టీబీ డ్యాంకు మొదలు కాని ఇన్‌ఫ్లో | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంకు మొదలు కాని ఇన్‌ఫ్లో

Published Sun, May 26 2024 7:40 AM

టీబీ డ్యాంకు మొదలు కాని ఇన్‌ఫ్లో

బొమ్మనహాళ్‌: కర్ణాటకలోని హోస్పేట్‌ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో ఇంకా మొదలుకాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయంలో అకాల వర్షాల కారణంగా ఆడపాదడపా జలాశయానికి వరద నీరు చేరింది. గతేడాది మే 7 నుంచి డ్యాంలో నీటి చేరిక మొదలై ఈ సమయానికి 1.035 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి వస్తుండగా 4.200 టీంఎసీలు నిల్వ ఉండేది. అయితే ఈ ఏడాది ఇప్పటికీ ఇన్‌ఫ్లో జీరో ఉండగా నీటి నిల్వ 3.365 ఎంసీటీలుగా ఉంది. జలాశయం నుంచి అన్ని కాలువలకు నీటి విడుదలను నిలిపి వేసి కేవలం రాయబసవన కాలువకు 12 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారు. కొద్ది రోజులుగా నీటి నిల్వలో మార్పు కనబడకపోగా ఆవిరి రూపంలో నీటి మట్టం తగ్గుతోంది. శనివారం డ్యాంలో 1577.47 అడుగుల వద్ద 3.365 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూన్‌ మొదటి వారం నుంచి జలాశయానికి నీటి చేరిక మొదలయ్యే అవకాశాలున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement