ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

Published Thu, Nov 16 2023 1:32 AM

- - Sakshi

మహబూబాబాద్‌: ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని జనరల్‌ అబ్జర్వర్‌ సింఘాల్‌, ఎన్నికల వ్యయ పరిశీలకులు బాబురాయ అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం మానుకోట నియోజకవర్గ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అభ్యర్థుల వ్యయ పరిమితులకు లోబడి జమాఖర్చులు ఉండాలన్నారు. అనుమతి లేకుండా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించొద్దన్నారు. కార్యక్రమంలో రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీఓ అలివేలు, ఏఆర్వో, మానుకోట తహసీల్దార్‌ భగవాన్‌రెడ్డి, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌

పోటీలకు ఎంపిక

కురవి: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు మండలంలోని రాజోలు జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థి లోకేష్‌ ఎంపికై నట్లు హెచ్‌ఎం అల్ల.రవికుమార్‌, పీఈటీ దార్ల సునీల్‌ బుధవారం తెలిపారు. ఇటీవల డోర్నకల్‌లో జరిగిన పోటీల్లో అత్యంత ప్రతిభకనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు వివరించారు. ఈనెల 17నుంచి 18వతేదీ వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారన్నారు. విద్యార్థి లోకేష్‌ను ఉపాధ్యాయులు దామోదర్‌, రవికుమార్‌, వీరభద్రం, బిక్కు, రాజేశ్వరీ, సురేష్‌, లింగమూర్తి, వీరన్న, ప్రభాకర్‌, చలపతి, నజిమున్సీసా అభినందించారు.

టీకాలను పంపిణీ చేయాలి

నెహ్రూసెంటర్‌: వ్యాధినిరోధక టీకాల పంపిణీతో పాటు గర్భిణులకు వందశాతం టీడీ వ్యాక్సిన్లు అందించాలని డీఎంహెచ్‌ఓ అంబరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌, ఇందిరానగర్‌, సిగ్నల్‌ కాలనీ, అంబేడ్కర్‌నగర్‌, గోపాలపురం సెంటర్‌లో వ్యాధి నిరోధక టీకాల పంపిణీని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. టీకాల పంపిణీతో పాటు అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్‌ ప్రాథమిక స్థాయిలో గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ఫ్రైౖడే, డ్రైడే నిర్వహించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. రక్తహీనత ఉన్నవారిని గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించి ఐరన్‌ ట్యాబ్లెట్లను ఇప్పించాలని ఆరోగ్య కార్యకర్తలను ఆదేశించారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ క్రిష్ణార్జునరావు, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ కేవీ రాజు, డీపీఎం రుక్ముద్దీన్‌ పాల్గొన్నారు.

వాహనాల తనిఖీ

గూడూరు: మండలంలోని భూపతిపేట వద్ద చెక్‌పోస్టు వద్ద బుధవారం రాత్రి డీఎస్పీ సత్యనారాయణ వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఎమ్మెల్సీ తాతా మధు కారును నిలిపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి వాహనాన్ని అయినా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సీఐ ఫణిధర్‌, ఎస్సై రాణాప్రతాప్‌ పాల్గొన్నారు.

ఆదివాసీ చట్టాలను

పకడ్బందీగా అమలు చేయాలి

వెంకటాపురం(కె): ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. మండల పరిధిలోని సుడిబాక గ్రా మంలో గోండ్వానా సంక్షేమ పరిషత్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రాజకీయ పార్టీల నాయకుల బూటకపు హామీలను ఆదివాసీలు నమ్మవద్దన్నారు. ఆది వాసీలు ఆలోచించి తమ ఓటు హక్కును విని యోగించుకోవాలని సూచించారు. కొత్త జిల్లా ల పేరుతో ఆదివాసీలను విడదీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేగ గణేష్‌, పూనెం ప్రతాప్‌, కనితి వెంకటకృష్ణ, సందీప్‌, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

1/3

2/3

3/3

Advertisement
Advertisement