ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆస్తులు రూ.21 లక్షలు | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆస్తులు రూ.21 లక్షలు

Published Sat, Nov 11 2023 12:42 AM

ప్రవీణ్‌కుమార్‌ - Sakshi

కౌటాల: సిర్పూర్‌(టి) బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రేపల్లె శివప్రవీణ్‌కుమార్‌ తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. శుక్రవారం సిర్పూర్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలో తన నామినేషన్‌ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించారు. బ్యాంక్‌లో నగదుతో పాటు ఆర్‌ఎస్పీ వద్ద 50 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. వాటి విలువ రూ.2,83,250గా ఉంది. కాగజ్‌నగర్‌ మండలం కోసినిలో రూ.13.55 లక్షల విలువైన భవనం ఉంది. మొత్తం స్థిరాస్తులు రూ.5,54,750 ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం తన ఆస్తులు రూ.21,93 లక్షలుగా ప్రకటించారు. అతడి సతీమణి లక్ష్మీబాయి బ్యాంక్‌ ఖాతాలో నగదుతోపాటు 150 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. వాటి విలువ రూ.31,46,637గా పేర్కొన్నారు. కుమారుడు పునీత్‌ పేరిట బంగారు ఆభరణాలు, బ్యాంక్‌ డిపాజిట్లు రూ.2,83,906 ఉన్నాయి. కుమార్తె శ్వేత పేరిట రూ.17,60,351 నగదు ఉంది. కేసులు లేవని అఫిడవిట్‌లో ఎన్నికల అధికారులకు తెలిపారు. మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తులు రూ.73,83,894గా ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement