ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీకి కెనడా సులభతర విధానం | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీకి కెనడా సులభతర విధానం

Published Sun, Jul 22 2018 8:05 AM

కెనడాలోకి అత్యంత సులభంగా ప్రవేశించేందుకు ఆ దేశం ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ కార్యక్రమం పేరుతో సులభతర వలస విధానానికి తలుపులు తెరిచింది. దీంతో ఉపాధి కోసం అమెరికావైపు చూసిన అభివృద్ధి చెందుతున్న దేశాల యువతరం మొదలుకొని కాస్త ప్రశాంత జీవితాన్ని కోరుకునే వారంతా ఇప్పుడు కెనడా వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. అక్కడి వలస విధానంతోపాటు పౌరుల ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలూ తదితరాల్లో ఆ దేశంలో ఉన్న సౌలభ్యాలన్నీ కూడా వలసదారుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

Advertisement
Advertisement