ప్రైవేటు జోరు.. | Sakshi
Sakshi News home page

ప్రైవేటు జోరు..

Published Mon, Dec 11 2023 12:12 AM

అమరచింత శివారులో కొనుగోలు చేసిన వరి ధాన్యం తూకం చేయిస్తున్న ప్రైవేటు వ్యాపారులు - Sakshi

వనపర్తి
సోమవారం శ్రీ 11 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2023

వివరాలు 8లో u

అధిక ధర లభిస్తుండటంతో..

ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో జిల్లా రైతులు ఎక్కువగా సన్నరకం వరిధాన్యం సాగుచేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు రకాలకు ఒకేధర ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు కాస్త ఎక్కువ ధరకు పొలాల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధర అధికంగా వస్తుండటంతో రైతులు ప్రైవేటులోనే విక్రయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరో 15 రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగియవచ్చు.

– కొండల్‌రావు,

డీఎం, పౌరసరఫరాలశాఖ

వనపర్తి: ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. జిల్లాలో ఈసారి ఎక్కువ మంది రైతులు సన్నరకాలు సాగు చేసేందుకు మొగ్గుచూపారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు ఇలా ఏ రకం ధాన్యమైనా క్వింటాకు (ఏ–గ్రేడ్‌) రూ.2,203 మద్దతు ధర నిర్ణయించడం.. ప్రైవేటు మార్కెట్‌లో సన్నరకం వరి ధాన్యానికి డిమాండ్‌ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు రైతుల పొలాలు, కల్లాల వద్దే కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ధాన్యం లేక వెలవెలబోతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది 1.87 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా.. 4.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించుకుని జిల్లావ్యాప్తంగా 210 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు కేవలం 75,998 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ఇప్పటి వరకు 80 శాతం పంటలు కోసినా.. ప్రభుత్వం కొన్న ధాన్యం కేవలం 15 శాతమే. మిగతా 65 శాతం ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పొలాల వద్దే కొన్న ధాన్యమే అని చెప్పవచ్చు.

రాయచూర్‌ మార్కెట్‌కు భారీగా..

జిల్లాలోని అమరచింత, ఆత్మకూరు, మదనాపురం తదితర ప్రాంతాల్లో పండించిన వరిధాన్యాన్ని ఆ ప్రాంత వ్యాపారులు పొలాల వద్దే ఎంఎస్‌పీ ధరకు కొనుగోలు చేయటంతో రైతులు ప్రభుత్వ కేంద్రాల వైపు చూడటం లేదని చెప్పవచ్చు. రవాణా చార్జీలు, తేమశాతం ఇబ్బందులు, సంచులు, హమాలి సమస్యలు లేకుండా పొలాల వద్దనే తూకం చేసి నగదు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు సైతం ప్రైవేటు వ్యాపారులకే విక్రయించేందుకు ఆసక్తి చూపించారు.

రూ.59.39 కోట్ల చెల్లింపులు..

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 210 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 11,303 మంది రైతులు 75,998 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని విక్రయించగా.. వారికి రూ.156.56 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 6,713 మంది రైతులు రూ.59.39 కోట్ల చెల్లింపులు చేశారు. మిగతా చెల్లింపులు ధాన్యం మిల్లులకు తరలించి ట్రక్‌షీట్‌లు, ట్యాబ్‌ ఎంట్రీలు చేసిన తర్వాత రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉండింది.

న్యూస్‌రీల్‌

నేడు కలెక్టరేట్‌లో

మంత్రి జూపల్లి సమీక్ష

వనపర్తి: కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జిల్లా తరఫున మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆయా శాఖల అధికారులు సమగ్ర ప్రగతి నివేదికలతో ఉదయం 10 వరకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో హాజరుకావాలని కలెక్టర్‌ సూచించినట్లు తెలిసింది. ఉదయం ప్రజావాణి అనంతరం మధ్యాహ్నం మంత్రి, ఎమ్మెల్యేలతో సమీక్ష ఉంటుందని.. జిల్లా ఏర్పాటు తర్వాత మంజూరైన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధులు, బ్యాలెన్స్‌ షీట్‌ తదితర వాటిపై సమీక్షించనున్నట్లు సమాచారం. మంత్రి జూపల్లి మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటి అధికారిక సమావేశం వనపర్తి జిల్లాలో నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు 95.30 శాతం హాజరు

వనపర్తిటౌన్‌: నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష ఆదివారం జిల్లాకేంద్రంలో ప్రశాంతంగా ముగిసింది. 8వ తరగతి విద్యార్థులు ఇంటర్మీడియట్‌ వరకు స్కాలర్‌షిప్‌ పొందేందుకు ప్రతి ఏటా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో రెండు, బాలికల ఉన్నత పాఠశాలలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష కొనసాగింది. మొత్తం 511 మంది విద్యార్థులకుగాను 487 మంది హాజరుకాగా.. 24 మంది గైర్హాజరయ్యారు. 95.30 శాతం హాజరు నమోదైంది. పరీక్షను డీఈఓ నరహరి పర్యవేక్షించారు.

ఆత్మకూరు, అమరచింతలో పూర్తిగా ప్రైవేట్‌ కొనుగోళ్లే..

కర్ణాటక రాయచూరు మార్కెట్‌ వ్యాపారులు ఎక్కువగా ఉండే ఆత్మకూరు, అమరచింత మండలాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా ఏర్పాటు చేశారు. జూరాల ప్రధాన ఎడమకాల్వ ఆయకట్టులో పండించిన ధాన్యం ఎక్కువగా రాయచూరు వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడ ఎక్కవ ధర లభిస్తే.. రైతులు వారికే ధాన్యం విక్రయించుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఈ కోవలోనే.. ఈ ఏడాది వానాకాలం సీజన్‌ వరిధాన్యం ప్రైవేటు వ్యాపారులకే ఎక్కువగా విక్రయించారు.

ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో

15 శాతం మించని

వరి ధాన్యం కొనుగోళ్లు

జిల్లా లక్ష్యం 4.70 లక్షల

మెట్రిక్‌ టన్నులు

ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది 75,998 మె.ట. మాత్రమే

రాయచూర్‌ మార్కెట్‌కు

భారీగా తరలుతున్న వైనం

రైతుల కల్లాల వద్దే కొనుగోళ్లు

మిగిలింది 20 శాతమే..

జిల్లాలోని అమరచింత, ఆత్మకూరు, మదనాపురం, కొత్తకోట, పెద్దమందడి, ఖిల్లాఘనపురం, గోపాల్‌పేట, రేవల్లి తదితర ప్రాంతాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. ఆలస్యంగా సాగుచేసిన పెబ్బేరు, శ్రీరంగాపురం, వనపర్తి మండలంలోని కొంతభాగం, వీపనగండ్ల మండలంలోని గ్రామాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. మరో 15 రోజుల్లో వానాకాలం పంటల కోతలు పూర్తి కానున్నట్లు అధికారుల అంచనా.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్రాక్టర్‌లో నింపుతున్న హమాలీలు
1/2

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్రాక్టర్‌లో నింపుతున్న హమాలీలు

2/2

Advertisement
Advertisement