రగులుతున్న ‘పెద్ద’మందడి.. | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 2 2023 8:10 AM

-

నపర్తి జిల్లాలోని ఓ ముఖ్యనేతకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశాడనే ఫిర్యాదు మేరకు పెద్దమందడి మండలం మనిగిళ్లకి చెందిన శివయాదవ్‌పై పోలీసులు 505(2), 504, 506ఆర్‌/డబ్ల్యూ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. గత నెల 22న మధ్యాహ్నం ఆ యువకుడిని వనపర్తి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకున్న పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అతడి ఒంటిపై, వెనుక పిరుదుల భాగంలో తీవ్ర గాయాలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రోజంతా విచక్షణారహితంగా చిత్రహింసలకు గురి చేసినట్లు బాధితుడు స్వయంగా వెల్లడించడం బీఆర్‌ఎస్‌శ్రేణులతో పాటు ప్రజలు ఉలిక్కిపడ్డారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి అతడిపై పోలీసులు ప్రతాపం చూపించడం వెనుక ముఖ్యనేత ప్రోద్బలమే కారణమని భావిస్తున్నారు. ఈ క్రమంలో విపక్షపార్టీలతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టడంతో జిల్లా అట్టుడుకుతోంది.

Advertisement
Advertisement