బాబు క్షమాపణ చెప్పాల్సిందే | Sakshi
Sakshi News home page

బాబు క్షమాపణ చెప్పాల్సిందే

Published Fri, Oct 22 2021 4:16 AM

YSR Congress Party Activists Fires On TDP Leaders - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: తెలుగుదేశం పార్టీ నేతల బూతు పురాణాన్ని నిరసిస్తూ.. అందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆ పార్టీ శ్రేణులు  రాష్ట్రవ్యాప్తంగా జనాగ్రహ దీక్షలు చేపట్టాయి. టీడీపీ నాయ కుడు పట్టాభి ఉపయోగించిన బూతు పదాలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని నినదించాయి. కృష్ణాజిల్లా లోని పార్టీ ఎమ్మెల్యేలందరూ వారి నియోజకవ ర్గాల్లో దీక్షలు చేపట్టారు. పట్టాభి బూతు వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనాగ్రహం కట్టలు తెంచుకుంది. అన్ని నియోజకవర్గ కేంద్రాలు, పలు మండల కేంద్రాల్లో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలోనూ ప్రజాగ్రహం పెల్లుబికింది. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుల తీరుపై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జనాగ్రహం వెల్లువెత్తింది.

టీడీపీ నేత పట్టాభి స్వగ్రామమైన పోతునూరులో అతని ఇంటి ఎదుట నిరసన తెలిపారు. జనాగ్రహ దీక్షలతో ప్రకాశం జిల్లా హోరెత్తిపోయింది. రాజకీయ విషక్రీడకు చంద్రబాబు తెరతీస్తున్నారని ధ్వజ మెత్తారు. చంద్రబాబు కుట్రను శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎండగట్టాయి. విజయనగరం జిల్లాలో జరిగిన దీక్షల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ సంఘీభావం తెలిపా రు. టీడీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకు నేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అరాచకా లు సృష్టిస్తున్నారని నేతలు ధ్వజమెత్తారు. ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ను చూసి ఓర్వలేక రెచ్చగొట్టడమే టీడీపీ అజెండాగా మారిందని విశాఖ జిల్లా నేతలు ఆరోపించారు. దద్దమ్మగా మారిన లోకేశ్‌ నాయకత్వాన్ని పార్టీ నేతలు ఒప్పుకోకుండా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ని తీసుకు రావాలని డిమాండ్‌ చేస్తుంటే చంద్రబాబు అస హనానికి  గురవుతున్నారని ఎద్దేవా చేశారు. 



పట్టాభి వ్యాఖ్యల వెనుక బాబు హస్తం
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బూతు పదజాలంతో దూషించడంలో పట్టాభి వెనుక చంద్రబాబు హస్తం ఉందని.. వెంటనే ఆయన సీఎంకు క్షమాపణ చెప్పాలని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డిమాండ్‌ చేస్తూ నిరసనలు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దీక్షల్లో పాల్గొన్నారు. టీడీపీ నేతలు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. పట్టాభి దురుసు వ్యాఖ్యలకు చంద్రబాబే కారణమని ప్రజా ప్రతినిధులు జనాగ్రహ దీక్షల్లో ఆరోపించారు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తం గా జనాగ్రహ దీక్షలు సాగాయి.


టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపట్ల వైఎస్సార్‌సీపీ నాయ కులు మండిపడ్డారు. చంద్రబాబు తన వయ స్సుకు తగ్గట్టు వ్యవహరించాలని.. అల్లర్లకు కుట్రలు పన్నడం మానుకోవాలని హితవు పలికారు. చిత్తూరు జిల్లాలోనూ ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. చంద్రబాబు, పట్టాభి దిష్టిబొమ్మలను దగ్థంచేశారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించు కుని క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్‌ జిల్లా నేతలు జనాగ్రహ దీక్షల్లో డిమాండ్‌ చేశారు. జిల్లాలో చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్థం చేశారు. చంద్రబాబు సిగ్గుమాలిన రాజకీయాల కు స్వస్తి పలకాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ హితవు పలికారు. ఢిల్లీ ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

Advertisement
Advertisement