ఏజెన్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి

Published Sat, May 25 2024 2:10 PM

ఏజెన్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి

వెంకటాపురం(కె): రాష్ట్ర గెజిట్‌ ప్రకారమే ఏజెన్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గోండ్వానా సంక్షేమ పరిషత్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో బోగస్‌ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు దొడ్డి దారిన బయటకు వస్తున్నాయని, ప్రతీ దరఖాస్తుదారుడికి ఎస్టీ కేటగిరి, ఇంటి పేరు వంశ వృక్షం పై పూర్తి విచారణ జరపాలన్నారు. అధికారులు విచారణ చేసి బోగస్‌ కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోదబోయిన సురేష్‌, పద్దం సుధాకర్‌, ఎట్టి చంద్రశేఖర్‌, అనిల్‌, అరుణ్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement