మహిళల రక్షణకు షీటీమ్స్‌ | Sakshi
Sakshi News home page

మహిళల రక్షణకు షీటీమ్స్‌

Published Wed, Apr 17 2024 1:45 AM

జానకీ షర్మిల, ఎస్పీ   - Sakshi

● ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా షీటీమ్స్‌ పని చేస్తున్నాయని ఎస్పీ డాక్టర్‌ జానకీషర్మిల తెలిపారు. మహిళలు, యువతులు, బాలికలు ఆకతాయిలతోగానీ, మరే విధమైన వేధింపులతోగానీ, ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని పేర్కొన్నారు. ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో షీటీమ్స్‌కు మార్చిలో 6 ఫిర్యాదులు రాగా, 2 ఎఫ్‌ఐఆర్‌లు బుక్‌ చేసినట్లు తెలిపారు. మిగతా వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 130 హాట్‌ స్పాట్‌లను విజిట్‌ చేసినట్లు పేర్కొన్నారు. చిన్న పిల్లల రక్షణకు పోలీస్‌ శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు. ఎవరికై నా ఇబ్బందులు ఎదురైనప్పుడు షీటీం నంబర్‌ 8712659550 లేదా డయల్‌ 100 కు సంప్రదించాలని తెలిపారు.

Advertisement
Advertisement