‘స్టార్‌ మా’ సరికొత్త రికార్డు | Star MAA Is Now No 1 Entertainment Channel | Sakshi
Sakshi News home page

స్టార్ మా ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ ఛానెల్‌

Oct 17 2020 5:15 PM | Updated on Oct 17 2020 6:48 PM

Star MAA Is Now No 1 Entertainment Channel - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలోనే ఎక్కువ మంది వీక్షించే ఎంటర్‌టైన్మెంట్‌ ఛానెల్‌గా ‘స్టార్ మా’ అవతరించింది. తాజాగా విడుదల అయిన రేటింగ్స్ లో ఈ ఘనత సాధించినట్లు స్టార్‌ మా ఓ ప్రకటనలో తెలిపింది.  అన్ని రీజినల్ చానెల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్న స్టార్ మా సన్‌ టీవీని దాటి ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్‌గా మారింది.

బ్లాక్ బస్టర్ సినిమాలు, ప్రముఖ తారలతో కూడిన ఈవెంట్లు, లైవ్ కార్యక్రమాలు స్టార్ మా లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. తెలుగులో పాపులర్ సీరియల్స్ తో స్టార్ మా ముందుంది. 42 శాతం వీక్షకులను ఆకట్టుకుంటున్న వదినమ్మ, కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి, తాజాగా ప్రారంభమైన దేవత, కస్తూరి తదితర కార్యక్రమాలతో స్టార్ మా ముందుకు వెళ్తుంది. బిగ్‌బాస్, సిక్స్‌సెన్స్‌, ఇస్మార్ట్ జోడీ లాంటి రియాలిటీ షో లు కూడా మా టీవీని ప్రేక్షకులకు దగ్గర చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement