా 2025–2026 విద్యా సంవత్సరానికి ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ సిలబస్ చదువుతున్న పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 28 నుంచి మే 15వ తేదీ వరకూ వివిధ వర్గాల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. విద్యార్థులు ఆధార్ ద్వారా ప్రాథమిక వివరాలతో http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అర్హతలు ఇవి ఐబీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాల్లో ప్రవేశం కోసం 31.03.2025 నాటికి ఐదేళ్ల వయసు నిండి ఉండాలి. స్టేట్ సిలబస్ పాఠశాలల్లో ప్రవేశానికి 01.06.2025 నాటికి ఐదేళ్ల వయసు నిండాలి. విద్యా హక్కు చట్టం–2009, సెక్షన్ 12(1) ఇ ప్రకారం, ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పిల్లలకు వారి నివాసానికి ఒక కిలోమీటర్ లేని పక్షంలో రెండు కిలోమీటర్లు తర్వాత మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను కేటాయించింది. ఎంపిక విధానం ఒకటో తరగతి ప్రవేశాలకు పోర్టల్‌లో నమోదు కోసం ఈ నెల 28 నుంచి మే 15 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చిన దరఖాస్తుల్లో విద్యార్థుల అర్హతలను మే 16 నుంచి 20వ తేదీ వరకూ నిర్ధారణ ప్రక్రియను చేపడతారు. లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలను మే 21 నుంచి 24 మధ్య విడుదల చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 2వ తేదీ చేస్తారు. రెండో విడత లాటరీ ఫలితాలను జూన్ 6వ తేదీ విడుదల చేస్తారు. అడ్డుకునేందుకు కార్పొరేట్ సంస్థల యత్నం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. వివిధ రూపాల్లో నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అండగా నిలవాల్సిందేనని సూచించారు. దాంతో కార్పొరేట్ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. న్యాయస్థానం విద్యాహక్కు చట్టం అమలు చేయాల్సిందేనని తీర్పు ఇవ్వడంతో పాటు కొన్ని సూచనలు చేసింది. దాంతో ఏటా పేద వర్గాలకు కార్పొరేట్ సంస్థల్లో 25 శాతం సీట్లు ఉచితంగా దక్కుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద 25 శాతం ఉచిత సీట్లు పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ జిల్లాలో గత మూడేళ్లలో 4,056 మందికి అవకాశం 2025–26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ ఇచ్చిన సమగ్ర శిక్షాభియాన్ అడ్డుకోవాలని చూసినా ముందుకే.. పేదలకు అన్ని విధాలుగా భరోసా ఇచ్చిన నేత జగన్మోహన్రెడ్డి. ఆయన నిరంతరం పేద కుటుంబాలు చదువు కోవాలి.. తద్వారా వారి కుటుంబాలు అభి వృద్ధి చెందాలని భావించారు. అందులో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే విద్యాహక్కు చట్టం ద్వారా 25 శాతం సీట్లు పేదలకు కేటాయించే దిశగా చర్యలు చేపట్టారు. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా ఆయన ముందుకు సాగారు. –వానపల్లి రవీంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నేత -
క్రీస్తు పునరుత్థానం..లోకానికి శుభోదయం
గుణదల(విజయవాడ తూర్పు): మానవాళి రక్షణార్ధమై యేసుక్రీస్తు సిలువ మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడని మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు అన్నారు. గుణదల మాత ప్రధానాలయంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పునరుత్థానుడైన యేసు క్రీస్తును ఆరాధించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు రావడంతో పుణ్యక్షేత్రం సందడిగా మారింది. ఈ సందర్భంగా ఆలయంలో సమష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. భక్తులనుద్దేశించి ఫాదర్ జయరాజు మాట్లాడుతూ క్రీస్తు పునరుత్థానం లోకానికి జయమన్నారు. మానవాళిని రక్షించేందుకే యేసుక్రీస్తు సిలువ మరణం పొందారని గుర్తు చేశారు. యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ఆయన ఆచరించి చూపిన మార్గంలో నడుచుకోవాలన్నారు. ఈస్టర్ పండుగ అందరి జీవితాలలో దీవెనలు నింపాలని ఆశీర్వదించారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో పాటు యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. కాలి నడకన కొండ శిఖరాగ్రం వరకు వెళ్లి క్రీస్తును వేడుకున్నారు. పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 20257నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీ ఆర్ఎస్) జరుగుతుందని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 514.80 అడుగుల వద్ద ఉంది. ఇది 139.9642 టీఎంసీలకు సమానం. తిరుపతమ్మకు జేజేలు పెనుగంచిప్రోలు: జైజై తిరుపతమ్మ అంటూ భక్తజనం ఆదివారం పెనుగంచిప్రోలు తిరుపతమ్మకు జేజేలు పలికారు. భక్తులతో క్యూలు కిటకిటలాడాయి. -
టెర్రస్ గార్డెన్ పెంపకంతో ఆరోగ్యకరమైన పంట
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంటి టెర్రస్‌పై కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించాలని, తద్వారా రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పంట లభిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి అన్నారు. ఆదివారం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) ఆధ్వర్యంలో భవానీపురంలోని వాసవి కల్యాణమండపంలో వంటింటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువును తయారు చేసుకుని కూరగాయలు పెంచటంపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమకు అవసరమైన కూరగాయలను ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును తయారు చేసుకుని పండించుకోవాలని, తద్వారా ఆరోగ్యమైన జీవితాన్ని పొందవచ్చని తెలిపారు. టెర్రస్ గార్డెనింగ్పై యువత ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన పర్యావరణవేత్త మద్దుకూరి సుబ్బారావు మాట్లాడుతూ కిచెన్‌లో కూరగాయలతో వంట చేసినప్పుడు వచ్చే వ్యర్థాలను బయట పడేయకుండా వాటిని కంపోస్ట్ ఎరువుగా తయారు చేసుకోవచ్చన్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా పండే కూరగాయలను తినటం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడినవారం అవుతామని అన్నారు. సదస్సుకు ఏపీఎఫ్సీసీఐ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు అధ్యక్షత వహించారు. సీటీజీ వ్యవస్థాపకుడు శ్రీనివాస్, విజయవాడ టీమ్ పీవీడీ నాగేశ్వరరావు, గూడవల్లి సురేష్‌బాబు, నర్రా నాగేంద్రప్రసాద్, పద్మజ, జి.పద్మాదేవి పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ నేపథ్యంలో అంతరాలయ, వీఐపీ దర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. దీంతో భక్తులకు త్వరతిగతిన అమ్మవారి దర్శన భాగ్యం లభించింది. పెద్ద ఎత్తున పాల్గొన్న ఉభయ దాతలు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవలకు ఆదివారం డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, నవగ్రహ హోమాలలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద , 7వ అంతస్తులో మైక్ ప్రచార కేంద్రం వద్ద దేవస్థానం మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాతల సహకారంతో ప్రతి రోజు మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. కిటకిటలాడిన క్యూ లైన్లు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిటకిటలాడాయి. దీంతో ఆలయ అధికారులు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. కౌంటర్లలో టికెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. రూ.300, రూ.100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా క్యూలైన్లను నియంత్రించారు. రూ.300 టికెట్లపై కేటాయించి క్యూలైన్‌తో పాటు అదనంగా బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.100 టికెట్ భక్తులకు వారికి కేటాయించిన క్యూతో పాటు అదనంగా మరో క్యూలైన్ కేటాయించడంతో దర్శనం త్వరగా పూర్తయింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాలయ దర్శనం పూర్తిగా నిలిపివేశారు. ఆన్లైన్లో ముందుగానే రూ.500 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం అంతరాలయ దర్శనం కల్పించారు. సూర్యోపాసన సేవ లోక కల్యాణార్ధం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాల అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించారు. సేవలో పలువురు భక్తులు, ఉభయదాతలు పాల్గొనగా, వారికి ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. 21న కానుకల లెక్కింపు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను సోమవారం లెక్కించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం మహా మండపం ఆరో అంతస్తులో ఉదయం 7–30 గంటల నుంచి కానుకల లెక్కింపు జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. దుర్గ గుడి కౌంటర్లలో సీసీ కెమెరాలు అదనపు వసూళ్లకు చెక్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సెల్‌ఫోన్ భద్రపరుచుకునే కౌంటర్లు, లగేజీ కౌంటర్లలో అదనపు వసూళ్లు, ఉచితంగా ఏర్పాటు చేసిన చెప్పుల స్టాండ్‌లో డబ్బుల వసూళ్లపై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులకు ఆలయ అధికారులు చెక్ పెట్టారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మహా మండపం దిగువన, ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద చెప్పులు, లగేజీ, సెల్‌ఫోన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. చెప్పుల స్టాండ్‌ను దేవస్థానం ఉచితంగా నిర్వహిస్తుండగా, లగేజీ, సెల్ఫోన్లు కౌంటర్లను కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. అయితే రద్దీ సమయంలో భక్తుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఇటీవల ఫిర్యాదులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో కౌంటర్లోని సిబ్బంది అదనపు వసూళ్లకు చెక్ పెడుతూ ఆయా కౌంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లో సిబ్బంది నిరంతరం ఈ కెమెరాలను పర్యవేక్షిస్తూ, కౌంటర్ల వద్ద ఎటువంటి వివాదాలు జరిగినా వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఆర్జిత సేవలకు డిమాండ్ అంతరాలయ దర్శనం రద్దు -
కారు పల్టీకొట్టి నలుగురికి తీవ్ర గాయాలు
నున్న(విజయవాడరూరల్): వెస్ట్ బైపాస్ జాతీయ రహదారి నున్న గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న కారు విజయవాడ వెస్ట్ నేషనల్ బైపాస్ రోడ్డులో నున్న స్లిప్‌వే వద్దకు వచ్చేసరికి కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంటు దిమ్మను వేగంగా ఢీ కొట్టింది. కారు పల్టీకొట్టగా డ్రైవింగ్ చేస్తున్న పాము కాసుబాబు లోపల ఇరుక్కు పోయాడు. ఆయన భార్య శిరీషకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు మగ పిల్లలకు గాయాలు కాగా ఒక బాబుకి కుడి కాలు విరిగింది. హైవేపై వెళుతున్న ప్రయాణికులు,సెక్యూర్టీ సిబ్బంది హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి వెళ్లి కారులో ఇరుక్కుపోయిన వారిని బటయకు తీశారు. నేషనల్ హైవే అంబులెన్స్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాకినాడకు చెందిన పాము కాసుబాబు హైదరాబాద్ రెడ్డీస్ ల్యాబ్‌లో ఐటీ మేనేజర్ గా పని చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇద్దరు పిల్లలు భార్యతో కలిసి కారులో కాకినాడు వెళుతున్నారు. నేషనల్ హైవే పక్కన టవర్ నిర్మాణం పనులు నిమిత్తం రోడ్డుపై పనులు పూర్తి కాలేదు. రోడ్డు సగభాగంలో రబ్బీష్ కుప్పలు పోసి సింగిల్‌వే మూసివేసి ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న నున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తతో పాటు ఇద్దరు పిల్లలకు గాయాలు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా ఘటన -
స్వచ్ఛాంధ్రతో పరిశుభ్రంగా గ్రామాలు
మైలవరం: స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి తెలిపారు. మైలవరం ఎస్వీఎస్ కల్యాణ మండపంలో గ్రామ పంచాయతీ, వెలుగు కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విచ్చల విడిగా ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు. క్యారీ బ్యాగులు ఎక్కడబడితే అక్కడ పడేయడంతో భూమి ఉపరితలంలో పేరుకుపోతున్నాయని తెలిపారు. దీంతో వర్షపు నీటిని భూమి పీల్చుకోలేకపోతుందని పేర్కొన్నారు. వాడిన ప్లాస్టిక్ వస్తువులను పంచాయతీ పారిశుద్ధ్య వాహనం వచ్చినపుడు అప్పగిస్తే వాటిని దూరంగా డంప్ చేస్తారని వెల్లడించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచకుని ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. రోగం వచ్చాక మందులు వాడేకన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతి బాబు మాట్లాడుతూ ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పంచాయతీ కార్మికులను సత్కరించారు. తహసీల్దారు అబ్దుల్ ధారియా, సర్పంచ్ మంజుభార్గవి, తదితరులు పాల్గొన్నారు. మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ వేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అప్పారావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ బి. శివహరిప్రసాద్, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి -
పెద ఓగిరాలలో భారీ చోరీ
ఉయ్యూరు రూరల్: మండలంలోని పెద ఓగిరాలలో శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఇంటి యజమాని నిద్రిస్తున్న క్రమంలో చోరీ జరిగినట్లుగా కంకిపాడు సీఐ మురళీకష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన మా రెడ్డి మాధవి ఒంటిరిగా ఉంటుంది. భర్త వ్యాపారం రీత్యా గుంటూరులో ఉంటారు. కుమారుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. మాధవి ఒక్కరే ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో దుండగులు వెనుక తలుపుకున్న తాళం వద్ద గొళ్లాన్ని విరగ్గొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.15 లక్షల నగదుతో పాటు కొంత బంగారాన్ని దొంగిలించినట్లు తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో పరిశీలించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని సందర్శించి బాధితురాల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. బైక్ చోరీ.... భారీ చోరీ జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే ఇంటి బయట నిలిపి ఉంచిన ఓ బైకును సైతం దొంగలు అపహరించారు. ప్రతిరోజు ఇంటి లోపల భద్రపరచుకునే వాహన యజమాని శుక్రవారం రాత్రి బయటనే పార్కింగ్ చేసి ఉంచడంతో దుండగులు ఆ బైకును సైతం దొంగిలించారు. -
అద్భుతం.. హంసలదీవి సాగరతీరం
కుటుంబసభ్యులతో కలిసి తీరంలో సేదతీరిన జేసీ గీతాంజలి శర్మ కోడూరు: ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవైన హంసలదీవి సాగరతీరం అద్భుతంగా ఉందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి జేసీ సాగరతీరాన్ని శనివారం వేకువజామున సందర్శించారు. పాలకాయతిప్ప శింకు నుంచి పవిత్ర కృష్ణా, సాగర సంగమం వరకు పడవ ప్రయాణం చేసి ప్రకృతి అందాలను తిలకించారు. మడచెట్ల వివరాలను అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగర సంగమ విశిష్టతను రెవెన్యూ అధికారులు జేసీకి వివరించారు. అక్కడ కొంతసేపు సేదతీరి పాలకాయతిప్ప బీచ్‌లో పర్యటించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి అయిన తాబేళ్ల పిల్లలను కుటుంబ సభ్యులతో కలిసి జేసీ సముద్ర బాట పట్టించారు. తాబేళ్ల పిల్లలు సముద్రం వైపు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఉన్న వివిధ రకాల జీవరాశుల నమునాలను ఆసక్తిగా తిలకించారు. మైరెన్ ఎస్ఐ పూర్ణమాధురి, రెవెన్యూ, అటవీ, పంచాయతీరాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రన్ ఫర్ జీసస్
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్రీస్తు సందేశం సమస్త మానవాళికి శాంతి సందేశం కావాలని విజయవాడ కేథలిక్ డయోసిస్ బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, సీఎస్ఐ కృష్ణా, గోదావరి డయోసిస్ బిషప్ టి. జార్జికొర్నేలియస్ పిలుపునిచ్చారు. ఈస్టర్ (పాస్కా) సందర్భంగా ఏపీ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చిలు, నగరంలోని అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శనివారం రన్ ఫర్ జీసస్ నిర్వహించారు. పటమటలోని సెయింట్ పాల్స్ చర్చి వద్ద బిషప్‌లు జోసఫ్ రాజారావు, కొర్నేలియస్, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్‌లు పునరుత్థానుడైన క్రీస్తును స్వాగతిస్తూ కాగడాలు వెలిగించి ఆనందోత్సాహాల మధ్య రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిషప్‌లు రాజారావు, కొర్నేలియస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు ఎంతో భక్తి విశ్వాసాలతో జరుకుంటున్నారని చెప్పారు. ఫాదర్ మువ్వల ప్రసాద్, ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ పాస్టర్ ఎస్. జయకుమార్ బాబు మాట్లాడుతూ రన్ ఫర్ జీసెస్ తెలుగు రాష్ట్రాల్లో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సెయింట్ పాల్స్ కథెడ్రల్ చర్చి నుంచి ప్రారంభమైన ర్యాలీ సెయింట్ పాల్స్ బసిలికా సీయస్ఐ చర్చి ప్రాంగణానికి చేరుకొంది. రన్ ఫర్ జీసెస్ స్టేట్ కో–ఆర్డినేటర్ శివాజిరాజు అల్లూరి విశ్వప్రసాద్, ప్రవీణ్, కరుణానిధి, మాజీ డెప్యూటీ మేయర్ ఎస్. గ్రిటన్ తదితరులు పాల్గొన్నారు. -
హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయండి
మధురానగర్(విజయవాడసెంట్రల్): హనుమజ్జయంతిని పురస్కరించుకుని హిందూ సమాజానికి ధైర్య సాహసాలను ఇచ్చే హనుమాన్ శోభాయాత్ర (బైక్ ర్యాలీ)ను విజయవంతం చేయాలని శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. వచ్చేనెల 22న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే శోభాయాత్ర స్టిక్కర్, పోస్టర్ విడుదల కార్యక్రమం మాచవరం దాసాంజనేయస్వామి దేవాలయంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా శివస్వామి పాల్గొని వీహెచ్‌పీ కేంద్రీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, వీహెచ్‌పీ ప్రాంత కోశాధికారి దుర్గాప్రసాద్ రాజు, వీహెచ్‌పీ విజయవాడ మహానగర్ అధ్యక్షులు సానా శ్రీనివాస్‌తో కలిసి బైక్ స్టిక్కర్, వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం
