పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి | Sakshi
Sakshi News home page

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Published Thu, May 23 2024 4:05 AM

-

మిడ్జిల్‌: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌ఓ కృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పశువైద్య కేంద్రం సమీపంలో చికెన్‌ గన్యా, మలేరియా జ్వరాల బారిన పడడంతో జిల్లా వైద్యాధికారి కృష్ణ మలేరియా అధికారి భాస్కర్‌తో కలిసి ఇంటింటికి తిరిగి పరిశీలించారు. వైద్య సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు. జ్వరాలు వచ్చిన వారికి రక్త పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేయాలన్నారు. నీటి నిల్వ ఉండటం వల్ల దోమలతో ఈ కాలనీలో ఎక్కువ శాతం జ్వరాల బారినపడినట్లు గుర్తించామని చెప్పారు. ఇంటింటి సర్వే నిర్వహించి వెంటనే అవసరమైన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. వారి వెంట వైద్యాధికారి శివకాంత్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement