అవసరం మేరకు అదనపు బ్యాలెట్‌ యూనిట్లు | Sakshi
Sakshi News home page

అవసరం మేరకు అదనపు బ్యాలెట్‌ యూనిట్లు

Published Sat, Nov 18 2023 6:36 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌  - Sakshi

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

సిద్దిపేటరూరల్‌: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన మేరకు అదనపు ఈవీఎం బ్యాలెట్‌ యూనిట్లను కేటాయించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హుస్నాబాద్‌ నియోజకవర్గానికి 380, సిద్దిపేట నియోజకవర్గానికి 341 అదనపు యూనిట్లను కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, పొలిటికల్‌ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రికార్డు మెజారిటీలో భాగస్వామ్యమవుదాం

మంత్రి హరీశ్‌రావుకు అండగా నిలుద్దాం

సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి

సిద్దిపేటఅర్బన్‌: మంత్రి హరీశ్‌రావు రికార్డు స్థాయిలో సాధించనున్న ఓట్ల మెజార్టీలో భాగస్వామ్యం అవుదామని సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట అర్బన్‌ మండలం కిష్టసాగర్‌, బూర్గుపల్లి, ఎన్సాన్‌పల్లి గ్రామాలలో మంత్రికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటు వేద్దామనుకునే వారు ఒక సారి ఆలోచించుకోవాలని అన్నారు. ఏ సమస్య వచ్చినా కుటుంబ సభ్యుడిలా ముందుండి సమస్యను పరిష్కరించే నాయకుడు హరీశ్‌రావు అని గుర్తుంచుకోవాలని కోరారు. కిష్టసాగర్‌ గ్రామ మధిర చిల్లకాలనీలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టడం లేదని, రేషన్‌ కార్డులు కొత్తవి ఇవ్వాలని, నీటి సౌకర్యం లేదని మహిళలు నిరసన తెలపగా ఎన్నికల అనంతరం సమస్యలు పరిష్కరిస్తామని సుడా చైర్మన్‌ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement