ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ | Custody Success Press Meet | Sakshi
Sakshi News home page

ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌

May 14 2023 6:13 AM | Updated on May 14 2023 6:14 AM

Custody Success Press Meet - Sakshi

శ్రీనివాసా చిట్టూరి, వెంకట్‌ ప్రభు, నాగచైతన్య, కృతీ శెట్టి 2

‘‘రోటీన్‌గా కాకుండా కొత్తగా చేయాలని ‘కస్టడీ’ చేశాను’’ అన్నారు నాగచైతన్య. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా థ్యాంక్స్‌ మీట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘కస్టడీ’కి మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ లభిస్తోంది.

మేం నమ్మి చేసిన అండర్‌వాటర్‌ యాక్షన్‌ సీన్, పోలీస్‌ స్టేషన్‌లో సింగిల్‌ షాట్‌ ఫైట్, ట్రైన్‌ ఫైట్, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఓ సీన్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు «థ్యాంక్స్‌’’ అన్నారు. ఈ చిత్రంలో నేను చేసిన రేవతి పాత్రకు మంచి స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు కృతీ శెట్టి.‘‘వందశాతం మా కష్టం ఫలించిందని అనుకుంటున్నాను’’ అన్నారు వెంకట్‌ ప్రభు. ‘‘కస్టడీ’ బ్లాక్‌బస్టర్‌ అయి నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి.

Advertisement
 
Advertisement
Advertisement