Allu Arjun Next Movie With SS Rajamouli, Deets Inside - Sakshi
Sakshi News home page

Allu Arjun - Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో బన్ని..!

Mar 16 2022 11:23 PM | Updated on Mar 17 2022 8:34 AM

Allu Arjun to Act under direction of SS Rajamouli - Sakshi

హీరో అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయా? అంటే అవుననే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రూల్‌’ గత ఏడాది థియేటర్స్‌లో మంచి విజయం సాధించింది. ‘పుష్ప’ రెండో భాగం ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈలోపు తన తర్వాతి సినిమాలకు సంబంధించిన పనులపై ఫోకస్‌ పెట్టినట్లున్నారు అల్లు అర్జున్‌.

ఇందులో భాగంగానే ఇటీవల బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని అల్లు అర్జున్‌ కలిసొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భన్సాలీ–బన్నీ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందనే టాక్‌ బీటౌన్‌లో మొదలైంది. తాజాగా అల్లు అర్జున్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త తెరపైకి వచ్చింది. అయితే రాజమౌళి తర్వాతి సినిమా మహేశ్‌బాబుతో చేయాల్సి ఉంది. ఈ సినిమా పూర్తయ్యాకే అల్లు అర్జున్‌తో సినిమా చేస్తారట. ఈలోపు ‘పుష్ప: ది రైజ్‌’, భన్సాలీతో సినిమాలను అల్లు అర్జున్‌ పూర్తి చేస్తారట. ఇలా అల్లు అర్జున్, రాజమౌళి వారి వారి కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకున్న తర్వాత వీరి కాంబినేషన్‌ సినిమా సెట్స్‌పైకి వెళుతుందనే టాక్‌ వినిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement