కుత్బుల్లాపూర్: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే.. ప్రజలకు, బాధితులకు కాదు.. డబ్బులు తీసు కుని ఎగ్గొట్టినవారికి ఫ్రెండ్లీ అనేలా ప్రవర్తిం చాడో ఎస్సై. అప్పు ఇచ్చినవారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. నోటికొచ్చిన బూతులు తిడుతూ ‘థర్డ్’డిగ్రీ ఇంటరాగేషన్ చేశాడు.