గోవును పూజిస్తే సకలదేవతలను పూజించినట్లే | Sakshi
Sakshi News home page

గోవును పూజిస్తే సకలదేవతలను పూజించినట్లే

Published Tue, Nov 21 2023 4:40 AM

గోవుకు పూజలు చేస్తున్న  వీహెచ్‌పీ కార్యకర్తలు  - Sakshi

వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి నీల శ్యామ్‌

చిన్నశంకరంపేట(మెదక్‌): గోమాతను పూజిస్తే సకలదేవతలను పూజించినట్లేనని విశ్వహిందు పరిషత్‌ జిల్లా కార్యదర్శి నీలశ్యామ్‌ అన్నారు. మండలంలోని చందంపేట, రుద్రారం, ఆగ్ర హారం గ్రామాలలో సోమవారం గోమాత పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవులు విశ్వానికి తల్లిలాంటిదని, ఎన్నో ఉపయోగాలున్న వాటిని మనమంతా రక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహేశ్‌, మల్లేశం, మహేందర్‌, రవీందర్‌, ప్రశాంత్‌, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement