అందుకే అందరూ కనెక్ట్‌ అవుతారు | Boys Hostel Release date fixed | Sakshi
Sakshi News home page

అందుకే అందరూ కనెక్ట్‌ అవుతారు

Aug 22 2023 2:17 AM | Updated on Aug 22 2023 2:17 AM

Boys Hostel Release date fixed - Sakshi

‘‘బాయ్స్‌ హాస్టల్‌’ కథకు యూనివర్సల్‌ అప్పీల్‌ ఉంది. ప్రపంచంలో హాస్టల్స్‌ అన్ని చోట్ల ఉన్నాయి. అందుకే ఇందులోని పాత్రల్ని అందరూ రిలేట్‌ చేసుకుంటారు. కన్నడలో సూపర్‌ హిట్టయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని డైరెక్టర్‌ నితిన్‌ కృష్ణమూర్తి అన్నారు. ప్రజ్వల్‌ బీపీ, మంజునాథ్‌ నాయక, రాకేష్‌ రాజ్‌కుమార్, శ్రీవత్స ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’.

ఈ నెల 12న కన్నడలో విడుదలైన ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ ‘బాయ్స్‌ హాస్టల్‌’ పేరుతో తెలుగులో ఈ నెల 26న రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నితిన్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ‘బాయ్స్‌ హాస్టల్‌’ నా తొలి చిత్రం. అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి చక్కని మ్యూజిక్‌ చేశారు. తెలుగు నేటివిటీ కోసం రష్మి, తరుణ్‌ భాస్కర్‌గారి పాత్రల్ని రీ షూట్‌ చేశాం. అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్‌ బిస్కెట్‌ లాంటి సంస్థల ద్వారా తెలుగులోకి రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement