కియారా మాత్రమే కాదు.. | Sakshi
Sakshi News home page

కియారా మాత్రమే కాదు..

Published Sat, May 25 2024 12:10 PM

కియార

కూలీ తరువాత దానికి సీక్వెలే

నటి జాన్వీకపూర్‌

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ జోరు మామూలుగా లేదుగా! ఎవరన్నారు ఈయన వయసు ఏదు పదులకు పైన అనీ. ఆ వయసులో నాన్నా, తాత వంటి క్యారెక్టర్‌ పాత్రల్లో నటిస్తారు. అయితే ఇక్కడున్నది సూపర్‌స్టార్‌. సూపర్‌హిట్‌ చిత్రాల ఎవర్‌గ్రీన్‌ హీరో. ఇటీవల రజనీకాంత్‌ కధానాయకుడిగా నటించిన జైలర్‌ చిత్రం ఇండిస్ట్రీ ిహిట్‌ గా నమోదైంది. ప్రస్తుతం జైభీమ్‌ చిత్రం ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వేట్టైయాన్‌ చిత్రంలో నటించారు. ఇది ఈయన నటించిన 170వ చిత్రం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్‌ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే వేట్టైయాన్‌ తెరపై వసూళ్ల వేటకు సిద్ధం అవుతోంది. కాగా రజనీకాంత్‌ తాజాగా తన 171వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని సెన్సేషనల్‌ దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ తెరకెక్కించనున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానుంది. దీనికి కూలీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నటి శృతిహాసన్‌ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ప్రారంభం కాక ముందే రజనీకాంత్‌ తదుపరి చిత్రం గురించి ప్రచారం జరుగుతోంది. ఆయన నటించనున్న 172వ చిత్రం జైలర్‌ 2 అని తాజా సమాచారం. రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దర్శకత్వం వహించిన జైలర్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌ ఉంటుందని నెల్సన్‌ అప్పుడే పేర్కొన్నారు. కాగా జైలర్‌ 2 చిత్రానికి కథను రెడీ చేసినట్లు, దీనికి ఆ చిత్రంలో చోటు చేసుకున్న హుకుమ్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో రజనీకాంత్‌ కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ చి త్రం అవుతుందని చె ప్పవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన రావడానికి మరి కొంత కాలం పడుతుంది.

తమిళసినిమా: బాలీవుడ్‌ హీరోయిన్లు ఇప్పుడు దక్షిణాదిపై ఆసక్తి చూపుతున్నారన్నది కాదన్నలేని నిజం. ప్రముఖ ఉత్తరాది బ్యూటీలు సైతం దక్షిణాది చిత్రాల అవకాశాలకు సై అంటున్న వైనం. ఇలియా నా, తమన్నా, కాజల్‌, తాప్సీ, హన్సిక వంటి పలువురు బాలీవుడ్‌ భామలు దక్షిణాదిలో ఎదిగిన వారే. ఇప్పుడు కూడా కియారా, దిశాపటాని వంటి క్రేజీ హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ పాన్‌ ఇండియా నటీమణులుగా రాణిస్తున్నారు. తాజాగా నటి జాన్వీకపూర్‌ ఈ పట్టికలో చేరారు. దివంగత అందాలరాశి శ్రీదేవి వారసురాలైన ఈ మగువ ఇప్పటికే తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన దేవర చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో రామ్‌చరణ్‌తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే నటి కియారా అద్వానీ తెలుగులో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌కు జంటగా గేమ్‌ చేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈ ఇద్దరూ కలిసి ఒక చిత్రంలో నటిస్తే. అదీ తమిళ సినిమా అయితే, అందులో సంచలన నటుడు శింబు కథానాయకుడు అయితే, ఆ చిత్రం వేరే లెవల్‌గా ఉంటుంది కదూ ఎస్‌ అలాంటి క్రేజీ చిత్రం త్వరలోనే తెరకెక్కబోతోందన్నది తాజా సమాచారం. శింబు ప్రస్తుతం కమలహాసన్‌ హీరోగా నటిస్తున్న థగ్‌లైఫ్‌ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ దశలో ఉంది. విశేషం ఏమిటంటే ఇందులో శింబుకు జంటగా నటి త్రిష నటిస్తున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. ఇకపోతే ఈ చిత్రం తరువాత శింబు తన 48వ చిత్రంలో నటించనున్నారు. దీన్ని నటుడు కమలహాసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించనుంది. దీనికి దేశింగు పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నా యి. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవ ల విడుదల చేసిన సంగ తి తెలిసిందే. అందులో ఇద్ద రు శింబులు తలపడేలా ఉన్న దృశ్యం చోటు చేసుకుని చిత్రంపై అంచనాలను పెంచేసింది. కాగా శింబు ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు, అందులో ఒక పాత్ర హీరో, మరో పాత్ర విలన్‌ అనీ, అందేలా ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఒక కథానాయకిగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఇకపోతే తాజాగా మరో నాయకిగా జాన్వీకపూర్‌ను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇదే కనుక నిజం అయితే ఈ క్రేజీ చిత్రం ద్వారా నటి కియారా, జాన్వీకపూర్‌ ఇద్దరూ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. చిత్రం జూన్‌ నెలలోనే సెట్‌ పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రజనీకాంత్‌

కియారా మాత్రమే కాదు..
1/1

కియారా మాత్రమే కాదు..

Advertisement
 
Advertisement
 
Advertisement