నేటి నుంచి 144 సెక్షన్‌ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి 144 సెక్షన్‌

Published Sat, May 25 2024 2:05 PM

-

ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేటి (శనివారం) సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకే చోట ఐదుగురు కంటే ఎక్కువ మంది సమావేశం కావడం నిషేధమన్నారు. బహిరంగ సమావేశాలను అనుమతి ఉండదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లపై నిషేధమని తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు ఇవ్వకూడదని సూచించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement