నాణ్యమైన విద్యే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యే లక్ష్యం

Published Tue, Nov 14 2023 1:22 AM | Last Updated on Tue, Nov 14 2023 1:22 AM

చిన్నారులకు విద్యాబోధన చేస్తున్న 
అంగన్వాడీ కార్యకర్త 
 - Sakshi

అంగన్వాడీ శిక్షణను

సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన బోధనను అందించేందుకు ప్రభుత్వం సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు శిక్షణను ఇస్తోంది. ప్రతి ఒక్క కార్యకర్తలు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. – వసంతబాయి, సీడీపీఓ

శిక్షణతో ఉత్తమ ఫలితాలు

అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు నాణ్యమైన బోధనను అందించేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఐసీడీఎస్‌లోని సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తి చేసిన తర్వాత తమపరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించొచ్చు. – శ్రీలక్ష్మి, జిల్లా

సీ్త్ర శిశు సంక్షేమ సాధికారత అధికారి, కడప

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పిల్లలకు మంచి విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకుసాగుతున్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పనితీరును పర్యవేక్షించే సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు పిల్లలకు ఇచ్చే విద్యాబోధనలో నాణ్యత, మెలకువలపై శిక్షణ ఇస్తున్నారు. అందుకోసం పూర్వ ప్రాథమిక విద్యాబోధనపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న తమ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.

ఆరు రోజులపాటు శిక్షణ

వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాల్లో పనిచేస్తున్న ఐసీడీఎస్‌ సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు కడప నగరంలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఒక్కొ బ్యాచ్‌లో 50–60 మంది చొప్పున ఒక్కొ బ్యాచ్‌కు ఆరు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే మూడు బ్యాచ్‌లు చొప్పున శనివారంతో శిక్షణ పూర్తయింది.

కాన్వెంట్లకు దీటుగా విద్యాబోధన

ప్రైవేటు కాన్వెంట్ల కన్నా ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో బోధన ఉండేలా ప్రీ స్కూలు యాక్టివిటీ (పూర్వ ప్రాథమిక విద్య)పై శిక్షణ ఇస్తున్నా రు. ఇంకా ఎక్కువ మంది పిల్లలు కేంద్రాలకు వచ్చేలా శిక్షణా విధానం ఉండగా, ప్రీ స్కూలు కిట్లను కూడా ప్రభుత్వం అందించనుంది.

అంగన్వాడీ కేంద్రాల్లో

ఉత్తమ బోధనకు ప్రభుత్వ చర్యలు

ప్రీ స్కూలు యాక్టివిటీపై

సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు శిక్షణ

వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాలకు కలిపి కార్యక్రమం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement