ముంపువాసులు ఆధార్‌, అకౌంట్‌ పుస్తకాలు ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

ముంపువాసులు ఆధార్‌, అకౌంట్‌ పుస్తకాలు ఇవ్వాలి

Published Sat, Jun 3 2023 12:56 AM

-

జమ్మలమడుగు/కొండాపురం/ఎర్రగుంట్ల : గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన మొదటి విడత 14 గ్రామాల ప్రజలు ఆధార్‌కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ పుస్తకాలు జిరాక్స్‌ కాపీలు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పించాలని ఆర్డీఓ జి.శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముంపు గ్రామాల ప్రజలకు అదనపు పరిహారం మూడు లక్షల 25వేల రూపాయల జమ చేయాలని సంకల్పించింది. దీంతో జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు ఆదేశాల మేరకు ముంపు గ్రామాల బాధితులు వారం రోజుల్లో తమ ఆధార్‌కార్డులు, బ్యాంక్‌ జిరాక్స్‌ కాపీలను తహసీల్దార్‌కు ఇవ్వాలని సూచించారు.

● కొండాపురం మండల తహసీల్దార్‌ శోభనబాబు మాట్లాడుతూ గండికోట జలాశయం కింద ముంపునకు గురైన మొదటి విడత 14 గ్రామాలైన సీతాపురం, గండ్లూరు, చౌటిపల్లె, ఓబన్నపేట, రేపల్లె,బొమ్మేపల్లె,బుక్కపట్నం, దత్తాపురం, ముచ్చుమర్రి, పక్కీరపేట,గంగాపురం,నేదరపేట, దొరువు ముద్దనూరు మండలంలోని కొర్రపాడు గ్రామాలలోని నిర్వాసితులు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాసు పుస్తకం జిరాక్స్‌ కాపీలు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో ఇవ్వాలన్నారు. ఎర్రగుంట్ల తహసీల్దార్‌ ఎ నాగేశ్వరరావు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.

Advertisement
Advertisement