Different Concept Oriented 1134 Movie Trailer Is Out Details In Telugu - Sakshi
Sakshi News home page

1134 Movie Trailer: థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న 1134 ట్రైలర్

Published Fri, Feb 18 2022 2:40 PM

Different Concept Oriented 1134 Movie Trailer Is Out - Sakshi

Content Oriented 1134 Movie Trailer: కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకురాబోతోంది 1134 మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాతో శరత్ చంద్ర దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.

ట్రైలర్ చివరలో 'అన్నీ నువ్వనుకునేలా జరిగితే మరి నేనెందుకురా ఇక్కడ' అంటూ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మదుపు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

Advertisement
Advertisement