సీబీఎస్‌ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల

Published Wed, May 15 2024 8:20 AM

సీబీఎ

సత్తా చాటిన కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు

విజయనగరం అర్బన్‌: జాతీయస్థాయి సీబీఎస్‌ఈ సిలబస్‌లో పదవ, పన్నెండవ తరగతుల ఫైనల్‌ పరీక్షా ఫలితాల్లో విజయనగరంలోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు. ఈ మేరకు విద్యాలయం ప్రిన్సిపాల్‌ దిలీప్‌మోడీ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతి ఫలితాలలో ఎంపీ గాయత్రి వసంత 97.4 శాతంతో 487 మార్కులు తెచ్చుకుని ప్రథమస్థానంలో నిలించిందని తెలిపారు. సీహెచ్‌.ప్రవల్లిక 467 మార్కుల (93.4 శాతం)తో ద్వితీయ స్థానం, కేవీకేఎన్‌ఎస్‌ఆర్‌శ్రీకర్‌ 465 మార్కుల (93 శాతం) తృతీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. అదేవిధంగా పన్నెండవ తరగతిలో జి.వెంకటగాయత్రి అమృత 456 మార్కుల(91.2 శాతం)తో ప్రథమ స్థానంలో జి.లక్ష్మిసాయి ప్రశాంతి 442 మా ర్కుల (88.4 శాతం)తో ద్వితీయ స్థానంలో, పి.సాయిమహిత లిఖిత 437 మార్కుల(87.4 శాతం)తో తృతీయ స్థానంలో నిలిచారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులు, మంచి ఫలితాలను అందించిన అధ్యాపకులను ప్రిన్సిపాల్‌ అభినందించారు.

ఆకట్టుకున్న ఆధ్యాత్మిక ప్రవచనం

విజయనగరం టౌన్‌: విజయనగరం మూడులాంతర్లు వద్దనున్న పైడితల్లి చదురుగుడి ఆవరణలో మంగళవారం రాత్రి ఆర్‌.బి.రామానాయుడు ఆధ్యాత్మిక ప్రసంగం ఆద్యంతం ఆహు తులను ఆకట్టుకుంది. అమ్మవారి జీవిత చరిత్ర, అమ్మవారి విశిష్టతను భక్తులకు వివరించారు. ఆయనను ఆలయ కార్యనిర్వహణాధికారి డీవీవీ.ప్రసాదరావు దుశ్సాలువతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పైడిమాంబ కళాపీఠం వ్యవస్థాపకుడు ఆర్‌.సూర్యపాత్రో, సూపర్‌వైజర్‌ ఏడుకొండలు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నాగావళి నది పరిసర

ప్రాంతాల్లో ఏనుగులు

జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి గ్రామ సమీపంలోని నాగావళి నదిలో ఏనుగులు మంగళవారం మధ్యాహ్నం వరకు సేదతీరాయి. సాయంత్రానికి అరటి, పామాయిల్‌ తోటలోకి చేరుకున్నాయి. ఏనుగుల సంచారంతో అరటి పంటకు నష్టం వాటిల్లుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఏనుగులను తరలించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.

గుర్తు తెలియని

మహిళ మృత దేహం

బొబ్బిలి: మండలంలోని రాముడు వలస–శివడ వలస గ్రామాల మధ్యలోని మామిడి తోటలో పడి ఉన్న గుర్తు తెలియని మహిళ మృత దేహాన్ని గుర్తించినట్టు ఎస్సై జి.లోవరాజు మంగళవారం రాత్రి తెలిపారు. అటువైపుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న రాముడు వలస గ్రామస్తులకు దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి పోలీ సులు చేరుకుని పరిశీలించారు. మహిళ చనిపోయి నాలుగు రోజులై ఉండొచ్చని ప్రాథమికంగా గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు. మహిళ ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారనే విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు. మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం జరుగుతుందన్నారు.

సీబీఎస్‌ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
1/3

సీబీఎస్‌ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్‌ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
2/3

సీబీఎస్‌ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల

సీబీఎస్‌ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
3/3

సీబీఎస్‌ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల

Advertisement
 
Advertisement
 
Advertisement