23న ఉమ్మడి నెల్లూరు జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక | Sakshi
Sakshi News home page

23న ఉమ్మడి నెల్లూరు జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక

Published Wed, Nov 22 2023 12:06 AM

-

కావలి: పట్టణంలోని మినీ స్టేడియంలో ఈ నెల 23న ఉమ్మడి నెల్లూరు జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ నగళ్ల శ్రీనివాసకిరణ్‌, అధ్యక్షుడు గద్దే వెంకటేశ్వర్లు, కార్యదర్శి వీ శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి ఆర్‌ కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 3 గంటలకు జరిగే ఎంపికలకు మహిళా కబడ్డీ క్రీడాకారిణులు హాజరుకావాలని కోరారు. ఎంపికై న వారు ఈ నెల 29 నుంచి కర్నూలు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు 94405 03548, 92989 50860 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement