Telangana new Record With Liquor Sales in December - Sakshi
Sakshi News home page

Liquor Sales: తెలంగాణలో లిక్కర్‌ సేల్స్‌ రికార్డుల మోత

Jan 1 2022 12:47 PM | Updated on Jan 1 2022 6:24 PM

Telangana new Record With Liquor Sales in December - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రికార్డ్‌ స్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ తెలిపింది. డిసెంబర్‌ నెలలోనే తెలంగాలో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే రూ.171 కోట్ల లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. గత ఐదు వ్యవధిలోనేనే రూ.902 కోట్ల మద్యాన్ని మందుబాబులు స్వాహా చేశారు.

గతంలో ఎన్నడూ లేనంతగా డిసెంబర్‌ నెలలో 3,435 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం డిసెంబర్‌లో 2,764 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2020లో 25,602కోట్ల అమ్మకాలు జరగ్గా.. 2021 శుక్రవారం సాయంత్రానికే 30,196 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో 6,970 కోట్లు, నల్గొండ జిల్లాలో 3288 కోట్లు, హైదరాబాద్‌లో 3,201 కోట్ల అమ్మకాలు నమోదయినట్లు ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది.

చదవండి: (కేకలు, అరుపులు.. జూబ్లీహిల్స్‌లో యువతి హల్‌చల్‌)

Advertisement
 
Advertisement
Advertisement