బంటుమిల్లి: మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో 216 జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు టీవీ మెకానిక్‌లు దుర్మరణం చెందారు. ఎస్ఐ గణేష్‌కుమార్ కథనం మేరకు... మచిలీపట్నం పట్టణానికి చెందిన వాసాబత్తుల వీరాచారి (40), అనకాపల్లి శివప్రసాదు (40) ద్విచక్రవాహనంపై రాజమండ్రి వెళ్లి పనులు పూర్తి చేసుకుని మచిలీపట్నం తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం 6 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం పేరుతో రూ. 22 లక్షలు స్వాహా పెనమలూరు: ఉద్యోగం పేరుతో మహిళ వద్ద రూ. 22 లక్షల సొమ్ము సైబర్ నేరగాళ్లు స్వాహా చేసిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తాడిగడప గ్రామానికి చెందిన నూకల విజయశ్రీ ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో ఉంది. ఆమె ఆన్లైన్లో రెంట్కామ్ అనే వెబ్సైట్లో చాట్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెతో చాటింగ్ చేసి గ్రూప్‌లో చేర్చారు. ఆన్లైన్లో ఆమెకు టాస్కు ఇవ్వగా సకాలంలో పూర్తి చేసింది. దీంతో సైబర్ నేరగాళ్లు సొమ్ము పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని విజయశ్రీకి ఆశ చూపి నమ్మించారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఈ నెల 5 నుంచి 7వ తేదీల్లో విజయశ్రీ పలు దఫాలుగా రూ. 22,09,857 ఆన్లైన్లో సొమ్ము ట్రాన్స్ఫర్ చేసింది. సొమ్ము బదిలీ అయిన తర్వాత గ్రూప్‌లో ఉన్న వ్యక్తులు స్పందించడం మానేశారు. దీంతో తాను మోసపోయానని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య మంగొల్లు(వత్సవాయి): ఫ్యాన్‌కు ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏలూరి నరసింహారావు, స్వాతి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె అయిన ఏలూరి రాజ (14) జగ్గయ్యపేటలోని ఒక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. కారు దూసుకెళ్లి మహిళ మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు పక్కన బుట్టలు అల్లుకునే వారిపై కారు దూసుకెళ్లిన ఘటన భవానీపురం పోలీసు స్టేషన్ పరిఽధిలోని గుప్తా సెంటర్ చోటుచేసుకుంది. విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్‌కు చెందిన పిల్లి యశోద కుటుంబం గుప్తాసెంటర్లోని షాదీఖానా రోడ్డు పక్కన బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగిస్తోంది. శనివారం యశోద, ఆమె మామ లక్ష్మయ్య, అత్త పిల్ల రాములమ్మ, ఆడపడుచు దుర్గా రోడ్డు పక్కన కూర్చుని బుట్టలు అల్లుకుంటున్న సమయంలో కుమ్మరిపాలెం వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. కారు రాములమ్మ (50) పైకి ఎక్కింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను భవానీపురంలోని ఓ హాస్పిటల్లో చేర్చించారు. వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు చెప్పారు. ఈ ఘటనపై మృతిరాలి కోడలు యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పది నెలల పాలనలోనే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యకర్గ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుల పదవీ బాధ్యతల స్వీకారోత్సవం శనివారం విజయవాడలోని ఓ ఫంక్షన్ హాలులో ఘనంగా జరిగింది. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఎప్పుడు మంచి చేయాలని ఆలోచన చేసే వారన్నారు. వైద్య రంగాన్ని మెరుగు పరిచి పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చూశారన్నారు. నేడు కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తున్నట్లు ఆరోపించారు. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తోందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. కూటమి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్దామని కార్యకర్తలు, నాయకులకు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని, గతంలో వైఎస్సార్ సీపీ రైతులకు అండగా నిలిచి, గిట్టుబాటు ధర కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు మేలు చేసేందుకు అందించిన సంక్షేమ పథకాలను కూటమి అటకెక్కించిందన్నారు. నిత్యం వైఎస్సార్ సీపీపై అస త్య ప్రచారాలు చేస్తూ, తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. సంపద సృష్టి పేరుతో అందరినీ మభ్యపెడుతోందన్నారు. కార్యకర్తకు పెద్దపీట.. రాబోయే రోజుల్లో కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ పెద్దపీట వేస్తుందన్నారు. కార్యకర్తలందరూ క్రమశిక్షణతో పనిచేయాలని, కష్టపడిన ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయన్నారు. మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, నల్లగట్ల స్వామిదాసు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, ఎండీ రూహుల్లా, జగ్గయ్యపేట పార్టీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజరెడ్డి, బెల్లం దుర్గతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సంక్షేమం లేదు.. అంతా క్షామమే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం రాజ్యసభ సభ్యుడు, కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి -
‘అద్దె గర్భం’ అనుమతులపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): సహాయక పునరుత్పత్తి సాంకేతికత(ఏఆర్టీ), అద్దె గర్భం(సరోగసి) చట్టం–2021 అమలులో భాగంగా జిల్లా మెడికల్ బోర్డు శనివారం సమావేశమైంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దె గర్భం సేవలు పొందడానికి దరఖాస్తు చేసుకున్న ఏడుగురు దంపతుల అప్లికేషన్లను పరిశీలించారు. వారు అర్హత కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. వాటిని అమలు చేస్తే అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశంలో ఎన్హెచ్ఎం కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ నవీన్, జీజీహెచ్ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ కేశవచంద్ర, పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ పి. అనిల్‌కుమార్, డాక్టర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన డీఎంహెచ్ఓ.. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్రా– స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తమ సిబ్బందితో కలిసి కార్యాలయం పరిధిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డెప్యూటీ డెమో ప్రభాకరరెడ్డి, సత్యనారాయణ, కార్తీక్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ సురక్షిత తాగునీరు నందిగామరూరల్: ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత తాగునీటిని అందించడమే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని కేంద్ర జల్ జీవన్ మిషన్ వెరిఫికేషన్ బృంద సభ్యుడు హరిపాల్‌సింగ్ అన్నారు. మండలంలోని పెద్దవరం, పాతబెల్లంకొండవారిపాలెం, లింగాలపాడు, అడవిరావులపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లోని జల్ జీవన్, ప్రజల తాగునీటికి సంబంధించిన పనులను శనివారం ఆయన పరిశీలించారు. లింగాలపాడు, అడవిరావులపాడు గ్రామాలలో కొందరు జల్ జీవన్ మిషన్ పనులలో అవకతవకలు జరిగాయని ఆరోపించగా.. స్పందించిన బృంద సభ్యుడు పనులు పూర్తి స్థాయిలో జరగలేదని ఇంకా జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం ఆయా గ్రామాలలో ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటికి పరీక్షలు నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ విద్యాసాగర్, ఏఈ రవికుమార్, తేజ, సర్పంచ్‌లు సూరా వెంకట నర్సమ్మ, బొల్లినేని పద్మజ పాల్గొన్నారు. నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపుపై హర్షంకూచిపూడి(మొవ్వ): యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో నాట్య శాస్త్రాన్ని ప్రత్యేకంగా నమోదు చేశారని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించటంతో ప్రముఖ కూచిపూడి నాట్య క్షేత్రం కూచిపూడిలో కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాపీఠంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, నాట్య విద్యార్థులు కలిసి నటరాజ స్వామికి శనివారం పూలమాలవేసి ఆనందోత్సాహాలతో స్వీట్లు పంచుకొన్నారు. జాతీయ ఖోఖో పోటీలకు గుడివాడ విద్యార్థులుగుడివాడ టౌన్: ఖేలో ఇండియా జూనియర్ ఖోఖో జాతీయ స్థాయి పోటీలకు గుడివాడ ఎస్పీఎస్ మునిసిపల్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు మడకా ప్రసాద్ శనివారం తెలిపారు. పాఠశాలకు చెందిన డి.రాకేష్, టి.తిమోతి, సాజిత్‌ఖాన్, బి.జయ సూర్యతేజ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. మే నాలుగు నుంచి 11వ తేదీ వరకు బిహార్ రాష్ట్రంలోని గయ పట్టణంలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తమ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. -
ఈ–వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు
పటమట(విజయవాడతూర్పు): ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ– వేస్ట్) వల్ల తీవ్ర అనర్థాలు పొంచి ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఈ–వ్యర్థాల సేకరణను ఉద్యమంగా చేపట్టి, వాటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా విలువైన లోహాల వృథాలను అరికట్టడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగస్వాములు కావాలని కోరారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వీఎంసీ ఆధ్వర్యంలో శనివారం బెంజిసర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబు కాలనీలో ఈ–వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ (స్పెషల్ డ్రైవ్) కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ నెలలో ఈ–వ్యర్థాల సేకరణ ప్రత్యేక డ్రైవ్‌గా చేపట్టినట్లు తెలిపారు. నగరంలో నిత్యం 700 కిలోల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉండే లెడ్, కాడ్మియం, మెర్క్యురీ, బెరీలియం వంటి మూలకాలు అతి ప్రమాదకరమైనవని, వాటిని బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే భూమి, నీరు, గాలి కలుషితం అవుతాయని, ఫలితంగా ప్రజలు రోగాలబారిన పడతారని వివరించారు. అనంతరం స్థానికుల నుంచి ఈ–వ్యర్థాలను సేకరించారు. వీఎంసీ అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ కె.షమ్మీ, ఇన్చార్జి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గోపాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఇచ్చేవి గోరంత.. ప్రచారం కొండంత–4లోuప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ విమానాశ్రయం(గన్నవరం): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మే రెండో తేదీన గన్నవరం విమానాశ్రయానికి విచ్చేస్తున్న సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. ప్రధాన మంత్రి పర్యటన నేపథ్యంలో విమానాశ్రయంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు, జేసీ గీతాంజలిశర్మతో కలిసి కలెక్టర్ పలు శాఖల జిల్లా అధికారులతో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి రాజ ధాని పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీఎం విచ్చేస్తున్నట్లు తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధానితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎయిర్‌పోర్ట్‌కు వస్తారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేయాలన్నారు. అదే సమయంలో సాధారణ ప్రయాణికులకు ఎటువంటి ఆటంకం కలుగ కుండా ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేలా సమాచారం అందించాలని సూచించారు. జి.కొండూరు: మాటలు కోటలు దాటుతున్నాయి గానీ.. చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదన్నట్లు తయారైంది కూటమి ప్రభుత్వ తీరు. పేద ప్రజలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం అందిస్తోన్న కార్పొరేషన్ రుణాల మంజూరులో ప్రభుత్వం కేటాయించిన యూనిట్లకు, వచ్చిన దరఖాస్తులకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. యూనిట్ల కేటాయింపు వందల్లో ఉంటే దరఖాస్తులు మాత్రం వేలల్లో వచ్చాయి. సిఫార్సు లేనిదే రుణాల మంజూరు కష్టమని ప్రచారం జరగడంతో ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు కూడా ముప్పై శాతానికి పైగా దరఖాస్తుదారులు వెనకాడారు. యూనిట్ల కేటాయింపులో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి మరిన్ని యూనిట్లను కేటాయిస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని దరఖాస్తుదారులు ఆశిస్తున్నారు. కేటాయింపులు అంతంతమాత్రమే.. అన్ని సామాజిక వర్గాల్లో నిరుపేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా రాయితీపై అందించే వ్యక్తిగత రుణాల కేటాయింపు అంతంమాత్రంగానే ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు రుణాల మంజూరు కోసం 2,335యూనిట్లను ప్రభుత్వం కేటాయించగా 34,767మంది దరఖాస్తులు చేశారు. వీరికి యాభైశాతం ప్రభుత్వం రాయితీపై యూనిట్ కాస్ట్ ఆధారంగా రుణాలను మంజూరు చేస్తారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 990యూనిట్లను ప్రభు త్వం టార్గెట్‌గా కేటాయించగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్సీ రుణాలకు ప్రభుత్వ రాయితీ 40శాతం నుంచి ప్రారంభమై ఎంచుకున్న యూనిట్ ఆధారంగా రాయితీని అందిస్తారు. సిఫార్సులు ఉంటేనే రుణాలు.. కార్పొరేషన్ రుణాల కోసం ముందస్తుగానే కూటమి నాయకులు తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు జాబితాను సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంటర్వ్యూల అనంతరం మండల స్థాయి కూటమి నాయకులు తయారు చేసి ఇచ్చిన జాబితానే మండల పరిషత్ అధికారుల లాగిన్ నుంచి బ్యాంకర్లకు పంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేద మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల పేరుతో నగదు బదిలీకి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా అన్ని సామాజిక వర్గాలలో 45–60 ఏళ్ల మధ్య వయస్సుగల మహిళలకి ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఆర్థిక సాయం తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా గ్రామ వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులను గుర్తించి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకాలతో పాటు మరికొన్ని నగదు బదిలీ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఎన్నో కుటుంబాలు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదిగారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాయితీపై అందించే వ్యక్తిగత రుణాలకు కూడా టార్గెట్లు పెట్టడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా అయితే కూటమి అనుకూలస్తులే లబ్ధి పొందుతారు తప్ప అసలైన పేద కుటుంబాలకు మేలు జరగదని దరఖాస్తుదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పారదర్శకత పాటించాలి.. కార్పొరేషన్ రుణాల మంజూరులో పారదర్శకత పాటించాలి. ఇంటర్వ్యూలలో ఎంపిక చేసిన దరఖాస్తుదారుల జాబి తా నుంచి డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తే న్యాయం జరుగుతుంది. వేలల్లో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో రుణాల మంజూరు టార్గెట్‌ను పెంచాలి. – పొన్నం శ్రీనివాసరావు, రజక సంఘం నాయకుడు, జి.కొండూరు గ్రామం టార్గెట్లు వద్దు.. కార్పొరేషన్ రుణాలకు పరిమితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ మంజూరు చేయాలి. దరఖాస్తు చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూల అనంతరం తుదిజాబితా నుంచి డ్రా పద్ధతిలో ఎంపిక చేయాలి. పారదర్శకత పాటించకపోతే అసలైన పేదలకు న్యాయం జరగదు. – పులిపాక ప్రకాశ్, జనసేన నాయకుడు, జి.కొండూరు ●అన్యాయం జరుగుతోంది.. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్లు విడివిడిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ పేరుతో ఉమ్మడిగా రుణాలను మంజూరు చేయడం వల్ల అధిక జనాభా ఉన్న వర్గానికి సంక్షేమ రంగంలో అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి కార్పొరేషన్ల వారీగా పరిమితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలను అందించాలి. – మందా నాగమల్లేశ్వరరావు, ఏపీ ఎంఆర్ పీఎస్ అమరావతి అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం 3న్యూస్‌రీల్ ఎన్టీఆర్ జిల్లాలో రుణాల మంజూరు టార్గెట్ 2,335 యూనిట్లు మాత్రమే వచ్చిన దరఖాస్తులు 34,767 అర్హత, పారదర్శకతకు తావే లేదు సిఫార్సులకే అవకాశమంటూ ప్రచారం యూనిట్లు పెంచాలని విన్నవిస్తున్న దరఖాస్తుదారులుఎన్టీఆర్ జిల్లాలో వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాల టార్గెట్, దరఖాస్తుల వివరాలు.. కార్పొరేషన్ రుణాల దరఖాస్తులు టార్గెట్బీసీ 1,466 23,975 కాపు 508 6,840 ఈడబ్ల్యుఎస్ 361 3,952 ఎస్సీ 990 (ప్రక్రియ కొనసాగుతోంది) -
ఉద్యోగుల్లో గ్రూపుల గోల..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రతిష్ట మసకబారుతోంది. పరీక్షల నిర్వహణలో విఫలం అవడం, సిబ్బందిలో గ్రూపు రాజకీయాలు పెచ్చుమీరడంతో వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఓ కాంట్రాక్టు ఉద్యోగి వైద్య విద్యార్థులకు గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నాడంటూ అధికారులకు ఫిర్యాదులు సైతం రావడంలో ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు. ఇంత జరిగిన తర్వాత పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలకు అధికారులు చేస్తున్నా, పరువు బజారున పడిందంటూ వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా కఠిన నిబంధనలు విధించాలంటూ పలువురు వైద్యులు కోరుతున్నారు. స్లిప్పులు రాస్తూ.. ఈ నెల 7 నుంచి 21 వరకూ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ నిమ్రా, ఎన్ఆర్ఐ విద్యార్థులతో పాటు, సిద్ధార్థ విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు. అయితే విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. అంతేకాదు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూనివర్సిటీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఒకసారి ముగ్గురు, మరోసారి ఇద్దరి నుంచి స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున కాపీయింగ్ జరిగినట్లు చెబుతున్నారు. అందుకు వైద్య కళాశాలలో కొందరి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమయం కంటే ముందుగానే పేపర్ డౌన్లోడ్ చేసినట్లు కూడా విమర్శలు వచ్చాయి. విద్యార్థులకు గంజాయి.. వైద్య కళాశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఒక కాంట్రాక్టు ఉద్యోగి గంజాయి విక్రయిస్తున్నాడంటూ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదులు అందడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే విచారించి ఆ ఉద్యోగిని విధుల నుంచి తప్పించారు. గంజాయి విక్రయించారా లేదా అనేది ఇప్పటి వరకూ తేల్చలేదు. ఇదిలా ఉంటే, ఆ ఉద్యోగిని మరలా విధుల్లోకి తీసుకోవాలంటూ పలువురు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఎలా తీసుకుంటారని పలువురు ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. మసకబారుతున్న వైద్య కళాశాల ప్రతిష్ట సిద్ధార్థ మెడికల్ కాలేజీలో వ్యవస్థ అస్తవ్యస్తం యథేచ్ఛగా విద్యార్థుల మాస్ కాపీయింగ్ విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు ఉద్యోగుల మధ్య గ్రూపుల గోల ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో దశాబ్దాలుగా ఇక్కడే పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వారంతా గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, తప్పుడు ఫిర్యాదులు ఇస్తూ కళాశాల పరువు తీస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. అంతేకాకుండా అవినీతి, అక్రమాల్లో సైతం వారి పాత్ర ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన ఆరోపణలన్నీ దీర్ఘకాలంగా ఇక్కడే పనిచేస్తున్న వారిపైనే అంటున్నారు. అధికారులు ప్రక్షాళన చేయకుంటే రానున్న రోజుల్లో వైద్య కళాశాల పరువు మరింతగా బజారున పడే అవకాశం ఉందంటున్నారు. పరిస్థితి విషమించక ముందే చర్యలు తీసుకోవాలని పలువురు ఉద్యోగులు హితవు పలుకుతున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కృష్ణలంక జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. విజయవాడకు చెందిన ఓ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్లే క్రమంలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో వారధి వైపు నుంచి జాతీయ రహదారి గుండా భవానీపురం వెళ్తోంది. బస్టాండ్ సమీపానికి చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానిని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కన ఆపాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో నుంచి మంటలు ఎగిసిపడటాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో ప్రయాణికులెవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది, పోలీసులు భావిస్తున్నారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా గోపీ బాధ్యతల స్వీకరణ
చిలకలపూడి (మచిలీపట్నం): జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి.గోపీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న అరుణసారిక బదిలీ కావటంతో విశాఖపట్నం ఏపీ వాల్యూయాడెడ్ ట్యాక్స్ అప్పిలయేట్ ట్రిబ్యూనల్ చైర్మన్‌గా పనిచేస్తున్న జి. గోపీని జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ లోపభూయిష్టం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ లోపభూయిష్టంగా చేశారని ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. గాంధీనగర్‌లోని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన రోస్టర్ విధానంతో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రోస్టర్ విధానాన్ని పక్కనపెట్టి మాల, మాదిగ ఉప కులాలకు సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు ఉన్న 15శాతం రిజర్వేషన్‌ను మాదిగలకు 7, మాలలకు 7, ఉప కులాలకు ఒక శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అప్పుడే మాదిగల 30 ఏళ్ల పోరాటానికి ఫలితం ఉంటుందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ వద్దని, ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన లోపభూయిష్టమైన వర్గీకరణ వల్ల మాదిగలకు నష్టం జరుగుతుంటే, మాదిగలకు ఐకాన్ అని చెప్పుకొనే మంద కృష్ణమాదిగ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఈ నెల 23 నుంచి మే 30వ తేదీ వరకు రాష్ట్రంలోని ముఖ్య నగరాలు, పట్టణాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు చెరుకూరి కిరణ్ మాదిగ, పూనూరు జార్జ్ మాదిగ, మంద నాగమల్లేశ్వరరావు మాదిగ, రెల్లి సంఘం నాయకుడు ఎర్రంశెట్టి ప్రసాద్ రెల్లి పాల్గొన్నారు బీచ్ కబడ్డీ పోటీలకు స్థల పరిశీలన మంగినపూడి(మచిలీపట్నంరూరల్): మండల పరిధిలోని మంగినపూడిబీచ్‌లో మే నెలలో నిర్వహించనున్న బీచ్ కబడ్డీ పోటీలకు అనువైన ప్రదేశం కోసం అధికారులు, స్పోర్ట్స్ అథారిటీ బృందం గురువారం బీచ్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. జాతీయస్థాయి బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించిన మెప్మా పీడీ పి. సాయిబాబు, కబడ్డీ అసోసియేషన్ అధికారులు పరిశీలించి నిర్వ హించే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఆంధ్ర కబ డ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జునరా వు, కృష్ణాజిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు పరిశుభ్రతే లక్ష్యం గన్నవరం: మండలంలోని సూరంపల్లి గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి. అర్జునరావు నేతృత్వంలో అధికారులు పర్యటించారు. గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించిన ఈ బృందం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తోందన్నారు. దీని కోసం ప్రతి గ్రామంలోని ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది తప్పనిసారిగా ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని చెప్పారు. ఈ చెత్త ద్వారా వర్మికంపోస్ట్ ఎరువుల తయారీతో సంపదను సృష్టించాలన్నా రు. సర్పంచ్ ఈలప్రోలు శ్రీనివాసరావు, ఎంపీ డీఓ టి. స్వర్ణలత, ఈఓపీఆర్డీ టి. భారతి, పంచా యతీ కార్యదర్శి టి. లక్ష్మణరావు పాల్గొన్నారు. -
మత్తు మరకలు.. గ్రూపు రాజకీయాలు!
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో దందా సాగిస్తున్నారు. సిండికేట్‌గా మారి రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు. వాస్తవానికి రైతు కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యం ఏ మిల్లుకు చేరుతుందో తెలియదు. మిల్లుకు చేరిన ధాన్యం ఏ రైతుదో మిల్లరుకూ తెలియదు. కానీ ఏ రైతు ధాన్యం మిల్లుకు చేరిందో మిల్లర్లకు తెలిసిపోతోంది. ఎందుకంటే మిల్లర్లు ఇచ్చే కమీషన్‌కు కక్కుర్తి పడి కొందరు అధికారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చిన సొమ్ము వాటాలు వేసుకుంటున్నట్లు సమాచారం. దళారీ రాజ్యం.. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకొని కొందరు మిల్లర్లు దళారులను పంపి ధాన్యం తక్కువ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించి ప్రభుత్వం నిర్ణయించిన బస్తా రూ. 1,740 ధర పొందుతున్నారు. మిల్లర్లకు కొందరు అధికారులు, కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది సహకరిస్తున్నారు. ఎక్కడికక్కడ పర్సంటేజ్లేనని రైతులు చెబుతున్నారు. జిల్లాలో పరిస్థితి.. జిల్లాలో 19,907 మంది రైతులు 50,484.1 ఎకరాల్లో రబీలో వరి సాగు చేశారు. మొత్తం 1,66,470 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారుల అంచనా. జిల్లాలోని 107 కొనుగోలు కేంద్రాల ద్వారా 50వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 17 మిల్లులను ట్యాగ్ చేసింది. ఇప్పటికీ కేవలం 14,281 టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కనీసం 50శాతం కూడా కొనుగోలు చేయలేదు. ఈనెల 3వ తేదీ నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. రైతులు తాము పండించిన ధాన్యాన్ని అకాల వర్షాల నుంచి కాపాడుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే తేమశాతం 17, నూక తక్కువగా ఉండాలి వంటి నిబంధనలు ఉన్నాయి. కల్లాల్లో ఆరబెట్టాలంటే ప్రతి రోజూ ఏదోచోట వర్షం కురుస్తోంది. నిల్వ చేసుకొనేందుకు రైతులకు ఏ మాత్రం అవకాశం లేదు. విధిలేని పరిస్థితుల్లో తక్కువ ధరకు విక్రయించి దందాకు బలైపోతున్నారు.న్యూస్రీల్సిండికేట్గా ఏర్పడి ధాన్యం దోపిడీ రైతు అవసరాలను ఆసరాగా తీసుకొని ధరలో కోత కమీషన్లకు కక్కుర్తిపడి సహకరిస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది ఎవరికీ చెప్పుకోలేక రైతుల దీనావస్థ కేంద్రాల వద్దే కొనుగోల్మాల్ఓ రైస్ మిల్లర్ నుంచి విజయవాడ రూరల్ మండలంలోని రైతుకు ఫోన్ వచ్చింది. ‘మీ ధాన్యం మా మిల్లుకు చేరింది. ధాన్యంలో నూక ఎక్కువగా వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇవ్వడం కుదరదు. ధాన్యం దిగుమతి చేసుకోలేను.. రూ.1400కు అయితే దిగమతి చేసుకుంటా’ అని తెగేసి చెప్పాడు. మరో ముగ్గురు రైతులకు అదే మిల్లరు ఫోన్ చేసి అలాగే మాట్లాడాడు. తాను చెప్పిన ధర అయితే ఓకే.. లేదంటే లేదు అని బెదిరించినంత పనిచేశాడు. వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలు.. ధాన్యం నిల్వ చేసుకొనే సామర్థ్యం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు మిల్లర్ చెప్పిన రేటుకు సరే అని అంగీకరించారు. ఒక్కో రైతు 75 కేజీల బస్తాకు రూ. 340లకు పైగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రంలో సంచులు కూడా పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు. కేంద్రాల్లో నిల్వ ఉండా ల్సిన సంచులు.. ధాన్యం లారీతోపాటే వస్తున్నాయి. లారీలు కూడా సరిగా రావడం లేదు. దళారులు వచ్చి తక్కువ రేటుకు అడుగుతున్నారు. కాదని కొనుగోలు కేంద్రానికి వెళ్తే తేమశాతం పేరుతో ఇంకా ఎండబెట్టాలంటున్నారు. మిల్లర్లపై ప్రభుత్వ నియంత్రణ లేదు. – ఓరుగంటి రాంబాబు, పైడూరుపాడు కొనుగోలు కేంద్రాల కేంద్రంగానే మిల్లర్ల దందా సాగుతోందని సమాచారం. రైతులు తమ ధాన్యం అమ్ముకొనేందుకు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లగానే ఆ సమాచారం మిల్లర్‌కు చేరుతోంది. అంతే వెంటనే ఆ రైతు కల్లాల్లో దళారులు వాలిపోతున్నారు. రైతుల అవసరాలు ఆసరాగా తీసుకొని ధరలో కోత విధిస్తున్నారు. మా ధర ఇంతే అంటూ తెగేసి చెబుతున్నారు. రైతు అంగీకరించకపోతే అతని సమాచారం కొనుగోలు కేంద్రాలకు వెళుతోంది. అక్కడ అతనికి గోనె సంచులు ఇవ్వడం లేదు. ఒక వేళ సంచులు ఇస్తే హమాలీలు కాటా వేసేందుకు వెళ్లడం లేదు. వాతావరణం చూస్తే గంటల వ్యవధిలో మారిపోతోంది. దళారులు కొనుగోలు చేసిన ధాన్యం ముందుగానే కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు చేరుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించి వాటాలు వేసుకుంటున్నారు. మిల్లర్ల తరఫున రైతుల పేరుతో విక్రయించి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. మరి కొందరు రైతుల వద్ద ముందే విత్ డ్రా ఫారాలు తీసుకొని తమ వద్ద ఉంచుకుంటున్నారు. డబ్బు డ్రా చేసి రైతుకు ముందే చెప్పిన ధర మేరకు ఎంత డబ్బు ఇవ్వాలో అంత ఇచ్చేసి, మిగిలిన సొమ్ము మింగేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లర్ల వద్ద ఉండాల్సిన యాప్ కొందరు దళారుల ఫోన్లలోనూ ఉండడం విశేషం. అధికారులు, మంత్రులు పర్యటించిన ఒకటి రెండు రోజులు అంతా హడావుడి చేస్తున్నారు. తర్వాత షరామామూలే. మిల్లర్లపై రాయనపాడు, పైడూరుపాడు రైతులు కొందరు ఏకంగా మంత్రికే విన్నవించారు అయినా పరిస్థితిలో మార్పులేదని చెబుతున్నారు. -
మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు
తిరువూరు: తిరువూరు డివిజన్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి మొక్కుబడి తంతుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. డివిజన్ పరిధిలోని 5 మండలాల్లో 41 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇంతవరకు కేవలం 2,222 టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. గతవారం రోజులుగా భారీ వర్షాల కారణంగా వరిధాన్యాన్ని త్వరితగతిన విక్రయించడానికి రైతులు ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో స్పందన కరువైంది. అవసరానికి తగినట్లు ఖాళీ సంచుల సరఫరాలో సైతం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద రైతులకు మాత్రమే ఈ కేంద్రాల్లో ధాన్యం విక్రయించే అవకాశం లభిస్తోందని, చిన్న రైతుల్ని పట్టించుకోవట్లేదని గంపలగూడెం మండలంలో పలువురు రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో కంటే ప్రైవేటు మిల్లర్లకు, వ్యాపారులకు, దళారులకు విక్రయించడమే సులువని రైతులు భావిస్తున్నారు. సిబ్బందిలో నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కొనుగోలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. రైతులు తమ కల్లాల్లోని ధాన్యాన్ని విక్రయించడానికి ముందుకు వచ్చినా తేమశాతం పరిశీలించడానికి, ధర నిర్ణయించడానికి తమకు తీరిక లేదన్నట్లు పీపీసీ సిబ్బంది వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించారు. కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామని సిబ్బంది చెబుతుండగా, కల్లాల్లోనే తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలని తిరువూరు ఆర్డీవో ఆదేశించారు. ప్రైవేటు వ్యాపారులు తిరువూరు డివిజన్లో 2,300 టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. డివిజన్లోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను గురువారం మరోసారి పరిశీలించిన తిరువూరు ఆర్డీవో మాధురి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.