దుప్పిపై కుక్కల దాడి | Sakshi
Sakshi News home page

దుప్పిపై కుక్కల దాడి

Published Fri, May 24 2024 10:20 AM

దుప్పిపై కుక్కల దాడి

● రక్షించిన అటవీ అధికారులు

ఆత్మకూరురూరల్‌: అరణ్యంలో స్వేచ్ఛగా సంచరించే చుక్కల దుప్పి దారితప్పి జనారణ్యంలోకి వచ్చి ప్రమాదం బారిన పడింది. ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలోని ముష్టపల్లె గ్రామ శివార్లలోని పంట పొలాల్లోకి గురువారం దారి తప్పిన ఒక పొడ దుప్పి వచ్చింది. ఊర కుక్కలు వెంట పడడంతో ఆ దుప్పి ప్రాణ భయంతో గ్రామంలోకి పరుగులు తీసింది. అప్పటికే కుక్కలు దుప్పి వెనుక భాగంలో గాయపరిచాయి. పారిపోతున్న దుప్పి గ్రామంలోని ఒక బాత్‌ రూంలోకి జొరబడింది. దీన్ని గమనించిన గ్రామస్తులు బాత్‌ రూం తలుపు వేసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న అటవీ అధికారులు వన్యప్రాణి వైద్యనిపుణులు అయిన జుబేర్‌ ఆధ్వర్యంలో సంరక్షణ చర్యలు చేపట్టారు. బైర్లూటిలోని వన్యప్రాణి డిస్పెన్సరీకి తరలించి చికిత్స అందించారు. పరిశీలనలో ఉంచి అడవిలో వదిలేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement