బాణసంచా దుకాణాల వద్ద నిబంధనలు తప్పనిసరి | Sakshi
Sakshi News home page

బాణసంచా దుకాణాల వద్ద నిబంధనలు తప్పనిసరి

Published Sun, Nov 12 2023 1:46 AM

వ్యాపారులతో మాట్లాడుతున్న ఎస్పీ రవిప్రకాష్‌  - Sakshi

సాక్షి, భీమవరం: దీపావళి మందుగుండు సామగ్రి విక్రయషాపుల వద్ద ఎటువంటి ప్రమాదాలకు తావులేకుండా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఎస్పీ యు.రవిప్రకాష్‌ అన్నారు. శనివారం పట్టణంలోని బాణసంచా దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లైసెన్స్‌ నిబంధనల ప్రకారం భద్రతాపరమైన ప్రమాణాలను పాటించాలన్నారు. మందుగుండు నిల్వ కేంద్రాలు, దుకాణాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యజమానులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా మందుగుండు సామగ్రి నిల్వ చేసినా, విక్రయించిన వారిపై పేలుడు పదార్థాల చట్టం, ఐపీసీ సెక్షన్‌ ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రవిప్రకాష్‌ హెచ్చరించారు. ఎంపిక చేసిన బహిరంగ ప్రదేశాలలో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకుని నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు. నీరు, ఇసుక వంటి అగ్నిమాపక సామగ్రిని తప్పనిసరిగా విక్ర య దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలన్నా రు. 18 ఏళ్లలోపు పిల్లలను విక్రయాల పనుల్లో పెట్టరాదన్నారు. దీపావళి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని బాణసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రవిప్రకాష్‌ సూచించారు.

Advertisement
Advertisement