అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం | Sakshi
Sakshi News home page

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

Published Thu, Dec 7 2023 4:30 AM

సమావేశంలో మాట్లాడుతున్న 
ఎంపీ రంజిత్‌రెడ్డి  - Sakshi

ఎంపీ రంజిత్‌రెడ్డి

మోమిన్‌పేట: ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపోటములు సహజమని, ఎవరూ అధైర్యపడరాదని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఏజేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌తో కలిసి మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోట ములు సహజమన్నారు. ఆనంద్‌ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించారని పేర్కొన్నా రు. ప్రజలు మార్పును కోరుకున్నారని, వారి అభీష్టం మేరకు నడుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు డీ వెంకట్‌,మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రతిఒక్కరికీ

దైవచింతన ఉండాలి

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

అనంతగిరి: ప్రతి ఒక్కరికీ దైవచింతన ఉండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం వికారాబాద్‌ పట్టణంలోని గిరిధర్‌రెడ్డి నివాసంలో రుద్రాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని శివునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలన్నారు. వికారాబాద్‌లో నెల రోజులుగా రుద్రాభిషేకాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా లక్ష్మణ్‌

వికారాబాద్‌ అర్బన్‌: ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాలె లక్ష్మణ్‌ గుప్తాను నియమించారు. ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కటకం శివకుమార్‌ గుప్తా బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, ఆర్యవైశ్య సంఘం కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న లక్ష్మణ్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ గుప్తా మాట్లాడుతూ.. తనపై ఎంతో నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.

వ్యాక్సినేషన్‌ వివరాల నమోదు తప్పనిసరి

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి

కొత్తూరు: వ్యాక్సినేషన్ల వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేయాలని షాద్‌నగర్‌ ఏరియా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి ఆదేశించారు. బుధవారం ఆమె మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్‌ సబ్‌సెంటర్‌ను పరిశీలించి ఏఎన్‌ఎంలకు పలు సూచనలిచ్చారు. అనంతరం టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్‌ హరికిషన్‌, ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది ఉన్నారు.

స్వామివారికి హారతి ఇస్తున్న 
ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు
1/3

స్వామివారికి హారతి ఇస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు

వైద్య సిబ్బందికి సూచనలు ఇస్తున్న
డాక్టర్‌ జయలక్ష్మి
2/3

వైద్య సిబ్బందికి సూచనలు ఇస్తున్న డాక్టర్‌ జయలక్ష్మి

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement