కేక్‌ కటింగ్‌.. ఆపై కటకటాలు | Auto Driver Anil Kumar Arrested For Cutting Cake With A Long | Sakshi
Sakshi News home page

కేక్‌ కటింగ్‌.. ఆపై కటకటాలు

Jun 3 2025 9:40 AM | Updated on Jun 3 2025 10:32 AM

Auto Driver Anil Kumar Arrested For Cutting Cake With A Long

గౌరిబిదనూరు: పుట్టినరోజు అని లాంగ్‌ కత్తితో కేక్‌ కట్‌ చేసిన వ్యక్తి, తరువాత పోలీసుస్టేషన్‌కు అతిథిగా వెళ్లాడు. ఆకతాయి చర్యల ఫలితం ఇలాగే ఉంటుంది. వివరాలు.. తాలూకాలోని వైచకూరహళ్ళి గ్రామంలో ఆటోడ్రైవర్‌ అనిల్‌ పుట్టినరోజును స్నేహితులతో జరుపుకొన్నాడు. 

పెద్ద ఖడ్గంతో కేక్‌ను కత్తిరించాడు. ఈ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వాటిని చూసిన రూరల్‌ పోలీసులు అనిల్‌ను అరెస్టు చేశారు. నిబంధనల ప్రకారం పెద్ద కత్తిని కలిగి ఉండడం, దానిని ప్రదర్శించడం చట్టరీత్యా నేరం. దీంతో ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement