Sakshi News home page

నిరాశగా దిగుబడి

Published Thu, Jan 18 2024 7:02 AM

- - Sakshi

ఆలు దిగుబడి రాక నిరాశగా ఉంది. ఒక బస్తా విత్తనానికి ఏడు బస్తాల మేర మాత్రమే దిగుబడి వచ్చింది. ఇంత తక్కువగా రావడంతో చేసిన కష్టం వృథా అయింది. పంటకు నీటి తడులు అందించడం, ఎడ్లతో అంతర కృషి తానే చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గించుకున్న. అయినా ఏ మాత్రం మిగులుబాటు లేదు.

– కనకరాజు, రైతు, కోహీర్‌

అనుకూలించని సాగు

రైతులు ఆలుగడ్డ పంటను ముందస్తుగా వేసుకున్నారు. దీంతో వాతావరణం అనుకూలించలేదు. పంటకు తగినంత చలి ఉన్నప్పుడే దిగుబడులు వస్తాయి. నవంబర్‌ నెలలో సాగు చేసుకోడమే ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా పురుగు ఉధృతి ఎక్కువగా ఉండటం కూడా ప్రభావం చూపింది. విత్తనం బాగాలేదని రైతుల వైపు నుంచి ఫిర్యాదులు రావడంతో ఎఫ్‌ఆర్‌ఎస్‌లో సీడ్‌ టెస్టింగ్‌ చేయించాం. విత్తనంలో ఎలాంటి లోపం లేదు.

– స్పందన, ఉద్యానవన శాఖ అధికారి, కోహీర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement