చరిత్ర లిఖించబోతున్నాం | Sakshi
Sakshi News home page

చరిత్ర లిఖించబోతున్నాం

Published Thu, Nov 9 2023 1:40 AM

-

కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని, మార్పుకోసం ఎదురుచూస్తున్నారని భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. 20 రోజుల్లో భువనగిరి ఖిలాపై కాంగ్రెస్‌ జెండా ఎగరవేసి చరిత్ర లిఖించబోతున్నామని పేర్కొన్నారు.బుధవారం భువనగిరిలో నామినేషన్‌ వేసిన అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రం చేసుకుని డబ్బులు దండుకున్నారే తప్పా చేసిందేమీ లేదని ఆరోపించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డులో బాధిత రైతులకు బేడీలు వేయించిన ఘనత పైళ్ల శేఖర్‌రెడ్డికే దక్కిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, మూసీ ప్రక్షాళన చేపడుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆడెంసంజీవరెడ్డి, పీసీసీ కమిటీ సభ్యులు తంగెళ్లపల్లి రవికుమార్‌, పోత్నక్‌ప్రమోద్‌కుమార్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బర్రె జహంగీర్‌, పాక మల్లేష్‌ యాదవ్‌, తుమ్మల యుగందర్‌ రెడ్డి,జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, అనిల్‌రెడ్డి, కుటుంబ సభ్యులు కీర్తిరెడ్డి, స్ఫూర్తిరెడ్డి, శ్రీ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కదిలిన కాంగ్రెస్‌ దండు

అనిల్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌కు కార్యకర్తలు, జనం భారీగా తరలివచ్చారు.సాయిబాబా ఆల యం నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.

పూజలు, ప్రార్థనలు

అనిల్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ వేయడానికి ముందు తల్లి కుంభం సుశీలమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి దర్శనం చేసుకున్నారు. అలాగే పడమటిసోమవారం బసవలింగేశ్వర స్వామి ఆలయం, భువనగిరి ఎల్లమ్మ దేవాలయం, కిసాన్‌ నగర్‌ దర్గా, గాస్పల్‌ చర్చిలో పూజలు, ప్రార్థనలు చేశారు.

Advertisement
Advertisement