అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీలను నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మంత్రులతో కలిసి రాచకొండ ప్రాంతంలో హెలికాప్టర్తో ఏరియల్ సర్వే చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీల నిర్మాణానికి రంగారెడ్డి -నల్లగొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతం అనువైనదని ఆయన చెప్పారు. రాచకొండలో దాదాపు 31 వేల ఎకరాల భూమి ఉందని, అందువల్ల ఆ ప్రాంతం పరిశ్రమలు, విద్యాలయాలు, ఇతర సంస్థలు స్థాపించేందుకు చాలా అనుకూలమని కేసీఆర్ అన్నారు
Dec 15 2014 8:51 PM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement