శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్‌ లీక్‌.. | Water leakage In Srisailam Dam | Sakshi
Sakshi News home page

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో వాటర్‌ లీక్‌..

Jan 1 2025 1:44 PM | Updated on Jan 1 2025 3:06 PM

Water leakage In Srisailam Dam

సాక్షి, శ్రీశైలం: శ్రీశైలం డ్యామ్ తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో నీరు లీకేజ్ ఘటన వెలుగు చూసింది. అయితే, డ్యామ్‌కు మాత్రం ఎటువంటి ప్రమాదం లేదని తెలంగాణ జెన్కో అధికారులు చెబుతున్నారు.

వివరాల ప్రకారం.. శ్రీశైలం డ్యామ్ తెలంగాణ(ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో నీరు లీకేజ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వరుసగా పంప్ మోడ్ ఆపరేషన్ చేస్తుండటంతో బట్టర్ ఫ్లై వాల్వు వద్ద నీరు లీక్‌ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే, నీరు లీకేజీ కారణంగా డ్యామ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని జెన్కో అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిపుణులతో చర్చించి నివేదికను రూపొందిస్తామని అధికారులు చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement