ఆత్మారాంనాయక్‌ ఆస్తులు రూ.91.50 లక్షలు | Sakshi
Sakshi News home page

ఆత్మారాంనాయక్‌ ఆస్తులు రూ.91.50 లక్షలు

Published Sat, Nov 11 2023 12:42 AM

-

● నామినేషన్‌ అఫిడవిట్‌లో పేర్కొన్న ఆసిఫాబాద్‌ బీజేపీ అభ్యర్థి

ఆసిఫాబాద్‌: ఆసిఫాబాద్‌ నియోజకవర్గ బీజేపీ అ భ్యర్థి ఆత్మారాంనాయక్‌ ఆస్తి విలువ రూ.91.50 లక్షలుగా నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన వద్ద రూ.లక్ష నగదు, తన భార్య సంధ్య వద్ద రూ.50వేల నగదు ఉన్నట్లు వివరించారు. ఇందులో రూ.45.50 లక్షల విలువ చేసే చరాస్తులు, రూ.46 లక్షల విలువ చేసే స్థిరాస్తులున్నాయి. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఎల్‌ఐసీ పాలసీలు, రూ.5లక్షల విలువైన ఇన్నోవా వాహనం, రూ.3లక్షల విలువ చేసే జాన్‌డీర్‌ ట్రాక్టర్‌తో పాటు రూ.3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలున్నాయి. రెబ్బెన మండలం ఖైర్‌గూడలో ని వాస స్థలంతోపాటు రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ భూములున్నాయి. తన భా ర్య సంధ్య పేరిట మొత్తం రూ.3,10,06,756 విలు వైన ఆస్తులున్నాయి. వీటిలో రూ.1,04,06,756 వి లువైన చరాస్తులు, రూ.1.96 కోట్ల స్థిరాస్తులున్నా యి. రూ.53 లక్షల విలువైన టయోటా ఫార్చునర్‌ కారు, రూ.15 లక్షల విలువైన 250 గ్రాముల బంగారం ఉంది. వీటితో పాటు వ్యవసాయ భూములు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. ఆత్మారాం పేరిట రూ.1.50 లక్షల పంట రుణం ఉండగా, తన భార్య సంధ్య పేరిట రూ.14 లక్షలు సుందరం ఫైనాన్స్‌ వా హన రుణం ఉన్నట్లు అఫిడవిట్‌లో వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement