28న రెండోదశ క్రీడాపోటీలు | Sakshi
Sakshi News home page

28న రెండోదశ క్రీడాపోటీలు

Published Thu, Nov 23 2023 12:08 AM

కన్యకాపరమేశ్వరి ఆలయానికి 
తీసుకువచ్చిన అయోధ్య అక్షింతలు  - Sakshi

వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్‌ కళాశాల రెండోదశ క్రీడా పోటీలు ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు వైవీయూ క్రీడాబోర్డు కార్యదర్శి డాక్టర్‌ కె.రామసుబ్బారెడ్డి తెలి పారు. యోగ, టగ్‌ఆఫ్‌వార్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడా ంశాల్లో పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఎలిజిబిలిటీ ఫాంలను వెంట తీసుకురావాలని సూచించారు.

నేటి నుంచి కాలజ్ఞాని జయంతి ఉత్సవాలు

బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రభోదకర్త వీరబ్రహ్మేంద్ర స్వామి 415వ జయంతి ఉత్సవాలను మఠం నిర్వాకులు నేటి నుంచి 25వరకు ఘనంగా జరపనున్నారు. మఠం పిట్‌పర్సన్‌ ఎండో మెంట్‌ ఏసీ శంకర్‌బాలాజీ ఆద్వర్యంలో మేనేజర్‌ ఈశ్వరాచారి ఉత్సవ ఏర్పాట్లను పూర్తి చేశారు. జయంతి ఉత్సవాలు గురువారం ఉదయం సుప్రభాతం వేద పారాయణంతో మొదలుకానున్నాయని మేనేజర్‌ ఈశ్వరాచారి తెలిపారు.

కోటి దీపోత్సవానికి రామయ్య

ఒంటిమిట్ట: హైదరాబాద్‌లో గురువారం జరిగే కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణానికి ఒంటిమిట్ట రామయ్య ఉత్సవమూర్తులను తీసుకెళ్తున్నట్టు ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్‌ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం మూడో శతాబ్దానికి చెందిన ఈ ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ హనుమంతయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒంటిమిట్టకు అయోధ్య అక్షింతలు

ఒంటిమిట్టకు బుధవారం ఆర్‌ఎస్‌ఎస్‌ నేత వేణుగోపాల్‌రాజు ఆధ్వర్యంలో ఆయోధ్య రామ మందిరం నుంచి అక్షింతలు చేరాయి. వీటిని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉంచి నెల పాటు పూజలు చేస్తారు.

బి.మఠంలో ఉద్యానవనంలోని వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం
1/1

బి.మఠంలో ఉద్యానవనంలోని వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం

Advertisement

తప్పక చదవండి

Advertisement