సమస్యలు పరిష్కరించండి | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించండి

Published Tue, Nov 14 2023 12:28 AM

కొడుముంజ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ - Sakshi

● పరిహారం రాలేదు.. ప్యాకేజీ మరిచారు ● ఉపాధి అవకాశాలు లేవు ● మిడ్‌మానేరు నిర్వాసితులు

వేములవాడఅర్బన్‌: మిడ్‌మానేరు ప్రాజెక్టులో సర్వం కోల్పోయాం.. ఉన్న ఊరిని వదిలి వచ్చాం.. ఇక్కడ ఉపాధి లేదు.. చేసేందుకు పని లేక ది క్కులు చూస్తున్నామంటూ మధ్యమానేరు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీసారి తమ సమస్యలు పరిష్కారిస్తామంటున్న నాయకులు ఏళ్లుగా పట్టించుకోవడం లేదంటున్నారు. ఊళ్లలో యువకులు ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నారని.. యువతకు ఉపాధి చూపాలని.. ఇంకా చాలా మంది నిర్వాసితులకు ప్యాకేజీ.. పరిహా రం డబ్బులు రావాల్సి ఉందని.. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వారికే ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు.

ఉపాధి కల్పించాలి

మిడ్‌మానేరు ముంపు గ్రామం కావడంతో ఉపాధి లేక ఇబ్బందిపడుతున్నాం. మాకు ఉ పాధి కల్పించే నాయకుడికే ఓటు వేస్తాం. ఉ పాధి కల్పిస్తామని నమ్మకం కల్పించాలి. ని ర్వాసిత యువత ఆలోచించి ఓటు వేయండి. – మహేశ్‌, కొడుముంజ

ఖాళీగా ఉంటున్నాం

మిడ్‌మానేరు ముంపు గ్రామం కావడంతో ఉపాధి లేక, ఉద్యోగాలు రాక ఖాళీగా ఉంటున్నాం. ఉద్యోగం, ఉపాధి ఎవరిని ఎంచుకుంటే వస్తుందో.. వారికే ఓటు వేస్తాం.

– సందీప్‌, రుద్రవరం

చాలా మందికి పరిహారం రాలేదు

మిడ్‌మానేరులో సర్వం కోల్పోయినం. ఇప్పటికీ చాలా మందికి పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. అందరూ సమస్యలు పరిష్కారిస్తామంటున్నారే.. తప్పా పట్టించుకునే వారు లేరు. సమస్యలు పరిష్కరించే వారికి ఓటు వేస్తాం. – నర్సయ్య, కొడుముంజ

పట్టించుకోవాలి

మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలను పూర్తిస్థాయిలో పట్టించుకుని, అంటుబాటులో ఉన్న నాయకులకు ఓటు వేస్తాం. సమస్యలు పరిష్కరించే నాయకుడిని ఎన్నుకుంటాం.

– మల్లయ్య, రుద్రవరం

1/5

2/5

3/5

4/5

పీపుల్స్‌ 
ఎజెండా
5/5

పీపుల్స్‌ ఎజెండా

Advertisement
Advertisement