పెళ్లి జ్ఞాపకాల్ని అలా మార్చేసిన సమంత.. వీడియో వైరల్ | Sakshi
Sakshi News home page

Samantha: భేష్.. హీరోయిన్ సమంత ఆలోచన బాగుంది

Published Fri, Apr 26 2024 1:33 PM

Samantha Ruth Prabhu Wedding Gown Modified Video

సమంత పేరు చెప్పగానే ఆమె పెళ్లి, విడాకులే చాలామందికి గుర్తొస్తాయి. ఎందుకంటే కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు అక్కినేని హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఎన్నాళ్లు బంధాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కారణమేంటో గానీ విడాకులు తీసేసుకుంది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటోంది. పెళ్లి పెటాకులు అయినా.. సామ్ దగ్గర ఆ జ్ఞాపకాల ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు వాటితో ప్రయోగం చేసింది. ఇంతకీ అసలేంటి విషయం?

'ఏ మాయ చేశావె'తో హీరోయిన్ అయిపోయిన సమంత.. ఇదే సినిమాలో హీరోగా చేసిన నాగచైతన్యని లవ్ చేసింది. ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాల్లో వీళ్లిద్దరూ జంటగా నటించారు. అలా కొన్నేళ్ల పాటు సాగిన ప్రేమకు 2017లో ఎండ్ కార్డ్ వేశారు. పెద్దల్ని ఒప్పించి చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ నాలుగేళ్లలో అంటే 2021లో విడాకులు తీసుకున్నారు.

అయితే పెళ్లిలో సమంత.. వైట్ కలర్ వెడ్డింగ్ గౌన్ ఒకటి అప్పట్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అయితే పెళ్లి, విడాకులు తర్వాత దాని అవసరం ఉండకపోవచ్చు. కానీ దాన్ని అలానే జాగ్రత్తగా దాచుకున్న సమంత.. ఇప్పుడు ఆ గౌన్‌కి ఉన్న చిన్న చిన్న పూలని తీసి కొత్త డ్రస్ కోసం ఉపయోగించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామ్ ఇన్ స్టాలోనే  ఉంది. పెళ్లి జీవితం సరిగా లేనప్పటికీ.. ఆ జ్ఞాపకాల్ని ఇంకా పదిలంగా అలా ఉంచుకోవడం ఇంట్రెస్టింగ్ విషయమే.

 

Advertisement
Advertisement