ఓటు హక్కు ఆవశ్యకత తెలుపుతూ వైఎస్సార్‌ క్రాంతి పథం ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ఇలా రంగవల్లులు వేశారు. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి ఆర్‌ హెచ్‌ కాలనీలో వీఓఏ వి.లత వేసిన రంగవల్లిక చూపరులను ఆకట్టుకుంది. – ఇచ్ఛాపురం రూరల్‌

- - Sakshi

● ఓటు విలువ తెలుసుకో..
● పోలీసుల తనిఖీల్లో రూ.1,37,420 పట్టివేత
● సోషల్‌ మీడియా.. తగ్గాలయ్యా

ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ శివార్లలో తిమ్మాపురం జంక్షన్‌ వద్ద ఎన్నికల విధుల్లో భాగంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహించా రు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.1,37,420 పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఆమదాలవలస ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు. శ్రీకాకుళం పట్టణం బొందిలీపురానికి చెందిన టి.నాగేంద్రప్రసాద్‌ హోండా బైక్‌పై పాలకొండవైపు వెళ్తూ తనతోపాటుగా రూ. 82,820ను ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకువెళ్తున్నారు. అలాగే శ్రీకాకుళం ఇలిసిపురానికి చెందిన జి. శ్రీను రూ.54,630 పత్రాలు లేకుండా తీసుకు వెళ్తుండగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ చేసి ఆ మొ త్తాన్ని, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొని ఆమదాలవలస పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని, రెండు వాహనాలను సీజ్‌ చేసి, దీనికి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

హిరమండలం, ఆమదాలవలస రూరల్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బయట కంటే సోషల్‌ మీడియా వేదికగానే ఎక్కువ యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోస్టింగ్‌లపై కూడా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఎవరైనా ద్వేషపూరిత, అసత్య, సమాజంలో అలజడులు రేపే పోస్టింగ్‌లు పెడితే వెంటనే చర్యలు చేపట్టే ఏర్పాట్లు చేశారు. రాజకీయ నాయకులు ఊరూరా తిరుగుతుండడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నా రు. ఈ క్రమంలోనే కొన్ని అరాచక శక్తులు విద్వేషాలు రాజేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు ఎన్నికల కమిషన్‌ నడుం బిగించింది. సోషల్‌ మీడియాపై అన్ని శాఖల అధికారుల ద్వారా నిఘా ఉంచింది. ఫొటో మార్ఫింగ్‌, అశ్లీల చిత్రాలు పంచుకో వడం ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా సందేశాలు పంపడం, తదితర కార్యకలాపాలకు పాల్పడితే ఐటీ యాక్ట్‌ –2000 సెక్షన్‌–67 కింద కేసు చేస్తారు. నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా విధిస్తారు. సోషల్‌ మీడి యా గ్రూపు సభ్యులు అభ్యంతరకరమైన, వివాదాస్పద పోస్టులు, కామెంట్లు పెట్టినా అడ్మిన్‌ వెంటనే డిలీట్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే పోస్టింగ్‌ చేసిన సభ్యుడితో పాటు గ్రూపు అడ్మిన్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఫిర్యాదు చేస్తే కేసు..

సామాజిక మాధ్యమాల్లో ఎవరిపైనా వ్యక్తిగతంగా గానీ, పార్టీలపై గానీ అసత్య ప్రచారం చేయ కూడదు. పోటీ చేసే అభ్యర్థులపై కార్టూన్‌, మీ మ్స్‌, షార్ట్‌ వీడియోల ద్వారా అసత్య ప్రచారం చేసినట్లు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే పోలీసులు, ఎన్నికల అధికారులు కేసు లు నమోదు చేస్తారు. చట్టవిరుద్ధమైన ప్రకటన లు, రాజ్యాంగ ఉల్లంఘన, ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసినా, ఐపీసీ–504,505 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేస్తారు. సోషల్‌ మీడియాలో ఎన్నికల ప్రచార ప్రకటనలకు ముందు జిల్లా, రాష్ట్ర స్థాయిలోని మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. దీనికి తోడు సోషల్‌ మీడియా ప్రచారం కూడా పెయిడ్‌ న్యూస్‌ కిందకే వస్తుందని స్పష్టం చేశారు.

ప్రచారాలకు అనుమతులు ఉండాల్సిందే: కలెక్టర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో రాజకీయ నాయకుల ప్రచారాలకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు చేపడితే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని రిటర్నింగ్‌ అధికారు లు, ఎంసీసీ అధికారులు, నోడల్‌ అధికారులు, కంట్రోల్‌ రూం అధికారులతో ఆయన మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లౌడ్‌ స్పీకర్‌లకు అనుమతులు తప్పనిసరి అని అన్నా రు. తాత్కాలిక పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసినా, ప్రచారానికి వాహనాలు వినియోగించినా, వీధుల్లో సమావేశాలు నిర్వహించినా, సభావేదికలు, బారికేడ్లు ఏర్పాటు చేసినా, అంతర్‌జిల్లాల్లో తిరిగే వాహనాలకు, ఇంటింటా ప్రచారాలకు, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆన్‌లైన్‌ అనుమతులు 48 గంటల్లో మంజూరు చేస్తామని తెలిపారు. ఆఫ్‌లైన్‌లో సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేస్తే 24 గంటల్లో అనుమతి వస్తుందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఈ సూచనలు పాటించాలని కోరారు.

Election 2024

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top