అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మించాలి | Sakshi
Sakshi News home page

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మించాలి

Published Thu, Nov 16 2023 1:34 AM

- - Sakshi

వరంగల్‌ తూర్పు నియోజక వర్గంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దశాబ్దాలుగా అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మిస్తామనే హామీ నెరవేర్చాలి. స్మార్ట్‌సిటీ నిధులతో నియోజకవర్గాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాలి. పాదాచారులకు ఫుట్‌పాత్‌లు నిర్మించాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. – సాంబరాజు చక్రపాణి,

వినియోగదారుల మండలి అధ్యక్షుడు

ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలి

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పక్కాదారి పడుతున్నారు. పరిశ్రమలు స్థాపించి, ఉపాధి కల్పించి వారిలో కొనుగోలు శక్తి మెరుగయ్యేలా కృషి చేయాలి. రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థలు మెరుగుపర్చాలి. అండర్‌ రైల్వే గేట్‌ ప్రాంతంలో కూరగాయాల మార్కెట్‌ ఏర్పాటు చేయాలి.

– సూరినేని రామారావు,

రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు

1/1

Advertisement
Advertisement