సింగరేణిలో రాఫెల్‌ను మించిన కుంభకోణం | Sakshi
Sakshi News home page

సింగరేణిలో రాఫెల్‌ను మించిన కుంభకోణం

Published Tue, Feb 22 2022 2:43 AM

KCR Govt Centre Behind Rs 50000 Crore Coal Scam Underway In Odisha: Revanth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి సంస్థకు చెందిన ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్‌ బొగ్గు గనులను ఓ ప్రైవేటు సంస్థకు కేటాయింపు వెనుక రాఫెల్‌ కంటే పెద్ద కుంభకోణం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌లు కలిసి రూ.50 వేల కోట్లకు పైగా దోచుకుంటు న్నారని వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

నైనీ బ్లాక్‌ బొగ్గు గనులను 25 ఏళ్లకు గాను ఓ ప్రైవేటు సంస్థకు లీజుకిచ్చారని, ఈ కేటాయింపులో కోల్‌ ఇండియా నిబంధనలను కాలరాసి ఒకరిద్దరు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారని ఆరోపించారు. రాఫెల్‌ కుంభకోణం రూ.35 వేల కోట్లు అయితే ఈ కుంభకోణం విలువ రూ.50 వేల కోట్లు ఉంటుందని చెప్పారు. దీనిపై తాము కేంద్ర గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్‌జోషికి ఫిర్యాదు చేస్తే, కేసీఆర్‌ విషయంలో తామేమీ చేయలేమని, అంతా ప్రధాని కార్యాలయం చూసుకుంటోందని చెప్పారన్నారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌కు తమ ఫిర్యాదు పంపాలని అడిగినా ప్రహ్లాద్‌ జోషి చేతులెత్తేశారని విమర్శించారు. 

Advertisement
Advertisement