ఈవీఎంలు మొరాయించిన ప్రాంతాలు ఇవే.. | Sakshi
Sakshi News home page

ఈవీఎంలు మొరాయించిన ప్రాంతాలు ఇవే..

Published Tue, May 14 2024 12:30 PM

-

● కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండలం 74వ పోలింగ్‌ కేంద్రంలో మాక్‌ పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎం మొరాయించింది. దీంతో అరగంటపాటు పోలింగ్‌ ఆగిపోయింది. తరువాత సరిచేయడంతో పోలింగ్‌ కొనసాగింది. మునగాల మండలంలోని 81వ బూత్‌లో కూడా ఈవీఎం మొరాయించడంతో కాసేపు పోలింగ్‌ ఆగిపోయింది.

● సాగర్‌ నియోజకవర్గంలోని హాలియాలోని 162వ పోలింగ్‌ స్టేషన్‌లో ఉదయం 7.30 గంటలకు ఈవీఎం కొద్దిసేపు మొరాయించింది. దీంతో ఈవీఎంను మార్చేసి పోలింగ్‌ను కొనసాగించారు. పెద్దవూరలోని 81వ పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎం మొరాయించడంతో 20 నిమిషాల పాటు పోలింగ్‌ నిలిచిపోయింది. నిడమనూరు మండలం బంకాపురంలో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్‌ అరగంట పాటు ఆలస్యమైంది.

● దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం కుర్మేడులోని 11వ బూత్‌లో వీవీ ప్యాట్‌ పనిచేయకపోవడంతో దానిని మార్చారు.

● హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం వజినేపల్లిలో ఈవీఎం మొరాయించడంతో కొద్దిసేపు పోలింగ్‌ ఆగిపోయింది. చింతలపాలెం, నక్కగూడెం గ్రామాల్లో వీవీ ప్యాట్స్‌ పనిచేయకపోవడంతో వాటిస్థానంలో కొత్తవి అమర్చారు.

● మిర్యాలగూడ మండలం జైత్యతండాలో ఈవీఎం నిర్వహణపై అవగాహన లేకపోవడంతో పోలింగ్‌ ఆరగంట పాటు నిలిచిపోయింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో సెక్టోరియల్‌ అధికారి వచ్చి దాన్ని ప్రారంభించడంతో పోలింగ్‌ కొనసాగింది.

● సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని 21వ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం కాసేపు మోరాయించింది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో టెక్నికల్‌ సిబ్బంది వచ్చి సరిచేశారు.

● పెన్‌పహాడ్‌ మండలం జలమాలకుంటతండా పోలింగ్‌ స్టేషన్‌లో వీవీ ప్యాట్‌ పనిచేయలేదు. దీంతో పోలింగ్‌ కొద్దిసేపు ఆగింది. అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాని మరొకటి ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement